ఆ పథకాలు మిగత రాష్ట్రాల్లో అమలుకావడం లేదే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆ పథకాలు మిగత రాష్ట్రాల్లో అమలుకావడం లేదే

ఆ పథకాలు మిగత రాష్ట్రాల్లో అమలుకావడం లేదే

Written By news on Thursday, May 23, 2013 | 5/23/2013

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకాలు కాంగ్రెస్ పార్టీ పథకాలని సీఎం కిరణ్ ప్రకటించడం పట్ల మహానేత కుమార్తె షర్మిల మండిపడ్డారు. మరో ప్రజాప్రస్థానంలో భాగంగా ఆమె చేపట్టిన పాదయాత్ర గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు మండలం గణపవరం చేరుకుంది. ఈ సందర్భంగా షర్మిల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

వైఎస్ ప్రవేశ పెట్టిన పథకాలు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టినట్లు అయితే దేశంలోని మిగతా రాష్టాల్లో ఎందుకు అమలు చేయలేకపోతోందని ఆమె ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ జాబితాలో నుంచి 133 వ్యాధులను ఈ ప్రభుత్వం తొలిగించిదన్నారు. 12 ఏళ్ల లోపు గుండె సమస్యలు ఉన్న చిన్నారులకు ఆపరేషన్లు చేయాలని వైఎస్ ఆలోచించారు. కాని ఈ ప్రభుత్వం రెండేళ్లల్లోపు చిన్నారులకే ఆ ఆపరేషన్లు చేయాలని వయోపరిమితి విధించడం ఎంతవరకు సమంజసం అని పేర్కొన్నారు. 

వైఎస్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్ తో లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారని షర్మిల ఈ సందర్భంగా గుర్తు చేశారు. 10 వేల ర్యాంక్ వరకే ఫీజురీయింబర్స్ ను పరిమితి చేయడం సరైన చర్య కాదని వ్యాఖ్యానించారు. పిల్లనిచ్చిన మామ ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచి సీఎం పదవి దక్కించుకున్న ఘనుడు చంద్రబాబు అని షర్మిల అభివర్ణించారు. చంద్రబాబు సీఎంగా ఉన్న హయాంలోనే రైతుల ఆత్మహత్యల సంఖ్య పెరిగిందని షర్మిల తెలిపారు.
Share this article :

0 comments: