మూడున్నరేళ్లుగా రెండు పార్టీల మ్యాచ్‌ఫిక్సింగ్ బాగోతం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మూడున్నరేళ్లుగా రెండు పార్టీల మ్యాచ్‌ఫిక్సింగ్ బాగోతం

మూడున్నరేళ్లుగా రెండు పార్టీల మ్యాచ్‌ఫిక్సింగ్ బాగోతం

Written By news on Wednesday, May 22, 2013 | 5/22/2013

* ఒకే ఒక్కడిని అడ్డుకునేందుకు ఒక్కటైన టీడీపీ-కాంగ్రెస్
* జగనే లక్ష్యంగా కుమ్మక్కులు, హస్తినలో చీకటి కుట్రలు
* మూడున్నరేళ్లుగా రెండు పార్టీల మ్యాచ్‌ఫిక్సింగ్ బాగోతం
* ‘పిల్’ నుంచి అసెంబ్లీ ఎన్నికల దాకా అన్నింటా అదే సీన్
* ప్రధాన విపక్షమే అధికార పార్టీకి తోకగా మారిన వైచిత్రి
* అవిశ్వాస గండం నుంచి సర్కారును గట్టెక్కించిన బాబు
* బదులుగా కేసుల నుంచి టీడీపీ అధ్యక్షునికి అభయ‘హస్తం’
* కుట్రలను కుదేలు చేస్తూ జన నేతగా ఎదిగిన జగన్

పార్టీలు రెండైనా ఎజెండా మాత్రం ఒక్కటే. మూడో రాజకీయ శక్తిని రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎదగనీయకూడదు. అందుకే... అంతకంతకూ ఎదిగిపోతున్న వైఎస్ తనయుడంటే అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీలకు భయంతో కూడిన కసి. ఆయన సారథ్యంలో ప్రబల శక్తిగా ఎదిగి తమ ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే వెరపుతో కూడిన వైరం. అది ఎంతగా అంటే, మూడు దశాబ్దాలుగా రాష్ట్రంలో తామిద్దరం ఒకరికొకరు ప్రధాన ప్రత్యర్థులమన్న వాస్తవాన్ని కూడా మరిచిపోయేంతగా! రాష్ట్రాన్ని విడతలవారీగా తామే ఏలేయాలన్న ఆకాంక్షలకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అతి పెద్ద అడ్డంకిగా నిలవడాన్ని టీడీపీ, కాంగ్రెస్ సహించలేకపోతున్నాయి. ఆయన్ను అణచివేయడమే లక్ష్యంగా ఏకమయ్యాయి. ఇంకేం...?! చరిత్రలోనే లేని రీతిలో అధికార-ప్రధాన ప్రతిపక్షాలు కుమ్మక్కై, ఒకే ఒక్కడిని లక్ష్యం చేసుకుని, కలసికట్టుగా తెర తీసిన కుటిల రాజకీయ క్రీడకు రాష్ట్రం వేదికయ్యింది. ఇక్కడి ప్రజలే సాక్షులయ్యారు. 

వైఎస్ జగన్‌ను, వైఎస్సార్ కాంగ్రెస్‌ను అణగదొక్కడమే ధ్యేయంగా గడచిన మూడున్నరేళ్లుగా టీడీపీ, కాంగ్రెస్ చేయని కుట్రలు లేవు. వేయని చిందులు లేవు. వైఎస్ తనయుడిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే శంకర్రావు హైకోర్టులో పిటిషన్ వేసీ వేయగానే బాబు కూడా తన మనుషులతో మరో పిటిషన్ వేయించడంతో మొదలైన ఈ ఫిక్సింగ్ బాగోతం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. జగన్ ముప్పును తప్పించుకునేందుకు టీడీపీ తన ప్రధాన ప్రతిపక్ష హోదానే పణంగా పెట్టింది. 

ప్రభుత్వం తీసుకునే ప్రజా వ్యతిరేక నిర్ణయాలను ఎండగట్టి జనానికి అండగా నిలవాల్సిన బాధ్యతను ఏనాడో గాలికొదిలేసింది. అధికార పార్టీతో అంటకాగుతూ దాని తోక పార్టీగా మారిపోయింది. కాంగ్రెస్ వ్యతిరేకతే పునాదిగా పుట్టిన పార్టీకి తాను సారథినన్న సంగతి కూడా విస్మరించారు చంద్రబాబునాయుడు. అటు జగన్ ప్రభంజనానికి తన పునాదులే గల్లంతైపోయే స్థితిలో ఉన్న కాంగ్రెస్ కూడా టీడీపీతో అక్రమ బంధానికి ఎగిరి గంతేసి మరీ సరేనంది. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించిన తర్వాత నుంచి చంద్రబాబు కాంగ్రెస్‌కు సన్నిహితమయ్యారన్నది జగమెరిగిన సత్యం. మరీ ముఖ్యంగా జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ విచారణ జరిపించేలా తెరవెనక తతంగం జరిగినప్పటి నుంచి కాంగ్రెస్‌కు ఆయన బలమైన మిత్రుడిగా మారారు. మూడేళ్లుగా రాష్ట్రంలో జరిగిన ప్రతి ఎన్నికా వాటి మ్యాచ్‌ఫిక్సింగ్‌కు అద్దం పడుతూ వచ్చినదే! ఇవిగో మ్యాచ్ ఫిక్సింగ్‌లు... 

ఎమ్మెల్సీ ఎన్నికతో మొదలు...
ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ఎన్నికల బరిలో దిగే సువర్ణావకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవు. టీడీపీ మాత్రం వైఎస్సార్‌సీపీ ఆవిర్భవించిన కొత్తలో జరిగిన కడప స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడం కోసం ఏకంగా పోటీకే దూరంగా ఉంది! టీడీపీ జెడ్పీటీసీలందరినీ కాంగ్రెస్ ఆర్థిక సాయంతో నిర్వహించిన క్యాంపుకు తర లించి మరీ పోలింగ్ రోజు దాకా వారిని ‘కాపాడింది’. పోలింగ్ నాడు వారంతా కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేసేలా బాబు అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు! 

చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించడానికి ముఖ్యమంత్రి కిరణ్‌తో బాబు చేతులు కలిపారు. టీడీపీ జెడ్పీటీసీల రెండో ప్రాధాన్యతా ఓట్లన్నిటినీ కాంగ్రెస్ అభ్యర్థికే వేయించారు. ఓట్ల లెక్కింపులో బ్యాలెట్ పత్రాల సాక్షిగా ఈ వాస్తవం బయటపడనే పడింది. ఇలా కడప, చిత్తూరుల్లో తమకు సహకరించినందుకు బదులుగా అనంతపురం జిల్లాలో టీడీపీ అభ్యర్థికి కాంగ్రెస్ సహకరించింది! 2011లో ఎమ్మెల్యేల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, టీడీపీ పరస్పరం రెండో ప్రాధాన్యతా ఓట్లు వేసుకున్నాయి! తెలుగుదేశం అభ్యర్థి కె.ప్రతిభా భారతికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రెండో, మూడో ప్రాధాన్యతా ఓట్లు వేసిన విషయం ఓట్ల లెక్కింపు సాక్షిగా బయటపడింది. 

- ప్రధాన ప్రతిపక్షమై ఉండి కూడా ఏకంగా ఎన్నికల ప్రక్రియకే దూరంగా ఉందంటే.. ప్రజలను, వారి ప్రయోజనాలను టీడీపీ ఏనాడో గాలికొదిలేసిందని, కేవలం జన నేతను అణగదొక్కడమే దానికి పరమ లక్ష్యంగా మారిందని తేలిపోవడం లేదా?
- ప్రజలు అసహ్యించుకుంటారన్న ఆలోచన కూడా లేకుండా కాంగ్రెస్, టీడీపీ ఇలా ఏ ఎన్నిక వచ్చినా ఓట్ల బదలాయింపుతో సహా అన్నిరకాలుగా కుమ్మక్కవుతుండటం దేనికి సంకేతం?
- అధికార, ప్రధాన ప్రతిపక్షాలు నిర్లజ్జగా కుమ్మక్కవడం ప్రపంచ చరిత్రలోనే ఎక్కడైనా ఉందా? 

నియామకాల్లోనూ భాయీ-భాయీ
సమాచార హక్కు (ఆర్టీఐ)కమిషనర్ల నియామకంలోనూ కిరణ్‌కు బాబు అండగా నిలిచారు. ఎనిమిది మంది కమిషనర్లతో ప్రభుత్వం పంపిన జాబితాపై స్వయానా గవర్నరే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. అయినా బాబు మాత్రం కనీసం నోరు విప్పలేదు. పైగా బాబు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదన్న విషయాన్ని కిరణే స్వయంగా చెప్పారు. 

ఉప పోరులో ‘కలిసి’ ఓడారు
కుమ్మక్కు ఎంత పరాకాష్టకు చేరిందంటే... ఆఖరికి అసెంబ్లీ ఎన్నికల్లో సైతం లోలోపల కలిసి పోటీచేసే పరిస్థితి. 2012 జూన్‌లో 18 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇదే దిగజారుడు రాజకీయం స్పష్టమయింది. కాంగ్రెస్‌తో చేతులు కలిపిన టీడీపీ... తమకు గట్టి పట్టుందని చెప్పుకునే ఉభయ గోదావరి జిల్లాల్లోని రామచంద్రపురం, నరసాపురంలలో తన ఓట్లన్నింటినీ గంపగుత్తగా కాంగ్రెస్ అభ్యర్థులకు వేయించింది. అలా తామిద్దరం కలిసైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని నిలువరించాలని భావించింది. 

ఇలా మొత్తం పలుచోట్ల కాంగ్రెస్- టీడీపీ సహకరించుకున్నా సరే... రెండు స్థానాల్లో మాత్రమే వైఎస్సార్ కాంగ్రెస్ విజయాన్ని అవి అడ్డుకోగలిగాయి. మిగిలిన 15 స్థానాల్లో ఈ కుమ్మక్కు కుట్రను వైఎస్సార్‌సీపీ బద్దలు చేసింది. విశేషమేమిటంటే నర్సాపురం, రామచంద్రపురం స్థానాల్లో టీడీపీకి వచ్చిన ఓట్లు ఆ పార్టీకి అక్కడున్న క్రియాశీలక సభ్యుల సంఖ్య కంటే తగ్గిపోవటం. నర్సాపురంలో 8,813 (7 శాతం) ఓట్లు, రామచంద్రపురంలో 6,256 (4 శాతం) ఓట్లు మాత్రమే వచ్చాయి. ఫలితంగా టీడీపీ అభ్యర్థుల డిపాజిట్లే గల్లంతయ్యాయి. అంటే భవిష్యత్తులో ఈ రెండు పార్టీలూ కలిసి పోటీ చేసినా గెలుపు అసాధ్యమన్న తీర్పును ఒకరకంగా ఆ ఎన్నికల్లోనే ఓటర్లు స్పష్టంగా ఇచ్చారు. 

అంతులేని అ‘విశ్వాసం’
మూడున్నరేళ్ల కాంగ్రెస్-టీడీపీ మ్యాచ్ ఫిక్సింగ్ ఇటీవలి అవిశ్వాస తీర్మానం సందర్భంగానైతే తారాస్థాయికి చేరింది. కిరణ్‌కుమార్‌రెడ్డి ధీమాకు కూడా అదే ప్రధాన కారణంగా మారింది. అన్ని రంగాల్లో విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రధాన ప్రతిపక్ష పార్టీగా అవిశ్వాస తీర్మానం పెట్టాలని టీడీపీని వైఎస్సార్‌సీపీ డిమాండ్‌చేస్తే, ‘ఎప్పుడు పెట్టాలో మాకు తెలుసు. 

ఒకరు చెబితే పెట్టాలా?’ అంటూ కాంగ్రెస్‌లో పీఆర్పీ విలీనమయ్యేదాకా కాలయాపన చేసింది. ఇక ప్రభుత్వం పడిపోదని రూఢి చేసుకున్నాక మాత్రమే అవిశ్వాసం ప్రతిపాదించి ప్రతిపక్ష పాత్రలో ‘నటించింది’. కానీ ఇటీవల వైఎస్సార్‌సీపీ, టీఆర్‌ఎస్ ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం సందర్భంగానైతే చంద్రబాబు అన్ని ముసుగులనూ తీసి గట్టున పెట్టారు. మైనారిటీలో పడిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని స్వయంగా గట్టెక్కించారు. ‘తటస్థ వైఖరి’ సాకుతో సర్కారును నిలబెట్టారు. ప్రభుత్వం మైనారిటీలో పడ్డ విషయం అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్‌తో స్పష్టమైనా, కేవలం బాబు నిస్సిగ్గు నిర్ణయమే కాంగ్రెస్‌కు శ్రీరామరక్షగా మారింది.

కరెంటు చార్జీల పెంపు, ఆర్టీసీ వడ్డన, భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు, ఆధార్ గందరగోళం, గ్యాస్, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు, మంచినీటి కొరత, గిట్టుబాటు ధరల లేమి, హామీల అమలులో వైఫల్యం... ఇలా అన్ని అన్నింటా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయడానికి అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడే దానికి ఆపద్బాంధవునిగా నిలవడం కూడా చరిత్రలో బహుశా ఇదే తొలిసారి! 

- ప్రతి రంగంలోనూ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైన విషయం వాస్తవం కాదా?
- అలాంటి సర్కారుపై టీడీపీ అవిశ్వాసం పెట్టకపోగా, మైనారిటీలో పడి కూలిపోయే దశలో స్వయంగా కాపాడటం ప్రధాన ప్రతిపక్ష హోదాకే తీరని కళంకం కాదా? 

కేంద్రానికి బాబు ఆపన్న హస్తం
చిల్లర వర్తకంలోకి ఎఫ్‌డీఐల పరిమితి పెంపు నిర్ణయాన్ని టీడీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తోందంటూ ఊరూవాడా హోరెత్తించిన చంద్రబాబు, దానిపై రాజ్యసభలో జరిగిన ఓటింగ్‌లో మాత్రం యూపీఏకు అనుకూలంగా వ్యవహరించారు. ముగ్గురు టీడీపీ ఎంపీలను ఓటింగుకు డుమ్మా కొట్టించి బిల్లును గట్టెక్కించారు. 

వేటుపై లేటు వెనకా..!
ప్రజాభిప్రాయానికి పెద్దపీట వేస్తూ అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా ఓటేసిన ఆరుగురు టీడీపీ ఎమ్మెల్యేలపై వేటు వేయించకుండా తాత్సారం చేస్తున్న వైనం బాబు కుమ్మక్కు రాజకీయాలకు, ప్రజా తీర్పును తలచుకుని ఆయన వణికిపోతున్న తీరుకు మరో ఉదాహరణ. కొన్నేళ్లుగా రాష్ట్రంలో జరిగిన ప్రతి ఉప ఎన్నికలోనూ ఘోర పరాజయాన్నే చవిచూడటం టీడీపీకి పరిపాటిగా నేపథ్యంలో... ఆ ఎమ్మెల్యేలపై తక్షణం అనర్హత వేటు పడితే ఎక్కడ మరోసారి ఉప ఎన్నికలు వచ్చి పడతాయేనన్నది బాబు భయం. అందుకే సాధారణ ఎన్నికలు ఏడాది లోపులోకి వచ్చి, ఉప ఎన్నికల ప్రమాదం తప్పేదాకా వేటు ఊసు కూడా ఎత్తేందుకు ఆయన ఇష్టపడటం లేదు. మంత్రుల విషయంలో బాబు తాజా డ్రామాల నేపథ్యంలో... ఉప ఎన్నికలకు ఆస్కారం లేదని స్పష్టంగా తేలాక ‘ఆ ఎమ్మెల్యేలపై వేటు వేయండి’ అంటూ ఆయన అర్జెంటుగా ఉద్యమించినా ఆశ్చర్యం లేదు! కాంగ్రెస్ కూడా విప్‌ను ధిక్కరించి అవిశ్వాసానికి అనుకూలంగా ఓటేసిన 9 మంది తమ ఎమ్మెల్యేల విషయంలో కిమ్మనకపోవడానికి కారణం ఉప ఎన్నికల భయమే.

అవే గనక వస్తే దెబ్బ మీద దెబ్బ పడి తమ ఉనికే ప్రశ్నార్థకంగా మారుతుందని కాంగ్రెస్, టీడీపీ భయపడుతున్నాయి. ఆ ‘ప్రమాదం’ రాకుండా, ప్రభుత్వం పడిపోకుండా పక్కా అవగాహన మేరకు నడుచుకుంటూ ప్రజలకు రోత పుట్టిస్తున్నాయి. ఇక మంత్రులను తొలగించాలంటూ హైదరాబాద్‌లోనూ, హస్తినలోనూ నాటకాలాడిన బాబు.. మైనారిటీలో కొనసాగుతున్న కిరణ్ సర్కారుకు స్వయంగా ప్రాణవాయువు అందించి మరీ నిలబెడుతున్న వైనాన్ని కుమ్మక్కుకు ఒకరకంగా దీన్ని పరాకాష్టగా చెప్పవచ్చు.

కేసులపై అభయ‘హస్తం’...
మూడున్నరేళ్లుగా కాంగ్రెస్‌తో అంటకాగుతున్నందుకు చంద్రబాబుకు వ్యక్తిగతంగా కూడా మహా బాగా గిట్టుబాటవుతోంది. హైదరాబాద్‌లో అతి విలువైన 850 ఎకరాలను ఐఎంజీ సంస్థ ముసుగులో ఆపద్ధర్మ సీఎం హోదాలో తన బినామీలకు కారుచౌకగా కట్టబెట్టుకున్న వ్యవహారం బాబును నీడలా వెంటాడుతోంది. అయినా ఆయన కేసులో ఇరుక్కోవడం లేదంటే కేవలం కాంగ్రెస్‌తో మ్యాచ్‌ఫిక్సింగే కారణం. ప్రస్తుతం సీబీఐ విచారణలో ఉన్న ఎమ్మార్ వ్యవహారమూ అలాంటిదే. ముఖ్యమంత్రిగా దగ్గరుండి మరీ అస్మదీయ కంపెనీకే ఆ ఒప్పందం కుదిర్చారు బాబు. అయినా ఎమ్మార్ కేసు విచారణలో భాగంగా సీబీఐ ఏనాడూ బాబు జోలికి కూడా వెళ్లలేదు. ఆయనను ఇప్పటిదాకా కనీసం విచారించలేదు.

- వైఎస్ జగన్‌పై దర్యాప్తు జరపండంటూ హైకోర్టు తీర్పు ఇచ్చీ ఇవ్వగానే ఆగమేఘాలపై రంగంలోకి దిగి, సెలవు రోజుల్లో కూడా ఓవర్‌టైమ్ పని చేసి, ఏకంగా 30 బృందాలుగా విరుచుకుపడి భయోత్పాతం సృష్టించిన సీబీఐ... చంద్రబాబు అక్రమార్జనపై విచారణ చేయండని అదే హైకోర్టు ఆదేశిస్తేనేమో ‘మాకు సిబ్బంది లేరు’ అంటూ ‘చిలుక పలుకులు’ పలికింది. బాబు స్టే తెచ్చుకునేదాకా తాత్సారం చేసింది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో బాబుకున్న సన్నిహిత సంబంధాల కారణంగా ఆయనపై ఈగ కూడా వాలలేదు.

- ఓబుళాపూరం మైనింగ్ కేసులో సీబీఐ ముందు సాక్షిగా విచారణకు హాజరైన జగన్‌మోహన్‌రెడ్డి, ఆ గనులను కేటాయించిందే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబని రుజువు చేసే జీవోను అధికారులకు అందజేశారు. అదే విషయాన్ని మీడియాకు కూడా జగన్ చెప్పారు. అంతే...! దానిపై సీబీఐ ఆగమేఘాల మీద స్పందించి, ఆ వ్యవహారంతో బాబుకు ఏ సంబంధమూ లేదంటూ కొద్ది గంటల వ్యవధిలోనే క్లీన్‌చిట్ ఇచ్చేసింది! కనీసం జీవో పూర్వాపరాలేమిటో తెలుసుకోకుండా, విచారణ ఊసయినా ఎత్తకుండా ఇలా ‘చిలుక పలుకులు’ పలికింది. ఈ కేసులో ఇప్పటికీ బాబును సీబీఐ కనీసం ‘టచ్’ చేసిన పాపాన పోలేదంటే, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో ఆయనకున్న ‘టచ్’ వల్లేనంటారు.
- ఇక ఎన్నికల ఖర్చు కోసం ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఒకరికి రూ.200 కోట్లు బదిలీ చేశానని గుర్రాల వ్యాపారి హసన్ అలీ వాంగ్మూలం ఇచ్చిన ఉదంతాన్ని కూడా ఈ సందర్భంలో పలువురు గుర్తు చేస్తున్నారు. కానీ ఆ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ జరిపిన దర్యాప్తు వివరాలేవీ ఇప్పటివరకు బయటికి పొక్కలేదు. అలా సదరు ‘మాజీ సీఎం’ ఎవరన్నది తెరపైకి రాకుండా ఉండేలా తెర వెనక భారీ మతలబే నడిచిందని చెబుతారు.

- సమగ్ర విధానం రూపొందించాకే పరిశ్రమలకు భూ కేటాయింపులు జరపాలంటూ కొంతకాలం పాటు ఊరూవాడా గొంతు చించుకున్న చంద్రబాబు, అలాంటి విధానమేదీ ప్రకటించకుండానే కిరణ్ సర్కారు కర్నూలు జిల్లాలో ప్రిజమ్ సిమెంట్స్‌కు వెయ్యి ఎకరాలను నామమాత్రపు ధరకు కట్టబెట్టినా చంద్రబాబు కిమ్మనలేదు. ఎందుకంటే ప్రిజమ్ టీడీపీకి అతి సన్నిహితుడైన వ్యక్తి కంపెనీ!
- రోశయ్య హయాంలో హైదరాబాద్‌నడిబొడ్డున అమీర్‌పేట మైత్రీవనం సమీపంలో రూ.200 కోట్లకు పైగా చేసే 9.14 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని కూడా, సదరు నోటిఫికేషన్‌ను ఉపసంహరించి మరీ బాబుకు అతి సన్నిహితుడైన జీఎన్ నాయుడుకు కేటాయించింది.
- కాంగ్రెస్‌తో లాలూచీకి ఫలస్వరూపంగా బాబు పనులన్నీ చకచకా పూర్తవుతున్న తీరు చూసి అధికార వర్గాలే విస్మయంతో ముక్కున వేలేసుకుంటున్నాయి. బాబుకు అత్యంత సన్నిహితుడు, టీడీపీ నేత అయిన ఓ కాంట్రాక్టర్‌కు ఏకంగా రూ.200 కోట్ల బిల్లులు ఆగమేఘాలపై మంజూరవడం అప్పట్లో ఓ పెను సంచలనం!

- వైఎస్ జగన్ కేసులో ఉరుకులు పరుగుల దర్యాప్తుతో భయోత్పాతం సృష్టించిన అదే సీబీఐ, బాబు విషయానికి వచ్చేసరికి చేష్టలుడిగిపోవడం వెనక ఉన్నది ఢిల్లీ డెరైక్షనే కాదా?
- ఓఎంసీ గనులను కేటాయించిందే చంద్రబాబు అని చెబుతూ జగన్ ఇచ్చిన సాక్ష్యాలను ఏమాత్రం పట్టించుకోని సీబీఐ జేడీ, ‘అబ్బెబ్బే, బాబుకేమీ తెలియదు’ అంటూ ఆగమేఘాల మీద క్లీన్‌చిట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చినట్టు?
- టీడీపీ హితులకు, సన్నిహితులకు, బాబు అనుయాయులకు రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు చేసి పెడుతున్న పనులన్నీ దేనికి క్విడ్ ప్రో కో అనుకోవాలి?

చీకటి కలయికలు...
ప్రజా సమస్యలపై కేంద్రాన్ని నిలదీస్తానంటూ హస్తిన యాత్రకు వెళ్లడం, చీకటి మాటున ప్రభుత్వ పెద్దలతో ఏకాంతంగా మంతనాలాడటం కొన్నేళ్లుగా బాబుకు పరిపాటిగా మారింది. ఆ మధ్య టీడీపీ నేతలతో పాటుగా ప్రధానిని కలిసిన బాబు, అందరినీ కనుసైగతో బయటికి పంపి ఏకాంతంగా, సవివరంగా ముచ్చటించారు.

జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లో పెట్టుబడులపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించడానికి ఒకరోజు ముందు కూడా బాబు ఢిల్లీలో అత్యంత గోప్యంగా అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరంతో చీకట్లో భేటీ అయ్యారు. చాలాకాలం తర్వాత చిదంబరమే ఈ రహస్యాన్ని లోక్‌సభలో బయటపెట్టారు.


- పీఆర్పీ విలీనానికిముందు అవిశ్వాస తీర్మానం డిమాండ్ వచ్చినప్పుడు.. అలా చేయబోనని, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోకుండా చూస్తానని సోనియాగాంధీ రాజకీయ కార్యదర్శి అహ్మద్ పటేల్‌కు బాబు ఫోన్ చేసి మరీ హామీ ఇచ్చిన విషయం పత్రికల్లో ప్రముఖంగా వచ్చింది.
- బాబు తన మనుషులను ఢిల్లీ పెద్దల వద్దకు పంపి వారికి వినతిపత్రాలు ఇప్పించారు. గంటల వ్యవధిలోనే జగన్ ఆస్తుల అటాచ్‌మెంట్‌కు ఈడీ ఉత్తర్వులిచ్చింది. ఇదంతా హస్తిన స్క్రిప్టులో భాగంగా జరిగిందని ఆ పరిణామాల క్రమమే చెప్పింది!
- తాజాగా పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొంటానంటూ మే 7న ఢిల్లీ వెళ్లిన బాబు, ఆరోగ్య పరీక్షల సాకుతో మర్నాడు కూడా అక్కడే మకాం వేసి కాంగ్రెస్‌కు చెందిన కీలకమైన నేతతో మంతనాలాడారు.
- జీవోల వ్యవహారంలో ఆరుగురు రాష్ట్ర మంత్రుల పేర్లు చాలాకాలంగా నానుతున్నా ఏడాదిగా వారిపై నోరయినా విప్పని బాబు, తాజాగా ఢిల్లీ పెద్ద నేతతో చీకట్లో భేటీ కాగానే రూటు మార్చారు. వారిని తప్పించాలంటూ గవర్నర్‌ను, రాష్ట్రపతిని కలిశారు. అదే సమయంలో ఇద్దరు మంత్రులపై వేటు పడింది. కాంగ్రెస్ అధిష్టానం, చంద్రబాబు ‘కలసికట్టు’గా ‘ముందుకు’ పోతున్న వైనానికి ఇది తాజా తార్కాణం.

- హస్తినలో కాంగ్రెస్ పెద్దలతో బాబు చీకటి భేటీల మాటున దాగిన 
‘చిదంబర’ రహస్యమేమిటి?
- కేంద్రానికి అన్నిరకాలుగా ‘సాయపడటం’, అందుకు ప్రతిగా సీబీఐని 
తనపైకి ఉసిగొల్పకుండా చూసుకోవడం అక్షరాలా క్విడ్ ప్రో కో కాదా?

sakshi
Share this article :

0 comments: