ఎనీ డౌట్స్...? ? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఎనీ డౌట్స్...? ?

ఎనీ డౌట్స్...? ?

Written By news on Monday, May 20, 2013 | 5/20/2013

* ఎమ్మార్ బిడ్లకు 2001లో ఏపీఐఐసీ పిలుపు * 5 సంస్థలు రాగా వాటిలో రెండు తిరస్కరణ * మిగిలిందల్లా ఎమ్మార్, ఐఓఐ, ఎల్ అండ్ టీ * చివరికి ఎమ్మార్ మినహా మిగతావి వెనక్కి * ఐఓఐ బాబు సన్నిహితుడు చుక్కపల్లి సురేష్‌ది * దానికి తరవాత మరిన్ని లాభసాటి ప్రాజెక్టులు * ఎల్ అండ్ టీకి హైటెక్ సిటీ, కాకినాడ పోర్టు, ఇంకా... * ఎమ్మార్ తరఫున బాబుతో కోనేరు డీల్ మాఫియా సంస్కృతికి వ్యతిరేకంగా దావూద్ ఇబ్రహీం ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? అశ్లీలతపై సన్నీలియోన్ నిరసన తెలిపితే ఎలా ఉంటుంది? బెట్టింగ్‌ను నిరసిస్తూ బుకీ లు ర్యాలీ జరిపితే ఎలా ఉంటుంది? అచ్చం ఇప్పుడు అవినీతిపై చంద్రబాబు తలపెట్టిన ఉద్యమంలాగే ఉంటుంది!! సీఎంగా తన హయాంలో కుంభకోణాల్ని సరికొత్త కోణాల్లో ఆవిష్కరించి రికార్డు సృష్టించిన టీడీపీ అధినేత... ఇప్పుడు లోక కల్యాణార్థం అవినీతిని వ్యతిరేకిస్తానంటున్నారు. 

రాష్ట్రంలో నిరసనలు చేపట్టడంతో పాటు రాష్ట్రపతినీ కలుస్తారట. నిజానికి నాటి బాబు అవినీతిని ఆవిష్కరించేందుకు ఎన్ని పేజీలైనా చాలవు. అందుకే మచ్చుకు కొన్ని స్కాముల వివరాలు... బిడ్డింగ్ ప్రక్రియలో నచ్చని సంస్థల్ని ఏరేశారు. బినామీ సంస్థల్ని చివర్లో వెనక్కి పంపేశారు. ఒకే సంస్థ మిగిలేలా చక్రం తిప్పారు. 535 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కారుచౌకగా కట్టబెట్టేశారు. చివరికి నేరం బయటపడేసరికి ఏలినవారితో కలిసి తనకు నచ్చనివారిని ఇరికించారు. దటీజ్ చంద్రబాబు!! 2000వ సంవత్సరంలో చంద్రబాబు దేశంలో ఎక్కడా లేనట్లుగా... ఓ ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌ను రాష్ట్రంలో కట్టాలనుకున్నారు. టౌన్‌షిప్ అంటే మామూలుది కాదు. 18 రంధ్రాల గోల్ఫ్ కోర్స్... చుట్టూ శ్రీమంతులకు విల్లాలు... ఫైవ్‌స్టార్, బిజినెస్ హోటళ్లు... అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్... ఇదీ ఆ టౌన్‌షిప్ స్వరూపం. ఆసక్తి, అనుభవం ఉన్న సంస్థలు ముందుకు రావచ్చంటూ 2001 జూలె 6న ప్రకటన ఇప్పించారు. ఐదు ముందుకొచ్చాయి. దుబాయ్‌కి చెందిన ఎమ్మార్, మలేసియాకు చెందిన ఐఓఐ ప్రాజెక్ట్స్, హాంకాంగ్‌కు చెందిన సోమ్ ఏసియా, ఎల్ అండ్ టీ, షాపూర్జీ పల్లోంజీ సంస్థలు ఆసక్తి వ్యక్తంచేశాయి. వీటిలో సోమ్ ఏసియాను, షాపూర్జీ పల్లోంజీను బాబు ప్రభుత్వం పక్కన పెట్టేసింది. మిగిలిన మూడింటినే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్‌కు (ఆర్‌ఎఫ్‌పీ) షార్ట్‌లిస్ట్ చేసింది. చిత్రమేమిటంటే టెండర్లకు ఆఖరుతేదీ అయిన 2001 డిసెంబర్ 15 నాటికి ఐఓఐ, ఎల్ అండ్ టీ వెనక్కెళ్లిపోయాయి.

 ఇక బరిలో మిగిలింది ఎమ్మార్ ఒక్కటే. సహజంగా పోటీదారు లేకుండా ఒకే సంస్థ బరిలో ఉంటే టెండర్లు రద్దు చేస్తారు. కానీ బాబు అలా చేయలేదు. ఎమ్మార్ సంస్థకే ప్రాజెక్టును కట్టబెట్టేశారు. ఆ రెండూ కూడా బాబు బినామీలే! ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. ఎమ్మార్‌కు అనుకూలంగా బిడ్లు ఉపసంహరించుకున్న రెండింట్లో ఐఓఐ ఇండియా సంస్థ బాబు సన్నిహితుడు చుక్కపల్లి సురేష్‌ది. ఈ సంస్థకు తరువాతి కాలంలో బాబు హైటెక్ సిటీ రెండో దశను, ఏపీ జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ పేరిట బంజారాహిల్స్‌లో విలువైన రెండున్నర ఎకరాల స్థలాన్ని కట్టబెట్టారు. ఎల్ అండ్ టీతో బాబు దోస్తీ రాష్ట్రం యావత్తూ తెలిసిందే. హైటెక్ సిటీని, కాకినాడ పోర్టును ఇంకెన్నో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల్ని కట్టబెట్టినందుకు అది తెలుగుదేశం పార్టీ కార్యాలయమైన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌ను ఉచితంగా నిర్మించిందనే ఆరోపణలూ వచ్చాయి. ఎల్ అండ్ టీ ప్రతినిధిగా ఉన్న రామకృష్ణ అప్పట్లో పలు కంపెనీల్లో బాబుకు బినామీగా వ్యవహరించారని కూడా వినవచ్చింది. కోనేరు ప్రసాద్‌తో అప్పటికే లింకులు ఎమ్మార్ విషయానికొస్తే కీలక సూత్రధారి కోనేరు రాజేంద్రప్రసాద్‌కు అప్పటికే బాబుతో చాలా సన్నిహిత సంబంధాలుండేవి. 2000వ సంవత్సరంలోనే దుబాయ్ అల్యూమినియం కంపెనీని(దుబాల్) రాష్ట్రానికి తెచ్చారు. విశాఖలో బాక్సైట్ గనుల్ని ఆ సంస్థకు కట్టబెట్టబోయారు బాబు.

 రస్ అల్ ఖైమాకు చెందిన రాక్ సిరామిక్స్‌ను రాష్ట్రానికి పరిచయం చేసిందీ కోనేరే. ఇక్కడ గమనించాల్సిందేంటంటే ఎమ్మార్‌కు కేటాయించిన స్థలానికి సమీపంలో చంద్రబాబుకు మూడెకరాల స్థలం ఉండేది. తల్లి అమ్మణ్ణమ్మ, భార్య భువనేశ్వరి, తనయుడు లోకేష్ పేరిట ఉన్న ఈ స్థలాన్ని 2000వ సంవత్సరంలోనే... అంటే ఎమ్మార్‌కు కేటాయించటానికి మూడేళ్ల ముందే బాబు ఏకంగా ఎకరం కోటి రూపాయల చొప్పున అమ్మారు. మరి మూడేళ్ల తరవాత ఎకరా రూ.14 లక్షలకే అప్పజెప్పారంటే ఏమనుకోవాలి? రాష్ట్ర ఖజానాను ఎంతగా దెబ్బతీశారనుకోవాలి? ఎనీ డౌట్స్...? ? తన సన్నిహిత, బినామీ సంస్థలు మాత్రమే రంగంలో ఉండేలా ప్లాన్ చేసిందెందుకు? ? ఎల్ అండ్ టీ, ఐఓఐ ఎందుకు వెనక్కి తగ్గాయి? తర్వాత ఆ రెండింటికీ విలువైన ఇతర ప్రాజెక్టులెందుకు దక్కాయి? ? భూముల సేకరణ, అప్పగింత అన్నీ ఆయన హయాంలోనే జరిగాయిగా? అప్పటి నుంచి ఎందుకు దర్యాప్తు చేయకూడదు? ఆయన్నెందుకు దర్యాప్తు పరిధిలోకి తీసుకురాకూడదు? అని సాక్షాత్తూ న్యాయస్థానమే ప్రశ్నించినా చలనమెందుకు లేదు? ? ఈ మొత్తం వ్యవహారంలో కొలాబరేషన్ అగ్రిమెంటే కీలకమని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం కూడా తేల్చింది. సీబీఐ ఎందుకు పట్టించుకోవటం లేదు? ? 520 ఎకరాల్లో గోల్ఫ్‌కోర్స్, విల్లాలను నిర్మించే సంస్థలో ఏపీఐఐసీకి 26 శాతం వాటా... 15 ఎకరాల్లో స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మించే సంస్థలో మాత్రం 49 శాతం వాటా ఉండటం నిజం కాదా? ఆదాయం వచ్చే గోల్ఫ్‌కోర్స్, క్లబ్, విల్లాల్లో 26 శాతానికే పరిమితమయ్యారేం? ? ఖర్చు పెట్టాల్సిన కన్వెన్షన్ సెంటర్, స్టార్ హోటల్లో 49 శాతం వాటా ఎందుకు?

courtesy:sakshi
Share this article :

0 comments: