జగన్ జైలుకి వెళ్లాక...నాయకుడే కరవయ్యాడు! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ జైలుకి వెళ్లాక...నాయకుడే కరవయ్యాడు!

జగన్ జైలుకి వెళ్లాక...నాయకుడే కరవయ్యాడు!

Written By news on Saturday, May 4, 2013 | 5/04/2013

జగన్ జైలుకి వెళ్లాక...నాయకుడే కరవయ్యాడు!

నాకు ఓటు హక్కు వచ్చిన దగ్గర నుండి కాంగ్రెస్‌కు తప్ప వేరొక పార్టీకి ఓటు వేయలేదు. నా అభిమాన రాజకీయనాయకురాలు కేంద్రంలో శ్రీమతి ఇందిరాగాంధీ, రాష్ట్రంలో డాక్టర్ వైయస్. రాజశేఖరరెడ్డిగారు. వీరు తమ హయాంలో బడుగు బలహీన వర్గాల వారికి ఎనలేని సేవ చేశారు కాబట్టి ప్రతి హృదయంలోను నిలిచిపోయారు. వై.ఎస్.ఆర్.గారు మరణించిన తర్వాత ఇటు రాష్ర్టంలోను, అటు కేంద్రంలో ఎన్నో మార్పులు వచ్చి, పరిపాలన అంతా అస్తవ్యస్తంగా తయారైంది. నాయకులంతా స్వార్థ రాజకీయాలతో కాలం వెళ్లబుచ్చుతున్నారు. 1982కు ముందు రాష్ట్రంలో కాంగ్రెస్‌కు దీటైన ప్రత్యామ్నాయం లేదు. 

అందుకే తమ ఇష్టానుసారం పరిపాలన సాగించారు. ప్రజలు విసుగు అప్పట్లో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీకి ఘనవిజయం చేకూర్చిపెట్టారు. అంతటితో రాష్ట్రంలో కాంగ్రెస్ చరిత్ర ముగిసింది. తిరిగి వైయస్సార్ పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి, వారి అవసరాలు తెలుసుకుని వాటికి అనుగుణంగా ఆయన ప్రవేశపెట్టిన పథకాలు కాంగ్రెస్‌కు వరుసగా రెండోసారి కూడా విజయాన్ని సాధించిపెట్టాయి. అయితే ఆ మహానేత చనిపోయిన తర్వాత రాష్ట్రం ఒక్కసారిగా చంద్రబాబు పాలించినప్పటి అంధకారంలోకి వెళ్లిపోయింది. ఒకటా? రెండా? అనేక సమస్యలు రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నాయి. ప్రతిపక్షమైన తెలుగుదేశంపార్టీ ప్రేక్షకపాత్ర వహించడమే కాకుండా, కాంగ్రెస్‌కు సహాయకపాత్ర పోషించడంతో ప్రజల కోసం పోరాడే నాయకుడే కరవయ్యాడు. 

అంత పవర్, ఆదరణ ఉన్న ఒకే ఒక్క నాయకుడు వై.ఎస్. జగన్ కూడా ఈ కుటిల వ్యూహాల మూలంగా ప్రజలకు అందుబాటులో లేకుండా, జైలుకు వెళ్లవలసివచ్చింది. ఈ స్థితిలో ప్రజలందరికీ ఆశాజ్యోతిగా ఒక్క వైయస్సార్ పార్టీ మాత్రమే కనిపిస్తోంది. అయితే ఈ చేదు నిజాన్ని భరించలేక జగన్‌ని, ఆయన పార్టీనీ అణగదొక్కాలని పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కవడాన్ని ప్రజలు జీర్ణించుకోలేకున్నారు. అలాగే వైయస్సార్ దయ వల్ల పదవులు పొంది, ఆర్థికంగా లబ్ధిపొందిన నాయకులు సైతం ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడడం కూడా ప్రజల మనసులను కలచివేస్తోంది. దీనికి పర్యవసానం ఏమిటో స్పష్టాతిస్పష్టం. ఏ క్షణంలో ఎన్నికలు వచ్చినా జగన్‌దే విజయం.

- జె.జె.ఎస్. ప్రసాద్‌బాబు, రాజమండ్రి

జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. 
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: