జగనన్న అంటే మాకు ఎంతో ప్రాణం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగనన్న అంటే మాకు ఎంతో ప్రాణం

జగనన్న అంటే మాకు ఎంతో ప్రాణం

Written By news on Monday, May 13, 2013 | 5/13/2013

నాపేరు సునీల్ కుమార్. జగనన్న అంటే మాకు ఎంతో ప్రాణం. ఎందుకంటే రాజశేఖర్‌రెడ్డిగారు చేసిన ప్రతి సంక్షేమ పథకం ప్రజలకు ఎంతో మేలు చేసింది.

ఈ దేశ రాజకీయవ్యవస్థను నేను గమనిస్తున్నాను. దివంగత నాయకుడు వైయస్ రాజశేఖర్‌రెడ్డిగారు పేద రైతుల కోసం ప్రవేశ పెట్టి, అమలుచేసిన సంక్షేమ పథకాలు భారతదేశంలోనే కాదు విదేశాలలో కూడా ఎవ్వరు చేయలేదు. అందుకే ఆయన పేదప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. ఆయనను ఒక దేవుడిలాగ కొలుస్తున్నారు. ఎన్నాళ్ళు బతికామన్నది ముఖ్యం కాదు. ఎలా బతికామన్నది ముఖ్యం. బతికినన్నాళ్ళు ఆయన సేవలు ఎలా ఉపయోగపడ్డాయన్నది ముఖ్యం. మరణం తర్వాత కూడా పేద ప్రజల గుండెల్లో సజీవంగా ఉన్నారు.

మన రాష్ట్ర ప్రజలకు ఇటువంటి నాయకుడు ఇక లేరు, రారు... అనుకున్న సమయంలో, ఆయన తనయుడు ‘నేనున్నాను’ అంటూ ముందుకు వచ్చారు. ప్రజల కన్నీళ్ళు తుడుస్తానని, వారి కష్టసుఖాలలో పాలు పంచుకుంటానని జగనన్న ఎప్పుడో మాట ఇచ్చాడు. ప్రజలల్లో ఒకడిగా తిరిగినప్పుడు తండ్రికి తగ్గ నాయకుడు అనుకున్నాను.

అయినా తండ్రిని మించిన నాయకుడని ఇవాళ తొంబై శాతం మంది ప్రజలు అనుకుంటున్నారు. ప్రజలు జగన్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే... ఎండనక, వాననక, రేయనక, పగలనక, ఎంతో కష్టపడి తన సుఖసంతోషాలను, తన కుటుంబాన్ని దూరం చేసుకొని ప్రజల్లో ఒకడిగా ప్రజాసమస్యల పట్ల ఎంతో శ్ర ద్ధ చూపారు. ప్రజలే తన ప్రాణం, ప్రజల సంక్షేమమే తన ధ్యేయం... అనుకుంటున్న సమయంలో జగనన్నకు ఓదార్పుయాత్రకు పర్మిషన్ ఇవ్వకపోగా సంబంధం లేని కేసుల్లో ఇరికించారు. ఆయనని ఈ నిరంకుశ ప్రభుత్వం చెరసాలలో ఉంచింది. నాయకులందరూ కలిసి మన జగనన్నకు బెయిల్ రానివ్వకుండా చేశారు. అంతమాత్రాన జగనన్న బయటకు రాకుండా ఉండడు. ఆయన ఒక మహా వెలుగై పేద ప్రజలకు వెలుగునిచ్చే రోజు త్వరలో వస్తుంది. కరెంట్ వస్తే వెలుగు వస్తుంది. జగనన్న వస్తే ప్రజలకు ఆనందం వస్తుంది.

2014లో అత్యధిక మెజారిటీ సీట్లతో జగనన్న సీఎంగా ఎంపిక అవుతాడని నా నమ్మకం. ప్రజల నమ్మకం కూడా.

- తోటంశెట్టి సునీల్ కుమార్, వీరపునాయినిపల్లె, కడపజిల్లా.


కడిగిన ముత్యంలా బయటికొస్తాడు

ప్రజాక్షేత్రంలో సమస్యలపై పోరాడేవారు అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు. రాజకీయనాయకులందరూ ప్రజల మనసులను గెలుచుకోలేరు. ప్రజల సమస్యలకు పరిష్కార మార్గం చూపేవారే నిజమైన ప్రజానాయకులుగా చరిత్రలో మిగిలిపోయారు. అటువంటి వారిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఒకరు. ప్రజాసమస్యలను గాడిలో పెడుతున్న సమయంలో దురదృష్టవశాత్తు దివికేగిన రాజన్న స్థానాన్ని భర్తీ చేయడం అనితర సాధ్యం.

రాజన్న మరణానంతరం చీకటిరాజ్యంగా మారిన ఆంధ్రప్రదేశ్‌లో కాంతిపుంజమై ముందుకు వచ్చాడు జగన్‌మోహన్‌రెడ్డి. రాజన్న పథకాలు మరుగున పడిపోయిన తరుణంలో పేదల పక్షాన నిలిచి అనేక పోరాటాలు, దీక్షలు చేపడుతూ ప్రజలకు ‘ఓదార్పు’ నిచ్చాడు జగనన్న. ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానం ఏర్పరుచుకుంటున్నాడన్న అసూయతో సీబీఐని పావులా వాడుకుని అరెస్ట్ చేయించిన ‘కాంగ్రెస్’ ప్రభుత్వానికి ప్రజలు గోరీ కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. మేమంతా జగన్ వెంటే ఉన్నామని ప్రజలు ఉపఎన్నికల్లో సంకేతాలు ఇచ్చారు. జగనన్న జైలులో ఉన్నా నీ వెంట మేమున్నామంటా ప్రజలు ఇచ్చిన భరోసా ప్రభుత్వానికి చెంపపెట్టులాంటిది. అయినా మాకు సిగ్గేంటి అంటూ సీబీఐ కేసును వాయిదా వేయించడం ద్వారా జగన్ రాకను అడ్డుపుల్లలు వేసే ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

ప్రపంచంలో అనేక దేశాలలో ప్రజల సంక్షేమం, హక్కుల కోసం పోరాడిన నాయకులను చీకటి ప్రభుత్వాలు జైలుపాలయ్యాయి. అయినా ఆ నేతలు ప్రజాబలంతో జైలు గోడలను బద్దలు కొట్టుకొని వచ్చారు. అరచేత్తో సూర్యుడి వెలుగు ఆపాలనుకోవడం ఎంత అవివేకమో అప్పటి ప్రభుత్వాలకు తెలిసివచ్చింది.

చంచల్‌గూడ జైలులో తరచుగా పవర్ కటింగ్, అధికారులను మార్చడంతో జగనన్నను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. కానీ ప్రజల హృదయాలలో ఆయనకున్న ఆదరణను ఎవ్వరూ ఆపలేరు.

జగన్‌ను జైల్లో నిర్బంధించాలనుకోవడం సూర్యుడిని అరచేతులతో ఆపాలనుకోవడం వంటిదే. న్యాయస్థానాల్లో న్యాయం లభిస్తుంది. జగన్ కడిగిన ముత్యంలా బయటకు రావడం తథ్యం.

- తాడి సూర్యనారాయణరెడ్డి (జెమ్మి)
మాచవరం, తూర్పు గోదావరి జిల్లా
 - See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62262&Categoryid=11&subcatid=19#sthash.hYvOx2pG.dpuf
Share this article :

0 comments: