జగన్‌పై ఉద్దేశపూర్వకంగానే కేసులు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్‌పై ఉద్దేశపూర్వకంగానే కేసులు

జగన్‌పై ఉద్దేశపూర్వకంగానే కేసులు

Written By news on Monday, May 20, 2013 | 5/20/2013


 రాజమండ్రి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై సీబీఐ ఉద్దేశ పూర్వకంగానే కేసులు పెట్టి వేధిస్తోందని పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త ఎం.వి.మైసూరారెడ్డి ఆరోపించారు. జిల్లాలోని మూడు పార్లమెంటు నియోజక వర్గాల నేతలతో స్థానిక జాంపేటలోని ఉమా రామలింగేశ్వరస్వామి కల్యాణ మంట పంలో ఆదివారం ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా తనను కలసిన విలేకరులతో మైసూరా మాట్లాడారు. జగన్‌పై పెట్టిన కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేకుండానే చార్జిషీట్లపై చార్జిషీట్లు వేస్తూ సీబీఐ కాలయాపన చేస్తోందన్నారు. ఆధారాలు లేకుండా కేసును సాగదీస్తున్న సీబీఐ వైఖరిని సుప్రీంకోర్టు కూడా తప్పుబట్టిందన్నారు. సీబీఐ కోర్టు కూడా అధికారుల వైఖరిని ఎత్తిచూపిందని, సీబీఐ తీరును ప్రజల్లోకి తీసుకు వెళతామని చెప్పారు. 2014 ఎన్నికల వరకూ జగన్‌ను జైలు నుంచి బయటకు రానివ్వకుండా జరుగుతున్న కుట్రను ప్రజల్లోకి తీసుకువేళ్లేందుకు నియోజకవర్గ కేంద్రాల్లో ఈనెల 27న కొవ్వొత్తుల ప్రదర్శన, 28న జిల్లా కేంద్రాల్లో నిరశన దీక్షలు చేపడతామని మైసూరా ప్రకటించారు.
Share this article :

0 comments: