ఇది రాజకీయ కుట్ర కాదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది రాజకీయ కుట్ర కాదా?

ఇది రాజకీయ కుట్ర కాదా?

Written By news on Friday, May 24, 2013 | 5/24/2013

రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీల రాజకీయ మనుగడకు పెను సవాల్ విసిరిన వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని జైలు గోడల మధ్య నిర్బంధించి వేధిస్తుండటం వెనుక ఢిల్లీ స్థాయిలో రాజకీయ కుట్ర ఉందని అడుగడుగునా తేటతెల్లమవుతోంది. స్వయంగా కాంగ్రెస్ నాయకుల నోటి నుంచే ఈ విషయం పలుమార్లు బయటపడింది.

‘‘జగన్ సంవత్సరం ఆగి ఉంటే కేంద్ర మంత్రి పదవి వచ్చేది. ఆ తర్వాత ముఖ్యమంత్రి కూడా అయ్యేవారు. జగన్ తొందరపాటు వల్ల కాంగ్రెస్ పార్టీకి కూడా కొంత నష్టం వాటిల్లింది. ఈ విషయంలో జగన్‌కే ఎక్కువ నష్టం కలుగుతోంది.’’ - కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్ 2012 ఉప ఎన్నికల సందర్భంగా బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలివి. అంటే.. జగన్ కాంగ్రెస్‌లోనే కొనసాగి వుంటే.. ఆయనకు ‘కష్టాలు’ ఉండేవి కావని.. పైగా కేంద్ర మంత్రి పదవి, ముఖ్యమంత్రి పదవి ఇచ్చేవాళ్లమని పరోక్షంగా చెప్పటం కాదా?

ప్రముఖ జాతీయ వారపత్రిక ‘ఇండియా టుడే’ 2012 జూన్ 12వ తేదీ నాటి సంచికలో.. జగన్ అరెస్టుకు ముందు ‘ఢిల్లీలో జరిగిన పరిణామాలను’ పూసగుచ్చినట్టు వివరించింది కూడా. ‘‘హైదరాబాద్‌లో జగన్‌ను సీబీఐ ప్రశ్నిస్తుండగా.. ఢిల్లీలో ముఖ్య నాయకుల మధ్య ముమ్మరంగా మాటామంతీ నడిచింది. జగన్ కోర్టుకు హాజరు కావటానికి ముందు రోజైన మే 27 ఉదయం ఆజాద్ వెళ్లి సోనియాను కలిశారు. అంతే! అదే రోజున కొన్ని గంటలు గడిచేసరికల్లా ‘జగన్‌ను అరెస్టు చేయండి’ అంటూ ఢిల్లీ నుంచి ఆదేశాలు వచ్చేశాయి’’ అని వెల్లడించింది. ఇంతకంటే ఏం తార్కాణం కావాలి?!

ఆ 26 జీవోలపై నిగ్గుతేల్చరేం?!
వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు.. ప్రభుత్వం ద్వారా ‘లబ్ధి’ పొందిన వారు.. అందుకు ప్రతిఫలంగా(క్విడ్ ప్రో కో) జగన్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారనేది ప్రధాన ఆరోపణ. అంటే.. వారు నిబంధనలకు విరుద్ధంగా లబ్ధి పొంది ఉండాలి. వారికి ప్రాజెక్టులు ఇస్తూ విడుదలైన 26 జీవోలు తప్పయి ఉండాలి. సీబీఐ ముందు ఈ విషయాన్ని తేల్చాలి. ఆ జీవోల్లో ఉన్న అక్రమాలను నిగ్గుతేల్చాలి. ఇది తేల్చాలంటే ఆ జీవోలు ఇచ్చిన ఆరుగురు మంత్రులు, 8 మంది ఐఏఎస్‌లను విచారించాలి. కానీ సీబీఐ తొలి చార్జిషీటు వేసేదాకా ఆ మంత్రులు, ఐఏఎస్‌లలో ఒక్కరిని కూడా విచారించలేదు. దీనిపై నెల్లూరుకు చెందిన సుధాకర్‌రెడ్డి అనే న్యాయవాది సీబీఐ కోర్టులో ఒక పిటిషన్ వేయగా.. ఆ కోర్టు కొట్టివేసింది. హైకోర్టుకు వెళ్తే అక్కడా పిటిషన్‌ను కొట్టివేశారు. చివరికి సుప్రీంకోర్టుకు వెళ్లగా.. ఆ మంత్రులకు, ఐఏఎస్ అధికారులకు అత్యున్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. నెల రోజుల్లో సమాధానమివ్వాలని స్పష్టంచేసినా.. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు. అనంతర కాలంలో తప్పనిసరి పరిస్థితుల్లో సీబీఐ మంత్రుల దిశగా కదిలింది. ఒక మంత్రిని అరెస్టు చేసింది.

బాబుకు ఊరట దక్కే వరకూ...
కేసుల్లో ఉన్న వ్యక్తులను బట్టి సీబీఐ దర్యాప్తు తీరు ఎలా ఉంటుందనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు మరో ఉదాహరణ. జగన్ సంస్థల్లో పెట్టుబడులపై వచ్చిన ఆరోపణలపై ప్రాథమిక దర్యాప్తు చేయాలని హైకోర్టు ఆదేశాలు వచ్చిందే తడవుగా.. ఆగమేఘాలపై రంగంలోకి దూకి రెండు వారాల్లో 100 మందిని విచారించి, నివేదిక సమర్పించిన సీబీఐ.. చంద్రబాబు ఆస్తులు, అక్రమాలపై ప్రాథమిక దర్యాప్తునకు అదే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల విషయంలో మాత్రం అత్యంత తాపీగా వ్యవహరించింది. కోర్టు ద్వారా బాబు ఊరట పొందేవరకూ నెల రోజులకుపైగా వేచిచూసింది.

టీడీపీ హయాంలో చంద్రబాబు అవినీతి, అక్రమాస్తులపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని విచారించిన హైకోర్టు.. చంద్రబాబు, ఆయన బినామీలు అక్రమాలకు పాల్పడ్డట్లు తమ ముందున్న ఆధారాలను దృష్టిలో ఉంచుకుని.. దీనిపై ప్రాథమిక దర్యాప్తు చేయాలని సీబీఐని, ఈడీని ఆదేశిస్తూ 2011 నవంబర్ 14న తీర్పు చెప్పింది. సీబీఐ రోజులు గడుస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు మిన్నకుండిపోయింది. ఈలోగా సీబీఐ దర్యాప్తును నిలిపివేయాలంటూ బాబు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ దశలో జోక్యం చేసుకోవటానికి నిరాకరించిన సుప్రీం.. హైకోర్టునే ఆశ్రయించాలని సూచించింది. దీంతో బాబు, రామోజీ, నామా నాగేశ్వరరావులు వెకేషన్ పిటిషన్‌లు వేశారు. వీటిలో అనూహ్యంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంప్లీడ్ అయింది. అనేక నాటకీయ మలుపుల తర్వాత.. బాబు తదితరులపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తును నిలిపివేస్తూ హైకోర్టు ధర్మాసనం డిసెంబర్ 13న ఆదేశాలు జారీచేసింది.
Share this article :

0 comments: