మూతపడేది టీడీపీయే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మూతపడేది టీడీపీయే!

మూతపడేది టీడీపీయే!

Written By news on Monday, May 20, 2013 | 5/20/2013


 ప్రజాదరణ కోల్పోతున్న తెలుగుదేశం పార్టీ త్వరలోనే మూతపడడం ఖాయమని వైఎస్సార్ కాంగ్రెస్ ఎస్సీ విభాగం రాష్ట్ర కన్వీనర్ నల్లా సూర్యప్రకాష్ స్పష్టం చేశారు. మూడు నెలల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మూతపడుతుందంటూ టీడీపీ నేతలు వర్ల రామయ్య, రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన అభ్యంతరం తెలిపారు. సూర్యప్రకాష్ ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరులతో మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర చేస్తుండగానే.. ఆయనపై నమ్మకం కోల్పోయిన ఎమ్మెల్యేలు పార్టీ నుంచి వెళ్లిపోతూ వచ్చారని గుర్తు చేశారు. టీడీపీ కార్యకర్తలు లేక ఎమ్మార్పీఎస్ వారిని చుట్టూ పెట్టుకుని బాబు పాదయాత్ర చేశారని.. అలాంటి సమయంలో కూడా మాదిగ ఎమ్మెల్యే అయిన తానేటి వనిత పార్టీ నుంచి వెళ్లి పోయారని నల్లా చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఇక ఎవరూ చేరరని వర్ల రామయ్య వంటి వారు చెప్పడం అవాస్తవమన్నారు.

సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 21వ తేదీన భారీ బహిరంగ సభ నిర్వహించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని.. పార్టీలో ఇప్పటికీ నేతలు చేరుతున్నారనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ‘‘వైఎస్సార్ కాంగ్రెస్ నేతలవి కాకి అరుపులంటున్న రేవంత్ తనవి గాండ్రింపులు అనుకుంటున్నారేమో! కానీ, వాస్తవానికి ఆయన గార్దభంలాగా ఓండ్ర పెడుతున్నారు. పరిటాల రవి హత్య కేసులో దర్యాప్తు చేసినపుడు సీబీఐ చెడ్డదని గుర్తుకు రాలేదా అని రేవంత్ మాటిమాటికీ ప్రశ్నిస్తున్నారు. వాస్తవానికి తన కుమారుడిపై ఆరోపణలు వచ్చిన వెంటనే నిండు శాసనసభలో వైఎస్ ఏ ఎంక్వయిరీకైనా సిద్ధమేనని ప్రకటించారు.

దాంతో చంద్రబాబే సీబీఐ విచారణ కావాలని అన్నారు’’ అని స్పష్టం చేశారు. టీడీపీలో తనకు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నాడనే కక్షతో పరిటాల రవిని చంద్రబాబే ఎందుకు హత్య చేయించి ఉండకూడదని అనుమానం వ్యక్తం చేశారు. బాబు జమానాలో చేసిన ఐఎంజీ భూముల కేటాయింపు, ఏలేరు కుంభకోణం, ఎమ్మార్ వ్యవహారం, ప్రభుత్వ రంగ సంస్థలను తన తాబేదారులకు కట్టబెట్టడం వంటి వ్యవహారాలపై సీబీఐ విచారణకు ఎందుకు సిద్ధపడరని సూర్యప్రకాష్ ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కత్తులతో నరకాలి, చంపాలి అని బయట ప్రసంగాలు చేసే బాబు అసెంబ్లీలో అవిశ్వాసతీర్మానానికి మద్దతు తెలపలేదని మండిపడ్డారు. ఆయన కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారనడానికి ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలన్నారు.
Share this article :

0 comments: