రాష్ట్ర ప్రయోజనాలను సముద్రంలో పాతిపెట్టేసిన చంద్రబాబే గుర్తుకొస్తారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ప్రయోజనాలను సముద్రంలో పాతిపెట్టేసిన చంద్రబాబే గుర్తుకొస్తారు

రాష్ట్ర ప్రయోజనాలను సముద్రంలో పాతిపెట్టేసిన చంద్రబాబే గుర్తుకొస్తారు

Written By news on Monday, May 20, 2013 | 5/20/2013

 రిలయన్స్‌కు జీహుజూర్ - రాష్ట్ర ప్రయోజనాలు రామోజీకి కృష్ణా-గోదావరి బేసిన్‌ను తలచుకుంటే ఒకప్పుడు అక్కడి అందాలు, సహజ నిక్షేపాలు గుర్తుకు వచ్చేవేమో కానీ... ఇపుడు మాత్రం రామోజీరావు, ఆయన కంపెనీల్లోకి వచ్చిన రూ.2,600 కోట్లే గుర్తుకొస్తాయి. రాష్ట్ర ప్రయోజనాలను సముద్రంలో పాతిపెట్టేసిన చంద్రబాబే గుర్తుకొస్తారు. గ్యాస్ వెలికితీత ప్రక్రియలో రాష్ట్ర ప్రభుత్వాన్ని భాగస్వామిని చేయాలని అధికార్లు చెప్పినా బాబు వినకపోవటం వెనక బలమైన కారణాలే ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. ఒక్క డీ6 బ్లాకు నుంచి గ్యాస్ వెలికితీయటం ద్వారా రిలయన్స్‌కు వచ్చే 10 నుంచి 15 ఏళ్లలో రూ.1.5 లక్షల కోట్ల ఆదాయం వస్తున్నట్లు తేలుతోంది. అదీ ప్రస్తుత ధరల ప్రకారం దాన్ని పెంచేందుకు ప్రభుత్వంపై రిలయన్స్ తెస్తున్న ఒత్తిడి ఫలిస్తే... అది మరిన్ని రెట్లు పెరిగిపోతుంది. రిలయన్స్ ఆదాయంలో మూడోవంతు కేజీ డీ6దేనంటే పరిస్థితి చెప్పకనే తెలుస్తుంది. ఇలా రిలయన్స్‌ను కాపాడటంతో పాటు దానికి ప్రాధాన్యమిచ్చి రాష్ట్రం లో భూములు కేటాయించటం, పన్నుల మినహాయింపులతో సహా రాయితీలు ఇవ్వటం వంటివన్నీ బాబుకే సాధ్యమయ్యాయి. అప్పట్లో రిలయన్స్ ఇన్ఫోకామ్ ముకేష్ అంబానీ చేతుల్లో ఉండేది. దానికి రాష్ట్రమే తొలి వేదికయింది. అందుకు బాబు అందించిన సహకారం మామూలుది కాదు. వీటన్నిటికీ గుర్తుగానే అది బాబు సియామీ కవల లాంటి రామోజీ గ్రూపులో 2,600 కోట్లు దొడ్డిదారిన పెట్టుబడిగా పెట్టిందనేది అందరికీ తెలిసినదే. ఈ పెట్టుబడిని చాన్నాళ్లు రహస్యంగా ఉంచిన రిలయన్స్-రామోజీలు.. కోర్టులో బయటపడటంతో పెదవి విప్పక తప్పలేదు. చివరికి రామోజీ సంస్థలో నష్టాలొచ్చే చానెళ్లను తీసుకుని, చెల్లు చేసుకుందంటేనే పరిస్థితి తెలుస్తుంది. మొత్తమ్మీద బాబు రుణం రిలయన్స్ ఇలా తీర్చుకుంది. ఇక్కడ దెబ్బతిన్నదల్లా రాష్ట్ర ప్రజలే. భలే 'సెటిల్' చేసుకున్నారు! బాబు 1984లో భువనేశ్వరీ కార్బైడ్స్ పేరుతో రెండు సంస్థలను స్థాపించారు. రేణిగుంటలోని ఐదెకరాలను తనఖా పెట్టి అదే ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక సంస్థ నుంచి రూ.40 లక్షల రుణం తీసుకున్నారు. తర్వాత వాయిదా కట్టడం మానేశారు. కొన్నాళ్లకు ఆ భూమి విలువ అమాంతం పెరిగింది. దాంతో 2001లో తాను సీఎంగా ఉండగానే వన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా రూ.11 లక్షలు కట్టి మొత్తం రుణాన్ని మాఫీ చేసుకుని తన భూమిని వెనక్కు తీసుకున్నారు. అంటే రూ.40 లక్షల రుణానికి 17 ఏళ్ల తర్వాత ఆయన చెల్లించింది కేవలం నాలుగో వంతు! దటీజ్ నారా!

http://m.newshunt.com/Sakshi/Articles/21571415
Share this article :

0 comments: