మా నిరసన సీబీఐ వ్యవహార శైలిపైనే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » మా నిరసన సీబీఐ వ్యవహార శైలిపైనే..

మా నిరసన సీబీఐ వ్యవహార శైలిపైనే..

Written By news on Friday, May 31, 2013 | 5/31/2013

013 3:11:00 AM
- కాంగ్రెస్, టీడీపీలకు సీబీఐ తొత్తులా మారింది
- జగన్‌ను జైల్లో ఉంచి కాంగ్రెస్, టీడీపీలకు లబ్ధి చేకూర్చేందుకే విచారణలో జాప్యం చేస్తున్నారు
- మా నిరసన సీబీఐ వ్యవహార శైలిపైనే.. కోర్టులపై కాదు
- కోర్టులను ప్రభావితం చేస్తోంది మీరే..
- దమ్ముంటే ప్రజా క్షేత్రంలో తేల్చుకుందాం రండి...
- కాంగ్రెస్, టీడీపీలకు సవాల్

సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కేసులో సీబీఐ పూర్తిగా రాజకీయ ఒత్తిడులకు లొంగి వ్యవహరిస్తోందని, సిగ్గూఎగ్గూ లేకుండా దర్యాప్తు పేరిట జాప్యం చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర పాలక మండలి సభ్యుడు ఎం.వి.మైసూరారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్, టీడీపీల చేతిలో సీబీఐ కీలుబొమ్మలా మారిందని దుయ్యబట్టారు. వారికి తొత్తులా వ్యవహరిస్తూ.. ఆ రెండు పార్టీలకు రాజకీయ ప్రయోజనాలు కలిగేలా వ్యవహరిస్తోందన్నారు. గురువారం ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ సీబీఐ తీరుపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు వేయడం అనేది చట్టాన్ని దుర్వినియోగం చేయడమేనని, అసలు ఏ నిబంధనల కింద ఇలా దాఖలు చేస్తున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు.

జగన్‌ను జైలు నుంచి రాకుండా చేసి, బయట కాంగ్రెస్, టీడీపీ నేతలు రాజకీయ ప్రచారం చేసుకోవడానికి వీలుగా సీబీఐ కుట్ర చేస్తోందని దుయ్యబట్టారు. తమ పార్టీ ఈ నెల 27, 28 తేదీల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టింది కేవలం సీబీఐ వ్యవహార శైలిపైనే అని, కోర్టులపై ఎంత మాత్రం కాదని స్పష్టంచేశారు. జగన్‌ను జైల్లో పెట్టి ఏడాది అయిన సందర్భంగా సీబీఐ తీరును ఎండగడుతూ మాత్రమే నిరసనలు తెలిపామన్నారు. ‘‘మేం చేపట్టిన కార్యక్రమాలు కోర్టులకు వ్యతిరేకంగా కాదు.. కోర్టులను ప్రభావితం చేసేందుకూ కాదు.. కోర్టులంటే ఏమిటో మాకు తెలుసు.. అక్క బిడ్డ అని తిట్ట కూడదు, గర్భిణి అని కొట్టకూడదు అనే సామెత మాదిరిగా ఉంది పరిస్థితి. కోర్టులనేవి పవిత్రమైన గోవులాంటివని కూడా తెలుసు. అందుకని వాటిపై మేమేమీ మాట్లాడం.. ఆ ప్రస్తావన కూడా చేయం. కోర్టులపై నిరసన ప్రకటించాల్సిన అవసరం గాని, ప్రభావితం చేయాల్సిన అవసరం గాని మాకు లేవు..’’ అని మైసూరా అన్నారు. కోర్టులను కాంగ్రెస్, టీడీపీలే ప్రభావితం చేస్తున్నాయని తెలిపారు. హైకోర్టులో జస్టిస్ నిస్సార్ అహ్మద్ కక్రూ వద్ద శంకర్రావు పిల్ వేసినప్పట్నుంచీ చోటు చేసుకుంటున్న పరిణామాలను పరిశీలిస్తే ఈ విషయం తెలుస్తుందని చెప్పారు. ‘‘శంకర్రావు లేఖ రాసినపుడు అందులో రాజకీయ దురుద్దేశాలున్నాయని అందరికీ తెలుసు... టీడీపీ నేత ఎర్రన్నాయుడు కూడా ఇందుకు జత కలిశారు.

ఈ రెండింటినీ జత చేసి కోర్టు ఓ న్యాయవాదిని ఎమికస్ క్యూరీగా నియమించింది. అతని పూర్వాపరాలేమిటో బహుశా కోర్టుకు తెలిసి ఉండక పోవచ్చు. ఆయన ఒకప్పుడు టీడీపీ టికెట్ కోసం ప్రయత్నించారు. 2004లో టీడీపీలో చేరినట్లు ఆంగ్ల పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయి. కర్షక పరిషత్ ఏర్పాటును సవాలు చేస్తూ దాఖలైన కేసులో ఈ న్యాయవాది చంద్రబాబు తరపున వాదించారు. బాబుతో మంచి సంబంధాలున్నాయి. అలాంటి వ్యక్తి కనుక తానే నైతిక విలువలకు కట్టుబడి ఎమికస్ క్యూరీగా ఉండటానికి అంగీకరించకుండా ఉండాల్సింది. లేదా టీడీపీ వాళ్లయినా వద్దని ఉండాలి. కానీ అదీ జరగలేదు. ఆరోజే జగన్‌కు వ్యతిరేకంగా బీజం పడింది. ఆయన్ను రాజకీయంగా ఇబ్బందులు పెట్టాలనే ఇలాంటి విధానాలను అనుసరించా రు. కోర్టులను ప్రభావితం చేస్తూ వచ్చారు’’ అని చెప్పారు.

సీబీఐవి అనైతిక చర్యలు..
జగన్ కేసు దర్యాప్తులో సీబీఐ అనైతిక చర్యలకు పాల్పడుతోందనడానికి కోకొల్లలుగా ఉదాహరణలు ఇవ్వగలనని మైసూరా చెప్పారు. ‘‘సీబీఐ జాయింట్ డెరైక్టర్ ఫోన్ కాల్ డేటా బయటపడింది. ఇంకా బయటకు రాని సమాచారం చాలా ఉంది. సీబీఐ వాళ్లు టీడీపీ, కాంగ్రెస్ నేతలతో మాట్లాడుతోంది సత్యం కాదా..?’’ అని ప్రశ్నించారు. బెయిల్ పిటిషన్ విచారణకు రావడానికి ముందుగా లీకుల పేరుతో జగన్‌పై అడ్డగోలు కథనాలను సీబీఐ రాయిస్తోందని, తరువాత వాదనల్లో వాటినే వినిపిస్తోందని, తీర్పు వెలువడిన తర్వాత తమ వాదనలే నిజమయ్యాయని రాయించుకుంటోందని వివరించారు.

ఇదంతా సీబీఐ చేస్తున్న కుట్ర కాక మరేమిటని నిలదీశారు. ‘‘ఇది కోర్టులను ప్రభావితం చేయడం కాదా.. కోర్టులను మీరు ప్రభావితం చేస్తూ మమ్మల్ని విమర్శించడం సబబు కాదు. అసలు ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు వేయడం ఏ చట్టం ప్రకారం సరైంది? కోర్టుకు పదిహేను రోజుల్లోపు ప్రాథమిక నివేదికలు సమర్పించినపుడు ఈ కేసు చాలా ప్రత్యేకమైనదని సీబీఐకి తెలియదా? అప్పుడెందుకు ఒకే ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు? ఆ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన వ్యక్తి ఏ కానిస్టేబులో కాదు కదా.. సీబీఐలో సూపరింటెండెంట్ స్థాయి అధికారి కదా. ఆయన బుద్ధి ఏమైంది? గాడిదలు కాయడానికి పోయిందా..’’ అని అన్నారు. సాధ్యమైనంత త్వరగా దర్యాప్తు పూర్తి చేయాలని సుప్రీంకోర్టు, హైకోర్టు చెప్పినా సీబీఐ మాత్రం ఉద్దేశపూర్వకంగా ఇంకా సమయం కోరతామనడం ఏమిటని ప్రశ్నించారు.

ఏం చేస్తున్నారో తెలియదనుకుంటున్నారా?
విచారణ పేరుతో తీవ్ర జాప్యం చేస్తున్న సీబీఐ ఏం చేస్తోందో తమకు తెలియదనుకుంటున్నారా అని మైసూరా ప్రశ్నించారు. ‘‘కేసులో సాక్షులను పిలిపించడం వారిని రోజుల తరబడి విచారణ చేయకుండా వేచి ఉండేలా చేయడం, చివర్లో పిలిచి జగన్‌కు వ్యతిరేకంగా సాక్ష్యం చెబుతారా లేక మిమ్మల్ని కేసుల్లో ఇరికించమంటారా అని బెదిరించడం.. ఇదీ సీబీఐ చేస్తోంది’’ అని తెలిపారు. సీబీఐ దర్యాప్తు మొత్తం కాంగ్రెస్, టీడీపీకి రాజకీయ లబ్ధి జరిగేలా సాగుతోందని, ఇలా కుట్రలు చేసే బదులు దమ్ముంటే ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారాన్ని తక్షణమే పరిష్కరించి ఉప ఎన్నికలకు సిద్ధం కావాలని సవాలు విసిరారు. సాధారణ ఎన్నికలకైనా తమ పార్టీ సిద్ధంగా ఉందని స్పష్టంచేశా
Share this article :

0 comments: