చంద్రబాబు ప్రభుత్వం అప్పీలు చేయలేదు. సరికదా... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు ప్రభుత్వం అప్పీలు చేయలేదు. సరికదా...

చంద్రబాబు ప్రభుత్వం అప్పీలు చేయలేదు. సరికదా...

Written By news on Monday, May 20, 2013 | 5/20/2013

న్యాయమూర్తి, లాయర్లతో కలసి కుట్ర - రైతు పరిహారం పెంచేసి.. భోంచేసి.. విశాఖ స్టీల్‌ప్లాంటుకు నీరందించేందుకు తూర్పు గోదావరి జిల్లా ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి విశాఖ వరకూ ఏలేరు కాల్వ నిర్మించారు. దానికోసం భూమి సేకరించారు. రైతులకు కొంత పరిహారం చెల్లించారు. దీనిపై కుట్రపూరితంగా ఆలోచించిన బాబు, కొందరు టీడీపీ నేతలు.. రైతుల వద్దకెళ్లారు. సర్కారీ పరిహారం సరిపోలేదంటూ వారి చేత కేసులు వేయించారు. ముందే ఆ కేసులు విచారించే జడ్జితో ఒప్పందం చేసుకున్నారు. దీన్లో ప్రధాన పాత్రధారి అనకాపల్లికి చెందిన లాయరు పీలా పోతినాయుడు. పోతినాయుడుతో కేసులు వేయించటం... ఆయనతో కుమ్మక్కైన సబ్‌జడ్జి స్వామి అధిక నష్టపరిహారం చెల్లించాలంటూ తీర్పులివ్వటం వేగంగా జరిగిపోయాయి. 

తీర్పులో భూమి ధరలను పెంచిచూపడంతోపాటు, 19 ఎకరాల్లో ఉన్న చెట్ల సంఖ్యకు సున్నాలు చేర్చి ప్రభుత్వం నుంచి కోట్లు గుంజారు. మామూలుగా సబ్ కోర్టు ఇచ్చిన ఇలాంటి తీర్పులపై రాష్ట్రప్రభుత్వం జిల్లా కోర్టులో, హైకోర్టులో అప్పీలు చేస్తుంది. పరిహారం పదిశాతం పెరిగినా అప్పీలుకు వెళుతుంది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అప్పీలు చేయలేదు. సరికదా... ఈ పరిహారం చెల్లించటం కోసం చంద్రబాబు స్వయంగా సంతకం చేసి పోస్ట్ ఫ్యాక్టో ఉత్తర్వులు జారీ చేయటం చిత్రం. ఇలా బాబు రూ.15 కోట్లు విడుదల చేశారు. గుట్టు రట్టయిందిలా...: ప్రభుత్వమిచ్చిన పరిహారం (ఎకరాకు రూ.70 వేలు) చాలదని రైతులకు తెలియకుండా వారి పేర్లతో సవాల్ చేసిన కేసుల్లో పరిహారం పెంచుతూ తీర్పులు వెలువడ్డాయి. ఇలాంటి ఓ కేసులో పరిహారం చెల్లింపు జాప్యం చేశారంటూ... విశాఖ కలెక్టర్ కారును జప్తు చేయాలని అనకాపల్లి సబ్‌జడ్జి స్వామి ఉత్తర్వులిచ్చారు. అవి పట్టుకుని, అనకాపల్లి పర్యటకు వచ్చిన కలెక్టర్ గోపాల్ కారును స్వాధీనం చేసుకోబోయారు అధికారులు. ఆగ్రహించిన కలెక్టర్ తీగ లాగారు. డొంక కదిలింది. కోర్టుల చుట్టూ బాబు ఆటలు... పోతినాయుడు తదితరులు అరెస్టు కాగా, భూసేకరణ అధికారులు సస్పెండ్ అయ్యారు. పోతినాయుడిని తప్పించేందుకు చంద్రబాబు కొన్నాళ్లు సీఐడీ విచారణ పేరిట జాప్యం చేశారు.

 చివరకు ఏలేరుపై దుమారం రేగడంతో కమిషన్ వేస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. అయితే 1999 ఎన్నికల తరుణంలో జస్టిస్ సోమశేఖర కమిషన్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటించి కూపీ లాగుతున్నప్పుడు పోతినాయుడు హైకోర్టుకు వెళ్లారు. చంద్రబాబు ప్రతిపక్షాల ఒత్తిడికి లొంగి కమిషన్‌ను వేశారని, మనసు పెట్టలేదు కనక అది చెల్లదని వాదించారు. ఏకీభవించిన హైకోర్టు కమిషన్‌ను రద్దు చేయాలంటూ తీర్పిచ్చింది. దీనిపై పీజేఆర్ సుప్రీంను ఆశ్రయించగా హైకోర్టు వాదనను తీవ్రంగా తప్పుపట్టి 2001లో హైకోర్టు తీర్పును రద్దుచేసింది. భయపడ్డ చంద్రబాబు కమిషన్‌ను రద్దు చేసేశారు. వైఎస్సార్ అధికారంలోకి వచ్చాక కమిషన్‌ను పునరుద్ధరించారు. చంద్రబాబు మరోసారి పో తినాయుడిని, అశోక్‌గజపతిరాజును రంగంలోకి దిం పారు. హైకోర్టులో కేసు వేయించారు. ఎనీ డౌట్స్...? - పరిహారం పదిశాతం పెంచినా దానిపై రాష్ర్ట ప్రభుత్వం పైకోర్టుకు వెళుతుంది? కానీ ఏలేరు విషయంలో వంద శాతం పెంచినా ఎందుకు అప్పీలు చేయలేదు? - పరిహారం విడుదలపై పోస్ట్ ఫాక్టో ఉత్తర్వులు ఇచ్చేంత ఉత్సాహ ం బాబుకేల? - ఏ తప్పూ చేయకపోతే సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా సోమశేఖర కమిషన్‌ను చంద్రబాబు ఎందుకు రద్దు చేశారు? - వైఎస్ ప్రభుత్వం సోమశేఖర కమిషన్‌ను పునరుద్ధరిస్తే దానిని నిలిపివేయాలని హైకోర్టును ఎందుకు ఆశ్రయించారు?
courtesy:sakshi
Share this article :

0 comments: