మనోబలానికి, ఆత్మవిశ్వాసానికి మారుపేరు జగన్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మనోబలానికి, ఆత్మవిశ్వాసానికి మారుపేరు జగన్

మనోబలానికి, ఆత్మవిశ్వాసానికి మారుపేరు జగన్

Written By news on Tuesday, May 21, 2013 | 5/21/2013

ఎందుకు ఈ మాట అంటున్నాను అంటేజగన్‌మోహన్‌రెడ్డిలాంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్‌లో పుట్టి, అందునా ఇంత తక్కువ వయస్సులోనే అశేష ప్రజానీకం అభిమానాన్ని చూరగొన్నందుకు, అలాగే యువతరానికి మనోబలం, ఆత్మవిశ్వాసం అంటే ఏమిటో మాటలతో గాకుండా చేతల రూపంలో చూపించినందుకు. 

వైయస్ కుటుంబానికి ఒక పనిపట్ల ఎంత అవగాహన, చిత్తశుద్ధి ఉంటుందనేది వైయస్సార్ అందించిన సుపరిపాలన, జగన్ స్థాపించిన సాక్షి మీడియా (పత్రిక, టీవీ), భారతి సిమెంట్స్, వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ, అలాగే షర్మిలమ్మ చేస్తున్న మరో ప్రజాప్రస్థానం మొదలయిన వాటిని చూస్తే తెలుస్తుంది.

దివంగతనేత, మన ప్రియతమ ముఖ్యమంత్రి డా॥వైయస్. రాజశేఖర్‌రెడ్డిగారు తన ఐదున్నరేళ్ల పాలనకాలంలో ఎన్నో మంచి పనులు చేయగలిగారంటే అది ఆయనకున్న 25 సంవత్సరాల రాజకీయ అనుభవం ద్వారా మాత్రమే సాధ్యపడింది. ఎందుకంటే ఆయన ప్రజల కష్టాల నుంచి వచ్చిన నాయకుడు.

కాని, ప్రస్తుతం అంతటి అనుభవాన్ని జగన్‌గారు కేవలం మూడు సంవత్సరాలలోనే గడించి, రానున్న కాలంలో రాజన్న పాలన అందించేందుకు సన్నద్ధమవుతున్నారు. జగన్‌గారిని జైలులో అక్రమంగా నిర్బంధించినా కూడా పార్టీ నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్న తీరే ఇందుకు మంచి ఉదాహరణ. సాధారణంగా ఎవరికైనా జగన్‌గారి చూడగానే అతనిలో ఇంత విశేష ప్రతిభ, నాయకత్వ లక్షణాలు ఉన్నాయా అని అంచనా వేయటం కష్టం. ఎందుకంటే ప్రపంచంలో అత్యధిక విలువ కలిగిన బంగారం, కొన్ని విలువైన లోహాలు తయారుచేయడానికి కావలసిన ముడిపదార్థాలను గుర్తించడం మామూలు వారికి అర్థం కాదు. వాటిని ఆ రంగంలోని ప్రొఫెషనల్స్ మాత్రమే గుర్తించగలరు. 

కాని రాజకీయాలలో విశేష అనుభవమున్న శ్రీమతి సోనియాగాంధీగారికి గాని (కాంగ్రెస్ పార్టీకి నెహ్రూ ఇందిరాగాంధీల తరువాత సుమారు గత 15 సం॥నుంచి అధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు) అలాగే రాష్ట్ర రాజకీయాల్లో 30 సం॥అనుభవం ఉన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుగారికి గాని, అలాగే పత్రికారంగంలో మూడున్నర దశాబ్దాలకు పైగా అనుభవం ఉన్న రామోజీరావుగారికి గాని జగన్‌గారి నాయకత్వ లక్షణాల గురించి ఎందుకు తెలియలేదో ఆశ్చర్యంగా ఉంది. 

వాళ్ళకి జగన్ నాయకత్వ లక్షణాల గురించి, అతని విజన్ గురించి ముందే తెలుసు. ఎందుకంటే జగన్‌గారు ప్రజాజీవితంలోకి రాకముందే విజయవంతమైన వ్యాపారవేత్త. కాని అతను రాజకీయాలలో పైకి వస్తే (రాజకీయాలు అనే పదం అందరు నాయకులకు సూటవుతుంది. కాని వైయస్ కుటుంబానికి రాజకీయాలు అనే దానికంటే ప్రజాజీవితం అని ఉపయోగిస్తే బాగుంటుంది) తమ స్థానాలు కదిలిపోతాయేమోనన్న ఒక్క అభద్రతాభావంతో వాళ్ళు జగన్‌ని ఇన్నిరకాలుగా కష్టాలపాలు చేశారు. ఇదంతా తాత్కాలికం అని వాళ్లకి తెలుసు.

ఏది ఏమైనా కాంగ్రెస్ అధ్యక్షురాలు గౌ॥సోనియాగాంధీగారిని, గౌ॥రాష్ట్ర కాంగ్రెస్ నాయకులను, ప్రతిపక్షనేత గౌ॥గౌ॥రామోజీరావుగారిని ఒక విషయంలో అభినందించాలి. ఎందుకంటే జగన్ ప్రజాజీవితం అనే పునాది ఏర్పాటుచేసుకోవడానికి వాళ్ళు చేసిన, చేస్తున్న సహాయం అంతా ఇంతా కాదు కాబట్టి. ప్రజాజీవితంలోని ఇంత కొద్దికాలంలోనే ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారు కనుక కచ్చితంగా జగన్‌మోహన్‌రెడ్డి గారు అందించబోయే పరిపాలన రాజన్న అందించిన పాలన కంటే అద్భుతంగా ఉంటుందని చెప్పవచ్చు.

- ఎస్. ఈశ్వరరెడ్డి, కాజ, గుంటూరు జిల్లా.

మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34.
e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: