బాబు అలా మాట్లాడడం తగదు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » బాబు అలా మాట్లాడడం తగదు

బాబు అలా మాట్లాడడం తగదు

Written By news on Monday, May 13, 2013 | 5/13/2013

దశాబ్దాల తరబడి పార్టీకోసం సేవలందించిన పలువురు సీనియర్ నేతలు పార్టీని వీడుతుంటే అధినేత చంద్రబాబు నాయుడు అలాంటివారి వల్ల పార్టీకి వచ్చే నష్టమేమీ లేదని మాట్లాడడం తగదని చిత్తూరు ఎంపీ శివప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా పాకాలలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, టీడీపీ నుంచి సీనియర్ నేతల వలసలు సాగుతుంటే చంద్రబాబు పట్టించుకోకపోవడం, వారికి నచ్చచెప్పకపోవడం వల్ల రానున్న రోజుల్లో పార్టీ తీవ్రంగా నష్టపోయే అవకాశం లేకపోలేదన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి పార్టీకి సేవలందిన కడియం శ్రీహరి వంటి సీనియర్ నేత మరో పార్టీకి వెళ్తుంటే కొందరు నాయకులు ఆయన దళితద్రోహి, పార్టీకి ద్రోహం చేశారనడం సరికాదన్నారు. అసలు పార్టీలో శ్రీరామచంద్రులు ఎవరు? అని ప్రశ్నించారు. ఇప్పటికే అనేకమంది పార్టీని వీడారని, ఇంకా అనేకమంది వెళ్లే అవకాశం లేకపోలేదన్నారు 
Share this article :

0 comments: