ప్రధాని, సిబిఐ డైరెక్టర్‌కు వైఎస్‌ భారతి లేఖ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ప్రధాని, సిబిఐ డైరెక్టర్‌కు వైఎస్‌ భారతి లేఖ

ప్రధాని, సిబిఐ డైరెక్టర్‌కు వైఎస్‌ భారతి లేఖ

Written By news on Sunday, May 19, 2013 | 5/19/2013

ప్రధాని మన్మోహన్‌, సిబిఐ డైరెక్టర్‌కు వైఎస్‌ భారతి రెడ్డి లేఖ రాశారు. సిబిఐ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ప్రధానిని భారతి రెడ్డి కోరారు. మే 27, 2012 నుంచి తన భర్త జగన్‌ జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారని, కీలక ఉప ఎన్నికల సమయంలో జగన్‌ను అరెస్ట్‌ చేశారని గుర్తు చేశారు. ఒక భార్యగా, ఒక తల్లిగా మీకు ఈ లేఖ రాస్తున్నానని పేర్కొన్నారు.

అక్టోబర్‌ 2012లో సుప్రీంకోర్టు విచారణలో సిబిఐ ఒక మాట చెప్పిందని, విచారణ పూర్తి చేయడానికి మూడు నెలల గడువు ఇవ్వాలని కోరింది. 8నెలల తర్వాత సుప్రీంకోర్టు సాక్షిగా సిబిఐ మాట మార్చిందని తెలిపారు. మరో 4 నెలలు గడువు కావాలంటూ కోర్టుకు సిబిఐ తెలిపిందన్నారు. ఉత్తర్వులు వెలువడిన మరుక్షణమే కోర్టును అగౌరవపరిచేలా సిబిఐ లాయర్‌ మాట్లాడారన్నారు. దర్యాప్తుకు గడువు లేదంటూ సిబిఐ లాయర్‌ సంకేతాలిచ్చారని అన్నారు. మరింత గడువు కోసం కొత్త కారణాలు చూపిస్తోందన్నారు. సజావుగా దర్యాప్తు చేయకూడదన్న దురుద్దేశం ఇందులో కనిపిస్తోందన్నారు.

సిబిఐ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నట్టు, సరిగా విధులు నిర్వర్తిస్తున్నట్టు ఏ కోశాన కనిపించట్లేదన్నారు. సిబిఐ దర్యాప్తు కాలంలో వైఎస్‌ జగన్‌ ఎలాంటి పదవిలో లేరన్నారు. 2004- 2009 మధ్య కాలంలో జగన్‌ ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదన్నారు. 2001నుంచి బెంగళూరులోనే జగన్‌ నివాసమున్నారని తెలిపారు. నిబద్దత, అంకితభావంతో జగన్‌ వ్యాపారం నిర్వహించారన్నారు. డా.వైఎస్సార్‌ మరణించిన 15నెలల తర్వాత ఆరోపణలు మొదలయ్యాయని తెలిపారు. జగన్‌ కాంగ్రెస్‌ను విడిచిపెట్టిన నెల రోజుల తర్వాత ఎమ్మెల్యే శంకర్రావు లేఖ రాశారని, ప్రతిఫలంగా శంకర్రావును రాష్ట్ర క్యాబినెట్‌లో మంత్రిగా తీసుకున్నారని అన్నారు. ఆ తర్వాత ఇదే కేసులో తెలుగుదేశం పార్టీ కూడా జత కలిసిందన్నారు. హైకోర్టు ఆదేశాలకు ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సమాధానం చెప్పలేదన్నారు. ప్రభుత్వ వైఖరితో హైకోర్టు సిబిఐ దర్యాప్తుకు ఆదేశించిందని తెలిపారు.

రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా వైఎస్‌ఆర్‌ నిర్ణయాలు తీసుకున్నారని, వాటిని సమర్థించుకునేందుకు ఆయన ఈనాడు మనమధ్య లేరన్నారు. నాడు నిర్ణయాల్లో భాగస్వాములైన మంత్రులంతా.. నేడు నోరు మెదపట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా కేసులు ఎదుర్కొంటున్న మంత్రులందరికి ప్రభుత్వమే న్యాయ సాయం చేస్తోందన్నారు. 26 జీవోలు నిబంధనల ప్రకారమే జారీ అంటూ మంత్రులు అఫిడవిట్‌ దాఖలు చేశారని, నాటి ప్రభుత్వంలో ఎలాంటి భాగస్వామి కాని జగన్‌ ఎలా బాధ్యుడవుతారని ప్రశ్నించారు. ఉద్దేశ పూర్వకంగానే సిబిఐ జెడి దర్యాప్తును సాగదీస్తున్నారని ఆరోపించారు. కొన్ని అంశాలను ఎంపిక చేసుకుని మరీ లీకులిస్తున్నారని అన్నారు. వైఎస్‌ జగన్‌ను, ఆయన పార్టీని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారన్నారు. కొందరు మీడియా ప్రతినిధులకు సిబిఐ జెడి వందలాది కాల్స్‌ చేశారని తెలిపారు.

ప్రారంభించిన ఐదేళ్లలో సాక్షి పత్రిక దేశంలోనే ఏడో స్థానానికి చేరిందని వెల్లడించారు. కోటి 43 లక్షల రీడర్‌షిప్‌ సాక్షి పత్రిక సొంతమన్నారు. ఇంత ఘనచరిత్ర ఉన్న సాక్షి రాత్రికి రాత్రే డమ్మీ కంపెనీలా మారుతుందా? అని ప్రశ్నించారు. షేర్‌హోల్డర్ల సంపద పెంచడమే కాకుండా 40వేల కుటుంబాలకు జగన్‌ ఉపాధి చూపారన్నారు. ఈనాడు పత్రికలా మేం వ్యవహరించలేదన్నారు. 1800 కోట్ల నష్టాల్లో ఉన్న ఈనాడు రూ.100 షేరును రూ.5.26లక్షలకు విక్రయించిందని గుర్తు చేశారు.
Share this article :

0 comments: