ఈ ముఖ్యమంత్రి వసూల్‌రాజా.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈ ముఖ్యమంత్రి వసూల్‌రాజా..

ఈ ముఖ్యమంత్రి వసూల్‌రాజా..

Written By news on Tuesday, May 14, 2013 | 5/14/2013

* జనం రక్తం పిండి పన్నులు వసూలు చేస్తున్నారు
* మరో ప్రజాప్రస్థానంలో షర్మిల మండిపాటు
* ప్రజలపై వైఎస్సార్ ఒక్క రూపాయి కూడా భారం మోపలేదు
* అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు
* ఈ ముఖ్యమంత్రి అన్నింటి ధరలు పెంచారు
* వైఎస్సార్ సంక్షేమ పథకాలకు తూట్లు పెడుతున్నారు
* ఈ ప్రభుత్వానికి చంద్రబాబు అండగా ఉన్నారు
* సీబీఐ విచారణ తప్పించుకునేందుకు అసెంబ్లీ సాక్షిగా ప్రజలకు వెన్నుపోటు పొడిచారు

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘అమ్మా..! ఇప్పుడున్న ప్రభుత్వం వైఎస్సార్ రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం.. కానీ వైఎస్సార్ ప్రభుత్వం కాదు. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి ప్రజల కష్టాలు తెలియవు. వైఎస్సార్ ప్రజలపై ఒక్క రూపాయి కూడా భారం మోపకుండా అన్ని సంక్షేమ పథకాలనూ అమలు చేస్తే ఇప్పుడున్న సీఎం అన్నింటి ధరలు పెంచేశారు. అన్ని చార్జీలు పెంచేశారు. మరోవైపు పేదల కోసం వైఎస్సార్ తెచ్చిన సంక్షేమ పథకాలను అటకెక్కిస్తున్నారు. జనం రక్తం పిండి పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి వసూల్‌రాజా..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు.

‘‘అన్ని ధరలు పెరిగా యి. పూట గడవని పరిస్థితుల్లో పిల్లలను బడి మాన్పించి మాతోపాటు పనికి తీసుకుపోతున్నామమ్మా.. వాళ్లకు వచ్చే కూలీ, మాకు వచ్చే కూలీ కలిపితే కూడాఇల్లు గడవటం కష్టంగా ఉంది తల్లీ..’’ అని రాఘవాపురం గ్రామానికి చెందిన అక్కమ్మ, నాగసూర్యదేవి, అడపాల శ్రీలక్షి అనే మహిళలు ఆవేదన వ్యక్తం చేయడంతో షర్మిల పైవిధంగా స్పందించారు. ప్రజాసమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో అంటకాగుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో సాగింది. చింతలపూడి మండలం రాఘవాపురంలో జరిగిన రచ్చబండలో షర్మిల మాట్లాడారు. ప్రసంగం ఆమె మాటల్లోనే..

కరెంటు పాపం చంద్రబాబుది కూడా..
‘‘ఈ సీఎం కిరణ్ పాలనలో ఫీజు రీయింబర్స్‌మెంటు కుంటుపడింది. ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది. 108, 104 కనుమరుగైపోయాయి. పక్కా ఇళ్లకు పాడె కట్టారు. ఆయన నిర్లక్ష్యంతో రాష్ట్రం అంధకారమైంది. ఈ ప్రభుత్వం కరెంటు ఇస్తున్న తీరు చూస్తుంటే.. ‘కరెంటు నిల్లు.. బిల్లు ఫుల్లు’ అన్నట్లుంది. రోజుకు కనీసం నాలుగు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదు. బిల్లులు మాత్రం మూడింతలు వేస్తున్నారు. సర్ చార్జీలని, వాటికి వడ్డీలని రాష్ట్ర ప్రజలపై రూ. 30 వేల కోట్ల భారాన్ని మోపారు. ప్రజల రక్తాన్ని పిండైనా సరే బిల్లులు వసూలు చేస్తున్నారు.

కరెంటు చార్జీలు ఇంతలా పెంచిన ఈ ప్రభుత్వానికి చంద్రబాబు అండగా నిలిచారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన అవిశ్వాసానికి బాబు మద్దతిచ్చి ఉంటే ప్రభుత్వం కూలిపోయి, ప్రజలపై కరెంటు భారం పడకుండా ఉండేది. కానీ అలా చేయలేదు. ప్రభుత్వానికి రక్షణగా నిలబడి కాపాడారు. కరెంటు భారం ప్రజలపై మోపిన ఈ పాపం సీఎం కిరణ్‌తో పాటు చంద్రబాబుది కాదా అని అడుగుతున్నా. స్వప్రయోజనాలే తప్ప ప్రజాప్రయోజనాలు పట్టని బాబు.. ఆయన అవినీతిపై సీబీఐ విచారణ తప్పించుకోవడానికి అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు వెన్నుపోటు పొడిచారు.

సీబీఐ వెనకాల దాక్కుని దాడి చేస్తున్నారు...
ఈ నాయకులకు కావాల్సింది ప్రజల బాగోగులు కాదు. వాళ్లకు కావాల్సింది అధికారం. అధికారం కోసం ఎంతటి నీచానికైనా పాల్పడతారు. కాంగ్రెస్, టీడీపీ కుమ్మక్కై జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టి జైల్లో బంధించారు. జనం గుండెల్లో స్థానం సంపాదించిన జగనన్నను నేరుగా ఎదుర్కొనే దమ్ము, ధైర్యం లేక... సీబీఐ వెనకాల దాక్కుని దాడి చేస్తున్నారు. ఉదయించే సూర్యుడిని ఎవ్వరూ ఆపలేరు. జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. జగనన్న బయటకు వస్తారు... రాజన్న రాజ్యం స్థాపిస్తారు. వైఎస్సార్ తెచ్చిన ప్రతి సంక్షేమ పథకానికి జీవం పోస్తారు.’’

సోమవారం 147వ రోజు మరో ప్రజా ప్రస్థానం పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని లింగగూడెం గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి రాఘవాపురం, డీఎన్‌రావుపేట, పోతునూరు, మల్లయ్యగూడెం, ఆముదాలచలక గ్రామాల మీదుగా సాగింది. సమ్మిరివారిగూడెం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు షర్మిల చేరుకున్నారు. సోమవారం మొత్తం 13.3 కిలోమీటర్లు నడిచారు.

ఇప్పటివరకు మొత్తం 1966.1 కి.మీ యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న వారిలో జిల్లా పార్టీ కన్వీనర్, పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, ఎమ్మెల్యేలు మద్దాల రాజేష్, ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మొవ్వ ఆనంద శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు ఉన్నారు. ప్రతిరోజు షర్మిల వెంట నడుస్తున్న వారిలో తలశిల రఘురాం, వాసిరెడ్డి పద్మ, కాపు భారతి, వైఎస్ కొండారెడ్డి, డాక్టర్ హరికృష్ణ, స్థానిక నాయకులు కర్ర రాజారావు, పాశం రామకృష్ణ, ఉమాబాల తదితరులున్నారు.

24 అడుగుల వైఎస్ విగ్రహం..
మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లు పూర్తయ్యే రావికంపాడులో పార్టీ కార్యకర్తలు, అభిమానులు 24 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. ఈ విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరిస్తారని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు హాజరవుతారని చెప్పారు
- See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=598601&Categoryid=1&subcatid=33#sthash.db56i6lR.dpuf
Share this article :

0 comments: