సీజన్ మొదలవుతున్నా విత్తనాల జాడ లేదు ... - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » సీజన్ మొదలవుతున్నా విత్తనాల జాడ లేదు ...

సీజన్ మొదలవుతున్నా విత్తనాల జాడ లేదు ...

Written By news on Friday, May 31, 2013 | 5/31/2013

సీజన్ మొదలవుతున్నా విత్తనాల జాడ లేదు
ప్రైవేటు వ్యాపారులు మాత్రం ఇప్పుడే నకిలీ విత్తనాలు తెచ్చిపెట్టారు
తెలియక వాటినే వేసి మోసపోతున్నాం
ఈ ప్రభుత్వం విత్తనాలు, ఎరువులు ఎప్పుడు తెస్తుందో.. ఎప్పుడిస్తుందో..?
వైఎస్ ఉన్నప్పుడు ఎప్పుడు కోరితే అప్పుడు అందేవి
ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునేవారే కరువయ్యారని రైతుల ఆవేదన
జగనన్న వస్తారు.. రాజన్న రాజ్యం తెస్తారు: రైతులకు షర్మిల భరోసా
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ గురువారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 164, కిలోమీటర్లు: 2,168

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: వ్యవసాయ సీజన్ మొదలవుతోంది.. వ్యవసాయ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వం ఇప్పటికే విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసి రైతులకు అందుబాటులో ఉంచాలి. కానీ రాష్ట్రంలో ఎక్కడా ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఇదే అదనుగా అక్రమార్కులు నకిలీ విత్తనాలు, ఎరువులతో మార్కెట్‌ను ముంచెత్తుతున్నారు. నకిలీలకు చెక్ పెట్టాల్సిన విజిలెన్స్ వ్యవస్థ ఇంకా నిద్రలోనే జోగుతోంది. పోయిన ఏడాది విత్తనాలడిగిన రైతుపైకి లాఠీలు లేచాయి. గుప్పెడు విత్తనాల కోసం రాత్రింబవళ్లూ క్యూలు కట్టి పడిగాపులు పడాల్సి వచ్చింది. అయినా నాణ్యమైన విత్తనాలు దొరకలేదు.

మరో దిక్కులేక రైతన్నలు నకిలీ విత్తన మాఫియా వలలో పడ్డారు. దీన్నుంచి ప్రభుత్వం ఇంకా పాఠాలు నేర్వలేదు! మళ్లీ గతేడాది పరిస్థితితే ఇప్పుడూ పునరావృతం అయ్యేలా కనిపిస్తోందని, నకిలీ విత్తనాలు, ఎరువుల బారి నుంచి తమను కాపాడే వారే లేరని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిలతో రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, దానితో అంటకాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర గురువారం పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజక వర్గంలో సాగింది. ఈ నియోజక వర్గంలోని మార్టేరు మండల కేంద్రంలో రైతులు, మహిళలతో కలిసి షర్మిల రచ్చబండలో పాల్గొన్నారు. రైతుల సమస్యలు విన్నారు. దారి వెంట నడుస్తుండగా పొలాల్లో పనులు చేసుకుంటున్న కొందరు రైతులు పరుగుపరుగున వచ్చి షర్మిలను కలిశారు. వాళ్ల సమస్యలు చెప్పుకున్నారు.
రైతు రాజయ్యే రోజులు దగ్గర్లోనే: షర్మిల

రైతు సమస్యలు వింటూ వారికి ధైర్యం చెప్తూ షర్మిల ముందుకు కదిలారు. రైతు మళ్లీ రాజులా బతికే రోజులు దగ్గర్లోనే ఉన్నాయంటూ వారికి భరోసానిచ్చారు. మార్టేరులో రచ్చబండతో పాటు, పలుచోట్ల రైతుల తో ఆమె మాట్లాడారు. ఆ మాటల సారాంశం ఆమె మాటల్లోనే.. ‘‘వైఎస్సార్ రైతు పక్షపాతి. రైతులకు ఏం చే స్తే బాగుపడతారో.. ఏం చేస్తే అప్పుల ఊబి నుంచి బయటపడతారో అవన్నీ చేసి చూపించారు. ఏడు గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానన్నారు.. ఇచ్చి చూపించారు.

రూ1250 కోట్ల రుణ బకాయిలను మాఫీ చేశారు. ఈరోజు వైఎస్సార్ బతికే ఉంటే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తు ఇచ్చి చూపించేవారు. ఏ సీజన్‌లో, ఏ ప్రాంతం రైతులకు ఎంత నీరు అవసరం అవుతుంది.. ఏ ప్రాంత రైతులు ఏ పంటలు వేస్తారు.. ఎన్ని విత్తనాలు అవసరం అవుతాయి.. ఏ ఎరువులు వాడుతారు.. ఎంత విద్యుత్తు వినియోగం అవుతుంది.. ఏ ప్రాజెక్టులో ఎంత మేరకు నీళ్లు ఉన్నాయి.. ఇలాంటి విషయాలు వైఎస్సార్ వేళ్ల మీద లెక్కలు వేసి చెప్పేవారు. ఈ సీజన్ వస్తే నాన్నగారు నిద్ర లేచే సరికి ఆయన టేబుల్ మీద వ్యవసాయ సమాచారానికి సంబందించిన ఫైల్ సిద్ధంగా ఉండేది. కానీ ఈ పాలకులకు వ్యవసాయం అంటే ఏమిటో తెలియదు. ఇక వాళ్లకు రైతు సమస్యలు ఏమి అర్థమవుతాయి. చంద్రబాబు హయాంలో రూ.1,800 ఉన్న బీటీ పత్తి విత్తనాల ధరను వైఎస్సార్ రూ.650 తగ్గించారు. కార్పొరేట్ విత్తన కంపెనీలు అంత తక్కువ ధరకు ఇవ్వలేమని మొండికేస్తే.. ఆ ధరకైతేనే మా రాష్ట్రంలో విత్తనాలు అమ్ముకోండి.. లేకుంటే వెళ్లిపోండని వైఎస్సార్ తెగేసి చెప్పారు. వైఎస్సార్ మన మధ్య నుంచి వెళ్లిపోగానే ఈరోజు అవే పత్తి విత్తనాల ధర రూ.930కి పెంచారు. మీ అందరికీ ఒక్కమాట చెబుతున్నా. ఆరునెల్లో... ఏడాదో ఓపిక పట్టండి. జగనన్న ఏ తప్పూ చేయలేదు. తప్పకుండా వస్తారు.. రాజన్న రాజ్యం తెస్తారు. రాజన్న రాజ్యంలో రైతన్నను రాజులాగా చూసుకుంటారు.

14.2 కిలోమీటర్ల యాత్ర

గురువారం 164వరోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలోని కవిటం నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి జగన్నాథపురం, మార్టేరు, ఆలమూరు, కంతేరు మీదుగా కొత్తపాడు చేరుకుంది. రాత్రి 7.30 గంటలకు కొత్తపాడు శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. మొత్తం 14.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటివరకు మొత్తం 2,168. కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న వారిలో ఎమ్మెల్యే ఆళ్ల నాని, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరు ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్సీ మల్లుల లక్ష్మీనారాయణ, స్థానిక నాయకులు కండిబోయిన శ్రీనివాసరావు, కొయ్య ప్రసాదరెడ్డి తదితరులు ఉన్నారు.

సీజన్ మొదలవుతున్నా.. విత్తనాల జాడే లేదండీ..

‘‘అమ్మా.. వ్యవసాయ సీజన్ మొదలైపోతుందండీ.. అధికారులు ఎక్కడ ఉన్నరో.. ఎప్పుడొస్తరో తెలియదండీ. సర్కారు విత్తనాల జాడే లేదండీ. తీరా విత్తనం వేసే సమయంలో నాలుగు సంచుల విత్తనాలు, నాలుగు సంచుల మందు కట్టలు తీసుకొచ్చి రైతులను తన్నుక చావమంటారండీ. బయట ఎక్కడ చూసినా నకిలీ విత్తనాలు, నకిలీ మందులు టన్నుల కొద్ది దించుతున్నారమ్మా.. వాళ్లను ఆపే వాళ్లే లేరు.. పోయిన ఏడాది నకిలీ మందుల బారిన పడ్డాం.. పంటకు దోమకాటు సోకితే వేలకు వేలు పోసి మందు తీసుకొచ్చి కొడితే రోగం పెరిగింది కానీ తగ్గలేదు..’’
- ఎన్.ఆంజనేయులు రైతు, ఆచంట

గోదాముల్లో ఇంకా బూజే దులపలేదు..

‘‘ప్రభుత్వం ఇప్పటికే విత్తనాలను సిద్ధం చేసి రైతులకు అందుబాటులో ఉంచాలి. కానీ అంత ప్రణాళికతో పట్టించుకునే ప్రభుత్వం కాదమ్మా ఇది. సహకార సంఘం గోదాముల్లో ఇంకా బూజే దులపలేదు. ఇక వీళ్లు విత్తనాలు ఎప్పుడు తెస్తారో.. రైతులకు ఎప్పుడిస్తారో ఆ దేవుడికే తెలియాలి. ప్రైవేటు వ్యాపారులు మాత్రం ఎరువులు, విత్తనాలు తెచ్చి పెట్టారు. చినుకు పడితే రైతులు వాటినే కొని విత్తనంగా వేసి మోసపొతున్నారమ్మా’’
- సత్య వెంకటరెడ్డి, రైతు, నెగ్గిపూడి

వైఎస్‌తోనే రైతు రాజరికం పోయిందమ్మా..

‘‘వైఎస్ ఉన్నప్పుడు కోరినప్పుడు రైతుకు ఎరువులు, విత్తనాలు అందాయండీ.. ఆయ్.. ఆ మహానుభావుడు పోయినప్పుడే రైతు రాజరికం పోయిందండీ! ఎన్ని కావాలంటే అన్ని సంచుల విత్తనాలు ఇచ్చారండీ. ఇప్పుడలా లేదు. ఒకట్రెండు సంచులు ఇత్తున్నారండీ... మిగిలినవి బ్లాక్ మార్కెట్లో తెచ్చుకోవాలండీ. ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి గారి విధానం అస్సలు బాగోలేదండీ..’’
- గుడిమెట్ల సత్యనారాయణరెడ్డి, రైతు, వెలగపూ
Share this article :

0 comments: