వైఎస్ చలవతోనే ఫీజు రీయింబర్స్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్ చలవతోనే ఫీజు రీయింబర్స్

వైఎస్ చలవతోనే ఫీజు రీయింబర్స్

Written By news on Wednesday, May 22, 2013 | 5/22/2013

వైఎస్ చలవతోనే ఫీజు రీయింబర్స్
ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలి: ఉపాధ్యాయులు
వైఎస్సార్‌టీఎఫ్ రాష్ట్ర కమిటీ సమావేశం.. పలు తీర్మానాల ఆమోదం


‘‘ఉన్నత విద్యను అభ్యసించేందుకు పేదరికం అడ్డు కారాదనే ఆలోచనతోనే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని ప్రవేశపెట్టారు. విద్య పట్ల తనకున్న అభిమానంతో ప్రతి జిల్లాలో ఒక యూనివర్సిటీ, పలు ట్రిపుల్ ఐటీలు నెలకొల్పారు’’ అని పలువురు ఉపాధ్యాయులు కొనియాడారు. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్(వైఎస్సార్‌టీఎఫ్) ఆవిర్భవించి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో రాష్ట్ర కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా దివంగత వైఎస్ చిత్రపటానికి ఉపాధ్యాయులు నివాళి ఘటించారు. అనంతరం.. రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. పలువురు ఉపాధ్యాయులు మాట్లాడుతూ టీచర్లకు వైఎస్ ఇచ్చిన ప్రాధాన్యతను గుర్తుచేసుకున్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళతామని చెప్పారు.

ఈ సందర్భంగా 22 తీర్మానాలను ఆమోదించారు. ఇందులో ‘ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఉచిత హెల్త్‌కార్డులను వెంటనే మంజూరు చేయాలి. డీఎస్సీ-2008 ఉపాధ్యాయులకు నియామకం తేదీ నుంచి రెగ్యులర్ స్కేల్ ఇవ్వాలి. రాష్ట్రవ్యాప్తంగా ఖాళీగా ఉన్న డిప్యూటీ ఈవో, ఎంఈవో, డైట్ లెక్చరర్స్, జేఎల్ పోస్టులను అడహాక్ ప్రమోషన్స్‌తో భర్తీ చేయాలి..’ తదితర తీర్మానాలున్నాయి. వైఎస్సార్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కన్వీనర్ కె.ఓబుళపతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యులు వై.విశ్వేశ్వరరెడ్డి, లీగల్‌సెల్ సభ్యులు వై.నాగిరెడ్డి, ఫెడరేషన్ నేతలు కె.జాలిరెడ్డి, కులశేఖరరెడ్డి, సత్యవర్ధన్‌రావు, పి.అశోక్‌కుమార్, బాబురావులతోపాటు పెద్దసంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Share this article :

0 comments: