ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం .. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ..

ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం ..

Written By news on Friday, May 17, 2013 | 5/17/2013

‘‘జగన్‌బాబును జైల్లో పెట్టి ఏడాది అవుతోంది. ఇంకా సరిపోలేదా? ఇంకెంత కాలం జైల్లోనే ఉంచుతారు? సీబీఐ ఒక్కొక్కరిని ఒక్కో రకంగా విచారణ చేస్తోంది. ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం జరుగుతోంది. ప్రధానమంత్రికి ఒక న్యాయం, అక్కడున్న మంత్రులకు ఒక న్యాయం రాష్ట్రంలో వైఎస్సార్‌కు ఒక న్యాయమా..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. రాజీవ్‌గాంధీ చనిపోయిన తర్వాత బోఫోర్స్ కేసులో ఆయన పేరును తీసేశారని, కానీ రాష్ట్రంలో మాత్రం వైఎస్సార్ చనిపోయాక ఆయన పేరును ఎఫ్‌ఐర్‌లో చేర్చారని ఆవేదన వ్యక్తం చేశారు.

మోపిదేవి, ధర్మాన ప్రసాద్, సబితమ్మ, చిరంజీవి, చంద్రబాబు నాయుడు, ములాయం కోడలు... ఇలా ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం జరుగుతోందన్నారు. షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 2 వేల కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గంలో రావికంపాడు వద్ద ఏర్పాటు చేసిన 24 అడుగుల వైఎస్సార్ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి విజయమ్మ హాజరయ్యారు. షర్మిల పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.

ఇది బాబు పాలన రెండో భాగం..
ప్రస్తుతం రాష్ట్రంలో చంద్రబాబు పాలన రెండోభాగం సాగుతోందని విజయమ్మ మండిపడ్డారు. ఆనాడు చంద్రబాబు నాయుడు పాలనలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడ్డారో... ఈరోజు కిరణ్ పాలనలో అలాంటి కష్టాలే పడుతున్నారన్నారు. కరెంటు బిల్లులు కట్టకపోతే రైతులను జైల్లో పెట్టించారని, బ్రిటీష్ వారి కాలం మాదిరిగా రైతుల గోళ్లు పీకించిన దుర్మార్గుడు చంద్రబాబని ఆరోపించారు. ఆ రోజుల్లో రైతులు, పేదలకు కూలి పని కూడా లేదని అందువల్లే అనేక మంది ఇతర రాష్ట్రాలకు, గల్ఫ్ దేశాలకు వలస పోయారని చెప్పారు. చంద్రబాబు పాలనలో నాలుగు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, 54 ప్రభుత్వరంగ సంస్థలను అమ్మేశారని అన్నారు. నాటి వైఎస్సార్ ప్రజా ప్రస్థానం పాదయాత్రను గుర్తుచేసుకుంటూ.. ‘‘ఇంత ఎండలున్నాయి.. కొంచెం ఎండలు తగ్గాకపాదయాత్ర చేస్తే బాగుంటుందేమో’’ అని వైఎస్‌కు చెప్పానన్నారు.

‘‘అందుకు ఆయన నాకు ఒకే మాట చెప్పారు.. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు.. కష్టాల్లో ఉన్నారు.. చంద్రబాబు పాలన చీకటి పాలన. రైతులు, పేదలు, మహిళలు, రైతు కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్లకు ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని ఆరోజు ప్రజా ప్రస్థానానికి బయలుదేరారు. సీఎం అయ్యాక అన్ని సమస్యలకు పరిష్కారం చూపారు..’’ అని అన్నారు. నేడు ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి మరో ప్రజాప్రస్థానం పేరుతో మళ్లీ ప్రజల్లోకి వచ్చి వారికి ధైర్యం చెప్పాల్సిన అవసరం ఉందని జగన్‌మోహన్‌రెడ్డి భావించారన్నారు. అక్టోబర్ 5న బెయిల్ వస్తే పాదయాత్ర చేయాలని తానే రూట్‌మ్యాప్ తయారు చేసుకున్నారని, కానీ విధిలేని పరిస్థితుల్లో జగన్‌బాబు రాలేకపోయారని చెప్పారు. మరో ప్రజాప్రస్థానం.. ప్రజలకు ధైర్యం చెప్పడానికి వచ్చిన యాత్ర అని, భరోసా ఇచ్చే యాత్ర అని చెప్పారు. ‘‘జన నేతగా మీ అందరి మధ్యలో ఉన్న జగన్‌బాబును ఈరోజు కక్షతో లోపలపెట్టి ఏడాది అవుతోంది. వీటన్నిటికి వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మరో ప్రజాప్రస్థానం పాదయాత్రతో మీ ముందుకు వచ్చింది. ఈ సమస్యలను అధిగమించి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో రాజన్న సువర్ణయుగాన్ని తెచ్చుకోగలిగినప్పుడే అసలైన పండగ రోజు..’’ అని చెప్పారు.

నేడు అధికార , ప్రతిపక్ష పార్టీలుగా ఉన్న కాంగ్రెస్, టీడీపీలు ఒక్కటయ్యాయని విమర్శించారు. ‘‘ఈ రెండు పార్టీలు కలిసి ఈ రాష్ర్టంలో ఇంకో పార్టీ, ఇంకో పేపర్ ఉండకూడదని నిర్ణయించకున్నాయి. ఈ రెండు పార్టీలకు నీతి లేదు. నిజాయితీ అంతకంటే లేదు. వీసమంత విశ్వసనీయత కూడా లేదు. ఈ రెండు పార్టీలు వెన్నుపోటు పార్టీలుగా నిలిచిపోయాయి..’’ అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఇప్పటివరకు వచ్చిన ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు కంటే చరిత్రహీనుడు మరొకరు లేరని మండిపడ్డారు.

జగన్‌పై కాంగ్రెస్ కక్ష సాధింపు
దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి రెండుసార్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చారు. కేంద్రంలోను ప్రభుత్వ ఏర్పాటుకు వైఎస్సే కారణం. ఆయన మరణించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన కుమారుడిని వేధిస్తోంది. నెల్లూరులో ఉప ఎన్నికల సమయంలో గులాంనబీ అజాద్ చెప్పిన మాటలు వింటే జగన్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధిస్తోందని అర్థమవుతుంది. దురుద్దేశంతోనే ప్రభుత్వం టీడీపీతో కుమ్మక్కై జగన్‌ను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా ప్రజలు కాంగ్రెస్, టీడీపీలకు బుద్ధి చెప్పాలి.
- మేకపాటి రాజమోహన రెడ్డి, ఎంపీ

జైల్లో ఉన్నా.. పులే
వైఎస్ పథకాలను నీరుగారుస్తూ ఈ ప్రభుత్వం ప్రజల్ని మోసగిస్తోంది. ప్రజల కష్టాలు తెలుసుకుని వాటిని పరిష్కరించాలనే తపనతో షర్మిల మండుటెండల్లో పాదయాత్ర చేస్తున్నారు. జగన్‌ను అన్యాయంగా జైల్లో పెట్టారు. జైలులో ఉన్నా... పులి పులే.
- తెల్లం బాలరాజు, ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ప.గో. జిల్లా కన్వీనర్

వైఎస్‌ను చూసే కాంగ్రెస్‌కు ఓటేశారు
వైఎస్ ఏడు గంటల ఉచిత విద్యుత్ ఇస్తే.. ప్రస్తుతం మూడు గంటల కరెంటు కూడా ఇవ్వడం లేదు. ఆనాడు వైఎస్‌ను చూసే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేసి గెలిపించారు. ప్రజా సమస్యలన్నీ తీరాలంటే జగన్ సీఎం కావాల్సిందే.
- మేకా శేషుబాబు, ఎమ్మెల్సీ

వారిద్దరూ రాష్ట్రానికి పట్టిన పీడలు
కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబు ఇద్దరూ రాష్ట్రానికి పట్టిన పీడలు. ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు షర్మిల మండుటెండలో పాదయాత్ర చేస్తున్నారు. వైఎస్ జగన్‌ను అక్రమంగా జైల్లో బంధించినా ఆయన ప్రజల గుండెల్లోనే ఉన్నారు.
- తిప్పారెడ్డి, ఎమ్మెల్సీ

ప్రజలు సమర్థ నాయకుడిని కోరుతున్నారు
రాష్ట్ర ప్రజలు సమర్థవంతమైన నాయకుడిని కోరుకుంటున్నారు. సింహాన్ని బోనులో బంధించినా జగనన్న రాజ్యం తప్పక వస్తుంది. ఉదయించే సూర్యుడిని ఆపటం ఎలా అసాధ్యమో.. జగన్ సీఎం కాకుండా ఆపటం అంతే అసాధ్యం. ప్రపంచ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే రోజు ఇది. ప్రజలకు, జగన్‌కు సంధానకర్తగా షర్మిల పాదయాత్ర చేపట్టారు.
- ఎమ్మెల్యే ధర్మాన కృష్ణదాస్

రాజన్న రాజ్యంలోనే న్యాయం
2003 మే 12న పశ్చిమ గోదావరి జిల్లాలోకి వైఎస్ ప్రజాప్రస్థానం పాదయాత్ర చేరింది. మళ్లీ పదేళ్ల తర్వాత అదేరోజు షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర జిల్లాలో ప్రవేశించింది. ప్రజల సమస్యలు తీరాలన్నా.. పేదలకు న్యాయం జరగాలన్నా.. రాజన్న రాజ్యంతోనే సాధ్యం.
- మద్దాల రాజేష్‌కుమార్, ఎమ్మెల్యే

జగనన్న బాణం.. పేదల ప్రాణం
జగనన్న బాణం... పేద ప్రజల ప్రాణం షర్మిల. పేదల కష్టాలు తీర్చడమే ముఖ్యమని వైఎస్ కుటుంబం భావిస్తోంది. పేదల కోసం ప్రాణాలు పెట్టిన మహా నాయకుడు వైఎస్.
- గొల్ల బాబూరావు, ఎమ్మెల్యే

సాహసోపేత యాత్ర
2003లో వైఎస్ పాదయాత్ర చేస్తున్నప్పుడు రాష్ట్రంలో ఏ పరిస్థితులు అయితే ఉన్నాయో ఇప్పుడూ అదే పరిస్థితి. అందుకే షర్మిల సాహసోపేతంగా పాదయాత్ర చేపట్టారు.
- కూన శ్రీశైలం గౌడ్, ఎమ్మెల్యే

ఆ పార్టీలను గోదావరిలో కలిపేసేలా ఉన్నారు
ఇక్కడకు వచ్చిన అశేష జనాన్ని చూస్తుంటే కాంగ్రెస్, టీడీపీలను గోదావరిలో కలిపేసేలా ఉన్నారు. మీకు ధైర్యం ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన 15 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసి ఎన్నికలకు వెళ్లండి.
- జోగి రమేష్, ఎమ్మెల్యే

బాబు చరిత్రహీనుడిగా మిగిలిపోయారు
అవిశ్వాసం సమయంలో ప్రజావ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించి చంద్రబాబు చరిత్ర హీనుడిగా మిగిలిపోయారు. జగనన్న సీఎం అవుతారు. రాష్ట్రంలో ప్రజల కష్టాలు తీరుస్తారు.
- కొయ్యే మోషేన్ రాజు, వైఎస్‌ఆర్‌సీపీ సీఈసీ సభ్యుడు

మహాయజ్ఞంలా పాదయాత్ర
పేదల కష్టాలు తెలుసుకునేందుకు ఎండ.. వానలను లెక్కచేయకుండా.. మరో ప్రజాప్రస్థానం మహా
యజ్ఞంలా సాగుతోంది. ప్రజాశ్రేయస్సే ధ్యేయం గా షర్మిల పాదయాత్ర చేస్తున్నారు.
- ముదునూరి ప్రసాదరాజు, మాజీ ఎమ్మెల్యే

నమ్మకంతోనే జనం వస్తున్నారు
రానున్నది రాజన్న రాజ్యమే అన్న నమ్మకంతోనే షర్మిల పాదయాత్రలో జనం పెద్దఎత్తున పాల్గొంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుపై నమ్మకం లేక ఆయన పాదయాత్రకు జనం రాలేదు.
- ఆదిరెడ్డి అప్పారావు, ఎమ్మెల్సీ
Share this article :

0 comments: