నివేదికను తారుమారు చేసినా చర్యల్లేవా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » నివేదికను తారుమారు చేసినా చర్యల్లేవా?

నివేదికను తారుమారు చేసినా చర్యల్లేవా?

Written By news on Wednesday, May 8, 2013 | 5/08/2013

ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి చేతికే సీబీఐ నివేదిక ఇవ్వడం నీతిమాలిన చర్య
కోల్ స్కాంలో నిందితులు బయటుంటే మాట్లాడని సీబీఐ జగన్‌కు బెయిల్ వద్దనటం కక్షపూరితమే
దేశంలో ఇంత జరుగుతున్నా బాబు నోరు మెదపకపోవటం కుమ్మక్కు కాదా?
ఎన్టీఆర్‌ను చంపిన బాబు.. విగ్రహావిష్కరణకు వెళ్లడం సిగ్గుమాలిన చర్య
మంత్రి శైలజానాథ్ అడ్డంగా బుక్ అయినా చర్యలేవి?
కొండా సురేఖ, కొణతాల పార్టీ వీడుతున్నారనే విషప్రచారాన్ని నమ్మొద్దు

సాక్షి, గుంటూరు: బొగ్గు కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే సీబీఐ నివేదికలు ఇవ్వటం నీతిమాలిన చర్య అని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బొగ్గు స్కాం కేసులో సీబీఐ సుప్రీంకోర్టుకు సమర్పించాల్సిన రెండు అఫిడవిట్లను దేశ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికే అందజేసిందని, దానిని ప్రధానమంత్రి కార్యాలయంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి, అటార్నీ జనరల్, ప్రధాని కార్యాలయ సిబ్బంది ట్యాంపరింగ్ చేశారని ధ్వజమెత్తారు. ఆయన మంగళవారమిక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బొగ్గు కుంభకోణం నివేదికలోని కొన్ని అంశాల్ని తొలగించిన వ్యవహారంలో బహిరంగంగా దొరికిపోయిన కేంద్రమంత్రులు, ప్రధాని కార్యాలయ సిబ్బందిపై ప్రధానమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ఆయన ప్రశ్నించారు. తద్వారా ప్రజాస్వామ్యాన్ని మంటగలుపుతున్నారని ధ్వజమెత్తారు. ఈ విషయంపై కనీసం సీబీఐ నోరు విప్పకపోవటం అత్యంత సిగ్గుచేటన్నారు. కోల్ స్కాంలో నిందితులు దర్జాగా బయట తిరుగుతూ నివేదికలు తారుమారు చేస్తున్నా పట్టించుకోని సీబీఐ, వైఎస్సార్‌సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి బెయిల్ విషయంలో మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు. పైగా కోర్టులో ఆయనకు బెయిలిస్తే సాక్ష్యాలు తారుమారు చేస్తారని చెప్పటం దాని వైఖరికి నిదర్శనమన్నారు. కేంద్రప్రభుత్వ పెద్దలున్న బొగ్గు స్కాంలో ఒకవిధంగా, జగన్ కేసులో మరోవిధంగా సీబీఐ వ్యవహరించటం ఏమిటన్నారు. రికార్డులు టాంపరింగ్ చేసిన వ్యక్తులు బయటఉంటే చర్యల్లేవు కానీ జైలులో ఉన్న జగన్ బయటికొస్తే ఇబ్బందని సీబీఐ మాట్లాడటం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. జగన్ విషయంలోనే ఇలా ఎందుకు చేస్తున్నారని నిలదీశారు. సీబీఐని కాంగ్రెస్ తన గుప్పిట్లో పెట్టుకొని రాజకీయంగా ప్రత్యర్థుల్ని అణచివేసే ప్రయత్నం చేస్తోందని, ప్రజలు దీనిని గమనిస్తున్నారని, రానున్న రోజుల్లో ఇందుకు ఆ పార్టీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

జగన్‌పై బురద చల్లడమే బాబు పని..

టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర, పాకుడుయాత్ర అంటూ తిరుగుతూ జగన్‌పై నిత్యం బురద చల్లటమే పనిగా పెట్టుకున్నారని అంబటి ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న బొగ్గు స్కాం విషయంలో సీబీఐ, ప్రధాని కార్యాలయం, కేంద్రమంత్రులపైన బాబు ఎందుకు మాట్లాడట్లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కయ్యారు కాబట్టే ఆయన మౌనం దాల్చారని విమర్శించారు. దీనిపై మాట్లాడితే ఐఎంజీ, ఇతర భూముల కేసుల్ని సీబీఐ తిరగతోడుతుందని చంద్రబాబుకు భయమన్నారు. ప్రధాన ప్రతిపక్ష నేతగా బాబు ఇప్పటికైనా దీనిపై మాట్లాడాలని, అసలు టీడీపీ వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్‌లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు చంద్రబాబును పిలవనప్పటికీ.. కాంగ్రెస్ వారిని బతిమిలాడి ఆహ్వానింప జేసుకుని వెళ్లారని ఎద్దేవా చేశారు. అసలు ఎన్టీఆర్‌ను చంపిన చంద్రబాబు విగ్రహావిష్కరణకు వెళ్లడం సిగ్గుమాలిన చర్య అని మండిపడ్డారు.

మంత్రులు నేరస్తులని చెబుతున్నప్పటికీ...

రాష్ట్రంలో పలువురు మంత్రులు నేరస్తులని సీబీఐ చెబుతున్నా.. వారిని తొలగించకుండా అవే శాఖల్లో కొనసాగిస్తున్నారని రాంబాబు ధ్వజమెత్తారు. రూ.25 కోట్ల నల్లధనాన్ని వైట్ చేయటానికి ప్రయత్నిస్తూ మంత్రి శైలజానాథ్ కోబ్రాపోస్ట్ స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగాదొరికిపోయినప్పటికీ నిస్సిగ్గుగా వ్యవహరిస్తున్నారని, తన స్నేహితుడు అడిగితే ఏదో సాయం చేశానంటూ కాకమ్మ కథలు చెబుతున్నారని దుయ్యబట్టారు. శైలజానాథ్‌ను రాజీనామా చేయాలని తాము కోరబోమని, ఎందుకంటే.. వివిధ కేసుల్లో ఉన్న వ్యక్తులే దర్జాగా మంత్రులుగా చలామణి అవుతున్న దౌర్భాగ్య పరిస్థితులు ఈ కాంగ్రెస్ హయాంలోనే ఉన్నాయని ఆయన మండిపడ్డారు.

అదంతా విషప్రచారం...

వైఎస్సార్‌సీపీని పార్టీ నేతలు కొండా సురేఖ, కొణతాల రామకృష్ణలు వీడుతున్నారంటూ కొన్ని చాన ళ్లు, పత్రికల్లో వస్తున్న కథనాల్ని పార్టీ శ్రేణులు ఎవ రూ నమ్మవద్దని, అదంతా పార్టీపై కొందరు చేస్తున్న విషప్రచారమేనని అంబటి మండిపడ్డారు. కాంగ్రె స్, టీడీపీలు చేస్తున్న కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందన్నారు. కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీయటానికి జరుగుతున్న తప్పుడు రాతలు, కూతల్ని ఎవరూ నమ్మవద్దని పిలుపునిచ్చారు. 
Share this article :

0 comments: