ఒక్కడిని లక్ష్యం చేసుకుని సాగిన కుమ్మక్కు కుట్రలకు సాక్షిగా నిలిచిన మే నెల - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఒక్కడిని లక్ష్యం చేసుకుని సాగిన కుమ్మక్కు కుట్రలకు సాక్షిగా నిలిచిన మే నెల

ఒక్కడిని లక్ష్యం చేసుకుని సాగిన కుమ్మక్కు కుట్రలకు సాక్షిగా నిలిచిన మే నెల

Written By news on Monday, May 27, 2013 | 5/27/2013

ఒక్కడిని లక్ష్యం చేసుకుని సాగిన కుమ్మక్కు కుట్రలకు సాక్షిగా నిలిచిన మే నెల
జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత అక్రమ అరెస్టుకు నేటికి ఏడాది. ఉప ఎన్నికల ముప్పును తప్పించుకునేందుకు అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ కలసికట్టుగా కుట్ర పన్ని జగన్‌ను అరెస్టు చేయించి నేటికి ఏడాది. పది మాసాలుగా దర్యాప్తు జరుపుతూ కూడా, మూడు చార్జిషీట్లను వేసి కూడా, ఏనాడూ కనీసం ప్రశ్నించని సీబీఐ... ఉప ఎన్నికల వేళ ఉన్నట్టుండి జన నేతను నిర్బంధించింది. మొదటి చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకున్న క్రమంలో, మే 28వ తేదీన తమ ముందు హాజరు కావాలంటూ సీబీఐ ప్రత్యేక కోర్టు అప్పటికే జగన్‌కు సమన్లు జారీ చేసింది. ఆ రోజున వ్యక్తిగత పూచీకత్తుతో బెయిల్ తీసుకుంటారని అర్థమైన సీబీఐ, బాసుల ఆదేశాలతో రంగప్రవేశం చేసింది. మే 25నే విచారణకు రావాలంటూ జగన్‌కు నోటీసులిచ్చింది. ముందస్తు బెయిల్ కోసం ఆయన సీబీఐ ప్రత్యేక కోర్టును ఆశ్రయిస్తే, ‘విచారణ పూర్తయి చార్జిషీట్లు కూడా వేసినందున అరెస్టు చేయబోరు. అలాంటి భయం అనవసరం’ అని కోర్టు చెప్పింది. కానీ జగన్ అనుమానమే నిజమని రుజువైంది. 25, 26, 27 తేదీల్లో వరుసగా మూడు రోజుల పాటు గంటల తరబడి ‘విచారించిన’ అనంతరం, మే 27 రాత్రి జగన్ అరెస్టును సీబీఐ ప్రకటించింది!

2012 మే 1న... 
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉప ఎన్నికల ప్రచారాన్ని తిరుపతి నుంచి ఆరంభించారు. అదే నెల 27న అర్ధరాత్రి పూట సీబీఐ ఆయన్ను అరెస్టు చేసింది. ఈ రెండు సంఘటనలకూ సంబంధమేంటని అనుకోవచ్చు గానీ... మొదటిది లేకుంటే చివరిది కూడా జరిగేది కాదని నిస్సందేహంగా చెప్పొచ్చు. ఎందుకంటే జగన్‌మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలోకి దిగటంతో ఆయన పార్టీ గెలుపు తథ్యమని ముందే ఖరారు అయిపోయింది. అందుకే కుట్ర తారస్థాయిని చేరుకుంది. మే 1వ తేదీ నుంచి 27 మధ్య 26 రోజుల్లో... దాదాపు ప్రతి రోజూ ఏదో ఒక కుట్ర బయట పడుతూనే వచ్చింది. కానీ వాటిని కోట్లాది మంది రాష్ట్ర ప్రజలు ఒక్కటై అడ్డుకున్నారు. ‘సాక్షి’కి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా నిలిచారు. అందుకే అధికార, ప్రధాన ప్రతిపక్ష-ఎల్లో మీడియా త్రయం సమష్టిగా పన్నిన కుట్రలు చాలావరకూ పటాపంచలయ్యాయి. అధికారాన్ని అడ్డుపెట్టుకుని జన నేతను కుట్రపూరితంగా అరెస్టయితే చేయగలిగారు గానీ... ఆయనను జనానికి గానీ... ఆయన మీడియా సంస్థను పాఠకులకు, వీక్షకులకు గానీ ఏ మాత్రమూ దూరం చేయలేకపోయారు. ఈ కుమ్మక్కు కుట్రలన్నింటి అంతిమ లక్ష్యమైన జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టయి ఈ రోజుతో ఏడాది గడుస్తున్న సందర్భంగా... ఆ ఒక్క నెలలో జరిగిన పరిణామాల్ని వివరించే కథనమిది...

మే, 2012. మరికొద్ది రోజుల్లో ఉప ఎన్నికలు. 1వ తేదీన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు. ఎక్కడికెళ్లినా జన ప్రభంజనమే. అద్భుత స్పందనే. ఇంకేముంది! ఫలితం ముందే తెలిసిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్లీన్‌స్వీప్ ఖాయమని కాంగ్రెస్‌కు అర్థమైపోయింది. ఇంతలోనే... మే 4న లోక్‌సభలో మాట్లాడుతూ అప్పటి కేంద్ర హోం మంత్రి చిదంబరం ఒక సంచలనాన్ని బయటపెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కొంతకాలం క్రితం హస్తినలో తనను రహస్యంగా కలిసినట్టు వెల్లడించారు. అలా అనుకోకుండానే అయినా... కుట్ర బట్టబయలైంది. 

జగన్‌మోహన్‌రెడ్డిపై దర్యాప్తునకు హైకోర్టు ఆదేశించడానికి రెండు రోజుల ముందు చిదంబరాన్ని చంద్రబాబు కలవడమెందుకో జనానికి తెలిసింది. వారి ఆగ్రహం ఎలా ఉండబోతోందో టీడీపీకీ అర్థమైంది. ఇంతలోనే.. కంపెనీల్లో పెట్టుబడుల కేసులో ఒకటో చార్జిషీటును విచారణకు స్వీకరించిన సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం మే 28న హాజరు కావాలంటూ జగన్‌కుసమన్లు జారీ చేసింది. చార్జిషీటు కాపీలు తీసుకోవాలి గనుక ఇతర నిందితులతో పాటు ఆ రోజు రావాలని కోరింది. అంటే... ఆ రోజున గనుక జగన్ కోర్టుకు హాజరైతే, అక్కడే ఇతర నిందితులతో పాటు సొంత పూచీకత్తుపై ఆయనకు కూడా బెయిలు మంజూరవుతుంది. తరవాత ఆయన్ను ఈ కేసులో అరెస్టు చేసే అవకాశం ఉండదు.

గొంతు నొక్కే యత్నాలు
‘పంజరంలోని చిలుక’కు పరిస్థితి అర్థమయింది. దాంతో బాసుల నిర్దేశానుసారం ‘అట్నుంచి’ నరుక్కొచ్చే ప్రయత్నాలకు సీబీఐ తెర తీసింది. ఎలాగైనా ‘సాక్షి’ గొంతు నొక్కడం ద్వారా జగన్ బలాన్ని తగ్గించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. మే 8న.. సాక్షి పత్రిక, చానల్ రోజువారీ లావాదేవీలకు సంబంధించిన బ్యాంకు కరెంటు ఖాతాలను స్తంభింపజేసింది. వాటిలో తదుపరి లావాదేవీల్ని నిషేధించింది. మరోవంక తాము శరవేగంగా దర్యాప్తు చేస్తున్నామని లోకాన్ని నమ్మించడానికి అదే రోజు మూడో చార్జిషీటు దాఖలు చేసింది. కానీ దీని ద్వారా దుష్టశక్తులు ఆశించింది ఒకటైతే, జరిగింది మరొకటి. ఖాతాల స్తంభనపై సీబీఐ ఊహించని స్పందన ఎదురైంది. యావత్తు పాత్రికేయ లోకమంతా దానికి వ్యతిరేకంగా గళమెత్తింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఇంతలోనే ప్రభుత్వం మరో పిడుగు వేసింది. సాక్షి పత్రికకు, చానల్‌కు ప్రభుత్వ ప్రకటనలు జారీ చేయటాన్ని నిషేధిస్తూ మే 10న ఉత్తర్వులు జారీ చేసింది. అసలే ఖాతాల స్తంభన. ఆపై ఇలా నల్ల జీవో. పాత్రికేయ ప్రపంచమే కాదు... మేధావులు, స్వచ్ఛంద కార్యకర్తలూ నిరసన గళమెత్తారు. సర్కారీ కుహకాన్ని కడిగి పారేశారు. ఇలాంటి నిరంకుశ విధానాలు చెల్లవని నినదించారు. పోరాటాన్ని మరింత ముందుకు తీసుకెళ్లారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ వంటి సంస్థలు జాతీయ స్థాయిలో సమావేశమై మరీ ప్రభుత్వ దుశ్చర్యను ఖండించాయి. సాక్షి యాజమాన్యంతో పాటు ఉద్యోగులు కూడా దీనిపై న్యాయపోరాటం ఆరంభించారు.

మరోవైపు సీబీఐ వేగం పెంచింది. జగన్‌మోహన్‌రెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం చేసింది. పారిశ్రామికవేత్త, పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టిన నిమ్మగడ్డ ప్రసాద్‌ను, ఐఆర్‌టీఎస్ అధికారి బ్రహ్మానందరెడ్డిని ముందుగా మే 15న విచారణకంటూ పిలిచి అరెస్టు చేసింది. మరో వంక ‘సాక్షి’ ఆస్తుల్ని అటాచ్ చేస్తామని, అనుమతివ్వండని ప్రభుత్వాన్ని అడిగింది. ప్రభుత్వం కూడా రెండ్రోజులు తిరక్కుండానే మే 18న అందుకు పచ్చజెండా ఊపేసింది. సీబీఐ కుట్ర అందరికీ అర్థమయింది. అటు సాక్షిని దెబ్బతీసి, ఇటు తనను అరెస్టు చేసి, వీలైతే ఉప ఎన్నికలను కూడా అడ్డుకోవాలని చూస్తున్నారని మే 22న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గుంటూరులో జనం సాక్షిగా చెప్పారు. ఆయన అలా చెప్పి 24 గంటలైనా గడిచిందో లేదో... 23వ తేదీన ఆయనకు నేరుగా సీబీఐ నోటీసులు పంపింది. 25న తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. పనిలో పనిగా మంత్రి మోపిదేవి వెంకటరమణారావును కూడా 23న విచారణకంటూ పిలిచింది. జగన్‌మోహన్‌రెడ్డిని అరెస్టు చేస్తే... ఈ వ్యవహారంలో మంత్రులనందరినీ వదిలిపెట్టి జగన్‌ను మాత్రమే టార్గెట్ చేశారన్న విమర్శలు వస్తాయనే భయంతో, మోపిదేవి అరెస్టు ద్వారా వాటిని తిప్పికొట్టేందుకు కాంగ్రెస్, సీబీఐ ఒక వ్యూహం పన్నాయని అందరికీ అర్థమైపోయింది. ముందు మోపిదేవిని అరెస్టు చేస్తారనేది కూడా తెలిసిపోయిది. ఊహించినట్టే 24న మోపిదేవిని అరెస్టు చేశారు.

జగన్‌ను విచారించటం మొదలుపెట్టారు
ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకోవటానికి తనను అరెస్టు చేయబోతున్నారని గ్రహించిన జగన్‌మోహన్‌రెడ్డి ముందే తన లాయర్ల చేత యాంటిసిపేటరీ బెయిలుకు దరఖాస్తు చేయించారు. అయితే ఒకసారి కోర్టు తన ఎదుట హాజరు కావాలని నోటీసులిచ్చాక సీబీఐ అరెస్టు చేయడమనేది ఉండదని జడ్జి చెప్పారు. ఈ కేసులో దర్యాప్తు కూడా పూర్తయింది కనక (అప్పటికే 3 చార్జిషీట్లు వేశారు కనక) అరెస్టు చేసే అవకాశముండదని కూడా ఆయనన్నారు. జగన్‌ది భయమే తప్ప, దానికి తగిన ఆధారాలు లేవంటూ పిటిషన్‌ను మరుసటి నెలకు వాయిదా వేశారు. ఇంకా చెప్పాలంటే ముందస్తు బెయిల్‌ను తోసిపుచ్చారు. కానీ 25, 26 తేదీల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు జగన్‌ను విచారించిన సీబీఐ... 27న కూడా విచారణకు రావాల్సిందిగా పిలిచింది. వెళ్లారు. రాత్రి వరకూ విచారించిన సీబీఐ... తెల్లారితే ఆయన కోర్టు ఎదుట హాజరవుతారనే ఉద్దేశంతో... రాత్రికి రాత్రే అరెస్టు చేస్తున్నట్టు ప్రకటించింది. ఒక మహా కుట్రలో ప్రధానాంకాన్ని అలా ‘విజయవంతంగా’ ముగించింది! ఈ అన్యాయాన్ని చూసి యావత్తు రాష్ట్రం ఒక్కసారిగా నివ్వెరపోయింది. జగన్ అరెస్టుపై రాష్ట్రమంతా భగ్గుమంది. దివంగత వైఎస్సార్ సతీమణి విజయమ్మతో సహా ఆయన కుటుంబం యావత్తూ ఈ అర్ధరాత్రి కుట్రకు నిరసనగా రాత్రి అక్కడే సీబీఐ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. అయినా తన కుట్రను నిస్సిగ్గుగా అమలు చేసిన సీబీఐ... అప్పటి నుంచి ఇప్పటి వరకు జగన్ బెయిలుపై కూడా బయటకు రాకుండా రకరకాల సాకులతో అడ్డు తగులుతూనే వస్తోంది.

అయితే ఇక్కడ చెప్పాల్సిందొక్కటే. 
ఆంధ్రప్రదేశ్‌లో ఓ మీడియా గొంతును నులిమేయడానికి మూడు రకాల శక్తులు మూకుమ్మడిగా చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు.
జగన్‌ను రాజకీయ రణక్షేత్రానికి వెళ్లకుండా చేసినా... ఆయన ఘన విజయాన్ని మాత్రం అస్సలు ఆపలేకపోయారు.
ఇక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు నిత్యం జరుగుతున్న తెర వెనక, తెర మీది ప్రయత్నాల్ని అడ్డుకోవటానికి.. జనం ఉండనే ఉన్నారు. న్యాయాన్ని నిలబెట్టేదీ.. నిలబెట్టగలిగేదీ కూడా వారే.

మే 1న 
ప్రజల నుంచే వస్తా..
మహా నేత వైఎస్ రాజశేఖరరెడ్డిలా చనిపోయాక కూడా పేదవాడి గుండెల్లో నిలిచేలా బతకాలన్న తపన, తాపత్రయం నాలో ఉన్నాయి. నేను వాళ్ల మాదిరిగా అధికారం కోసం గడ్డి తినేవాణ్ని కాదు. అధికారం కోసం సొంత మామను వెన్నుపోటు పొడిచే చరిత్ర, ఓటేసిన ప్రజల్ని నట్టేట ముంచే చరిత్ర నాకు లేవు. పేదవాడి కోసం, ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నుకోబడ్డ సీఎంను అవుతాను. నన్ను ఒక్కడిని చేసి ఇటు కాంగ్రెస్ వాళ్లు, చంద్రబాబు కలిసికట్టుగా నాపై దాడి చేస్తున్నారు. అధికారాన్ని ఉసిగొల్పుతున్నారు. మరోవైపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 ఒక్కటై దాడి చేస్తున్నారు. నా దగ్గర రాజ్యాలు లేకపోవచ్చు. మద్దతిచ్చే రాజులు లేకపోవచ్చు. కానీ పై నుంచి ఆ దేవుని ఆశీస్సులున్నాయి. నాన్నను ప్రేమించే ప్రతి గుండె నా వెంటే ఉంది.
- మే 1న తిరుపతి నుంచి ఉప ఎన్నికల 
ప్రచారానికి శ్రీకారం చుట్టిన సందర్భంగా జగన్

మే- 7
సీబీఐ కోర్టు సమన్లు
2012 మే 28న తమ ముందు హాజరు కావాలంటూ జగన్‌కు సీబీఐ ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది. పెట్టుబడుల కేసులో మార్చి 31న సీబీఐ సమర్పించిన మొదటి చార్జిషీటును విచారణకు స్వీకరించి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. చార్జిషీట్ ప్రతిని నిందితులకు అందించేందుకు వారిని వ్యక్తిగతంగా తన ముందు హాజరవాల్సిందిగా కోర్టు ఆదేశించడం పరిపాటి. ఆ మేరకే జగన్‌కు సమన్లు అందాయి.

మే- 8
‘సాక్షి’ ఖాతాల స్తంభన
రాజకీయంగా సవాల్‌గా మారిన జగన్‌మోహన్‌రెడ్డిని దెబ్బ తీసేందుకు.. అధికార పార్టీ ఎమర్జెన్సీ రోజులను మరపిస్తూ బరితెగించింది. వేలాది ఉద్యోగులు, కోట్లాది పాఠకులతో ముడిపడ్డ బలమైన మీడియా సంస్థ ‘సాక్షి’కి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాలను సీబీఐ మే 8న స్తంభింపజేసింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకులకు సీబీఐ ఎస్‌పీ ఈ మేరకు నోటీసులు ఇచ్చారు. ‘‘జగన్ కంపెనీల్లో పెట్టుబడుల కేసు దర్యాప్తులో ఉంది. కాబట్టి జగతి పబ్లికేషన్స్, జగతి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్, ఇందిరా టెలివిజన్ల ఖాతాల్లో లావాదేవీలను నిలిపేయండి. ఆయా ఖాతాల్లో ఇక ఎలాంటి లావాదేవీలనూ అనుమతించొద్దు’’ అని పేర్కొన్నారు. 

స్తంభింపజేసినవన్నీ సంస్థ రోజువారీ కార్యకలాపాల తాలూకు ఆదాయమంతా జమయ్యే కరెంట్ ఖాతాలే. అంటే సాక్షి పత్రికలో, చానల్‌లో ప్రకటనలిచ్చిన కంపెనీలు, పత్రికను కొనే చందాదారుల నుంచి వచ్చే సొమ్మును ఉంచే ఖాతాలు. ఉద్యోగులకు జీతాలు చెల్లించేది కూడా ఈ ఖాతాల నుంచే! ఇదంతా తెలిసి కూడా ఇంతటి నిస్సిగ్గుగా దాడికి దిగారంటేనే, కుట్ర ఎంత పెద్దదో అర్థం చేసుకోవచ్చు. పత్రిక పాఠకులు, టీవీ వీక్షకుల సమాచార హక్కుపై, పత్రికా స్వేచ్ఛపై జరిగిన పెను దాడి ఇది. సీబీఐ దుశ్చర్యను నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. జర్నలిస్టులు ఎక్కడికక్కడ భారీ ర్యాలీలు నిర్వహించారు. ఖాతాల స్తంభనను తొలగించాలని కోరుతూ ‘సాక్షి’ మీడియా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లను సీబీఐ కోర్టు మే 14వ తేదీన తిరస్కరించింది. దీనిపై సంస్థలు హైకోర్టుకు వెళ్లగా.. బ్యాంకు గ్యారంటీలు సమర్పించి, ఖాతాలను నిర్వహించుకోవచ్చని న్యాయస్థానం మే 23వ తేదీన అనుమతినిచ్చింది.

మే- 10
చీకటి జీవో
‘సాక్షి’పై ప్రభుత్వం ఎమర్జెన్సీ ప్రకటించింది. పత్రికా స్వేచ్ఛ గొంతు నులిమేందుకు తనే స్వయంగా రంగంలోకి దిగింది. ప్రభుత్వం చెప్పుచేతల్లోని సీబీఐ ‘సాక్షి’ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి తొలి దెబ్బ కొట్టగా.. నేరుగా ప్రభుత్వమే రెండో దెబ్బ కొట్టింది. ‘‘ఇకపై సాక్షి పత్రికకు గానీ, టీవీ చానల్‌కు గానీ ప్రభుత్వం తరఫున ఎలాంటి ప్రకటనలూ ఇవ్వటానికి వీల్లేదు’’ అంటూ హుకుం జారీ చేసింది. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు.. ఏవీ ‘సాక్షి’కి ప్రకటనలు ఇవ్వకూడదంటూ ఓ నల్ల జీవోను విడుదల చేసింది. ‘‘సాక్షి పత్రికను, చానల్‌ను నడుపుతున్న జగతి పబ్లికేషన్స్‌పై సీబీఐ చార్జిషీటు దాఖలు చేసింది కాబట్టి.. అన్ని రకాలుగా జాగ్రత్తగా పరిశీలించిన మీదట.. ఇకపై ప్రభుత్వం తరఫున సాక్షికి ఇస్తున్న ప్రకటనలన్నింటినీ నిలిపేయాలని నిర్ణయించాం’’ అన్నది 2012 మే 9వ తేదీతో జారీ చేసిన ఆర్‌టీ నంబర్ 2097 సారాంశం. ఒక మీడియా సంస్థపై సీబీఐ దర్యాప్తు జరుగుతోంది కాబట్టి.. ఆ సంస్థకు ప్రభుత్వం తరఫున ప్రకటనలివ్వటాన్ని నిలిపేస్తున్నామన్న సందర్భాలు ఎన్నడైనా ఉన్నాయా? కానీ సర్కారుకు కావాల్సింది ఒక్కటే. ‘సాక్షి’ గొంతు నొక్కటం. ప్రభుత్వ ప్రకటనలంటే కేవలం ప్రభుత్వం తన పథకాలను ప్రచారం చేసుకునేవి మాత్రమే కావు. ఆయా విభాగాలు విడుదల చేసే టెండర్లు, ప్రభుత్వ ఏజెన్సీలు, కార్పొరేషన్లు ఇచ్చే ప్రకటనలన్నీ దీని కిందకే వస్తాయి. వాటన్నింటినీ నిలిపేయడం ద్వారా సాక్షిని ఆర్థికంగా మరింత బలంగా దెబ్బ కొట్టవచ్చని భావించబట్టే ప్రభుత్వం ఇంతటి నైచ్యానికి దిగజారింది.

మే- 12
కోటి సంతకాల సేకరణకు శ్రీకారం
సాక్షి ఖాతాల స్తంభన, ప్రకటనలు నిలిపివేస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ మొదలైంది. దానికి విశేష స్పందన లభించింది. విప్లవ కవి నిఖిలేశ్వర్ తొలి సంతకం చేశారు.

మే -13
ఆగ్రహ వెల్లువ!
సాక్షిపై సర్కారు జులుంను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పాత్రికేయులు, ప్రజా సంఘాల నుంచి తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయి. ఢిల్లీలో ‘కాన్ఫెడరేషన్ ఆఫ్ న్యూస్‌పేపర్స్ అండ్ న్యూస్ ఏజెన్సీస్ ఎంప్లాయీస్ ఆర్గనైజేషన్స్’ ఆధ్వర్యంలో జాతీయ జర్నలిస్టు సంఘాలు అత్యవసరంగా సమావేశమయ్యాయి. సాక్షిపై వేధింపులను తీవ్రంగా ఖండించాయి. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పాట్నా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో.. సాక్షిపై అణచివేత చర్యలను తీవ్రంగా తప్పుబట్టింది. నల్ల జీవోలను ఉపసంహరించాలంటూ తీర్మానాన్ని ఆమోదించింది.

మే- 14
చీకటి జీవోకు చెక్
‘సాక్షి’కి ప్రకటనల నిలిపివేత జీవో రాజ్యాంగ విరుద్ధమంటూ పత్రిక యాజమాన్యం, ఉద్యోగులు.. 2012 మే 14న హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. వాటిని మే 17న విచారించిన హైకోర్టు.. చీకటి జీవోకు చెక్ పెట్టింది. జీవో ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధమంటూ దాని అమలుపై స్టే విధించింది. ప్రభుత్వానికి, సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

మే- 15
నిమ్మగడ్డ, బ్రహ్మానంద అరెస్టు
వైఎస్ జగన్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినందుకు గాను మ్యాట్రిక్స్ ల్యాబొరేటరీస్ వ్యవస్థాపకుడు, మాటీవీ చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. రెండు రోజులు నాలుగు దఫాలుగా విచారించి, మే 15వ తేదీ రాత్రి పది తర్వాత ఆయనను అరెస్టును ప్రకటించారు. ఐఆర్‌టీఎస్ నుంచి డిప్యుటేషన్‌పై రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖలో ప్రత్యేక కార్యదర్శిగా పని చేసిన బ్రహ్మానందరెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. వారిద్దరూ 2012 మే 16 నుంచీ రిమాండ్‌లోనే ఉన్నారు.

మే- 18
‘సాక్షి’ ఆస్తుల అటాచ్‌మెంట్
‘సాక్షి’పై ప్రభుత్వం అక్షరాలా విషం కక్కింది. సాక్షి పత్రిక, టీవీ ఆస్తులను అటాచ్ చేసుకోవడానికి సీబీఐకి అనుమతిస్తూ రహస్య జీవో జారీ చేసింది. పత్రికను వెలువరించే జగతి పబ్లికేషన్స్, చానల్‌ను నిర్వహించే ఇందిరా టెలివిజన్, సాక్షి భవనాల యాజమాన్య సంస్థ జనని ఇన్‌ఫ్రాల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు సీబీఐకి అనుమతిచ్చింది. వివరాలేవీ బయటకు తెలియకుండా జీవోను రహస్యంగా ఉంచారు.

మే- 22
తనను అరెస్టు చేస్తారన్న జగన్
ఉప ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని సర్వే నివేదికల ద్వారా తెలుసుకున్న కాంగ్రెస్.. టీడీపీ, సీబీఐలతో చేతులు కలిపి ఎన్నికల వాయిదాకు నీచమైన కుట్ర పన్నిందని జగన్ మే 22నే వెల్లడించారు. మూడు, నాలుగు రోజుల్లో తనను అరెస్టు చేసి, కాంగ్రెస్, టీడీపీలు గొడవలు సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించి, ఆ నెపాన్ని తమపైకే నెట్టి ఎన్నికలు వాయిదా వేయటానికి వ్యూహం రచించారని వివరించారు. ఈ మేరకు ప్రధాని, ప్రధాన ఎన్నికల కమిషనర్‌లకు లేఖ రాశారు. చంద్రబాబు, డీజీపీ దినేశ్‌రెడ్డి, సీబీఐ జేడీ లక్ష్మీనారాయణలతో కాంగ్రెస్ సీనియర్ నేత వయలార్ రవి రహస్య మంతనాలు జరిపారని, భారీ రాజకీయ కుట్రకు ప్రణాళికా రచించారని లేఖలో పేర్కొన్నారు. ఈ కుట్రను అదే రోజు గుంటూరు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార సభల్లో సైతం జగన్ వెల్లడించారు.

ఉన్నట్టుండి సీబీఐ సమన్లు: పెట్టుబడులకు సంబంధించిన ఆరోపణలపై కేసు నమోదు చేసిన తర్వాత 9 నెలల వరకూ జగన్‌ను ఒక్కసారి కూడా విచారణకు పిలవని సీబీఐ.. ఉప ఎన్నికల ముంగిట... ఆయన ఎన్నికల ప్రచారంలో ఉన్నవేళ... ‘మే 25వ తేదీన మా ఎదుట విచారణకు హాజరు కండి’ అంటూ 2012 మే 22న హడావుడిగా నోటీసులు జారీ చేసింది. గుంటూరు జిల్లా రెంటచింతలలో ఎన్నికల ప్రచారంలో ఉన్న జగన్ వద్దకు సీబీఐ అధికారుల బృందం వెళ్లి మరీ ఈ నోటీసులు అందజేసింది. తాను ఒక పార్టీకి అధ్యక్షుడినని, ఉప ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నందున ప్రచార కార్యక్రమంలో ఉన్నానని, 20 రోజుల సమయం ఇవ్వాలని, జూన్ 15వ తేదీ తర్వాత ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరవుతానని జగన్ కోరారు. కానీ సీబీఐ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

మే- 23
మోపిదేవి అరెస్టు
వాన్‌పిక్‌కు భూముల కేటాయింపుపై మంత్రి మోపిదేవి వెంకటరమణను సీబీఐ 2012 మే 23వ తేదీన పిలిపించి ఏడు గంటల పాటు సుదీర్ఘంగా విచారించింది. మళ్లీ ఆ మరుసటి రోజు మే 24న కూడా మోపిదేవిని విచారణకు పిలిచి, కాసేపటికే ఆయన అరెస్టును ప్రకటించింది. అప్పటి నుంచీ మోపిదేవి జైలులోనే ఉన్నారు. ఆయన బెయిల్ పిటిషన్లను సీబీఐ అడ్డుకుంటూ వస్తోంది.

మే- 24
అరెస్టు చేయకపోవచ్చన్న కోర్టు...
‘దర్యాప్తు పూర్తయింది కాబట్టి అరెస్టు చేయకపోవచ్చు’
- జగన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై సీబీఐ కోర్టు
ఉప ఎన్నికల ప్రచారంలో ఉన్నందున సీబీఐ విచారణకు హాజరు కాలేనని పేర్కొంటూ జగన్‌మోహన్‌రెడ్డి మే 24న సీబీఐ ప్రత్యేక కోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. జడ్జి మాత్రం, సీబీఐ దర్యాప్తు పూర్తయి, చార్జిషీట్ కూడా వేసినందున జగన్‌ను అరెస్టు చేయకపోవచ్చంటూ విచారణను మే 28కి వాయిదా వేశారు.

నిషేధాజ్ఞలు.. అరెస్టులు: ఉప ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ జైత్రయాత్రను అడ్డదారిలోనైనా అడ్డుకోవటానికి ఢిల్లీ స్థాయిలో కాంగ్రెస్ పెద్దలు పన్నిన కుట్ర నిజమని తేటతెల్లమయింది. జగన్‌ను అరెస్ట్ చేసి, అల్లర్లు సృష్టించి, ఆ నెపాన్ని వైఎస్సార్‌సీపీపై మోపడానికి వ్యూహరచన జరిగిందన్న వార్తలను పోలీసులు నిజం చేశారు. మే 23 నుంచి 29 దాకా హైదరాబాద్‌లో 144 సెక్షన్ కింద నిషేధాజ్ఞలు అమలులోకి తెస్తూ హంగామా సృష్టించారు. అన్ని జిల్లా, మండల కేంద్రాలకూ దాన్ని వర్తింపజేశారు. రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. రాష్ట్రాన్ని ఖాకీమయం చేశారు. అర్ధరాత్రిళ్లు వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణుల ఇళ్లపై విరుచుకుపడ్డారు. నేతలు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో అరెస్టులు, బైండోవర్లు చేశారు.

మే- 27
అరెస్టు చేశారు
కుట్ర నిజమైంది. ఢిల్లీ ఆదేశాలు అమలయ్యాయి. కోర్టు అభిప్రాయం కూడా అపహాస్యం పాలైంది. జగన్‌ను సీబీఐ అరెస్టు చేసింది. ఉప ఎన్నికల ప్రచారానికి జన నేతను ఎలాగైనా దూరం చేయడమే లక్ష్యంగా ఆయన్ను నిర్బంధించింది. జగన్ ముందే వెల్లడించిన కుట్ర కోణాలు, రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమైన అనుమానాలు నిజమేనని నిరూపించింది. 

మే 25 నుంచి వరుసగా మూడు రోజుల పాటు సుదీర్ఘంగా దిల్‌కుశ అతిథి గృహంలో విచారించిన అనంతరం, మే 27న రాత్రి 7.20 గంటలకు అత్యంత హైడ్రామా నడుమ జగన్ అరెస్టును సీబీఐ ప్రకటించింది. మరో 12 గంటలు గడిస్తే సీబీఐ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉండగా అదుపులోకి తీసుకుంది. అరెస్టు విషయం ప్రజలకు చేరకుండా అడ్డుకునేందుకు కేబుల్ ప్రసారాలను కూడా నిలిపివేయించింది. అరెస్టును నిరసిస్తూ దిల్‌కుశ ముందు ఫుట్‌పాత్‌పై బైఠాయించి ధర్నాకు దిగిన జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, ఆయన భార్య వైఎస్ భారతి, సోదరి షర్మిల తదితరులపై కూడా ఖాకీలు జులుం ప్రదర్శించారు.ఒక్కడిని లక్ష్యం చేసుకుని సాగిన కుమ్మక్కు కుట్రలకు సాక్షిగా నిలిచిన మే నెల

మే 25 నుంచి వరుసగా మూడు రోజుల పాటు సుదీర్ఘంగా దిల్‌కుశ అతిథి గృహంలో విచారించిన అనంతరం, మే 27న రాత్రి 7.20 గంటలకు అత్యంత హైడ్రామా నడుమ జగన్ అరెస్టును సీబీఐ ప్రకటించింది. మరో 12 గంటలు గడిస్తే సీబీఐ కోర్టు ముందు హాజరు కావాల్సి ఉండగా అదుపులోకి తీసుకుంది. అరెస్టు విషయం ప్రజలకు చేరకుండా అడ్డుకునేందుకు కేబుల్ ప్రసారాలను కూడా నిలిపివేయించింది. అరెస్టును నిరసిస్తూ దిల్‌కుశ ముందు ఫుట్‌పాత్‌పై బైఠాయించి ధర్నాకు దిగిన జగన్ మాతృమూర్తి వైఎస్ విజయమ్మ, ఆయన భార్య వైఎస్ భారతి, సోదరి షర్మిల తదితరులపై కూడా ఖాకీలు జులుం ప్రదర్శించారు.
Share this article :

0 comments: