ఏ తీర్పులు ఎలా ఉన్నా...ప్రజాతీర్పులో గెలుపు జగన్‌దే - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఏ తీర్పులు ఎలా ఉన్నా...ప్రజాతీర్పులో గెలుపు జగన్‌దే

ఏ తీర్పులు ఎలా ఉన్నా...ప్రజాతీర్పులో గెలుపు జగన్‌దే

Written By news on Wednesday, May 22, 2013 | 5/22/2013


జగన్ కేసును పరిశీలించిన కొద్దీ మామూలు ప్రజానీకం కూడా న్యాయస్థానాలు, వాటి పనితీరును శంకించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది! న్యాయస్థానాలు స్వతంత్రంగా వ్యవహరించడం లేదా, సీబీఐ లాంటి సంస్థలను అవి పూర్తిగా నమ్ముతున్నాయా అనే అనుమానం కూడా వస్తోంది. నేర నిరూపణ అయ్యేవరకు ప్రతి ఒక్కరూ నిర్దోషులే అన్న న్యాయసూత్రాన్ని అంతా విస్మరించారా అనిపిస్తోంది. విస్మరించనట్లయితే సంవత్సరకాలంగా జగన్ జైల్లో ఉండేవారు కాదు. ఒకపక్క సీబీఐ పూర్తిగా ప్రభుత్వ చెప్పుచేతల్లో నడిచే సంస్థ అయి తెలిసిన తర్వాత కూడా ప్రతిసారీ ఆ సంస్థ వాదనలతో ఏకీభవించి జగన్ రిమాండును పొడిగించడం ఏమాత్రం సబబు కాదు.

అధికారంలో ఉన్న మంత్రులు సాక్షులను ప్రభావితం చేయనప్పుడు... అధికారం లేని వ్యక్తి, అధికార పార్టీకి చెందనివ్యక్తి ఎలా ప్రభావితం చేస్తాడు అని ఒక్కసారి కూడా న్యాయస్థానాలు సీబీఐని ప్రశ్నించలేదు. ఒకపక్క ఏమాత్రం ప్రజాదరణ లేని శంకర్రావు లాంటి వ్యక్తి - తేదీ కూడా లేకుండా వేసిన - అర్జీని కోర్టు స్వీకరిస్తుంది. వేరొక చంద్రబాబు అవినీతి గురించి వేల పేజీలకొద్ది సాక్ష్యాన్ని కోర్టు ముందు ఉంచి,

విచారించమని కోరితే, తక్షణమే తిరస్కరిస్తుంది! అక్కడ జగన్‌కు వ్యతిరేకంగా వచ్చిన అర్జీని ఎందుకు స్వీకరించిందో నాలాంటి సామాన్య పౌరులకు ఈ ప్రజాస్వామ్య దేశంలో వివరించాల్సిన ఆవశ్యకత న్యాయస్థానాలకు ఎంతైనా ఉంది. అంతిమంగా వీటన్నింటినీ మించిన తీర్పు, ప్రజాతీర్పు, జగన్‌మోహన్‌రెడ్డికి అనుకూలంగా రావాలని, వస్తుందని ఆకాక్షిస్తున్నాను.
- ఎస్.ఖాసిమ్ కాదిర్, హైదరాబాద్

mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: