ఈదుతున్న మాకే తెలుసు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఈదుతున్న మాకే తెలుసు

ఈదుతున్న మాకే తెలుసు

Written By news on Thursday, May 30, 2013 | 5/30/2013

వేధింపులపై వైఎస్ భారతి ఆవేదన
దేవునిపై నమ్మకముంది.. ఆయనే దారి చూపిస్తాడు
జగన్ జనం మనిషి.. ఆ భయంతోనే జైల్లో పెట్టారు
అయినా ఆయన చాలా ధైర్యంగా ఉన్నాడు
చీకటి పోయాక వెలుగేనంటూ ధైర్యం చెబుతుంటాడు
జైల్లో ఉన్నట్టుగా గడుపుతున్నది కిరణ్, చంద్రబాబే
ఈర్ష్య, అభద్రతా భావాలతో దహించుకుపోతున్నారు
తాను హీరో కావాలని జగన్ ఏనాడూ అనుకోలేదు
కాంగ్రెస్ అధిష్టానమే జగన్‌ను హీరోను చేసింది
మా మామలాగే జగన్ కూడా ప్రేమమూర్తి
స్వతహాగా రావాలే తప్ప తెచ్చిపెట్టుకునేది కాదది
ఏం చేసినా చాలా సిన్సియర్‌గా, కమిటెడ్‌గా చేస్తాడు
మహా టీవీ ఎడిటర్ ఐ.వెంకట్రావుతో ముఖాముఖి

‘‘మా మామ వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి ఉన్నప్పుడు జగన్ చేసినవి తప్పులుగా అనిపించలేదు. ఆయన మరణించిన తరవాతే తప్పులుగా అనిపించాయి. మా మీద కేసులు వేసే వాళ్లు వేశారు. చార్జిషీట్లు వేస్తున్న వాళ్లు వేస్తున్నారు. కానీ ఇవన్నీ ఈదుకుంటూ వెళ్లడం ఎంత ఇబ్బంది అనేది మాకు మాత్రమే తెలుస్తోంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సతీమణి వైఎస్ భారతి ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబంపై రెండేళ్లుగా వేధింపులు ఎలా సాగుతున్నదీ మంగళవారం మహా టీవీ చీఫ్ ఎడిటర్ ఐ.వెంకట్రావుకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె వివరించారు. ‘క్విడ్ ప్రో కో’కు కారణంగా సీబీఐ చూపుతున్న 26 జీవోలపై విచారణ జరపకుండా తమ ఇళ్లపైనా, సంస్థలపైనా దాడులు జరపడాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా వైఎస్ భారతి వెల్లడించిన అంశాలు...

జగన్ అరెస్టయి ఏడాది అయింది కదా! మీ మనోభావాలేమిటి?
ఒకటి, ఈ రోజు జగన్‌ను జైల్లో పెట్టింది ఏదో తప్పు చేసినందుకు కాదు. జనం ఆయనను కోరుకుంటున్నారనే భయంతోనే అని నేననుకుంటున్నాను. జగన్ జనాన్ని కోరుకుంటున్నాడు. జనం కూడా ఆయనను కోరుకుంటున్నారు. మా మామ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్‌ను ఎవరూ తప్పు పట్టలేదు. వాస్తవానికి మా మామ హయాంలో మనం అభివృద్ధిలో గుజరాత్‌తో పోటీ పడుతూ ఉన్నాం. సంక్షేమంలో గుజరాత్‌ను దాటిపోయాం. అసలు అప్పుడు నేనూ, జగన్ బెంగళూరులో ఉన్నాం. మేం 2001లోనే బెంగళూరుకు వెళ్లి అక్కడే ఉంటూ వచ్చాం. రెండు చిన్న విద్యుత్ ప్రాజెక్టులను స్థాపించాం. 2004 డిసెంబర్‌కు మరో పెద్ద ప్రాజెక్టును కూడా పూర్తి చేశాం. మా మామ గారు కూడా జగన్‌ను బెంగళూరులోనే ఉండమని చెప్పారు. తాను ముఖ్యమంత్రిని కనుక హైదరాబాద్‌లో ఉంటే ఏదో ఒకటి ఆపాదిస్తూ ఉంటారు కనుక అక్కడ ఉండటమే మేలని అన్నారు. అందుకే... జగన్ తప్పు చేశాడని జైల్లో పెట్టలేదు. అసలాయన ఇక్కడ లేను కూడా లేడు. కొన్నేళ్లుగా ఆయన ప్రజల అవసరాలను గమనించి ఎప్పటికప్పుడు వాటిపై పాలకులను నిలదీస్తూ వచ్చాడు. అందువల్ల ప్రజలకు దగ్గరయ్యాడు. అందుకే కష్టాలు పడుతున్నాడు. జగన్ ఎంపీ కాక ముందు నుంచీ కడప జిల్లాలో 16, 17 ఏళ్లుగా ప్రజా సంబంధాలు మెండుగా ఉన్న వ్యక్తి. ఎక్కువగా ఉద్యోగాలు ఇప్పించమంటూ వచ్చేవారికి సాయం చేసేవాడు. జగన్‌తో ఎవరైనా ఫ్రెండ్‌షిప్ చేయాలనుకుంటే ఆయన వద్దకు వెళ్లి మీ వాళ్లకు పది ఉద్యోగాలిస్తామని చెబితే చాలు, వాళ్లతో ఆయన చాలా బాగా ఉండేవాడు. రాజకీయంగానే కాక సామాజికంగా కూడా మంచి సంబంధాలున్న వ్యక్తి జగన్.

వైఎస్ మరణానంతరం కాంగ్రెస్‌లో జగన్ రాజకీయ ప్రాధాన్యత కోల్పోవడమే నేటి పరిణామాలకు కారణమనుకుంటున్నారా?
జగన్ ఏనాడూ ప్రాధాన్యత కావాలనుకోలేదు. అలా అనుకునే వ్యక్తే అయితే బెంగళూరులో ఉండడు. హైదరాబాద్‌లోనే ఉండేవాడు. ‘ఎప్పుడైతే నేను ప్రజలకు ఉపయోగపడనని అనుకుంటానో అప్పుడు రాజకీయాలు చాలించుకుని వె ళ్లిపోతాను’ అని జగన్ మాతో చెప్పేవాడు. అదీ ఆయన వ్యక్తిత్వం! ఆయనకు నిజంగా పదవీ కాంక్ష ఉంటే 2004 నుంచీ రాష్ట్రంలోనే ఉండేవాడు. మనం ఎంతమంది ముఖ్యమంత్రుల కుమారులను చూడలేదు! వాళ్లు చక్రం తిప్పుతూ ఉంటారు. కానీ జగన్ ఏనాడూ అధికార వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు.

జగన్ తక్కువగా మాట్లాడతారనుకుంటా...
అవును. సహజంగానే తక్కువ మాట్లాడతాడు. వాళ్ల నాన్నను చాలా దగ్గర నుంచి చూశాడు కదా. ఉన్నదున్నట్టు మాట్లాడటం జగన్ అలవాటు. అనుకున్నదే చెబుతాడు. కల్పించి ఏదీ చెప్పడు. అయితే అందరూ చెప్పేది చాలా ఓపిగ్గా వింటాడు. చెప్పాలనుకున్నది ఓపెన్‌గా చెబుతాడు.

కాంగ్రెస్‌తో విభేదాలు ఎందుకొచ్చాయి?
మా మామ చనిపోవడం మా కుటుంబానికంతటికీ పెద్ద షాక్. ఆయన్ను చూసిన వారెవరూ కూడా ఆయన మన మధ్య లేరంటే నమ్మలేదు. ఆయన మృతిని తట్టుకోలేక చాలామంది చనిపోయారని విన్నాం. మేమైతే ఆ విషాదంలో ఎవరమూ టీవీలు చూడలేదు. కుటుంబ పెద్దను కోల్పోయి మనమే ఇంత బాధపడుతున్నాం కదా, ఇక చిన్న కుటుంబాల వాళ్లు ఎంత బాధపడుతూ ఉంటారో అని అప్పట్లో షర్మిల, అత్తమ్మ చెప్పుకుంటూ ఉన్నారు. వారి కుటుంబాల వద్దకు జగన్ వెళ్లి కలవాలని అనుకుంటూ ఉన్నారు. జగన్ పావురాల గుట్టలో కూడా అదే చెప్పాడు. అది సమస్య అవుతుందని ఆ రోజు అనుకోలేదు. అవుతుందనుకుంటే వేరేలా ఉండేదేమో. మొదటిసారిగా అత్తమ్మ, జగన్, షర్మిల, నేను సోనియాగాంధీ దగ్గరకు వెళ్లాం. ఓదార్పు గురించి తొలుత సోనియాను అడిగితే పొమ్మని చెప్పింది. కానీ ప్రజలు చాలా భావోద్వేగాలతో ఉన్నారు, కొంతకాలం తరువాత వెళ్లమని చెప్పారు. అందువల్ల మూడు నెలలు ఆగాం. జగన్ మళ్లీ డిసెంబర్‌లో అడిగాడు. అప్పటికే ఆలస్యమైందని చెప్పాడు. మార్చి, ఏప్రిల్‌లో అనుకుంటా, అహ్మద్‌పటేల్‌ను అడిగితే ‘మేడమ్‌కు ఒక లేఖ రాసిచ్చి పో’ అని జగన్‌కు చెప్పారు. జగన్ బెంగళూరుకు వచ్చాక ఒక రోజు అహ్మద్ పటేల్ ఫోన్ చేసి, ‘అర్జంట్‌గా రా’ అంటే జగన్ ఢిల్లీ వెళ్లి వాళ్లను ఒప్పించి వచ్చాడు. పశ్చిమ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో ఓదార్పు యాత్ర మొదలు పెట్టాడు. యాత్ర ప్రారంభించిన తొలి రోజే ప్రజలంతా మామ మీద ఉన్న అభిమానాన్ని జగన్ పై చూపించారు. నాలుగు రోజుల తరువాత అనుకుంటా, వెనక్కి వచ్చేయమన్నారు. అది తొలుత వారం రోజుల యాత్రే కనుక పూర్తి కాగానే వస్తానని జగన్ చెప్పాడు.

పూర్తయ్యాక ఢిల్లీ వెళ్తూ వెంట పేపర్ క్లిప్పింగ్‌లు తీసుకెళ్లాడు. వాటిలో అన్నిచోట్లా కాంగ్రెస్ జెండాలే ఉన్నాయి. అదేమీ పార్టీ వ్యతిరేక చర్య కాదు. చనిపోయిన వారు, తన వెంట వస్తున్న వాళ్లు అందరూ కాంగ్రెస్ వాళ్లేనని చెప్పాడు. దీనివల్ల పార్టీకి మేలే జరుగుతుందన్నాడు. ఢిల్లీలో చాలామంది పెద్ద లీడర్లను కలిశాడు. ‘మా నాయన చనిపోయిన దగ్గర నేను మాట ఇచ్చాను, మీరు ఒప్పించండి’ అని కోరారు. ఒకరోజు వీరప్ప మొయిలీ యాత్రకు ఒప్పుకున్నారు. ‘బయట ప్రెస్ వాళ్లు వేచి ఉన్నారు. ఓదార్పుకు అనుమతిచ్చారని చెప్పుకోవాలా, వెనక ద్వారం నుంచి వెళ్లి పోవాలా’ అని జగన్ అడిగితే ఆయన చెప్పుకో అన్నారు. తీరా మేం ఇంటికి వెళ్లి భోంచేసేటపుడు అహ్మద్ పటేల్ ఫోన్ చేసి బెంగళూరు వెళ్లిపొమ్మని చెప్పారు. తీరా హైదరాబాద్‌లో విమానం దిగాక మొయిలీ తానలా అనలేదని చెప్పినట్టు ప్రకటించారు. అంటే జగన్ అబద్ధమాడినట్టుగా చూపాలనే కదా! వాళ్ల ప్రయోజనా ల కోసం ఇలా చేయడం తప్పు కదా! మేం అదే అనుకున్నాం. జూలై 8న జగన్ మళ్లీ ఓదార్పుయాత్ర ప్రారంభించాడు. మళ్లీ మా అత్త, జగన్, షర్మిల ఢిల్లీలో సోనియాను కలిశారు. ‘‘మా ఆయన చనిపోతే మేం చిన్నవారమైనా మీరే మా ఇంటికి వచ్చి కలిశారు కదా! మృతి చెందిన కుటుంబాలను పిలిపించుకుని మాట్లాడటం సరికాదు’’ అని మా అత్త చెప్పారట. వాళ్లకది నచ్చలేదు. ‘ఒకసారి మాటిచ్చాక ఇక వెనక్కి తిరగబోను’ అని జగన్ కూడా ఒకసారి నాతో అన్నాడు.

మొత్తం మీద హైకమాండ్‌ను ఎదిరించి హీరో అయ్యారు!
హైకమాండ్‌ను ఎదిరించాలని జగన్‌కు ఎప్పుడూ లేదు. మాట నిలబెట్టుకోవాలనే తపన పడ్డాడు. అలా అనుకుంటే వాళ్లే జగన్‌ను హీరోను చేశార ని చెప్పొచ్చు. వారు అనవసరంగా ఓదార్పుకు అడ్డం చెప్పారు.

రాష్ట్ర కాంగ్రెస్ వాళ్లు వ్యతిరేక సమాచారం ఇవ్వడం వల్లే అధిష్టానం అలా వ్యవహరించిందని అనుకుంటున్నారా?
ఏమైందో, వారెందుకలా చేశారో! మా మామ 30 ఏళ్లు ఆ పార్టీ కోసం కష్టపడ్డారు. అలాంటి ఆయన కుమారుడిపై ఏదో కేసులు పెట్టి భయపెడతారని మాత్రమే అనుకున్నాం గానీ ఇంత చేస్తారను కోలేదు.

విజయసాయిరెడ్డి అరెస్టు, బెయిల్ నేపథ్యంలో జగన్‌ను కూడా అరెస్టు చేస్తారని ఊహించారా?
పుకార్లయితే ముందు నుంచే ఉన్నాయి. ఇంత కష్టమవుతుందనుకోలేదు. విచిత్రంగా అనిపించిందేమంటే, మామ ఉన్నప్పుడు వాళ్లకు ఏదీ తప్పుగా అనిపించలేదు. ఆయన చనిపోయిన పదిహేను నెలల తరువాత ఒకాయన కేసు వేశారు. ఆయనకు ఆ తరవాత మంత్రి పదవి కూడా వచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన జీవోల్లో తప్పులున్నాయేమో చూడండంటే, దాన్ని వదిలివేసి దాడులు చేశారు. భయపెట్టాలని చూశారు. జీవోల కథే పక్కనపెట్టి మా వ్యాపారాల మీదకు వచ్చారు. రాష్ట్రంలోగానీ, దేశంలోగానీ పెద్దోళ్లను ఎదిరిస్తే ఇలాగే ఉంటుందని ఒక భయం సృష్టించాలని చూశారు. ఫోన్ ట్యాపింగ్‌లు చేశారు. దాడులు చేశారు. ఆగస్టు నుంచి మార్చి దాకా దర్యాప్తు చేసి ఒక చార్జిషీటు వేశారు. జగన్‌ను అరెస్టు చేసే నాటికే మూడు చార్జిషీట్లు వేశారు. ‘ఇది చేశావా?’ అని అప్పటికి జగన్‌ను కనీసం ఒక్కసారైనా అడగలేదు. ఆయన చెప్పేది వారు నమ్మొచ్చు, నమ్మకపోవచ్చు. కానీ అడగాలిగా! అడగలేదు. ఇంకా చార్జిషీట్లు వేస్తామని, అన్నింట్లోనూ జగనే ఏ-1 (తొలి నిందితుడు)గా ఉంటాడని దర్యాప్తు చేస్తున్న అధికారే చెప్పారు. సీఆర్పీసీ 173 ప్రకారం ఒక ఎఫ్‌ఐఆర్‌కు ఒక చార్జిషీటే, అది కూడా దర్యాప్తు పూర్తయ్యాకే వేయాలి. ఇంకేమైనా ఉంటే అనుబంధ చార్జిషీట్లు వేయాలి. కానీ ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు వేస్తున్నారు.

కాంగ్రెస్‌లోనే ఉండి పోరాడి మాట నెగ్గించుకునే ప్రయత్నం ఎందుకు జరగలేదు? రాజకీయంగా ఆలోచించి పార్టీ పెట్టారా? కాదు, రాజకీయంగా ఆలోచించి చేసింది కానే కాదు. అలా అనుకుని ఉంటే (ఎన్నికలకు) ఏడాది ముందు బయటికొస్తే బాగుండేది. ఇది రాజకీయంగా ఆలోచించి చేసిన నిర్ణయం కాదు. లేకుంటే అన్ని సంవత్సరాల ముందు వారితో విభేదించి బతగ్గలమా అనుకున్నాం. కానీ, తప్పలేదు. జగన్ విషయంలో రెండు అంశాలు చెప్పాలి. అతను చాలా సిన్సియర్. ఒక పని చేపట్టినా, మాట ఇచ్చినా సిన్సియర్‌గా ఉంటాడు. కమిటెడ్‌గా ఉంటాడు. పవర్ ప్రాజె క్టులు కావచ్చు, సాక్షి, కావచ్చు, భారతి (సిమెంట్స్) కావచ్చు... ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే అంత కమిటెడ్ గా ఉంటాడు. రెండోది వెరీ వెరీ హ్యూమన్, మా మామ గానీ, జగన్ గానీ చాలా సాఫ్ట్‌గా ఉంటారు. ఎవరైనా కష్టాలు చెబుతూ ఉంటే మా మామకైతే కన్నీళ్లు వస్తాయి. జగన్ కూడా అంతే. ఓదార్పు యాత్ర అంతా విజువల్స్‌లో చూస్తూ ఉంటాం కదా. వాళ్ల ఇళ్లకు వెళ్లినప్పుడు, వాళ్లు కలిపిచ్చిన అన్నం తినే విషయంలో. మా బంధువులు కూడా చెబుతూ ఉంటారు... వాళ్లంత ప్రేమతో పెడుతున్నప్పుడు తినాలి అని జగన్ చెబుతాడు. దారిలో తన కోసం ఇద్దరు ముగ్గురు వేచి ఉన్నా ఆగి పలకరించి వెళతాడు. ఈ స్వభావం తెచ్చి పెట్టుకుంటే వచ్చేది కాదు. స్వతహాగా రావాలి. అర్ధరాత్రి వరకూ తిరిగారంటే అదే కారణం.

జగన్ ఫక్తు వ్యాపారవేత్త అనే విమర్శలున్నాయి...
అది నిజం కాదు. ఆయన అలాంటి వ్యాపారవేత్త కాదు. భారతి సిమెంట్స్‌ను ఫ్రెంచ్ వాళ్లకు అమ్మినప్పుడు ఎవరి దగ్గరైతే భూమి కొన్నారో వారికి అదనంగా డబ్బు ఇప్పించాం. మాకు తగ్గించుకోనైనా రైతులకు ఇవ్వండని చెప్పాం. సాక్షి నుంచి మేం ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోలేదు. సాక్షిలో వచ్చేది దాంట్లోనే పెట్టాం. మా సమయంలో ఎక్కువగా సాక్షికే కేటాయిస్తున్నాం. సాక్షిని ఏ రోజూ మేం భారంగా చూడలేదు. మీరన్నట్లు జగన్ ఫక్తు వ్యాపారవేత్తే అయితే అలా ఉండడు. జగన్ మంచి బిజినెస్ మాన్. భారతి సిమెంట్స్ చాలా అల్ట్రా మాడ్రన్ ప్లాంటు. సాక్షి దేశంలోనే ఏడో స్థానంలో ఉంది. ఈ రెండూ పేరు మోసిన సంస్థలు. భారతి సిమెంట్స్‌ను జర్మనీ నుంచి వచ్చిన వాళ్లు చూసి ఒక ముఖ్యమంత్రి కుమారుడు ఇంత కష్టపడి పని చేస్తారని అనుకోలేదన్నారు. భారతిలో కిందిస్థాయి నుంచీ అన్ని విషయాలను జగన్ శ్రద్ధగా చూశాడు. సాక్షి విషయంలో కూడా అంతే. ప్రతి చిన్న విషయంలో కూడా, డిజైనింగ్‌లోనూ, టెక్నాలజీలోనూ, యంత్రాల విషయంలోనూ చొరవ, శ్రద్ధ తీసుకున్నాడు. ఈ రోజు సాక్షికి కోటిన్నర మందికి పైగా పాఠకులున్నారు. ప్రజలకు ఏం చెప్పి కొనిపించగలం? ఎలా మభ్యపెట్టగలం? ఉత్పాదనలో నాణ్యత లేకుంటే ఎందుకు కొంటారు? మోసం చేసి షేర్లు కొనిపించామని సీబీఐ అంటోంది. ఇదేమీ డమ్మీ పేపర్ కాదు. పనికి మాలినది అంతకంటే కాదు.

నిజమే. సాక్షి చాలా అభివృద్ధి చెందింది. ఇంత రీడర్‌షిప్ పెంచుకోవడం చిన్న విషయం కాదు.
దేవుని దయ. జగన్ తన టీమ్‌లోని వాళ్లకు పూర్తి స్వేచ్ఛనిస్తాడు. అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తాడు. నన్ను, విజయమ్మను, షర్మిలను ప్రోత్సహిస్తాడు.

కుటుంబానికి ఇంత అన్యాయం జరుగుతోందని విజయమ్మ బాధపడుతూ ఉంటారా?
బయటి వాళ్లు వైఎస్‌ను, జగన్‌ను ఇన్నేసి మాటలు అంటున్నందుకు బాధపడుతూ ఉంటారు. కానీ ఆమె చాలా కృతనిశ్చయంతో ఉంటారు. జగన్ కూడా తన తల్లికి, మాకు ధైర్యం ఇస్తూ ఉంటాడు. కష్టాలు ఎల్లకాలం ఉండవు. చీకటి ఎంతోకాలం ఉండదు. రాత్రి పోయినాక వెలుగు వస్తుందని చెబుతూంటాడు.

కుటుంబంలో విభేదాలున్నట్టు బయట చెప్పుకుంటూ ఉంటారు...
నిజం కాదు. మేమంతా చాలా ఐక్యంగా ఉంటాం. షర్మిల తన భర్త కోసమో, కొడుకు కోసమో కాకుండా ఇంత ఎండలోనూ తన అన్న జగన్ కోసం తిరుగుతున్నారు. ఆమెకు జగన్ అంటే చాలా ఇష్టం.

అదే మీ కుటుంబం గొప్పతనం. మీరు ఒక పాయింట్‌ను తీసుకుంటే దాన్ని విజయవ ంతంగా జనంలోకి తీసుకు వెళతారు
మేం చెబుతున్నది అదే. జగన్‌ను ఇన్ని రోజులు జైల్లో ఎందుకు పెట్టారు? అతను ఒక్క సంతకం పెట్టలేదు. భూములు ఫలానా వారికి ఎందుకిచ్చారో, ఎందుకు నీళ్లిచ్చారో ఆయనకు తెలియదు. ప్రజలకు అన్యాయం జరిగితే మా మామ సహించేవారు కాదు. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన భూ సేకరణ ప్రకటన తిరుపతి ఎడిషన్‌లో అచ్చవడం చూసి, ‘అక్కడిది ఇక్కడెందుకు ఇస్తున్నారు?’ అని మా మామ ప్రశ్నించారట. ఇది విధాన నిర్ణయమంటే, దానివల్ల ఖజానాకు నష్టం వాటిల్లుతుందని చెప్పి ఆ విధానాన్నే వైఎస్ మార్చేశారు. దానివల్ల సాక్షికి కూడా ఆదాయం తగ్గుతుందని తెలిసినా ఆ నిర్ణయం తీసుకున్నారు. మా సరస్వతి పవర్ ప్రాజెక్టుకు కూడా వైఎస్ ఉన్నప్పుడు నీళ్లు తక్కువగా వచ్చేవి. ‘గత ప్రభుత్వంలోనే ఎక్కువగా వచ్చేవి’ అని అంటే, మీ ప్రాజెక్టు కోసం నీళ్లివ్వలేనని, ప్రజలే ముఖ్యమని మామ చెప్పారు.

ఈ పరిణామాల వల్ల మీకు రాజకీయంగా సానుకూల పరిస్థితి ఉంది బెయిల్ లభించడంలో ఇంకా జాప్యమవుతోంది. దీన్నెలా తీసుకుంటున్నారు? మీకున్న విశ్వాసం ఏమిటి?
మాకు దేవుని మీద నమ్మకముంది. ఆయన తప్పకుండా దారి చూపిస్తాడు. మాకున్న విశ్వాసమల్లా... ఇవన్నీ అబద్ధాలు, ఆరోపణలు. సీబీఐ వేసిన ఐదు చార్జిషీట్ల గురించి మీకు చెబుతాను. అరబిందో, హెటెరో సంస్థలకు ప్రైస్ ఫిక్సేషన్ కమిటీ ఎకరా భూమిని రూ.15 లక్షలకు ఇవ్వాలని సూచిస్తే, ఏడు లక్షలకే ఇవ్వాలని నిర్ణయించారని అభియోగం మోపుతున్నారు. అసలు ఆ ప్రాంతంలో ఎకరా లక్ష, రెండు, రెండున్నర లక్షలకు కూడా అమ్ముడుపోదు. అసలు ఆ నిర్ణయం జరిగిన విషయం కూడా మా మామకు తెలియదు. అంతా పూర్తయి, టేబుల్ వద్దకు వచ్చాక , వెనకబడిన తెలంగాణ ప్రాంతంలో మీ చేతుల మీదుగా ప్రాజెక్టును ప్రకటించండంటూ తెచ్చిపెట్టారు. వాస్తవానికి ఈ సంస్థలకు రూ.16 కోట్లు లబ్ధి చేకూరితే 32 కోట్లు ఎలా పెట్టుబడి పెడతారు? ఇక రెండోది ప్రైవేటు ఇన్వెస్టర్ల వ్యవహారం. మూడోది రాంకీ సంస్థకు స్థలమిచ్చింది చంద్రబాబే. అందులో వైఎస్, జగన్ చేసిందేమీ లేదు. తప్పులేమైనా చేసి ఉంటే చంద్రబాబే చేసి ఉండాలి. ఇక వాన్‌పిక్‌కు ఇచ్చిన ప్రభుత్వ భూమి కేవలం 200 ఎకరాలే. మిగతాది ప్రైవేటుగా కొనుక్కున్నదే. ప్రభుత్వం కేవలం కొనుగోలుకు సహకరించింది. పైగా అది ఒక ప్రభుత్వానికి, మరో ప్రభుత్వానికి జరిగిన ఒప్పందం. రాష్ట్ర ప్రభుత్వానికి రస్ అల్‌ఖైమా ప్రభుత్వానికి మధ్య జరిగింది. ఇందుకు సంబంధించి చంద్రబాబు హయాంలోనే ఒప్పందం జరిగింది. ఇక దాల్మియా కంపెనీకి మైనింగ్ లీజు ఇవ్వడానికి సంబంధించింది. ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మార్పు చేయడం సర్వసాధారణం. ఒకటి దాల్మియా సొంత కంపెనీ అయితే రెండోది వారి సబ్సిడరీ. ఇలాంటి మార్పు చేయడాలు ఏడాదికి కొన్ని వందలు జరుగుతూ ఉంటాయని సోమయాజులు గారు చెబుతూ ఉంటారు. మా సంస్థల్లో పెట్టుబడులు పెట్టినోళ్లందరికీ షేర్లు ఇచ్చాం. ఈనాడు కన్నా ఉత్తమమైన సంస్థలు మావి. రూ.1,800 కోట్ల నష్టాల్లో ఉండే ‘ఈనాడు’ సంస్థలో రూ.2,600 కోట్లు పెట్టారు. ‘ఈనాడు’ షేర్‌ను రూ.5 లక్షల పై చిలుకు ధరకు కొన్నారు. ‘ఈనాడు’లో పెట్టుబడి పెట్టిన వారికి ఒక్క రూపాయి అయినా లాభం కింద దొరికిందా? ఈనాడు కన్నా సాక్షి అన్నివిధాలా మెరుగైన సంస్థ. అలాంటి దానిలో పెట్టుబడి పెడితే క్విడ్ ప్రొ కో ఎలా అవుతుంది? ఇంతటి మెరుగైన సంస్థ షేర్లు రూ.350కే దొరికినప్పుడు ఇన్వెస్టర్లు ఎందుకు కొనరు? పైగా భారతి సంస్థలో పెట్టుబడులు పెట్టిన వారికి భారీగా ఆదాయాలు వచ్చాయి. మా కంపెనీలో ఇన్వెస్టర్లకు 2006-07లోనే షేర్లను పంపించాం. అన్నీ ప్రొసీజర్ ప్రకారమే ఫైల్ చేశాం. ఆ రశీదులు మా కార్యాలయంలో ఉన్నాయి. ఇతరులు పెట్టుబడి పెట్టి, షేర్లు మా పేరు మీద ఉంటే తప్పవుతుంది గానీ పెట్టుబడి పెట్టినవారి పేరు మీదనే షేర్లుంటే తప్పెలా అవుతుంది?

జైల్లో జగన్ ఎలా ఉన్నారు?
చాలా ధైర్యంగా ఉన్నాడు. మాకందరికీ కూడా ధైర్యం చెబుతున్నాడు. బయట ఉన్నంత స్వచ్ఛంగా ఉన్నాడు. నిజానికి బయట ఉన్న చంద్రబాబు, కిరణే రెండేళ్లుగా జైల్లో ఉన్నట్టుగా గడుపుతున్నారు. ఏమంటే వాళ్లకు రాజకీయ అభద్రతా భావం, ఈర్ష్య. మొన్న సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్‌పై తీర్పు వచ్చేముందు కూడా జగన్‌ను జైల్లో కలిశాను. మరో నాలుగు నెలలు జగన్‌ను ఎలాగోలా జైల్లోనే ఉంచితే ఆ లోపు రాష్ట్రంలో కాంగ్రెస్‌ను బలోపేతం చేస్తానని ఢిల్లీ పెద్దలతో కిరణ్ చెప్పారని నా దృష్టికి వచ్చింది. అదే మాట జగన్‌తో చెప్పి, ‘ఎట్ల జగన్?’ అని అడిగాను. అంటే ఒకటే చెప్పినాడు. ‘కష్టాలు కలకాలం ఉండవు. ఈ దశను దాటిపోతాం. పైన దేవుడున్నాడు. ఆయనను నమ్ముకున్నాం. ఏం జరిగినా మంచే జరుగుతుంది’ అని ధైర్యం చెప్పినాడు. (బెయిల్ పిటిషన్‌పై) తీర్పు ఎటైనా రావచ్చని జగన్‌కు కూడా తెలుసు. అయినా అంత ధైర్యంగా ఉన్నాడు. సుప్రీంకోర్టులో తీర్పు వింటున్నప్పుడు పదేపదే నాకు జగన్ మాటలే గుర్తుకొచ్చినయి.

కాంగ్రెస్ కోసం సాక్షిని, టీవీని స్థాపిస్తే తమపైనే అస్త్రాలు సంధిస్తున్నారని మంత్రులు విమర్శిస్తున్నారు. అఫ్‌కోర్స్, అది మీ ఫ్యామిలీ ఆస్తి అనుకోండి...
కాదు. సాక్షి మా ఫ్యామిలీది మాత్రమే కాదు. అది ఇన్వెస్టర్లందరి ఆస్తి. మా మామ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రాయాల్సిందిగా జగన్‌ను ఎంకరేజ్ చేసేవాడు. నువ్వు క్రిటిసైజ్ చేయి, వాటిని మేం రెక్టిఫై చేసుకుంటాం అనేవాడు. పత్రిక స్థాపించడానికి ముందు అది ఎలా ఉండాలనే విషయమై జగన్ ఏడు పేజీలు రాసుకున్నాడు. సాక్షి పెట్టి ఐదేళ్లు పూర్తయిన సందర్భంలో దాన్ని నేను చూశా. ఫలానా పార్టీకో, వ్యక్తికో మనం కొమ్ముకాసేలా ఉండరాదనేది ఆయన అభిమతం. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి... అందరి వార్తలూ పెద్దగా వేస్తున్నాం.

కానీ మీ పేపర్‌ను బ్యాన్ చేయాలంటున్నారు...!
అది వాళ్ల కోరిక. దేవుడున్నాడు. ఆయన అనుమతించాలి కదా! సాక్షి పత్రికలో ప్రజా సమస్యల గురించే ఎక్కువగా రాస్తున్నాం, రాస్తాం. ప్రజా సమస్యలపై రాసినందుకే ఈ మంత్రులు బాధపడితే... వారంతా మా మామగారితో కలిసి పని చేశారు. వీళ్లన్న మాటలు విని మేమెంత బాధపడాలి! ‘ఉరి తీయాలి, వెలేయాలి’ అని మాట్లాడారు. మేమేం చేశామని అలా మాట్లాడారు? వాళ్ల గురించి ఎవరైనా అలా మాట్లాడితే వాళ్ల కుటుంబాలు బాధ పడవా? అయినా ఎవరి సభ్యత వారికుంటుంది.

సమస్యలపై మీ పార్టీ చాలా దూకుడుగా ఉంది. విజయమ్మ నిబ్బరంతో ముందుకు పోతున్నారు. వైఎస్ ఉన్నప్పుడు ఏనాడూ బయటకు రాని ఆమె ఈ రోజు పార్టీని నడిపిస్తున్నారు...
మామ మృతి అత్తకు ఎక్కువ బాధాకరం అనుకుంటా. మామను విడిచిపెట్టి అత్త ఒక్క రోజు కూడా ఉండేవాళ్లు కాదు. కడపకు పెళ్లికి వెళ్లినా రాత్రికి వచ్చేవాళ్లు. మామ, జగన్, షర్మిలలే అత్తకు ప్రపంచం. రాజకీయాలకు ఆమె దూరం. ఎంత దూరమంటే, వేంపల్లె ఎస్టేట్‌కు వెళ్లినప్పుడు అక్కడి సర్పంచ్ ఎవరో కూడా అత్తకు తెలియదు. మామ మరణంతో ఆమె ప్రపంచమే కుప్పకూలినట్టుగా అయింది. అయితే ఇప్పుడు ఆమే మాకు బాగా ధైర్యం చెబుతున్నారు. 35 సంవత్సరాలు కష్టపడి వైఎస్ ప్రజాదరణను సంపాదించుకున్నారు. జగన్ కూడా రెండేళ్లు బాగా కష్టపడి ప్రజాభిమానం సంపాదించారు. జగన్ బయటకు వచ్చే వరకూ ఆ ఆదరణను కాపాడుతూ పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత తనపై ఉందని అత్తమ్మ భావిస్తూ ఉంటారు.

ఇదంతా కొలిక్కి వచ్చేటప్పటికి చాలాకాలం పట్టేటట్టుంది?
నేనదే అనుకుంటున్నా. కేసులు వేసే వాళ్లు సులభంగా వేశారు. చార్జిషీట్లు సులభంగా వేశారు. ఇందులో ఈదుకుని పోయేటోళ్లకు, మాకు అర్థం అవుతోంది ఎంత కష్టమో. అందులోనూ ఏమీ చేయని దానికి ఇవన్నీ. జగన్ స్థాపించిన సాక్షి, భారతి సిమెంట్స్ సంస్థలు 35 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. భారతి సిమెంట్స్‌ను అమ్మేసే వరకూ మేం అందులోంచి ఒక్క రూపాయి తీసుకోలేదు. సాక్షిలో నుంచి కూడా ఈ రోజు వరకూ రోజు ఒక్క రూపాయి తీసుకోలేదు. ఇంత నిబద్ధతతో పని చేసి ఆంధ్రప్రదేశ్‌కే జగన్ మంచి పేరు తెచ్చారు. అలాంటి వ్యక్తిని జైల్లో పెట్టారు. ఈ రోజు భారతి సిమెంట్స్ కేరళ, తమిళనాడు, గోవాల్లో అమ్ముడుపోతోంది. సాక్షి పత్రిక అంశాన్ని ముద్రా ఇన్‌స్టిట్యూట్ వాళ్లు అధ్యయనాంశంగా తీసుకున్నా
- See more at: http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=63210&Categoryid=1&subcatid=18#sthash.TgkSUQ1Q.dpuf
Share this article :

0 comments: