పోరాటం కొనసాగుతుంది: విజయమ్మ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » పోరాటం కొనసాగుతుంది: విజయమ్మ

పోరాటం కొనసాగుతుంది: విజయమ్మ

Written By news on Tuesday, May 28, 2013 | 5/28/2013

రాజ్యాంగాన్నే దుర్వినియోగ పరుస్తూ జగన్‌ను జైల్లో పెట్టడమే లక్ష్యంగా కాంగ్రెస్‌, టీడీపీ, సీబీఐ పనిచేస్తున్నాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ ఆరోపించారు. ద్వంద్వ నీతితో సీబీఐ విచారణ చేస్తోందని ఆమె అన్నారు. జగన్ అక్రమ నిర్బంధాన్ని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద దీక్ష చేపట్టిన విజయమ్మ ఈ సాయంత్రం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. 

తమపై వచ్చింది ఆరోపణలేనని, నేరం రుజువుకాలేదని మంత్రులు చెప్తున్నారని... జగన్‌పై కూడా వచ్చినవి ఆరోపణలేనని గుర్తు చేశారు. ఆయన్ను ఏడాదిగా ఎందుకు జైల్లో ఉంచారని ప్రశ్నించారు. గుండెల మీద చెయ్యి వేసుకుని చెప్పండి.. జగన్‌ ఎన్నడైనా మీ కార్యాలయాలకు వచ్చిగానీ, క్యాంప్‌ ఆఫీసుకు వచ్చిగాని కనపడ్డాడా అంటూ నిలదీశారు. కాంగ్రెస్‌ నుంచి బయటకొచ్చిన వారంలోనే జగన్ ను ఐటీ నోటీసులొచ్చాయని తెలిపారు. వివాదస్పద 26 జోవోలు సక్రమమా కాదా అని ప్రభుత్వానికి నోటీసులందినప్పుడు కనీసం ఒక్క జోవోపై కూడా కాంగ్రెస్ సర్కారు కౌంటర్‌ దాఖలు చేయలేదన్నారు. మంత్రులు కూడా వ్యక్తిగతంగా కౌంటర్ దాఖలు చేయలేకపోయరన్నారు. శంకర్రావు ఆధారాలు లేని పిటిషన్‌ వేస్తే.. చంద్రబాబు ఇంప్లీడ్‌ అయ్యారని, జగన్‌పై జరిగిన కుట్రకు ఇవన్నీ ఉదాహరణలని విజయమ్మ అన్నారు.

జగన్‌బాబుకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పలేదనే నిమ్మగడ్డ ప్రసాద్‌ను ఏడాదిగా జైల్లో ఉంచారని ఆరోపించారు. ఇందిరాగాంధీని చంపిన హంతకులను సైతం విచారించిన తర్వాతే కేసు నమోదుచేశారని, ఎలాంటి విచారణ లేకుండా మూడు ఛార్జ్‌షీట్లలో ఏ1గా నిందితుడిగా జగన్‌ను పేర్కొనడం కుట్ర కాక మరేమిటని ప్రశ్నించారు. సుప్రీంకోర్టును తీర్పులను కూడా సీబీఐ లెక్కచేయడంలేదన్నారు. చనిపోయిన వైఎస్సార్ పేరును చార్జిషీట్ లో పెట్టడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. 

విప్‌ జారీచేసి మరీ ప్రభుత్వాన్ని కాపాడిన ఘనత ప్రతిపక్ష నేత చంద్రబాబుదే అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంతో ఎన్నికల ఫిక్సింగ్‌కు పాల్పడుతుంది చంద్రబాబే అన్నారు. నోట్ల కట్టలను బస్తాలలో, లారీలలో ఎలా నింపాలో చంద్రబాబుకు తెలిసినంతగా.. మరెవరికీ తెలియదన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుతున్నారు కాబట్టే చంద్రబాబుపై ఎటువంటి విచారణలు జరగడం లేదన్నారు. జగన్ అక్రమ నిర్బంధానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని విజయమ్మ ప్రకటించారు. నిన్న, నేడు జరిగిన నిరసన కార్యక్రమాల్లో పాల్గొని తమకు అండగా నిలిచిన వారందరికీ ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Share this article :

0 comments: