వ్యక్తుల్నిబట్టి తీర్పులిస్తారా! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వ్యక్తుల్నిబట్టి తీర్పులిస్తారా!

వ్యక్తుల్నిబట్టి తీర్పులిస్తారా!

Written By news on Sunday, May 26, 2013 | 5/26/2013


నిరుపేదల గుండెల్లో గూడుకట్టుకుని ఉన్న మహానేత డా॥వైఎస్సార్‌గారి మరణవార్త విని గుండెపగిలి చనిపోయినవారి కుటుంబాలను ఓదార్చటం కుమారుడిగా నా ధర్మం అని నల్లకాలువ బహిరంగ సభ సాక్షిగా జగన్ ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం, ఓదార్పు కార్యక్రమం మొదలుపెట్టారు. ఆ జనాదరణను చూసి ఓర్వలేక కొంతమంది నాయకులు అధిష్టానానికి వైఎస్సార్ కుటుంబంపై పితూరీలు చెప్పారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీ నాయకులు కుమ్మక్కై కుట్రపన్ని జగన్‌ను జైల్లో పెట్టించారు.

కేంద్రం జగన్‌ను సీబీఐ ద్వారా వేధించటం మొదలుపెట్టింది. బెయిల్ రాకుండా చేస్తోంది. బెయిల్ మంజూరు చేయకుండా తొంభై రోజుల కంటే ఎక్కువ రోజులు జైల్లో ఉంచకూడదు. కానీ జగన్ దోషిగా నిరూపణ కాకుండానే ఇప్పటికి ఏడాదిగా జైల్లోనే ఉంచారు. ఇది రాజ్యాంగ ఉల్లంఘన కిందికి రాదా? ప్రభుత్వాలను బట్టి, వ్యక్తులను బట్టి కోర్టులు తీర్పులు ఇస్తాయి అనే భావన సామాన్య పౌరులకు కలిగితే ఆ తప్పు ఎవరిది? జగన్‌ని అన్యాయంగా నిర్బంధించిన ఈ ఏడాది కాలాన్ని ఎవరు తెచ్చిస్తారు? ఫలానా తేదీ లోపల చార్జిషీటు పెట్టండి అని సీబీఐకి సుప్రీంకోర్టు సూచించవచ్చు కదా.

గుళ్లో దేవుడు ఉంటాడు. మనం వెళ్లి దండం పెడితే, మన కోర్కెలు తీరుస్తాడని అనుకుంటాం. కానీ దేవుడే అన్యాయం చేసినప్పుడు చేయగలిగేదేముంది? అందువలన ఈ విషయంలో కోర్టులు జోక్యం చేసుకోకపోతే భారతదేశంలో న్యాయస్థానాల ఔన్నత్యం తగ్గిపోతుంది. జగన్‌కు త్వరగా బెయిల్ రావాలని అందరూ దేవుణ్ని ప్రార్థిస్తున్నారు. ఎందుకంటే జనం జగన్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు.

- ఎస్.ఎం.సుభాని, విశ్రాంత ఉపాధ్యాయుడు, నందిగామ

మా చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: