రేపే జగన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రేపే జగన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు?

రేపే జగన్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు?

Written By news on Wednesday, May 8, 2013 | 5/08/2013


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై గురువారం సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వనుంది. జగన్మోహన్‌రెడ్డి బెయిల్ పిటిషన్‌పై సోమవారం (6వ తేదీ) సుప్రీం కోర్టులో ఇరువైపుల వాదనలు ముగిసిన అనంతరం తీర్పును రిజర్వులో ఉంచిన విషయం తెలిసిందే.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిని పదకొండు నెలలుగా జైలులో ఉంచారని, దర్యాఫ్తు పూర్తయినందున బెయిల్ ఇవ్వాలని జగన్ తరఫు న్యాయవాది సుప్రీం కోర్టులో వాదించారు. జగన్ బెయిల్ పిటిషన్ పైన ఈ నెల 6వ తేదీన అతని తరఫు లాయరు వాదించారు. జగన్ ఎక్కడకు పోరని, ఎన్నికలు వస్తున్నందున పార్టీని సిద్ధం చేసుకోవాల్సిన అవసరముందన్నారు.
జగన్ కేసులో సిబిఐ అసంబద్ద వాదనలను వినిపిస్తుందన్నారు. హైకోర్టులో వాదనలకు, సుప్రీం కోర్టులో వాదనలకు పొంతన లేదన్నారు. జగన్ సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశమే లేదన్నారు. దర్యాఫ్తు పూర్తయిన తర్వాత ఇంకా సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశమెక్కడిదన్నారు. జగన్ పారిపోయే వ్యక్తి కాదని, ఏడాదిగా జైలులో ఎందుకు ఉంచారన్నారు.తాము ముందస్తు బెయిల్ అడిగితే తప్పు కానీ, జైల్లో ఉండగా బెయిల్ కోరితే తప్పేంటన్నారు. మధ్యంతర బెయిల్ అయినా ఇవ్వాలని కోరారు.
source:
andhrajyothy
Share this article :

0 comments: