గంపెడు ఆశలతో...రాష్ట్రం నిరీక్షిస్తోంది - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » గంపెడు ఆశలతో...రాష్ట్రం నిరీక్షిస్తోంది

గంపెడు ఆశలతో...రాష్ట్రం నిరీక్షిస్తోంది

Written By news on Friday, May 24, 2013 | 5/24/2013

పవిత్ర భారతావనిలో సమస్త మానవాళికీ న్యాయం, ధర్మం, స్వేచ్ఛ సమంగా వర్తించాలని మన రాజ్యాంగం నిర్దేశించింది. కాని నేడు సాగుతున్నది నిరంకుశ పాలన. మూడు నెలలు దాటితే ఏ వ్యక్తికైనా నిబంధన ప్రకారం బెయిల్ ఇచ్చి తీరాలి. కాని జగన్ విషయంలో మూడు నెలలు దాటి తొమ్మిది నెలలు అవుతున్నా కూడా బెయిల్ రాకుండా కేంద్రం, సీబీఐ దోబూచులాడుతున్నాయి. జగన్ బెయిల్‌ను అడ్డుకుంటున్నాయి. మన పుణ్యభూమిలో ఒక మహిళ కంటతడి పెట్టుకుంటే దేశానికి సౌభాగ్యం ఉండదు. 

ఇది యదార్థం. మన పురాణాలు కూడా ఇదే ఘోషిస్తున్నాయి. భర్తను పోగొట్టుకుని, కొడుకు జైలుపాలై విజయమ్మ పడుతున్న క్షోభ ఊరికేపోదు. నాడు కురుసభలో ఎందరో వృద్ధులు, ఆచార్యులు, మహావీరులు తమ ముందు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లారా చూసి, మౌనంగా ఉండిపోయారు. ఫలితమే మహా సంగ్రామం. ఆ సంగ్రామంలో కురు సామ్రాజ్యం నాశనమైపోయింది. ధర్మజ్ఞులైన పాండవులు విజయం పొందారు. నేడు ఇదే జరగబోతోంది. ప్రభుత్వంలోను, ప్రతిపక్షంలోను, కేంద్రంలోను ఎందరో న్యాయకోవిదులు, పెద్దలు ఉండి కూడా నేడు జగన్‌కు జరుగుతున్న ఘోరమైన అన్యాయాన్ని ప్రశ్నించలేకపోతున్నారు. రేపు ఇదే పరిస్థితి తమకు వస్తే ఏమిటి? అని వారు కాస్త ఆలోచించి ఈ కేసుకు ముగింపు చూసి, ఒక నిరపరాధిని బయటకు తీసుకురావాలి. గౌరవనీయులు, దేశ ప్రథమపౌరులు అయిన రాష్ట్రపతి కలుగజేసుకుని ఈ అన్యాయాన్ని ఆపవలసిందిగా కేంద్రానికి, సీబీఐ వారికి గట్టి సూచనలివ్వాలని ప్రజలు కోరుతున్నారు.

జగన్ ఏనాడైనా మంత్రి పదవిలో ఉన్నారా? ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నారా? ఏరోజైనా సచివాలయం గుమ్మం ఎక్కారా? ఏ మంత్రితోనైనా లాలూచీ పడ్డారా? ఆయన ఒక మహానాయకునికి, ప్రజల ఆరాధ్య దైవమైన వైఎస్సార్‌కి జన్మించడం తప్పా? ఆయన చేసిన నేరమేంటి అని ప్రజలు అడుగుతున్నారు. నిరూపించి తగిన శిక్ష విధించవచ్చు కదా. తండ్రి మరణం తర్వాత ప్రజలకిచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండటం న్యాయం కాదా? ప్రజలను కలుసుకుని వారిని పరామర్శించడం తప్పా? మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడం నేరమా? 

నా వయసు 70. ఎన్నో ప్రభుత్వాలను, నాయకులను, ముఖ్యమంత్రులను చూశాను. ఇంతటి నీతిమాలిన, నిరంకుశ పాలనను, పాలకులను చూడలేదు. ఈ కుటిల పాలకులకు భగవంతుడు తగినశిక్ష వేయాలని; దేశానికి, రాష్ట్రానికి మంచి జరగాలని ప్రార్థిస్తున్నాను. ఇటీవల మంత్రి ఆనం, కేంద్ర మంత్రి కోట్ల కారుకూతలకు రాబోయే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెపుతారు. పునరపి జననం, పునరపి మరణం. నాయకులు వస్తారు, పోతారు. చేసిన మంచి పనులు శాశ్వతం. రాజన్న కీర్తి సంపాదించి దివికేగిన పుణ్యమూర్తి. ఆయన అడుగు జాడల్లో నడుస్తున్న జగన్‌ని ప్రజలు గత ఎన్నికల్లో అఖండ మద్దతుతో గెలిపించారు. రాబోయే ఎన్నికల రణరంగంలోను ముసలి కాంగ్రెస్‌కు, దాని చేతికింది టీడీపీకి గుణపాఠం ప్రజలు ఎదురుచూస్తున్నారు. అలాగే జగన్ సీఎంగా వచ్చి రాష్ట్రంలో నేడున్న ఘోర పరిస్థితులను చక్కదిద్దుతారని నమ్ముతున్నారు. జగన్ త్వరలోనే జైలు నుండి వస్తారని, తమ కష్టసుఖాల్లో పాలుపంచుకుంటారని గంపెడు ఆశలతో యావత్‌రాష్ర్టం నిరీక్షిస్తోంది.

- ఎ.సాంబమూర్తి, చిన అమిరం, భీమవరం 
Share this article :

0 comments: