మాట్లాడితే ఢిల్లీకి పరుగెత్తేవాళ్లు...ప్రజానాయకులు ఎలా అవుతారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాట్లాడితే ఢిల్లీకి పరుగెత్తేవాళ్లు...ప్రజానాయకులు ఎలా అవుతారు?

మాట్లాడితే ఢిల్లీకి పరుగెత్తేవాళ్లు...ప్రజానాయకులు ఎలా అవుతారు?

Written By news on Saturday, May 25, 2013 | 5/25/2013

రాజకీయ నాయకులు తమను నమ్మి ఓటు వేసిన ప్రజలను విస్మరించి ఢిల్లీ నేతలను పెద్దలుగా భావించి వారి ఆశీర్వాదాల కోసం వెంపర్లాడినంతకాలం ప్రజానాయకులు కాలేరు. దేశంలోనే మొదటిసారి దివంగత నేత వైయస్సార్ గారు ప్రజలకోసం ఎంత చెయ్యవచ్చో అంతా చేసి చూపించారు. నిస్వార్థంగా ప్రజల మంచి కోరి వారికి సేవ చేసేవారికి ఏ పెద్దల అండా అవసరం లేదని, అలాంటి వారినే ప్రజలు మళ్లీమళ్లీ ఎన్నుకొంటారని రెండవసారి గెలిచి నిరూపించారు. అదే లక్ష్యంతో ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి... ‘ఢిల్లీ నుంచి సీల్డ్ కవర్ లో సి.ఎం. అయి రావడం’ కంటే... ‘ప్రజల మనిషి’ అని ప్రజల చేత సీల్ వేయించుకోవడం మేలని తలచాడు. ఇప్పుడు ప్రజలు గమనించింది ఏమిటంటే జగన్ కి వచ్చిన కష్టాలు మరి ఏ నాయకులకైనా వచ్చి ఉన్నట్లయితే వారు ఢిల్లీలో కాళ్ల బేరానికి వచ్చేవారని. కాని జగన్ ఒంటరిగా ఎన్ని కష్టాలైనా ఎదుర్కొని ప్రజల మనిషిగా నిలబడతానన్నాడు. అతని ధైర్యం చూస్తే ఎవ్వరికైనా కొనియాడాలనిపిస్తుంది. తన ఆస్తులను కాపాడుకొనేవాడైతే జగన్ మరో గులాం నబీ అయ్యుండేవాడు కదా!

ఉదయం లేచింది మొదలు అవినీతి గురించే మాట్లాడే ప్రతిపక్ష నాయకుడు కూడా తనకున్న వేలఎకరాలు, కుప్పంలో ఇజ్రాయిల్ తరహా సేద్యం, బినామీ వ్యాపారాలు, హోటల్‌లు, హెరిటేజ్‌ల గురించి మాత్రం నోరెత్తకపోవడం గురువిందగింజ చందంగా ఉందని ప్రజలు నవ్వుకుంటున్నారు. చంద్రబాబుగారి యాత్రలు, పర్యటనలు చూస్తుంటే... నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లు ఉన్నాయి. ఆయన తన పాదయాత్రలో చిన్నపిల్లలతో మాట్లాడుతూ ‘మీరూ రాజకీయాల్లోకి రండి, నీతిగా ఉండండి, ఎన్టీఆర్ రాజకీయాల్లో నీతిగా ఉండి ఎంతో పేరు గడించారు’ అనడం చూస్తే, ఆయన నీతిగా లేరనేగా అర్థం. పిల్లనిచ్చిన మామను, కుటుంబ సభ్యులను, ప్రజలను నమ్మించి మోసం చేసి, ఇప్పుడు కొత్తగా ‘తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి కార్యకర్తలకు ఏమీ చెయ్యలేకపోయాను. 

ఈసారి గెలిపిస్తే మిమ్ములను లక్షాధికారులను చేస్తా’ అంటున్నారు బాబుగారు. ఎలా చేస్తారు? అవినీతిని ప్రోత్సహించా? ఆయన మాటలు, ఆ అసహనం, ప్రజల మధ్య ఆయన ప్రవర్తన చూస్తే చంద్రబాబుకి మతిస్థిమితం గానీ తప్పలేదు కదా అన్న అనుమానం కలుగుతోంది. 63 సంవత్సరాల వయస్సు ఉండి, 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవం ఉండి తోటి వయస్సు గల దివంగత నేత గురించి ఎంత నీచంగా మాట్లాడుతున్నారు! కుటుంబ సభ్యులతోనే వ్యాపారం చేసే బాబుగారు, ‘ఒక్క అవకాశం ఇస్తే చాలు, మీ ఇంట్లో పెద్దకొడుకుగా ఉంటా’నంటే ప్రజలు ఎలా నమ్ముతారు? 

ఎల్లో మీడియా కూడా చంద్రబాబుకు ఏమాత్రం తీసిపోలేదు. మన దౌర్భాగ్యంఏమిటంటే ప్రజాశ్రేయస్సు కోరవలసిన ఆ రెండు పత్రికలు తమ సొంత లాభం కోసం, తమ ఆస్తులు కాపాడుకోవడం కోసం, అసత్యాలు ప్రచారం చేయడం! అభూత కల్పనలను, ఊహలను వార్తలుగా నమ్మించి, జగన్‌పై వ్యతిరేకతను కలిగించే ప్రయత్నం చేయడం. పనికిమాలిన వార్తలతో జగన్‌కు జనాన్ని దూరం చేయాలన్నది వారి ఎత్తుగడల్లో ఒకటి. 

కాని ప్రజలు అమాయకులు కారు. అదేదో సినిమాలో అన్నట్లు వారు ‘థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ’. ‘ముప్పైఏళ్లుగా మీరు రాస్తున్న వార్తల్లో ఏది నిజమైన వార్తో, ఏది బ్లాక్‌మెయిల్ వార్తో కనిపెట్టలేమా?’ అంటున్నారు. చివరగా... రాజకీయనాయకులు కాని, పత్రికలు కాని అర్థం చేసుకోవలసినది ఏమిటంటే... ఒకసారి ప్రజలు మైండ్‌లో ఫిక్స్ అయిపోతే బ్లైండ్‌గా వెళ్లిపోతారంతే. వైయస్సార్ ప్రజల సంక్షేమం కోసం వారి అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారు. అవి నిరాటంకంగా కొనసాగాలంటే జగన్ ముఖ్యమంత్రి కావాలి. ప్రజలు ఇలాగే ఫిక్స్ అయిపోయారు కాబట్టి ఇలాగే జరుగుతుంది. 

- సాయిలక్షి్ష్మ, నెల్లూరు

కాంగ్రెస్‌కు చేసిన ఉపకారానికి కాంగ్రెస్ చేసిన ప్రత్యుపకారం ఇదా!

మనసున్న మారాజు డా॥తన రెక్కల కష్టంతో... రేయనక, పగలనక సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టసుఖాలను తెలుసుకొంటూ, వారిలో ఒకరిగా కలిసిపోయి రాష్ట్రంలో జీర్ణావస్థలో ఉన్న కాంగ్రెస్‌పార్టీని రెండుసార్లు అధికారంలోకి తెప్పించారు. అందుకు ‘ప్రత్యుపకారంగా’ అన్నట్లు కాంగ్రెస్ పార్టీ ఆయన తనయుడిని ఏడాదికాలంగా నిర్బంధించి వేధిస్తోంది! తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖాన్ని దిగ మింగుకొని, మీకోసం నేనున్నానంటూ నల్లకాలువ వద్ద ప్రజలకిచ్చిన మాటకోసం జగన్‌గారు ఓదార్పుయాత్ర ప్రారంభిస్తే, అది చూసి సహించలేక, ఆయనపై వర్షిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక పాలక, ప్రతిపక్షాలు రెండూ కలసి జనహృదయ యువనేతపై విషపు జ్వాలలు చిమ్ముతున్నారు. అయినా సూర్యుడిపైన ఉమ్మివేస్తే ఏమౌతుంది? తిరిగొచ్చి ఉమ్మినవారి మీదే పడుతుంది. ఈ వాస్తవం మన కుటిలనేతలకు తెలిసేరోజు దగ్గర్లోనే ఉంది. తల్లి విజయమ్మగారు, వదిన భారతిగారు, చెల్లి షర్మిలమ్మ కన్నీటి మంటలే వారిని దహించి వేస్తాయి. త్వరలోనే జగనన్న బయటకు వచ్చి, రాజన్న సువర్ణ పాలనను మనకు అందించాలని మనసారా ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాం. 

- ఎ. శ్రీనివాస్‌రాజు, కరీంనగర్

 చిరునామా: జగన్ కోసం, సాక్షి ఫ్యామిలీ, సాక్షి, రోడ్ నెం.1, బంజారాహిల్స్, హైద్రాబాద్-34. e-mail: ysjagankosam@gmail.com
Share this article :

0 comments: