అడుగుజారిన టీడీపీ!కాంగ్రెస్‌కు ఇక పరాభవపర్వమే! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అడుగుజారిన టీడీపీ!కాంగ్రెస్‌కు ఇక పరాభవపర్వమే!

అడుగుజారిన టీడీపీ!కాంగ్రెస్‌కు ఇక పరాభవపర్వమే!

Written By news on Saturday, May 18, 2013 | 5/18/2013

రాష్ట్రం మార్పు కోరుతోంది. అందుకు అనుగుణంగానే ఏ నోట విన్నా జగన్ మాటే వినపడుతున్నది. సోనియా కక్ష సాధింపు మీద అంతిమతీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కోర్టు ఆదేశం ప్రకారమే సీబీఐ జగన్‌పై చార్జిషీటు వేస్తోంది గానీ, దానితో కాంగ్రెస్‌కు సంబంధం లేదనే నంగనాచి మాటలను ప్రజలు నమ్మడం లేదు. కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యే వాడని గులాంనబీ ఆజాద్ చెప్పలేదా! కాంగ్రెస్‌లో ఉంటే నిర్దోషి, లేకుంటే దోషి అవుతాడా! రూల్ ఆఫ్ లా అంటే ఇదేనా! 

కేంద్రంలోని తాజా పరిణా మాలు ఆ పార్టీ సమీప భవిష్య త్తులో భారీ మూల్యం చెల్లించక తప్పదని స్పష్టం చేస్తున్నాయి. సుప్రీంకోర్టు అక్షింతలతో కర్ణా టక విజయం మరుగున పడి పోయింది. స్కాములలో ముని గితేలుతున్న కేంద్ర సర్కారును తాజాగా కేంద్ర మంత్రుల వ్యవహారం నిలువునా ముంచివేసింది. తన పరువును కాపాడుకోవడానికి బన్సల్, అశ్వనీ కుమార్‌ల చేత రాజీ నామా ఇప్పించకతప్పలేదు.

సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన తరువాత కూడా మన్మోహన్‌సింగ్ పదవిలో కొనసాగడం కాంగ్రెస్ దుస్థితికి అద్దం పడుతున్నది. ప్రజల మన్ననలు పొందిన నిజాయి తీగల సమర్థులు కాంగ్రెస్‌లో కరువయ్యారు. తన కుమా రుడు రాహుల్ కోసం ప్రణబ్ ముఖర్జీని సోనియా రాష్ర్ట పతిభవన్‌కు సాగనంపింది. అయితే రాహుల్ చేతులు కాల్చుకోవడానికి సిద్ధంగా లేడు. ఇందిరా గాంధీ అనంత రం దేశానికి దశ, దిశ ఇవ్వగల ధైర్యం గల నాయకుడేడీ?

ఇటీవల సీబీఐ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. అది కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో మెలిగే సంస్థ అని అతి సామా న్యునికి కూడా అర్థమైపోయింది. దేశం కోడై కూస్తున్నా సోనియాలో చలనం లేదు. వైఎస్ జగన్‌పై కక్షసాధింపు నకు సాధనంగా సోనియా సీబీఐని ఉపయోగిస్తోందని బడి పిల్లవానికీ, మూలనున్న ముసలమ్మకూ అర్థమై పోయింది. అయినా సోనియా వైఖరిలో మార్పురాలేదు. రాజకీయ ప్రత్యర్థులను బ్లాక్‌మెయిల్ చేసి తన మద్దతు దార్లుగా మార్చుకోవడానికి కేంద్ర సంస్థలను సోనియా ఉపయోగిస్తున్నదని మొన్న ములాయంసింగ్ అంటే, నేడు మమత కూడా అదే మాట అంటున్నారు.

కేంద్ర ప్రభుత్వ పంజరంలోని చిలుకగా సీబీఐ మారి పోయిందని సుప్రీంకోర్టు చురకలు అంటిస్తే ప్రస్తుత సీబీఐ డెరైక్టర్ రంజిత్ సిన్హా అది అక్షరాలా నిజం అన్నారు. సీబీఐ ని స్వతంత్రంగా వ్యవహరించగల సంస్థగా తీర్చిదిద్దడానికి చట్టం తయారు చేయమని అటార్నీ జనరల్‌ను సుప్రీం కోర్టు ఆదేశించింది. సోనియా, మన్మోహన్‌సింగ్‌లకు ఇంత కంటే అభిశంసన కావాలా? దీని తర్వాత కూడా వారు పదవుల్లో కొనసాగడం ఈ దేశాన్ని పట్టిపీడిస్తున్న నాయ కత్వ దారిద్య్రాన్ని సూచిస్తోంది. పాలకపక్షీయులైనా, ప్రతిపక్షీయులైనా చట్టం ఒక్కటే అనే రాజ్యాంగ మౌలిక సిద్ధాంతాన్ని సోనియా బుట్టదాఖలా చేసింది. భజనపరు లను చేరదీసి వారికి ఉన్నత పదవులు కట్టబట్టే కళలో ఆమె రాటు దేలారు.

మూలాల్లోకి పోయే సాహసం ఏదీ?
దొరికిన వాడు దొంగ, దొరకని వాడు దొర అన్న పద్ధతిలో పాలన నడుస్తోంది. బన్సల్, అశ్వినీ కుమార్‌లను పదవుల నుంచి తొలగిస్తే అవినీతి అంతమైనట్లా? వేళ్లూనికుని విస్తరించిన అవినీతి పైపూతలతో అంతమవుతుందా? గత మూడు, నాలుగు దశాబ్దాలుగా రాజకీయ అవినీతి తామర తంపరగా విస్తరించింది. స్వాతంత్య్ర సమరయోధులు ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన రోజులు ఏ నాడో గతిం చాయి. సంపద కేంద్రీకరణ, ఆర్థిక వ్యత్యాసాలు పెరగరా దని రాజ్యాంగంలో రాసుకున్న ఆదేశిక సూత్రాలు గాలిలో కలిసిపోయాయి. నెల్లూరు పార్లమెంటు ఉప ఎన్నికల్లో జగన్ పార్టీని ఓడించడానికి ఓటర్లకు వేలకు వేలు పంచి పెట్టగల కోటీశ్వరుడు టి. సుబ్బరామిరెడ్డిని రంగంలోకి దింపి డబ్బు రాజకీయంలో దిట్ట అని సోనియా నిరూపిం చుకున్నారు. అయితే నెల్లూరు ప్రజలు ధనశక్తి కంటే ప్రజాశక్తి మిన్న అని నిరూపించారు. 

విధానాల మార్పు ద్వారా కాంగ్రెస్‌కు కొత్త ఊపిరులు పోయడానికి బదులు, ఎత్తుగడల్లో మార్పుల ద్వారా ఆమె అధికారం నిలబెట్టుకో వడానికి దివారాత్రాలు పథకరచన చేస్తున్నారు. ఆమె పెత్తందారీ విధానానికి తలవంచని జగన్‌ను సీబీఐ ద్వారా ఎలా ముప్పుతిప్పలు పెడుతున్నదో అందరికీ తెలిసిందే. దేశంలో ఎవరికీ రానంత మెజారిటీ జగన్‌కు ఇచ్చి సోని యా మీద ప్రజలు కసితీర్చుకున్నా కనుచూపు మేరలో ఆమెలో మార్పు వచ్చే సూచన కానరావడం లేదు. ప్రజలే అంతిమ నిర్ణేతలనే నగ్నసత్యాన్ని సోనియా విస్మరించింది.

కర్ణాటక విజయం ఎవరిది?
బీజేపీ మీద కర్ణాటక ప్రజలు సాధించిన విజయం అది. గత్యంతరం లేకనే కాంగ్రెస్‌ను గెలిపించారు. ప్రత్యామ్నా యం ఉన్న నియోజకవర్గాల్లో జేడీఎస్‌ను గెలిపించారు. ఫలితంగా జేడీఎస్ బలం 28 నుండి 40కి పెరిగింది. బీజేపీ ముఠాకక్షలు, అస్థిర రాజకీయాలతో కర్ణాటక ప్రజలు విసు గెత్తారు. కర్ణాటక జనతాపార్టీ బీజేపీ ఓట్లను చీల్చినం దువల్ల సుమారు 23 స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. కాం గ్రెస్ ఘనకార్యాలను చూసి ప్రజలు వారిని గెలిపించలేదు. 2014 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఆ రాష్ట్రంలో భారీ నష్టం తప్పదు. వరుస కుంభకోణాలతో విసుగెత్తిన ప్రజలు తిరిగి కాంగ్రెస్‌ను గద్దెనెక్కిస్తారని అనుకోవడం పచ్చి భ్రమ మాత్రమే. దాని తొమ్మిదేళ్ల నిర్వాకం చూసిన ఏ పార్టీ కూడా దానితో జత కట్టడానికి సిద్ధంగా లేదు. పెద్ద రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, బెంగాల్, తమిళనాడు, యూపీ, బీహార్‌లలో కాంగ్రెస్‌కు గండిపడకతప్పదు. కాంగ్రెసేతర లౌకికశక్తుల కూటమి బలమైన ప్రత్యామ్నాయంగా ఆవి ర్భవించే సూచన ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.

సీఎం పిల్లిమొగ్గలు!
వైఎస్ తన లోకోత్తరమైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమా లతో తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. వైఎస్ మరణంతో 650 మంది వైఎస్ అభిమానులు ప్రాణాలు విడవడం ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా జరి గిందా! ఈ ముద్రను చెరిపివేయడానికి అహోరాత్రాలు కిరణ్‌కుమార్‌రెడ్డి కొత్త కొత్త పథకాలతో తలబద్దలు చేసు కుంటున్నాడు. అయితే వైఎస్ పథకాల ముందు అవి పిల్లి మొగ్గలే. వైఎస్ రెక్కల కష్టంతో పదవుల్లో కులుకుతున్న వారికి మరిచిపోలేని వాత పెట్టడానికి ప్రజలు కాచుకొని ఉన్నారు. విద్యుత్ సంక్షోభం ప్రజలకు నరకాన్ని చూపి స్తోంది. కిలో రూపాయి పథకం ద్వారా 21 రూపాయల లబ్ది చేకూర్చి వైఎస్ 30 కేజీల పథకంలోని పది కేజీలను మార్కెట్లలో కొనమని చెప్పి 300 రూపాయల బరువును పేదల మీద వేశాడు. ప్రజా ద్రోహులను వెనుక బెంచీల్లో కూర్చోబెట్టే రోజు కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారు.

అడుగుజారిన టీడీపీ!
2009 తర్వాత జరిగిన అన్ని ఉపఎన్నికల్లో టీడీపీ చిత్తయి పోయింది. గణనీయ సంఖ్యలో డిపాజిట్లు కూడా గల్లంత య్యాయి. చంద్రబాబు కౌటిల్యం అర్థమై మైసూరారెడ్డి వైఎస్సార్ సీపీలో చేరి, లక్ష కోట్ల అపవాదులోని బండా రాన్ని బయటపెడితే బాబు గొంతు పెగలలేదు. ఆత్మ గౌరవాన్ని చంపుకోలేక టీడీపీకి గుడ్‌బై చెప్పిన దాడి వీర భద్రరావు బాబు కుమ్మక్కు రాజకీయాన్ని అసహ్యించు కుంటూ వాస్తవాలను బయటపెట్టాడు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై చంద్రబాబు దోబూచులాటను ఛీత్కరించు కుంటూ టీడీపీకి షాక్ ఇచ్చాడు. ‘వెన్నుపోటు రాజా’ను గురించి షర్మిల పరిహసిస్తూ పాదయాత్రలో మాట్లాడటం చంద్రబాబుకు నిష్కృతి లేదని స్పష్టం చేస్తున్నది.

ఏ నోట విన్నా జగన్ మాటే!
రాష్ట్రం మార్పు కోరుతోంది. అందుకు అనుగుణంగానే ఏ నోట విన్నా జగన్ మాటే వినపడుతున్నది. సోనియా కక్ష సాధింపు మీద అంతిమ తీర్పు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కోర్టు ఆదేశం ప్రకారమే సీబీఐ జగన్‌పై చార్జిషీటు వేస్తోంది గానీ, దానితో కాంగ్రెస్‌కు సంబంధం లేదనే నంగనాచి మాటలను ప్రజలు నమ్మడం లేదు. కాంగ్రెస్‌లో కొనసాగి ఉంటే జగన్ ముఖ్యమంత్రి అయ్యే వాడని రాష్ట్ర కాంగ్రెస్ ఇన్‌చార్జి గులాంనబీ ఆజాద్ చెప్ప లేదా! కాంగ్రెస్‌లో ఉంటే నిర్దోషి, లేకుంటే దోషి అవు తాడా! రూల్ ఆఫ్ లా అంటే ఇదేనా!

ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. ప్రజాస్వామ్య ప్రదా తలు ప్రజలే గానీ, సోనియా కాదు! సోనియాకు దిమ్మ తిరిగే తీర్పు ప్రజలు ఇవ్వబోతున్నారు. అది ఎప్పు డెప్పు డా అని వారు ఎదురు చూస్తున్నారు.

http://www.sakshi.com/main/WeeklyDetails.aspx?Newsid=62507&Categoryid=1&subcatid=18
Share this article :

0 comments: