మాఫియా సంస్కృతికి వ్యతిరేకంగా దావూద్ ఇబ్రహీం ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మాఫియా సంస్కృతికి వ్యతిరేకంగా దావూద్ ఇబ్రహీం ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది?

మాఫియా సంస్కృతికి వ్యతిరేకంగా దావూద్ ఇబ్రహీం ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది?

Written By news on Monday, May 20, 2013 | 5/20/2013

మాఫియా సంస్కృతికి వ్యతిరేకంగా దావూద్ ఇబ్రహీం ప్రచారం చేస్తే ఎలా ఉంటుంది? అశ్లీలతపై సన్నీలియోన్ నిరసన తెలిపితే ఎలా ఉంటుంది? బెట్టింగ్‌ను నిరసిస్తూ బుకీ లు ర్యాలీ జరిపితే ఎలా ఉంటుంది? అచ్చం ఇప్పుడు అవినీతిపై చంద్రబాబు తలపెట్టిన ఉద్యమంలాగే ఉంటుంది!! సీఎంగా తన హయాంలో కుంభకోణాల్ని సరికొత్త కోణాల్లో ఆవిష్కరించి రికార్డు సృష్టించిన టీడీపీ అధినేత... ఇప్పుడు లోక కల్యాణార్థం అవినీతిని వ్యతిరేకిస్తానంటున్నారు. రాష్ట్రంలో నిరసనలు చేపట్టడంతో పాటు రాష్ట్రపతినీ కలుస్తారట. నిజానికి నాటి బాబు అవినీతిని ఆవిష్కరించేందుకు ఎన్ని పేజీలైనా చాలవు. అందుకే మచ్చుకు కొన్ని స్కాముల వివరాలు... చంద్రబాబునాయుడు.... ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్ట్... హెరిటేజ్ ఫుడ్స్... తెలుగుదేశం పార్టీ. చూడటానికివన్నీ వేరువేరు పేర్లతో ఉంటాయి. కానీ ఇవన్నీ బాబు జేబు సంస్థలు. ఫక్తు కుటుంబ ఆస్తులు. ముఖ్యమంత్రిగా ఉంటూ... తన బినామీలకు దోచిపెట్టడం, రామోజీ కోటలకు పునాదులెయ్యటం, పాలసీ పాముల పుట్టల్లోంచి కోట్లు పుట్టించుకోవటం ఒకెత్తయితే... నిస్సిగ్గుగా తన సొంత సంస్థలకు రాయితీలు ఇచ్చుకోవటం దగ్గర్నుంచి, తన రుణాలను తానే మాఫీ చేసుకోవటం,తనకు తానే భూములు ధారాదత్తం చేసుకోవటం వంటివి చేశారాయన. న్యాయస్థానాల్లో సాంకేతిక కారణాలతో, నాట్ బిఫోర్‌లతో డ్రామాలాడటం...

 చివరకు అదే క్లీన్‌చిట్‌గా ప్రచారం చేసుకోవటమనే విద్యలో ఆయనది మాస్టర్స్ డిగ్రీ. ఆఖరికి కుంభకోణాల పుట్ట పగిలి కోర్టు దర్యాప్తునకు ఆదేశించినపుడు కూడా తన మంత్రాంగంతో ఆపించుకున్న ఘనత బాబుదే. అలాంటి చంద్రబాబు అవినీతిపై పోరాడతానంటున్నారిపుడు. అందుకోసం రాష్ట్రపతిని కూడా కలుస్తానంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎంగా ఆయన మురికి చరితను.. ఆయన కుంభకోణాల్లో కొన్నిటిని మరొక్కసారి గుర్తు చేసే కథనమే ఇది. బిల్లీ ఎలకా... బాబూ చోర్ ఒక బినామీని పెట్టుకుని... ఆ బినామీ చేత కంపెనీ పెట్టించి... దానికి ఆగమేఘాల మీద 850 ఎకరాలు కేటాయించేసి... ముందుచూపుతో భవిష్యత్తు హక్కుల్ని కూడా ఆ సంస్థకు రాసిచ్చేసిన తీరు బహుశా ఈ దేశంలోనే కాదు, ప్రపంచంలోనూ ఎక్కడా జరిగి ఉండదేమో. ఇంతటి పచ్చి దగాకోరు చర్యకు ఏ నాయకుడూ పాల్పడి ఉండడేమో!!

 * సొంత ఆఫీసు లేని ఐఎంజీకి 850 ఎకరాలు * ఎకరా 2 కోట్లు చేసే భూమి... 50 వేలకే * పుట్టిన వారానికే కంపెనీతో ఒప్పందం * కేబినెట్‌కు తెలియకుండా కేటాయింపులు * హైదరాబాద్ నడిబొడ్డున ఆఫీసుకు ఐదెకరాలు * ఐఎంజీ అధికారుల పేరిట దొంగ ఇ-మెయిల్స్ * సీబీఐ దర్యాప్తుకు 2007లోనే ప్రభుత్వ ఆదేశాలు * దొంగ బాబులు దొరికినా సీబీఐ అనాసక్తి * తగిన సిబ్బంది లేరన్న దర్యాప్తు సంస్థ * అప్పుడూ దాని అధిపతి ఈ లక్ష్మీనారాయణే 2003 ఆగస్టు 5న హైదరాబాద్‌లో 'ఐఎంజీ భారత' కంపెనీ రిజిస్టరయింది. దాని అధిపతులు అహోబలరావు అలియాస్ బిల్లీరావు, ప్రభాకరరావు అలియాస్ పేట్‌రావు. వీరిద్దరూ నాటి సీఎం బాబుకు బాగా సన్నిహితులు. వాళ్లకు అప్పటికే కుప్పంలో ఇజ్రాయెల్ టెక్నాలజీని అమలుచేసే ప్రాజెక్టునూ అప్పగించారు బాబు. కనీసం ఆఫీసు కూడా లేని ఐఎంజీ... రూ.5 లక్షల మూలధనంతో పేపర్‌పై మొదలైంది. రాష్ట్రంలో స్పోర్ట్స్ స్వరూపాన్ని మార్చేస్తామనే ప్రతిపాదనతో ముందుకొచ్చింది. అంతే! ఫైళ్లు వేగంగా కదిలాయి. నాలుగు రోజులు తిరక్కుండా బాబు ఎంఓయూ చేసుకున్నారు. హైదరాబాద్‌లో 850 ఎకరాల భూమిని ఇచ్చేయటానికి సరేనన్నారు. ఈలోపే బాబు మిత్రపక్షమైన 'ఈనాడు' పత్రిక శివాలెత్తేసింది. ఐఎంజీకి భూములిస్తే రాష్ట్రం నుంచి ఒలింపిక్స్ విజేతలు తథ్యమంటూ కథనాలు వండేసింది. ఐఎంజీని ఆకాశానికెత్తేసింది. ఇంతలో చిక్కొచ్చి పడింది. తమ పేరు బిల్లీ దుర్వినియోగం చేస్తున్నారని, ఆయనతో తమకెలాంటి సంబంధం లేదంటూ ఫ్లోరిడాలోని అసలు ఐంఎజీ లేఖ రాసింది. బాబు లెక్కచేయలేదు. 

ఎందుకంటే బిల్లీ తన జేబులో మనిషాయె. 2003 సెప్టెంబరు 1న... ఐఎంజీకి హైదరాబాద్‌లోని స్టేడియాలనూ అప్పగించాలని నిర్ణయించారు. ఐఎంజీకి భూమి అప్పగించాలంటూ... 2004 జనవర్లో నాటి రంగారెడ్డి కలెక్టర్‌కు ఆదేశాలు వెళ్లాయి. అప్పగింత పూర్తయింది. ఫిబ్రవరి 10న భూమి రిజిస్ట్రేషన్ పూర్తయింది. 24 గంటలు తిరక్కుండా బాబు టెంకాయ కొట్టేశారు. స్టేడియాలూ ఫ్రీ... భూమి ఒక్కటే కాదు. అప్పటికే హైదరాబాద్‌లో కట్టిన 8 మైదానాలను 45 ఏళ్ల పాటు ఐంఎజీకి లీజుకిచ్చేందుకు బాబు ఓకే చేశారు. లీజు గడువు ముగిశాక... ఐఎంజీ తనకు నచ్చిన రేటుకు, నచ్చిన స్టేడియాన్ని సొంతం చేసుకునే అవకాశం కూడా ఉదారంగా కల్పించారు. అంతటితో ఆగలేదు లెండి! ఆ స్టేడియాలకయ్యే నిర్వహణ ఖర్చును ఐదేళ్లపాటు ప్రభుత్వమే భరిస్తుందని, ఏడాదికి రూ.2.5 కోట్ల చొప్పున చెల్లిస్తామని కూడా జీవో ఇచ్చేశారు. చిత్రమేంటంటే ఈ ఒప్పందానికి ప్రభుత్వం లేదా ప్రభుత్వ సంస్థలు సహకరించకపోతే... ఐఎంజీ తనకున్న హక్కుల మేరకు తానే నిర్ణయం తీసుకునే వెసులుబాటూ కల్పించారు. ఇక వీటన్నిటితో పాటు మామూలు విద్యా సంస్థలకిచ్చే రాయితీలు, సౌకర్యాలు, పన్ను మినహాయింపులు అన్నీ అదనం. తొలి మూడేళ్లకు కరెంటు, నీటిబిల్లులు రద్దు చేశారు. తర్వాత నాలుగేళ్లూ సగం బిల్లలు కడితే చాలన్నారు. ఔరా!! ఇంత అడ్డగోలు దోపిడీకి దిగిన బాబు... అవినీతిపై పోరాటమంటే ఏమనుకోవాలి? జనమంటే... వ్యవస్థలంటే అంత చులకనా బాబూ!!! ప్రభుత్వం కోరినా సీబీఐ నో! ఈ స్కామ్‌లో అసలు ట్విస్టేమిటంటే 2004లో వైఎస్ హయాంలో అన్ని ప్రాజెక్టులనూ సమీక్షించారు. ఐఎంజీ దగుల్బాజీతనం బయటపడటం తో రద్దు చేశారు. 

భూమి వెనక్కు తీసుకుని... సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారు. 2006లో ఈ మేరకు జీవో ఇచ్చారు. బాబును దోషిగా రుజువు చేసే సకల సాక్ష్యాలూ కళ్ల ముందే కనిపిస్తున్నా... ఆయన్ను అరెస్టు చేయడానికి కాదు కదా, విచారించేందుకు కూడా సీబీఐ ఉత్సాహం చూపించలేదు. ''మా వద్ద తగిన వనరులు లే వు కాబట్టి విచారణ జరపలేం'' అంటూ తప్పించుకుంది. గమనించాల్సిందేంటంటే అప్పుడూ రాష్ట్రంలో సీబీఐ ఇన్‌చార్జిగా ఉన్నది నేటి జేడీ వి.వి.లక్ష్మీనారాయణే! ఎనీ డౌట్స్...? ? అసలు ఎకరా 2 కోట్లు పలుకుతున్న చోట రూ. 50 వేల చొప్పున... అదీ 850 ఎకరాల్ని ఎవరైనా ఇస్తారా? అంతకు మూడేళ్ల కిందటే తన భార్య పేరిట అక్కడున్న భూమిని బాబు ఎకరా రూ.కోటికి విక్రయించిన సంగతి ఆయనకు గుర్తులేదా? ? 400 ఎకరాలకు రిజిస్ట్రేషన్ ఫీజును కూడా మినహాయించారంటే ఏమనుకోవాలి? ? భూమి మాత్రమే కాదు. ఆ కంపెనీకి ఆఫీసు లేదని జాలిపడి గచ్చిబౌలి నుంచి బంజారాహిల్స్ దాకా ఎక్కడ ఎంచుకుంటే అక్కడ ఐదెకరాలిస్తానని చంద్రబాబు ఆఫర్ చేసేశారు. ఎకరా అప్పట్లోనే కనీసం 25 కోట్లు విలువ చేసే బంజారాహిల్స్‌లో ఆ సంస్థ స్థలాన్ని ఎంచుకోగానే రూ. 50 వేల చొప్పునే ఓకే చేసేశారు. ఈ అవినీతికి అసలు హద్దుందా? ? 5 లక్షల రూపాయలతో ఆరంభమైన కంపెనీ రూ. 750 కోట్లతో స్పోర్ట్స్ ప్రాజెక్టు చేపడతామని ముందుకొస్తే ఎలా నమ్మేశారు? ? ఐఎంజీకి అప్పటిదాకా ఒక్క స్టేడియం కట్టిన అనుభవం కూడా లేదని రెవెన్యూ శాఖ చెప్పినా బాబు చెవికెక్కలేదెందుకు? బాబుకు బిల్లీ బినామీ కాబట్టేనా? 3ఇడియట్స్ 

* అడిగేది...ఇచ్చేది...అనుభవించేది
 * బాబు మూడు పాత్రల ముచ్చట
 * తాను వెన్నుపోటు పొడిచిన ఎన్టీఆర్ పేరిటే ట్రస్టు * విద్య, శిక్షణ కోసమని సర్కారుకు దరఖాస్తు * భవన నిర్మాణంపై అప్పట్లోనే ఆరోపణలు
 * అది ఎల్ అండ్ టీ 'క్విడ్ ప్రోకో' అన్న విపక్షం
 * భవనం నిర్మించాక సీఎంగా సడలింపులు
 * పార్టీకి అద్దెకిచ్చి... రాజకీయ శిక్షణగా చెప్పిన తీరు
 * ముడుపులన్నీ విరాళాల రూపంలో? 
* పార్టీ నేతలైనా, కార్పొరేట్లయినా అదే తీరు ఎన్‌టీఆర్ మెమోరియల్ ట్రస్టులో జీవితకాలం ట్రస్టీలెవరయ్యా అంటే... చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరే. మిగతా వాళ్లంతా వచ్చిపోయే వాళ్లే. ఆ ట్రస్టు ఆస్తులకూ వారసులు వాళ్లిద్దరే. కాకుంటే రేపెప్పుడో లోకేశ్ కూడా ఒక యజమాని అవుతాడు. అసలు ఇలాంటి ట్రస్టుకు భూమి కేటాయింపు నుంచి... పన్ను చెల్లింపు... విరాళాలు... కార్యకలాపాలు... అన్నీ అనుమానాస్పదమే. 1997 ఫిబ్రవరి 15న చంద్రబాబు శాశ్వత మేనేజింగ్ ట్రస్టీగా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు ఏర్పడింది. నిజానికి అప్పటికే తన మామ ఎన్‌టీఆర్ విశ్వాసాన్ని (ట్రస్టు) చంద్రబాబు పూర్తిగా కోల్పోయారు. ఆయన్ను వెన్నుపోటు పొడిచి అధికారంలోకి రావటంతో ఆయన బాబుపై రాజకీయ పోరాటానికి దిగి... మధ్యలోనే తనువు చాలించారు.

 అలాంటి బాబు మామ పేరిట ట్రస్టు ఏర్పాటు చేయటమే అన్నిటికన్నా చిత్రం. పేదలకు చదువు, వైద్య సేవలు అందించటం, ప్రకృతి వైపరీత్యాల బాధితులకు సాయం చేయటం దీని ధ్యేయాలు. ట్రస్టును ఆరంభించిన రెండు నెలలకే...తనకు స్థలం కావాలంటూ ట్రస్టీ హోదాలో ప్రభుత్వానికి లేఖ రాశారు. నిజానికి అప్పటికే పార్టీ కార్యాలయం కోసం టీడీపీకి స్థలం కేటాయించాలంటూ 1996 డిసెంబరు 6న ప్రభుత్వానికి రాసింది. బంజారాహిల్స్‌లోని 3,981 గజాల స్థలం కావాలంటే చూసుకోమని ప్రభుత్వం జవాబు కూడా ఇచ్చింది. అయితే పార్టీ లేఖను 'ఉపసంహరింప'జేసిన బాబు... ట్రస్టు పేరిట తన సొంత లేఖను ముందు పెట్టారు. తానే ముఖ్యమంత్రి కాబట్టి అదే స్థలాన్ని ట్రస్టుకు 30 ఏళ్ల లీజుకు అప్పగించేశారు. అనుకూలంగా మరో సవరణ ట్రస్టుకు కేటాయించిన స్థలాన్ని విద్య, శిక్షణ అవసరాలకు మాత్రమే వాడాలి. రాజకీయ అవసరాలకు వాడకూడదు. ఆ అడ్డంకిని దాటడానికి బాబు మరో ఎత్తు వేశారు. ఆ స్థలంలో కట్టే భవనాన్ని రాజకీయ కార్యకలాపాలకు వాడుకోవటానికి అనుమతించాలని మరో లేఖ రాశారు. ముఖ్యమంత్రిగా తానే ఓకే చేసేశారు. దాని ఆధారంగా టీడీపీకి ట్రస్టు భవనాన్ని అద్దెకిచ్చారు. కానీ దాన్ని నేటికీ కొనసాగిస్తూ ఉండటమే విచిత్రం. భవనాన్ని అద్దెకు తీసుకున్నందుకు టీడీపీ రూ.కోటిని ట్రస్టుకు డిపాజిట్ చేసింది. పార్టీ అధ్యక్షుడి హోదాలో భవనాన్ని అనుభవిస్తున్నదీ బాబే. ట్రస్టీ హోదాలో ఆ అద్దెను తీసుకుంటున్నదీ బాబే. అదీ మహా మాయ. క్విడ్ ప్రో కో భవనం... బాబు హయాంలో ఏ టెండరు పిలవాలన్నా ఎల్ అండ్ టీనే.

 ఏ ప్రాజెక్టు కట్టబెట్టాలన్నా ఎల్ అండ్ టీనే. అందుకు ప్రతిఫలంగా ఆ సంస్థ ట్రస్ట్ భవనాన్ని ఫ్రీగా కట్టిందని అప్పట్లో అసెంబ్లీ సాక్షిగానే ఆరోపణలొచ్చాయి. భవన నిర్మాణానికి సంబంధించి బిల్లులు చూపించాలని ఎన్ని సవాళ్లొచ్చినా బాబు నోరెత్తితే ఒట్టు. కానీ బాబుపై విచారణ జరిపేదెవరు... నిగ్గు తేల్చేదెవరు? ఎనీ డౌట్స్...? ? చదువు, శిక్షణ కోసం స్థలం తీసుకుని, టీడీపీకి అద్దెకివ్వటమన్నది ఏ రకమైన సమాజ సేవ? ? రేపెప్పుడైనా టీడీపీని ఆ భవనం ఖాళీ చేయాలని బాబు హుకుం జారీచేస్తే ఆ పార్టీ గతేంటి? కార్యాలయం కూడా ఉండదు కదా? ? పార్టీలో తిరుగుబాట్లూ రాకుండా, తననెవరూ ఎదిరించకుండా బాబు ఇవన్నీ తన గుప్పిట్లో పెట్టుకున్నారన్న మాట నిజం కాదా? ? అసలు ఎన్‌టీఆర్ పేరిట ట్రస్ట్ నడిపించే అర్హత చంద్రబాబుకు ఉందా? ? సామాజిక సేవ కోసమంటూ విదేశాల్లో ట్రస్టు పేరిట విరాళాలు వసూలు చేస్తూ... వాటిని తన కుటుంబ ఆస్తులు పెంచుకోవటానికి ఉపయోగిస్తున్నారనేది అబద్ధమా? ? విదేశాల్లో టీడీపీకి ఇచ్చే విరాళాలను కూడా ఎన్‌టీఆర్ ట్రస్ట్ పేరిటే బాబు వసూలు చేస్తారన్న పార్టీ వర్గాల మాట నిజం కాదా? ? పదవులిచ్చినందుకు టీడీపీ నేతలు, ప్రాజెక్టులు అందుకున్నందుకు కంపెనీలు... ట్రస్ట్‌కు విరాళాల పేరిట బాబుకు ముడుపులిస్తున్నారన్న మాటఅబద్ధమా? 'మద్యం'తో మస్తు మజా 1995లో ఎన్టీఆర్‌ను కూలదోసిన బాబు, ఆయన ప్రవేశపెట్టిన సంపూర్ణ మద్య నిషేధానికీ ఏడాది లోపే తూట్లు పొడిచారు! అంతటితో ఆగకుండా మద్యం కంపెనీలతో కుమ్మక్కై రూ.550 కోట్ల ప్రజా ధనాన్ని కొల్లగొట్టి వాటాల కింద పంచుకున్నారు.

 1997లో ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా లిక్కర్ కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించి, ఇతర రాష్ట్రాలకు సరఫరా చేసే ధర కన్నా తక్కువ కోట్ చేయాలన్న టెండర్ నిబంధనను మద్యం కంపెనీలు ఉల్లంఘించి 100% ఎక్కువ కోట్ చేసినా అనుమతించారు! ఈ ఉదంతంలో అక్రమాలన్నీ నిజమని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్సుమెంటు విభాగం విచారణ జరిపి నిగ్గుదేల్చింది. ఏపీబీసీఎల్ టెండర్ నిబంధనల్ని పాటించకపోవడం వల్ల రూ.550 కోట్ల అదనపు చెల్లింపులు జరిగాయని వెల్లడించింది. ఒక్క మెక్‌డోవెల్ బ్రాందీకే 134% మేర అదనపు చెల్లింపులు జరిగాయని, ఇలా 14 బ్రాండ్లకు అదనంగా చదివించుకున్నారని గుర్తించింది. ఒక్క 1997-98 మధ్యే లిక్కర్, బీర్ కొనుగోళ్లపై రూ.200 కోట్ల మేర ఖజానాకు చిల్లి పడిందని తేల్చింది. అప్పట్లో మద్యం ధరల నిర్ణయాధికారం మొత్తం ముఖ్యమంత్రికే, అంటే బాబుకే ఉండేది. కానీ దీనిపై టీడీపీ హయాంలోనే విజిలెన్సు విభాగం నివేదిక సమర్పించినా చర్యల ఊసే లేదు.
 పైగా ఈ మద్యం కుంభకోణంపై వైఎస్ హయాంలో విచారణ చేయించబోతే, సంబంధిత ఒరిజినల్ ఫైలును కోర్టులో ఈ కేసు విచారణ కొనసాగుతుండగా 2003లోనే, అంటే బాబు హయాంలోనే కాల్చేశారని తేలింది! అలా చేసే అవకాశం ఎవరికుందన్నది, చేయడం వల్ల ఎవరికి లాభమన్నది బహిరంగ రహస్యమే! తప్పుల కుప్ప(o) తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించడానికంటూ ఒక టెక్నాలజీని తెచ్చారు హైటెక్ బాబు. 2000 సంవత్సరంలో ఆధునిక బిందు సేద్యం పేరిట తన సొంత అసెంబ్లీ నియోజకవర్గం కుప్పంలో ఈ ప్రాజెక్టు మొదలుపెట్టారు. దీన్ని అప్పగించింది మాత్రం బీహెచ్‌సీ ఆగ్రో ఇండియాకు. ఇది బిల్లీరావు, పేట్‌రావులదే. దీన్ని ఇజ్రాయెల్ సంస్థగా చూపించి... నాలుగు దశల్లో 30 వేల ఎకరాల్లో డ్రిప్ ఇరిగేషన్‌ను అమలు చేస్తే రూ.36 కోట్లు చెల్లిస్తామని ఒప్పందం చేసుకున్నారు. కానీ 9,572 ఎకరాల్లో చేపట్టినందుకే 20.7 కోట్లు ఇచ్చేశారు.

 నిజానికి ఇందులోనూ బీహెచ్‌సీ చేసిందేమీ లేదు. కిందిస్థాయి అధికారులతోనే పనులు చేయించి... అవన్నీ తానే చేసినట్లు రికార్డుల్లో పేర్కొంది. ఈ బాగోతంపై 2005లో జస్టిస్ టీహెచ్‌బీ చలపతి నేతృత్వంలో ప్రభుత్వం కమిషన్ వేసింది. జరిగిన నేరాన్ని కళ్లకు కడుతూ అది 2007 ఏప్రిల్లో నివేదిక సమర్పించింది. కమిషన్ నివేదిక ముఖ్యాంశాలివీ...: ప్రాజెక్టులో 19 కోట్లు దుర్వినియోగమయ్యాయి. బీహెచ్‌సీ ఆగ్రోకు ఏకపక్షంగా నిధులు మంజూరు చేశారు. అవి దుర్వినియోగమయ్యాయి. రాష్ట్రంలో అప్పటికే అమల్లో ఉన్న ఇజ్రాయెల్ టెక్నాలజీని కొత్తదిగా చెబుతూ మళ్లీ తేవాలని ప్రభుత్వం ప్రయత్నించటమే అక్రమం. పథకాన్ని అమలు చేయాల్సిన పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ మంత్రుల ప్రమేయం లేకుండా బాబే ఏకపక్షంగా చర్చల ప్రక్రియ కానిచ్చేశారు. బాబు అత్యుత్సాహం వల్లే ఆయన ఉప కార్యదర్శి ఈ పథకం కోసం అధికారులపై ఒత్తిడి తెచ్చి నేరపూరిత కుట్రతో ప్రభుత్వాన్ని మోసగించారు. ఇందులో ఇజ్రాయెల్ శాస్త్రవేత్తలెవ్వరూ పనిచేయలేదు. అనుభవం లేని బీహెచ్‌సీకి ఈ పని అప్పగించటమే అక్రమం. బిల్లీరావు, పేట్‌రావు, ఇతర డెరైక్టర్లు, ఉన్నతాధికారులపై కేసులు పెట్టి విచారణ జరపాలి. ముఖ్యమంత్రిగా ఉంటూనే ఆయనో ట్రస్టు పెడతారు. దాన్లో ట్రస్టీ హోదాలో... తనకు భూమినివ్వాలంటూ ఆయనే ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తారు. సీఎం హోదాలో ఆయనే దాన్ని ఓకే చేస్తారు. ఇంకేం! భూమి వచ్చి వాకిట్లో వాలుతుంది. ప్రభుత్వాధినేతగా కొన్ని కంపెనీలపై అమితమైన ప్రేమ చూపిస్తారు. ఏ పనైనా వాటికే అప్పగిస్తారు. ప్రతిఫలంగా... తాను ప్రభుత్వం నుంచి కొట్టేసిన స్థలంలో భారీ భవంతి కట్టిస్తారు. ఇంకేం! భూమి ఫ్రీ... బిల్డింగ్ ఫ్రీ. తరవాత ఆ భవనాన్ని తానే అధ్యక్షుడిగా ఉండే పార్టీకి అద్దెకిస్తారు. తానే ట్రస్టీగా ఉండే ట్రస్టుకు అది అద్దె చెల్లిస్తుంది. తన కుటుంబ యాజమాన్యంలోని ట్రస్టుకు ఆ డబ్బొచ్చి చేరుతుంది. ఆదర్శ రైతునని చెబుతూ పాల వ్యాపారం మొదలుపెట్టారు. మామ చలవతో రెవెన్యూ మంత్రి అయ్యారు.

 తన డెయిరీ కోసం ప్రభుత్వ డెయిరీని బొంద పెట్టారు. ప్రభుత్వ డెయిరీల్ని చిదిమేసే నిర్ణయాలు అతి వేగంగా అమలు చేశారు. ఆ సమాధులపై తన డెయిరీని వేగంగా విస్తరించారు. సొంత మామను వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి కాగానే... తన కంపెనీకి పన్ను రాయితీలు వర్తింపజేశారు. దాన్ని వేగంగా వసూలు చేసుకోవటానికి పాలపై పన్ను పెంచేశారు. రావాల్సిన రాయితీ సొమ్ము చేతికి రాగానే ఏకంగా పన్నునే రద్దు చేశారు. ఆదర్శ రైతుగా కంపెనీలు పెట్టారు. వాటి కోసం ప్రభుత్వ సంస్థల నుంచి రుణాలు తీసుకున్నారు. తరవాత రుణం ఎగ్గొట్టారు. చివరకు ముఖ్యమంత్రి కాగానే తీసుకున్న రుణంలో నాలుగో వంతు మాత్రమే చెల్లించి 'సెటిల్' చేసుకున్నారు. తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీ. అదీ ఆయన సొంత బిజినెస్ లాంటిదే. తన సొంత ప్రయోజనాల కోసం పార్టీని తాకట్టు పెట్టేస్తారు. ఏ కుంభకోణంలోనూ సీబీఐ తనవైపు చూడరాదన్న షరతుతో.. అధికార పార్టీతో చేతులు కలిపేస్తారు. అవిశ్వాసం పెట్టరు. వేరొకరు పెట్టినా మద్దతివ్వరు. కేంద్రంలో సైతం తన ఎంపీలకు కన్నుకొట్టి సర్కారుకు అనుకూలంగా ఓటేయిస్తారు. మూటలిచ్చినవారికే పదవులిస్తారు. లాభం చేకూరిస్తేనే రాజ్యసభకు పంపుతారు.

source:sakshi
Share this article :

0 comments: