చిన్న వయసులో భగవంతుడు ఎంత గుండె ధైర్యం ఇచ్చాడు!! - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చిన్న వయసులో భగవంతుడు ఎంత గుండె ధైర్యం ఇచ్చాడు!!

చిన్న వయసులో భగవంతుడు ఎంత గుండె ధైర్యం ఇచ్చాడు!!

Written By news on Wednesday, May 1, 2013 | 5/01/2013

జగనన్నను అరెస్టు చేస్తారని నాకు గట్టి అనుమానం ఉండింది. ఆరోజు మే 27 సాయంత్రం అరెస్టు వార్త విని ఎంతో బాధపడ్డాను. గుండెల్లో దాచలేనంత బాధ. కాని జగనన్న ముఖం మీద చిరునవ్వు... ‘బాధ పడొద్దు, నాకేం కాదు’ అన్న ఒక సంకేతం ఇచ్చినట్లనిపించింది. ఆరోజు జగనన్న కుటుంబాన్ని చూస్తే చాలా బాధనిపించింది. కన్నతల్లి మనసు బిడ్డ కోసం ఎంత తపిస్తుందో మనం అర్థం చేసుకోగలం.

అంత బాధలో కూడా పేద ప్రజల కోసం, విద్యార్థుల కోసం విజయమ్మ పోరాడుతున్నారు. జగనన్న బయట ఉండి పేద ప్రజలకు మంచి చేస్తూ, వారికి దగ్గరవుతున్నారని కొన్ని పాలక, ప్రతిపక్షాలు కుమ్మక్కై సీబీఐ తోడ్పాటుతో జగనన్నను జైలుకు పంపాయి. ఈ రోజుల్లో తప్పు చేస్తేనే జైలుకి పోవాలని లేదనీ, అధికారంలో ఉన్న రాజకీయపార్టీ, పెద్దపెద్ద వ్యక్తులు చేతులు కలిపితే ఎంత మంచివారైనా సరే జైలుకు పోవడం తప్పదని జగనన్న అరెస్టు విషయంలో స్పష్టం అయింది. 

ఇదేనా ప్రజాస్వామ్యం? జగనన్న తన తండ్రి చనిపోయిన తరువాత నల్ల కాలువలో ఇచ్చిన మాటకు కట్టుబడి ఓదార్పుయాత్ర చేస్తుంటే, అది వారికి నచ్చక పార్టీ నుంచి పొమ్మనలేక పొగబెట్టారు. మాటతప్పని మడమ తిప్పని కుటుంబం కాబట్టే పదవులను సైతం పట్టించుకోకుండా జగనన్న, విజయమ్మ ప్రజలకోసం త్యాగం చేశారు. ఎవరు చేస్తారు ఇంత త్యాగం. (చూస్తూనే ఉన్నాం కదా... కొంతమంది పార్టీనేతలు పదవులకోసం పార్టీలనే అమ్ముకున్నారు!) పార్టీలు కుమ్మక్కై ఎన్ని కుయుక్తులు పన్నినా ప్రజలు జగనన్న వెనుక ఉన్నారు. త్వరలోనే ఆయన బయటకు వస్తారు. 
- ఉమ్ముల్ బనీన్, విజయవాడ

చిన్న వయసులో భగవంతుడు ఎంత గుండె ధైర్యం ఇచ్చాడు!!
మాది వ్యవసాయ కుటుంబం. నా అనుభవంలో రైతు కష్టాలను అర్థం చేసుకున్న ఒకే ఒక్క నాయకుడు వైఎస్సార్‌గారే. ఇన్ని కోట్లమంది ప్రజల మనస్సులో వైఎస్సార్ చిరస్థాయిగా ఉన్నారంటే ఆయన అవలంబించిన రైతుహిత విధానాలే కారణం. ఆ మహానేత తనయుడు జగన్‌ని ఇప్పుడు కుటిల రాజకీయ నాయకులంతా కలిసి వేధింపులకు గురిచేస్తుండడం మాకెంతో బాధకలిగిస్తోంది. 

ఆ మధ్య జరిగిన బై ఎలక్షన్లలో జగన్‌గారు నాలుగు రోజులు కోవూరులో ఉండి ప్రచారం చేశారు. ఆఖరిరోజు రాత్రి మా బంధువు వినోద్‌రెడ్డి ఇంట్లో బసచేశారు. వినోద్‌రెడ్డి నాకు ఫోన్ చేసి, ‘జగన్‌గారు ఈరోజు మన ఇంట్లోనే ఉన్నారు. రేపు ఉదయం రండి’ అని చెప్పారు. మర్నాడు ఉదయాన్నే ఐదు గంటలకల్లా నేను కోవూరు చేరుకున్నాను. తొమ్మిది గంటలకు జగన్‌ను చూశాను.

చూశాక, ‘ఇంత చిన్న వయసులో భగవంతుడు ఎంత గుండె ధైర్యం ఇచ్చాడు..!’ అని మనసులో పదేపదే అనుకున్నాను. ఆయనతో కలిసి ఫొటో కూడా తీయించుకున్నాను. అది నాకు మరపురాని రోజు. ఏ తప్పూ చేయని జగన్‌ని జైలుపాలు చేసి కాంగ్రెస్ అధిష్టానం ఆయన్ని రాజకీయంగా ఇబ్బందిపెట్టాలని చూసింది.

అయితే ఆ ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు ప్రజలు బుద్ధి చెప్పారు. అయినా ఆ పార్టీకు బుద్ధి రాలేదు. జగన్ త్వరలోనే బయటికి వస్తారు. ఆ రోజున రాజకీయంగా ఆయన మరింత బలపడతారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను.
- డి.గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు
Share this article :

0 comments: