రాజకీయ బాసుల మాటలే వల్లించిన సీబీఐ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాజకీయ బాసుల మాటలే వల్లించిన సీబీఐ

రాజకీయ బాసుల మాటలే వల్లించిన సీబీఐ

Written By news on Friday, May 10, 2013 | 5/10/2013

* సుప్రీం ఆవరణలోనే తీర్పుపై సీబీఐ న్యాయవాది వ్యాఖ్యలు
* ‘నాలుగు నెలల గడువు’ను పొడిగిస్తామంటూ ముందే కూత
* ఎవరో చెప్పమన్నట్టుగా రాజకీయ వ్యాఖ్యలు చేసిన అశోక్‌భాన్
* ఆది నుంచీ జగన్ కేసును నడిపింది రాజకీయ ప్రయోజనాలే
* కేసు వేసిన ఎమ్మెల్యేకు మంత్రిపదవి, అదే అసలు క్విడ్ ప్రో కో
* టీడీపీ-కాంగ్రెస్ కూడబలుక్కుని ఒకే పత్రాలతో కేసు
* తీర్పు వెలువడిన దగ్గర్నుంచీ ప్రత్యర్థి పార్టీలా మారిన సీబీఐ
* ఒక్కో కోర్టులో ఒక్కో మాట; ఒక్కో అఫిడవిట్లో ఒక్కో తీరు
* సింగిల్ చార్జిషీటు గాలికి; సుప్రీంకిచ్చిన హామీ తుంగలోకి
* జగన్‌ను కనీసం ప్రశ్నించకుండానే మూడు చార్జిషీట్లు
* మరో 24 గంటల్లో కోర్టుకు హాజరవుతారనగా అరెస్టు

‘‘నాలుగు నెలలే అని ఏముంది? (దర్యాప్తు పూర్తయ్యేందుకు) ఆరు నెలలు కూడా పట్టొచ్చు. మా అధికారులు విదేశాల్లో ఉన్నారు. అక్కడి నుంచి సమాచారం రాకుంటే గడువు పొడిగించాలని అడుగుతాం. అందుకు కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాం. అవసరమైతే మరో పిటిషన్ వేస్తాం’’
- సుప్రీంకోర్టు తీర్పు వెలువరించాక కోర్టు ఆవరణలోనే ఫక్తు రాజకీయ నాయకుడిలా సీబీఐ న్యాయవాది చేసిన వ్యాఖ్యలివి!

(సాక్షి ప్రత్యేక ప్రతినిధి) : ‘‘స్వతంత్రంగా దర్యాప్తు చేయాల్సిన సీబీఐ పంజరంలో చిలుకలా మారిపోయింది. కేంద్రంలోని ప్రభుత్వాన్ని తన యజమానిగా భావిస్తూ, యజమాని చెప్పిన చిలుక పలుకులనే వల్లిస్తోంది’’ 
ఇవీ... బొగ్గు కుంభకోణంలో సీబీఐ వ్యవహారశైలిపై సర్వోన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు.

‘‘అవును! సుప్రీంకోర్టు ఏం చెప్పిందో అది అక్షరాలా నిజం’’
ఇది సుప్రీం వ్యాఖ్యలపై సీబీఐ డెరైక్టరు రంజిత్ సిన్హా
గురువారం చేసిన వ్యాఖ్య.


దీనర్థమేంటి? సీబీఐ స్వతంత్రంగా వ్యవహరించటం లేదనేగా? కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టల్లా ఆడుతోందనేగా? దాన్ని సీబీఐ కూడా ‘‘ఔను! నిజమే’’ అంటూ ఒప్పుకున్నట్టేగా? మరి కేంద్రంలోని రాజకీయ బాసులు చెప్పినట్టల్లా ఆడుతున్నది ఒక్క బొగ్గు కుంభకోణంలోనేనా? కేంద్ర ప్రభుత్వానికో, దాన్ని నడిపిస్తున్న కాంగ్రెస్ పార్టీకో ఇబ్బంది కలిగించే ప్రతి వ్యవహారంలోనూ ఇలాగే జరిగే అవకాశం నూరు శాతం ఉన్నట్టేగా? సీబీఐని తన చెప్పుచేతల్లో ఆడించే అవకాశం ఉన్నప్పుడు తనను ఇబ్బంది పెట్టే అంశాల్లో కేంద్రం గానీ, కాంగ్రెస్ పార్టీ గానీ వేలు పెట్టకుండా ఉంటాయని అనుకోగలమా? ప్రజలకు ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్ అధిష్టానాన్ని ధిక్కరించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారంలో కేంద్రంతో సీబీఐ కుమ్మక్కయి అది చెప్పినట్టల్లా చేస్తోందనటానికి ఎన్ని ఉదాహరణలు లేవు!! అంతెందుకు? గురువారం ఆయన బెయిలుపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించి కొన్ని నిమిషాలు కూడా గడవక ముందే... కోర్టు ఆవరణలోనే సీబీఐ న్యాయవాది చేసిన వ్యాఖ్యలు ఈ తీరును కళ్లకు కట్టడం లేదా? నాలుగు నెలల్లోగా దర్యాప్తు ముగించాలని, ఆ తరవాత పిటిషనర్ బెయిలు కోసం దరఖాస్తు చేసుకోవచ్చని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఆయన చాలా తేలికగా కొట్టిపారేశారు.

‘‘నాలుగు నెలలే అని ఏముంది? ఆరు నెలలు కూడా పట్టొచ్చు. మా అధికారులు విదేశాల్లో ఉన్నారు. అక్కడి నుంచి సమాచారం రాకుంటే గడువు పొడిగించాలని అడుగుతాం. అందుకు కావాల్సిన గ్రౌండ్ ప్రిపేర్ చేస్తాం. అవసరమైతే మరో పిటిషన్ వేస్తాం’’ అంటూ ఫక్తు రాజకీయ నాయకుడిలా మాట్లాడారు. సీబీఐని పంజరంలో పెట్టి దాని చేత పలికిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానివే ఈ పలుకులని చెప్పటానికి ఇంకా ఏం కావాలి?

వేల కోట్లంటూ వితండ వాదన
సీబీఐ స్థాయి వాదనంటే ఎలా ఉండాలి? నిజం చెప్పేట్టుగా ఉండాలి. కనీసం జనం నమ్మేట్టుగానైనా ఉండాలి. తన వాదనల్లో కొంతైనా నిజముందని దర్యాప్తులో తేల్చగలగాలి. కానీ జగన్‌మోహన్‌రెడ్డి వ్యవహారంలో కింది కోర్టు నుంచి పై కోర్టు వరకూ సీబీఐ చెప్పిన లెక్కలు వింటే ఎవరికైనా మతిపోవడం ఖాయం. ఇది వేల కోట్ల వ్యవహారమని ఒకసారి, 40 వేల కోట్ల రూపాయల కుంభకోణమని ఒకసారి, 50 వేల కోట్ల రూపాయల కేసని మరోసారి... ఇలా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు సీబీఐ న్యాయవాది.

బహుశా! న్యాయశాస్త్రమంటే ఏంటో తెలియని సామాన్యులు సైతం ఇలా నోటికొచ్చినట్టు మాట్లాడే సాహసం చేయరేమో!! పోనీ సీబీఐ తాను చెప్పినదేదైనా దర్యాప్తులో తేల్చిందా అంటే... అలాంటి పరిస్థితే లేదు. ఎందుకంటే ఇప్పటిదాకా సీబీఐ దాఖలు చేసిన 5 చార్జిషీట్ల ప్రకారం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంస్థల్లోకి వచ్చిన పెట్టుబడులుగా అది చూపించిన మొత్తం దాదాపు రూ.1,030 కోట్లు. ఇంకా 2,500 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి తాము దర్యాప్తు జరపాల్సి ఉందని సుప్రీంకోర్టుకు తాజాగా ఇచ్చిన నివేదికలో సీబీఐ స్వయంగా పేర్కొంది.

ఇప్పటిదాకా వేసిన చార్జిషీట్లలో పెట్టుబడులుగా వచ్చిన మొత్తాన్ని సీబీఐ 1,030 కోట్లుగా చూపించింది. కానీ ఈ లెక్కలను చూసినప్పుడు ఔరా... ఇంత దారుణమా అనిపించకమానదు. ఎందుకంటే మొదటి చార్జిషీటు ప్రకారం అరబిందో, హెటెరో సంస్థలు జగన్ కంపెనీల్లో పెట్టిన పెట్టుబడులను రూ.29.5 కోట్లుగా సీబీఐ పేర్కొంది. రెండో చార్జిషీట్లోనైతే నలుగురు వ్యక్తులు 39.5 కోట్లు పెట్టుబడులుగా పెట్టినట్టు తెలిపింది.

మూడో చార్జిషీట్లో రాంకీ సంస్థ రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టినట్టు, ఐదో చార్జిషీట్లో దాల్మియా సంస్థ రూ.95 కోట్లు పెట్టుబడి పెట్టినట్లు తెలియజేసింది. కానీ వాన్‌పిక్ అధిపతి నిమ్మగడ్డ ప్రసాద్ రూ.854 కోట్లు పెట్టుబడి పెట్టినట్టుగా నాలుగో చార్జిషీట్లో పేర్కొంది. ఇదెంత అసమంజసమంటే... ప్రసాద్ ఒకసారి పెట్టుబడి పెట్టి, దానిపై లాభం సంపాదించి ఆ లాభంతో సహా కొంత అసలును మళ్లీ పెట్టుబడి పెడితే, ఆ రెండింటినీ కలిపి లెక్కించటమనేది సీబీఐ తీరుకు పరాకాష్ట. మొదట జగన్ సంస్థల్లో రూ.280 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టిన ప్రసాద్, తరవాత దాన్లో రూ.250 కోట్ల విలువైన వాటాను రెట్టింపు కన్నా అధిక లాభంతో విక్రయించారు.

అలా లాభంగా వచ్చిన మొత్తాన్ని రీ ఇన్వెస్ట్ చేశారు. ఇంతా చేస్తే ఆయన నికరంగా పెట్టిన పెట్టుబడి రూ.230 కోట్లే. కానీ సీబీఐ రూ.854 కోట్లుగా పేర్కొంటూ చార్జిషీటు వేయడమే విచిత్రం. ఈ లెక్కన చూస్తే సీబీఐ వేసిన చార్జిషీట్లలో పేర్కొన్న లావాదేవీల సొమ్ము నికరంగా 400 కోట్ల రూపాయలు. మరి 40 వేల కోట్లు... 50 వేల కోట్ల రూపాయలంటూ టీడీపీ నేతల మాదిరిగా సీబీఐ ఎందుకు ఆరోపణలు చేసినట్టు? తెలుగుదేశానికైతే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలన్న రాజకీయ అనివార్యత ఉంది. మరి సీబీఐకి ఏముంది? తన రాజకీయ బాసులకు సహకరించాల్సిన అనివార్యతా? అధికార పార్టీ ఆదేశాలను, వాటికి కొమ్ముకాసే తెలుగుదేశం వంటి రాజకీయ పార్టీలను సైతం మోసి మోసి నడుం వంగిపోయిన సీబీఐని ఈ వ్యవస్థ ఇంకా ఎన్నాళ్లు భరించాలి?

ఆది నుంచీ అరాచకమే...: 
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై సాగుతున్నది రాజకీయ కేసు అనడానికి ప్రత్యేక ఉదాహరణలేవీ చెప్పాల్సిన పని లేదు. కేసు వేసిన శంకర్రావుకు మంత్రిపదవి రావడం నుంచి... సోనియాగాంధీ వేయమన్నందుకే తాను కేసు వేశానని ఆయన స్వయంగా చెప్పడం వరకూ అన్నీ అలాంటి ఉదంతాలే. ఆర్‌వోసీ పత్రాలనే సాక్ష్యాలంటూ శంకర్రావుకు అందించిన తెలుగుదేశం నేతలు... అవే జిరాక్స్ కాపీలతో తాము కూడా కేసు దాఖలు చేయటం తెలియనిదేమీ కాదు. ఇక ఈ కేసులో తీర్పునిచ్చిన జడ్జి రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ అయ్యారు! తెలుగు కూడా రాని వ్యక్తికి ఆ పదవి ఎందుకు ఇచ్చారంటూ ఈ ఉదంతంపై కేసు దాఖలైంది కూడా! తీర్పు వచ్చింది మొదలు... ప్రత్యేక బృందాలతో సోదాలు, ఇన్వెస్టర్లను భయభ్రాంతుల్ని చేయటం వంటి సీబీఐ చర్యలు పంజరం పాలిటిక్స్‌ను కళ్లకు కట్టనే కట్టాయి.

ఇక మరో 24 గంటల్లో జగన్ కోర్టుకు హాజరవుతారనగా... అలా జరిగితే ఆయనకు బెయిలు మంజూరై ఇక ఎన్నడూ తాము అరెస్టు చేయలేమోనని భయపడి సీబీఐ అరెస్టుకు దిగడం తెలియనిదేమీ కాదు. దర్యాప్తు మొదలయ్యాక సుమారు 9 నెలల పాటు ఆయన్ను కనీసం ప్రశ్నించకుండా... మూడు చార్జిషీట్లు వేసేశాక... అరెస్టు చేయకుండా బయట ఉంచితే దర్యాప్తునకు ఆటంకం కలుగుతుందని కోర్టుకు చెప్పటమే అతి పెద్ద విచిత్రం. ఆ తరవాత దర్యాప్తును సాగదీస్తూ... ముక్కలు ముక్కలుగా చార్జిషీట్లు వేస్తూ... వైఎస్సార్ కుటుంబ పరువు ప్రతిష్టలే లక్ష్యంగా ప్రత్యర్థి మీడియాతో కుమ్మక్కయి కథనాలు వండటం... వేల కోట్ల రూపాయలంటూ ఆరోపణలు చేయటం... రకరకాలుగా జగన్‌ను వే ధించటం... ఇవన్నీ రాజకీయ డ్రామాలో భాగంగా దర్యాప్తు జరుగుతున్న వైనాన్ని కళ్లకు కట్టినవే.

ఇవన్నీ చూసినవారికి అనిపించేదొక్కటే. ఇపుడు దర్యాప్తు జరగాల్సిన అవసరం గానీ, అంశం గానీ ఏదైనా ఉందంటే అది రాజకీయ బాసులతో సీబీఐ కుమ్మక్కుపై జరగాలి! రాజకీయంగా ఎదుగుతున్న నాయకుడిని, పార్టీని అణచివేయటానికి సాగిస్తున్న కుటిల నీతిపై జరగాలి. జనం నుంచి జగన్‌మోహన్‌రెడ్డిని దూరం చేయలేక చతికిలపడ్డ చేవచచ్చిన నాయకులకు... వారికి తోడుగా నిలిచిన దర్యాప్తు సంస్థలకు మధ్య ఉన్న రహస్య అవగాహనపై జరగాలి. కానీ దురదృష్టమేమిటంటే దర్యాప్తు చేయాల్సిన సంస్థే ఈ నేరంలో నిండా మునిగిపోయి ఉంది. మరి దీనిపై దర్యాప్తు చేయాల్సిందెవరు? నేరాన్ని మించిన ఈ ఘోరానికి రాష్ట్ర ప్రజలే సాక్షి.

కోర్టుల్లో ఇలా కూడా చెప్పొచ్చా?
సుప్రీంకోర్టే కానక్కరలేదు. మేజిస్ట్రేటు కోర్టు నుంచి మొదలు పెడితే ఏ కోర్టులోనైనా లిఖితపూర్వకంగా ఒక మాట చెబితే అదే ఫైనల్. అలా ప్రమాణపూర్వకంగా దాఖలు చేసే అఫిడవిట్‌పై మాట మార్చే అవకాశం లేనే లేదు. కానీ దేశంలో అత్యున్నత స్థాయి దర్యాప్తు సంస్థయిన సీబీఐ లిఖితపూర్వకంగా ఒక కోర్టులో చెప్పింది మరో కోర్టులో చెప్పడం లేదు. సాక్షాత్తూ సుప్రీంకోర్టుకిచ్చిన హామీని సైతం పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టు తీర్పుకూ వక్రభాష్యాలే చెబుతోంది. అరబిందో ఫార్మా కేసులో మాత్రమే జగన్‌ను అరెస్టు చేశామని కింది కోర్టుకు చెప్పి... వాన్‌పిక్ కేసులోనే ఆయన్ను అరెస్టు చేశామని హైకోర్టుకు చెప్పింది. లేదు లేదు... దర్యాప్తు చేయకుండా మిగిలిపోయిన ఏడు అంశాల్లోనే ఆయన్ను అరెస్టు చేశామని సాక్షాత్తూ సుప్రీంకోర్టుకు తెలియజేసింది. అంతే కాదు, దర్యాప్తును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ఒకే తుది చార్జిషీటు దాఖలు చేస్తామని గతేడాది అక్టోబర్లో సీబీఐ తరఫున సీనియర్ న్యాయవాది పరాశరన్ సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు. ఆ మేరకు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు.

దాన్ని తీర్పులో ప్రస్తావించిన సుప్రీంకోర్టు... సీబీఐ చెప్పినట్టుగా దర్యాప్తు పూర్తిచేసి తుది చార్జిషీటు వేశాక జగన్ బెయిలు కోసం దరఖాస్తు చేయొచ్చని ఉత్తర్వులిచ్చింది. ఈ ఉత్తర్వులు వెలువడింది గతేడాది అక్టోబరు 5న. కానీ ఇటీవలే సీబీఐ మరో చార్జిషీటు దాఖలు చేసింది. చిత్రమేంటంటే అది తుది చార్జిషీటు కాదు. 5వది! మరి సుప్రీంకిచ్చిన హామీ సంగతేంటి? దాన్ని కోర్టు సైతం తీర్పులో ప్రస్తావించింది కదా? ఇలా కోర్టుకిచ్చిన హామీని, కోర్టు తీర్పును సైతం పట్టించుకోకపోయినా సీబీఐకి సాగిపోతుండటాన్ని ఏమనుకోవాలి?
Share this article :

0 comments: