ఆత్మహత్యలు వద్దు-మంచిరోజులు వస్తాయి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఆత్మహత్యలు వద్దు-మంచిరోజులు వస్తాయి

ఆత్మహత్యలు వద్దు-మంచిరోజులు వస్తాయి

Written By news on Sunday, May 19, 2013 | 5/19/2013

కరీంనగర్: టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు మాదిరిగా రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ విమర్శించారు. సిరిసిల్లలో ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను పరామర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజకీయం చేయడానికి తాను ఇక్కడకు రాలేదని చెప్పారు. నేతన్నలకు ధైర్యం చెప్పడానికి వచ్చానన్నారు. వైఎస్ ఐదేళ్లపాలనలో ప్రతి ఒక్కరికీ మేలు జరిగిందని గుర్తు చేశారు. వైఎస్ హయాంలో ఆహార, ఉద్యోగ, పెన్షన్, ఆవాస్ భద్రత ఉండేదని వివరించారు. ఇప్పుడు ఆ మేలు జరగడం లేదని తెలిపారు. 

బాబు హయాంలో 8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచితే, ఈ ప్రభుత్వం 4 సార్లు పెంచిందన్నారు. వైఎస్ హయాంలో ఆర్టీసీ, విద్యుత్ ఛార్జీలు, పన్నులు పెంచలేదని గుర్తు చేశారు. నేతన్నలను ప్రత్యేక పథకాలతో వైఎస్ ఆదుకున్నారని చెప్పారు. వైఎస్ ఏర్పాటు చేసిన చేనేత టెక్స్ టైల్ పార్క్ ఇప్పుడు నిరుపయోగంగా మారిందన్నారు. ప్రతి మనిషి గుండె చప్పుడు తెలిసిన వ్యక్తి వైఎస్ఆర్ అని చెప్పారు. ఎవరు ఏది కావాలన్నా అడగక ముందే నెరవేర్చారని పేర్కొన్నారు. ఆత్మహత్యలు ఎవరూ చేసుకోవద్దని, మంచిరోజులు వస్తాయని చేనేత కార్మికులకు ధైర్యం చెప్పారు. వైఎస్ సువర్ణయుగాన్ని జగన్ బాబు తీసుకొస్తారన్నారు. రాష్ట్రంలో చేనేత కార్మికులు ధైర్యంగా ఉండాలన్నారు. 312 కోట్ల రూపాయల రుణ మాఫీ చేయాలని బడ్జెట్ లో వైఎస్ పెట్టారని, దానిని కిరణ్ ప్రభుత్వం నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల సమస్యలను శాసనభలో మాట్లాడతానని చెప్పారు.
Share this article :

0 comments: