రాష్ట్ర ప్రజలంతా...జగనన్నకు అండగా ఉన్నారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రాష్ట్ర ప్రజలంతా...జగనన్నకు అండగా ఉన్నారు

రాష్ట్ర ప్రజలంతా...జగనన్నకు అండగా ఉన్నారు

Written By news on Friday, May 17, 2013 | 5/17/2013

నాకు పాలిటిక్స్ గురించి పెద్దగా ఏమీ తెలియదు. అలాంటిది వైఎస్సార్ సీఎం అయ్యాక, ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలని చూశాక ప్రజానాయకుడంటే ఇలా ఉండాలి అనుకున్నాను. ప్రతి నాయకుడూ ఆయనలాగే ఉంటే రాజకీయాలపై ప్రజలకు ఉండే ఉదాసీనభావం తొలగిపోతుంది. నిజానికి వైఎస్సార్‌ని చూస్తే పొలిటీషియన్‌లా కనిపించరు. మన కుటుంబ సభ్యుడిగా అనిపిస్తారు. ప్రజల మీద ఆయనకున్న ప్రేమ, వాత్సల్యం ఎప్పటికీ ఎవ్వరమూ మరిచిపోలేనివి. ఆయన పరిపాలనలో ప్రజలంతా సుభిక్షంగా, ప్రశాంతంగా జీవనం సాగిస్తున్న తరుణంలో దేవుడు కూడా తనకు అలాంటి మహానేత కావాలనుకున్నాడేమో, ఆయన్ని మన నుండి దూరం చేశాడు. 

ఆ సమయంలో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయింది. ఇక మన జీవితంలోకి వెలుగు రాదు, అలాంటి నాయకులు ఇక రారేమోనని ప్రజలు ఆందోళన చెందుతున్న సమయంలో, సన్నటి సూర్యకిరణంలా జగన్ రూపంలో వెలుగొచ్చింది. జగన్‌లో ఆ మహానేతను చూసుకున్నారంతా. ప్రజలకు, ఆ కుటుంబానికి మధ్యన ఇలా బంధం వేసింది దేవుడే తప్ప, ఈ స్వార్థపరులైన నాయకులు కాదు. వైఎస్సార్‌ని జగన్‌లో చూసుకుని సంతోషించే సమయంలో ఆయన్ని జైలుకు పంపడంతో ప్రజలంతా ఆవేదనకు లోనయ్యారు. ఆ కుటుంబం మీద కనీస మానవత్వం మరచి, పదవుల కోసం ఎవరు ఎంత గొంతు చించుకుని ఎన్ని అభాండాలు వేసినా ప్రజలు నమ్మేస్థితి లేదు. 

జగన్‌ని ఎంత అణగదొక్కాలని చూస్తే, అంతగా... ఉవ్వెత్తు కెరటంలా ఎగసి పైకొస్తాడు. విజయమ్మ కన్నీళ్లు పెట్టుకుంటే ప్రతి మహిళ కళ్లల్లో నీళ్లు వస్తాయి. భర్తని పోగొట్టుకుని, ఉన్న ఇద్దరు బిడ్డల్లో ఒకరిని జైలుపాలు చేసుకుని, మరొకరిని ప్రజల మధ్యకు పంపించిందా తల్లి. ఆ కుటుంబం మీద నిందవేసే నాయకుల్లారా... ఆ తల్లి కన్నీళ్లే మీకు శాపంగా మారతాయని గుర్తుంచుకోండి. ఈ రాష్ట్రమంతా జగన్ వెంట, ఆయన కుటుంబసభ్యుల వెంట అండగా ఉంది. 

- జి.లీలావతి, ఇసిఐల్, హైదరాబాద్

రెండు న్యాయాల పాలనలో ఉన్నాం!

స్వాతంత్య్రం రాక మునుపు బ్రిటిష్‌వారు, తమను వ్యతిరేకించినవాళ్లను జైల్లో పెట్టించారని పుస్తకాల్లో చదివాను. కానీ ఇప్పుడు కళ్లారా చూస్తున్నాను. అవును. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు ఆనాటి అరాచకాన్ని తలపిస్తున్నాయి. నాకు ఊహ తెలిసినప్పటి నుంచీ కాంగ్రెస్ పార్టీ అంటే చాలా గౌరవం, ఇష్టం. కానీ ఇప్పుడు జగనన్న విషయంలో ఇది కాంగ్రెస్ పాలన కాదు, బ్రిటిష్ రాజ్యం అనిపిస్తోంది. 

వాస్తవంగా కొంతమంది మీద ఒక అభియోగం మోపినప్పుడు, ఆ కేసుకి సంబంధించిన అందరికీ చట్టం ఒకేలా వర్తిస్తుంది. అంతేకానీ కొంతమందికి ఒకరకంగా, కొంతమందికి మరొక రకంగా ఉండదు. మరి జగన్‌ను, మరికొంతమందిని మాత్రమే జైల్లోపెట్టి, మిగతావారిని బయట ఉంచింది ఈ ప్రభుత్వం. కోర్టువారికి ఈ విషయం ఎందుకు అర్థం కావడం లేదో, వారు సీబీఐని ఎందుకు ప్రశ్నించడం లేదో నాకు అర్థం కాని విషయం. నిజంగా జగన్ సాక్షులను భయపెట్టే వ్యక్తే అయితే, ఆయన బయట ఉన్నప్పుడే భయపెట్టి ఉండాలి. సీబీఐ కూడా ఇంతవరకు ఒక్కర్ని కూడా ఆయన భయపెట్టినట్టు రుజువులు చూపలేకపోయింది. ‘జగన్‌కు ఇప్పట్లో బెయిల్ రానే రాదు’ అని ఏప్రిల్ 5న చంద్రబాబు అన్నట్లు వార్తాపత్రికల్లో చదివాను. అసలు ఆయనకి ఈ విషయం ఎలా తెలుసని నా సందేహం. నాకే కాదు, రాష్ట్రంలోని ప్రతి వ్యక్తికీ ఈ సందేహం వచ్చింది. 

అంటే చంద్రబాబు కాంగ్రెస్‌తో చేతులు కలిపారని స్పష్టంగా అర్థమవుతోంది. ఆయన తన పాదయాత్రలో ‘‘గేదెకు గడ్డి వేస్తే పాలు ఇస్తుంది కానీ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గడ్డి అనే తమ ఓటును దున్నపోతుకు వేశారు’’ అని కూడా చంద్రబాబు అన్నట్లు అదేరోజు చదివాను. అటువంటప్పుడు మొన్న అన్ని పార్టీలూ కలిసి అవిశ్వాసం పెడితే, చంద్రబాబుగారు ఎందుకు మద్దతు ఇవ్వనట్లు? దీన్నిబట్టి చంద్రబాబు, కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందం కుదుర్చుకున్నారని స్పష్టమౌతోంది. అసలు చంద్రబాబుకి విశ్వసనీయత అంటే అర్థం తెలిస్తే, మామగారిని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చుండేవారే కాదు. దీన్నిబట్టి అర్థమౌతున్న ఇంకో విషయం ఏమిటంటే, చంద్రబాబు అధికారం కోసం ఎన్ని తప్పులైనా చేస్తారని.

ఇక, ‘జగన్‌కు డబ్బు పిచ్చి పట్టింది’ అని ఎల్లో మీడియా రాస్తోంది. డబ్బే ముఖ్యమనుకుంటే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించకుండా మౌనంగా తన పని తాను చేసుకుని ఉంటే, ఈ కేసులు ఉండేవి కాదని ఆయనకు మాత్రం తెలీదా. తెలిసీ జగన్ తను ప్రజలకు ఇచ్చినమాటకు కట్టుబడ్డారు. కష్టాలు కొనితెచ్చుకున్నారు. జగన్‌కి డబ్బు ముఖ్యం కాదు, మాట ముఖ్యం, ప్రజలు ముఖ్యం. ఎవరు ఎటువైపు ఉన్నా ప్రజలందరూ జగన్ వెంటే ఉన్నారు. ఒక సగటు మనిషిగా ప్రజలందరూ ఏం మాట్లాడుకుంటారో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాను. జగన్ విడుదల కోసం రాష్ట్రప్రజలంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. 

- న్యాయవాది, నెల్లూరు
Share this article :

0 comments: