ఇది బాబు, కిరణ్‌ల నాటకం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » ఇది బాబు, కిరణ్‌ల నాటకం

ఇది బాబు, కిరణ్‌ల నాటకం

Written By news on Tuesday, May 21, 2013 | 5/21/2013

మంత్రులను తప్పించడంపై వైఎస్సార్ సీపీ నేత గట్టు విమర్శ
చంద్రబాబు అండతోనే కిరణ్ మంత్రులను సాగనంపారు
బాబు ఏది చెబితే కాంగ్రెస్ అధిష్టానం అదే చేస్తోంది..
మద్యం ముడుపుల కేసులో మంత్రివర్గం నిర్ణయమన్న బాబుకు..
26 జీవోల్లో మంత్రివర్గ నిర్ణయం కనిపించలేదా?
అవిశ్వాసానికి టీడీపీ మద్దతిచ్చి ఉంటే బాబు జైల్లో ఉండేవారు
జగన్‌ను కేసుల్లో ఇరికించాలనే దుర్బుద్ధే మంత్రులను కాల్చేస్తోంది

సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ అధిష్టానం అండదండలతో సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలిసి ఆడుతున్న నాటకంలో భాగమే మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డిల రాజీనామా అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గట్టు రామచంద్రరావు విమర్శించారు. సోమవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబు ఢిల్లీ వెళ్లడం, అక్కడ కాంగ్రెస్ వారితో మాట్లాడుకుని రావడం, హైదరాబాద్‌కు వచ్చాక అవినీతి మంత్రులను తొలగించాలని డిమాండ్ చేయడం ఇదంతా ఒక డ్రామా అని చెప్పారు. చంద్రబాబు ఏది చెబితే కాంగ్రెస్ అధిష్టానం అదే చేస్తోందని, కిరణ్ దానిని అమలు చేస్తున్నారని అన్నారు. ఆయన హయాంలో జరిగిన మద్యం ముడుపుల కేసులో అది మంత్రివర్గ ఉమ్మడి నిర్ణయమని చెప్పి బయటపడిన చంద్రబాబుకు.. ఇప్పటి 26 జీవోల్లో మాత్రం ఉమ్మడి నిర్ణయం అనేది కనిపించడంలేదా అని ప్రశ్నించారు.

కిరణ్ ముఖ్యమంత్రిగా ఉండాలి.. ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండాలి.. కానీ మంత్రులను సాగనంపాలి అని బాబు భావిస్తున్నారని అన్నారు. ప్రభుత్వానికి ఏమీ కాదని చంద్రబాబు ఇచ్చిన భరోసాతోనే కిరణ్ ఇద్దరు మంత్రుల రాజీనామాలు కోరారని తెలిపారు. అసలు క్విడ్ ప్రొ కో(ఫలానికి ప్రతిఫలం) ఒప్పందం చంద్రబాబు, కిరణ్‌కు మధ్యనే జరిగిందన్నారు. ‘నేను నీ ప్రభుత్వాన్ని పడగొట్టను. నువ్వు నా మీద సీబీఐ ఎంక్వయిరీ రాకుండా చూడు’ అని వారిద్దరూ కూడబలుక్కున్నారని అన్నారు. ఈ ఒప్పం దాల్లో భాగంగానే అసెంబ్లీలో కిరణ్ సర్కారుపై అవిశ్వాస తీర్మానానికి టీడీపీ మద్దతివ్వలేదని చెప్పారు. ఆరోజు కనుక అనుకూలంగా ఓటేసి ఉంటే చంద్రబాబు ఈ పాటికి జైల్లో ఉండేవారని తెలిపారు. నిజంగా బాబు తనకు తానుపునీతుడను అనుకుంటే ఆయన తొమ్మిదేళ్ల పాలనలో జరిగిన అవినీతిపై విచారణకు సిద్ధపడాలని సవాలు విసిరారు.

లోకేశ్‌ను చదివించిందెవరు?
తండ్రి గురించి గొప్పగా మాట్లాడుతున్న లోకేశ్ బాబుకు పదో తరగతిలో వచ్చిన మార్కులెన్నో చెప్పాలని, అసలు మ్యాట్‌లో వచ్చిన మార్కులెన్నో బయట పెట్టాలని గట్టు డిమాండ్ చేశారు. అత్తెసరు మార్కులు వచ్చిన లోకేశ్‌ను ‘సత్యం’ రామలింగరాజు స్టాన్‌ఫోర్డ్ యూనివర్శిటీలో డబ్బు కట్టి చదివిం చిన మాట నిజం కాదా అని గట్టు ప్రశ్నించారు. అవి నీతిపై పోరాటం పేరుతో బాబు ఢిల్లీ వెళ్లి.. పాడిన పాటే మళ్లీ పాడుతున్నారన్నారు. గతంలో వైఎస్‌పై అచ్చేసిన పుస్తకాలే మళ్లీ పంచారని విమర్శించారు. బాబు పాలనపై సీపీఎం ప్రచురించిన ‘బాబు జమానా-అవినీతి ఖజానా’తో పాటుగా బీజేపీ వేసిన ‘అవినీతి చార్జిషీటు’ ప్రతులను కూడా పంచి ఉంటే బాగుండేదని ఎద్దేవా చేశారు.

మంత్రులు కళంకితులు కాదు
ఎట్టి పరిస్థితుల్లోనూ మంత్రులు కళంకితులు కాదని గట్టు రామచంద్రరావు చెప్పారు. ఈ కేసులకు కారణమైన 26 జీవోలు సక్రమమైనవేనని మంత్రులు సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొన్నారని, అలాంటప్పుడు వారు క ళంకితులు ఎలా అవుతారని ప్రశ్నించారు. 26 జీవోలపై సమాధానం ఇవ్వాలని హైకోర్టు నోటీసులు ఇచ్చినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. మంత్రులు బలి కావడానికి కారణం కాంగ్రెస్ అధిష్టానం, రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పారు. ఈ జీవోలు సక్రమమేనని కోర్టుకు తెలిపితే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కేసే ఉండదని భావించి, అప్పుడు మౌనం దాల్చారని అన్నారు. జగన్‌ను కేసుల్లో ఇరికించాలనే దుర్బుద్ధితో జీవోలపై హైకోర్టుకు సమాధానం ఇవ్వలేదని, అదే ఇప్పుడు మంత్రులను కాల్చేసిందని తెలిపారు. జగన్ వల్లే మంత్రులు బలయ్యారని కొందరు నాయకులు, వారి సహచరులు మాట్లాడుతున్నారని, వాస్తవానికి వారిని బలి చేసింది కాంగ్రెస్ అధిష్టానమేనని చెప్పారు.

జగన్‌పై జరుగుతున్న దర్యాప్తు ఏంటో చెప్పాలి
తామేమీ తప్పు చేయలేదని, జీవోలన్నీ సక్రమంగా బిజినెస్ రూల్స్ ప్రకారమే జరిగాయని రాజీనామా చేసిన మంత్రులు ధర్మాన ప్రసాదరావు, పి.సబితా ఇంద్రారెడ్డి స్పష్టంగా వెల్లడించిన తరువాత వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై ఇంకా ఉన్న కేసు ఏమిటి? ఆయనపై జరుపుతున్న దర్యాప్తు ఏమిటి? అసలు ఆయన్ను ఇంకా ఎందుకు జైల్లో పెట్టారు? అనే విషయాలకు సీబీఐ, కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని గట్టు రామచంద్రరావు డిమాండ్ చేశారు. ‘ఎకరా రెండు లక్షల రూపాయల లోపు విలువ గల భూములను మాత్రమే జిల్లా కలెక్టర్ ఇవ్వొచ్చు, అంతకు మించిన విలువ గలిగినవి ఇవ్వడానికి ఒక్క మంత్రికో, ముఖ్యమంత్రికో వీలు కాదు, అన్నీ మంత్రివర్గ సమష్టి నిర్ణయాలే’నని మంత్రి ధర్మాన ప్రసాదరావు చెప్పారన్న విషయాన్ని ఆయన గుర్తు చేస్తూ అసలు సీబీఐ ఏ తీరులో దర్యాప్తు చేస్తోంది అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. జీవోల జారీకి ఏ ఒక్క మంత్రిదీ బాధ్యత కాదని అది సమష్టి బాధ్యత అని సహచర మంత్రులు కూడా కొందరు చెబుతున్నారని ఆయన వివరించారు. నిజంగా జీవోలు తప్పయితే రాజీనామాలు చేయాల్సింది ఒకరిద్దరు మంత్రు లే కాదని, మొత్తం మంత్రివర్గం అంతా చేయాలని ఒక మంత్రి కూడా చెప్పారని ఆయన అన్నారు.
Share this article :

0 comments: