జగన్ నిర్బంధం వెనుక కుట్రలు బట్టబయలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » జగన్ నిర్బంధం వెనుక కుట్రలు బట్టబయలు

జగన్ నిర్బంధం వెనుక కుట్రలు బట్టబయలు

Written By news on Thursday, May 23, 2013 | 5/23/2013

పోరాటం చేస్తానని బాబు అనడం హాస్యాస్పదం

సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్బంధం వెనుక కుట్రలు ఒక్కొక్కటీ వెలుగులోకి వస్తున్నాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తెలిపారు. మంత్రి ఆనంరామనారాయణరెడ్డి స్థాయికి మించి మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ ఆర్థిక నేరస్తుడని, ఉగ్రవాది అని ఇష్టానుసారంగా ఆనం మాట్లాడుతున్నారని, ఇవన్నీ కాంగ్రెస్ ఆయనతో మాట్లాడిస్తోందని ధ్వజ మెత్తారు. అంబటి బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు.

నేరారోపణలు చేసినంత మాత్రాన ఓ వ్యక్తిని నేరస్తుడని చెప్పడం భావ్యం కాదని, కోర్టులో నేరం రుజువైతేనే నేరస్తుడవుతాడని, అలా తమను కళంకితులనడం సరికాదంటూ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావులు అన్నారని, ఇదే అంశం జగన్‌కు ఎందుకు వర్తించదని ప్రశ్నించారు. అంటే కాంగ్రెస్‌పార్టీకి ఓ న్యాయం, జగన్‌కు మరో న్యాయమా? అని నిలదీశారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి, ప్రభుత్వంలోని మరికొందరు సిగ్గు తెచ్చుకుని మాట్లాడాలన్నారు. జగన్ కేసు సమయంలో.. కేబినెట్ సమష్టి నిర్ణయమన్న వాదనను వినిపించినట్లయితే.. ఇవాళ కాంగ్రెస్ మంత్రులకు ఈ గతి పట్టేది కాదన్నారు. 

చంద్రబాబు కేసు విషయంలో ప్రభుత్వం వాదనలు వినిపించకుండా టీడీపీ అధినేతకు సహకరించిందని, అందువల్లే అవిశ్వాస తీర్మానంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా టీడీపీ ఓటు వేయలేదని ఆయన చెప్పారు. మంత్రి కన్నా లక్ష్మీనారాయణ దుర్మార్గంగా మాట్లాడుతున్నారని, వైఎస్సార్‌సీపీ, టీడీపీ కలిసి పనిచేస్తున్నాయని మాట్లాడటం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌ను ఏడాదిగా జైలులో నిర్బంధించినా, పార్టీకేడర్‌ను అణగదొక్కడానికి ఎన్నో కుయుక్తులు పన్నినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా పార్టీ ధైర్యంగా ముందుకు సాగుతోందని, రాబోయే అన్ని ఎన్నికల్లో ఘనవిజయం సాధించడం తథ్యమని చెప్పారు.

బాబు మాటలు హాస్యాస్పదం: అవినీతి రహిత ప్రభుత్వంకోసం పోరాడతానని, అదే తన కర్తవ్యమ ని చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమని అంబ టి అన్నారు. దేశంలో అత్యంత అవినీతిపరుడైన బాబు ఇలా మాట్లాడుతుండటం విచిత్రమన్నారు. అసలు రాజకీయాల్లో ఖర్చులు పెంచింది చంద్రబాబేనన్నారు. చంద్రబాబు నీతివాక్యాలు చెబుతున్నారని, ఆయన రెండెకరాలు లేదా హెరిటేజ్ నుంచి ఇన్ని వేల కోట్లు సంపాదించి ఖర్చు పెడుతున్నారా? అని అంబటి ప్రశ్నించారు. దేశంలోనే అత్యంత అవినీతి పార్టీ తెలుగుదేశమని స్వయంగా ఆ పార్టీ నాయకులే చెప్పి వెళ్ళిపోతున్నారన్నారు. 

చంద్రబాబు పైకి గంభీరంగా తాను గేట్లు తెరిస్తే చాలామంది వస్తారని చెబుతున్నారని, అలాంటి పరిస్థితే ఉంటే ఎన్టీఆర్ హయాం నుంచి పనిచేస్తున్న కడియం శ్రీహరి, దాడి వీరభద్రరావు, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లులాంటి నేతలు ఎందుకు వెళ్లిపోతారని ప్రశ్నించారు. మూడవసారి కూడా అధికారం కోల్పోతే టీడీపీ జెండా ఎత్తేయాల్సి వస్తుందన్నారు. రూ. 500, రూ. 1000 నోట్లు రద్దు చేయాలని చంద్రబాబు మాట్లాడుతున్నారని, అంటే 2014 ఎన్నికల ఖర్చులకోసం ఆయన నోట్లన్నింటినీ వందలుగా మార్చుకుని సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. 
Share this article :

0 comments: