వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నా: దాడి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నా: దాడి

వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరుతున్నా: దాడి

Written By news on Saturday, May 4, 2013 | 5/04/2013

అనకాపల్లి:వైఎస్సార్ కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖంగా ఉన్నట్లు దాడి వీరభద్రరావు ప్రకటించారు. శుక్రవారం విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని శనివారం తాను ములాఖత్ ద్వారా చంచల్‌గూడ జైలులో కలుస్తానన్నారు. ఆత్మగౌరవం దెబ్బతినడంతోనే తెలుగుదేశం పార్టీకి దూరమవుతున్నానని దాడి వీరభద్రరావు స్పష్టం చేశారు. శాసన మండలి ప్రతిపక్ష నేత హోదాలో అధికార పార్టీ నిర్ణయాలను ఎన్నోసార్లు ఎండగట్టి, అనేక స్కామ్‌లను బయటపెట్టానని, అయినప్పటికీ చంద్రబాబు వెన్నుదన్నుగా నిలవక పోవటంతో మనస్తాపం చెందానన్నారు.
Share this article :

0 comments: