అంటే బాబు అవినీతి సంపాదన లక్షన్నర కోట్లకు పైనే.. - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » అంటే బాబు అవినీతి సంపాదన లక్షన్నర కోట్లకు పైనే..

అంటే బాబు అవినీతి సంపాదన లక్షన్నర కోట్లకు పైనే..

Written By news on Tuesday, May 21, 2013 | 5/21/2013

పోర్టులు, పరిశ్రమలకు 26వేల ఎకరాల ధారాదత్తం
లక్ష ఎకరాలకు పైగా గనుల లీజులు
మొత్తం 2.6 లక్షల కోట్ల విలువైన భూముల కేటాయింపు
తెలుగుదేశం సూత్రీకరణ ప్రకారం సగం సీఎంకే గదా!
అంటే బాబు అవినీతి సంపాదన లక్షన్నర కోట్లకు పైనే..
అన్నీ దాచి ఇపుడు ‘నీతి’యాత్రలు...



నూరు ఎలుకలను తిన్న పిల్లి తీర్థయాత్రలకు బయల్దేరినట్లు తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇపుడు అవినీతిపై రాజ్యాంగాధినేతల వద్దకు విజ్ఞాపనల యాత్ర చేస్తున్నారు. రెండెకరాలతో మొదలు పెట్టి వేల కోట్లకు పడగలెత్తిన చంద్రబాబు అవినీతి గురించి మాట్లాడుతుంటే ఆయన చుట్టూ ఉన్న వందిమాగ ధులు కూడా విభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారని టాక్. కుంభకోణాలు, ముడుపులు, వసూళ్లు, కమీషన్లు, వాటాలు మూడో కంటికి తెలియకుండా నిలువుగా.. అడ్డదిడ్డంగా దోపిడీ చేయడంలో చంద్రబాబు ఘనుడని అడపాదడపా ఆయన మిత్రపక్షంగా మెలుగుతున్న సీపీఎం పుంఖానుపుంఖాలుగా పుస్తకాలు ప్రచురించింది.

తమకు తెలిసిన కుంభకోణాల మేరకు చంద్రబాబు అవినీతి విలువ సుమారు 12,000 కోట్ల రూపాయల పైచిలుకేనని 2003లో సీపీఎం నిగ్గు తేల్చింది. ఇప్పటి లెక్కల్లో చూస్తే చంద్రబాబు అవినీతి సంపాదన లక్షన్నరకోట్లకు పైమాటే. ఆరుదశాబ్దాల క్రితం నికరంగా రెండెకరాల ఆసామికి జన్మించిన చంద్రబాబు స్కాలర్‌షిప్‌లతో చదువుకుని ‘‘ఏ వ్యాపారాలూ చేయకుండానే’’ లక్ష కోట్లకు పడగలెత్తడం పీహెచ్‌డీ చేయడానికి తగిన సబ్జెక్టే. చంద్రబాబు ధనకాంక్షను, అవినీతి తత్పరతను ఆయనకు పిల్లనిచ్చిన మామ ఎన్టీ రామారావు ఎన్నోమార్లు ఎత్తి చూపారు.

తెలుగుజాతి చరిత్రలో దోపిడీ నంబర్ వన్ చంద్రబాబు అని ఎన్టీఆర్ తిట్టిపోశారు. ముఖ్యమంత్రిగా ఉండగా చంద్రబాబు 2.6 లక్షల కోట్ల విలువైన భూములను ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అవినీతి సూత్రీకరణ ప్రకారం ముఖ్యమంత్రికి సగం కమీషన్ దక్కుతుంది కాబట్టి చంద్రబాబుకూ అందులో సగం దక్కి ఉండాలి. ఆయన ఆస్తులు చూస్తే అది కరెక్టేననిపిస్తుంది. కానీ చంద్రబాబు మాత్రం ‘నీతి’ యాత్రలు చేస్తూ... అవినీతిపై సమరం అంటున్నారు. చంద్రబాబు హయాంలో భూ పందేరం తీరుతెన్నులు పరిశీలిస్తే...

అన్నీ పనిగట్టుకు తెచ్చిన సంస్థలే..
ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో చంద్రబాబు ‘పని’గట్టుకుని పలు సంస్థలను ఈ రాష్ర్టంలోకి తీసుకువచ్చి, భారీ ఎత్తున భూములు కేటాయించారు. అడ్డదిడ్డంగా రాయితీలిచ్చారు. తనకు బాగా కావలసిన కొన్ని సంస్థలకు ప్రభుత్వ సంస్థలు సహా వేరెవరూ అడ్డుపడకుండా చక్రం తిప్పిన చంద్రబాబు అలనాటి తన నిర్వాకాలన్నిటినీ కప్పి పెట్టుకునేందుకు నయా అవతారం ఎత్తేందుకు ప్రయత్నిస్తున్నారు. రహేజా, ఎమ్మార్ ప్రాపర్టీస్, రస్ అల్ ఖైమా, రిలయన్స్ గ్యాస్, మలేసియన్ టౌన్‌షిప్, సింగపూర్ టౌన్‌షిప్... ఇలాంటి సవాలక్ష కంపెనీలకు అవసరమైతే నిబంధనలను తోసిరాజంటూ భూములు కట్టబెట్టే ప్రాతిపదికన తెలుగునేల మీద ఎర్రతివాచీలు పరిచింది చంద్రబాబే. సెజ్‌లకు ఆయన ఆద్యుడు. ఆ పేరిట భూ కేటాయింపులకు ఆయన ఆది గు రువు. అలాంటి చంద్రబాబు ఇపుడు అవినీతిపై సమరశంఖం పూరిస్తున్నారు. తన ఘనమైన అవినీతి కీర్తి కిరీటాల గురించి జనం మరిచిపోయి ఉంటారని ఆయనకు ఎక్కడ లేని నమ్మకం. తన ఏలుబడిలో చంద్రబాబు అనేక సంస్థలకు వేల ఎకరాలను కట్టబెట్టారు. ఆయన హయాంలో ఏపీఐఐసీ ద్వారా దాదాపు పాతికవేల ఎకరాల భూమిని సేకరించారు. 26వేల ఎకరాలకు పైగా భూమిని వివిధ పారిశ్రామిక సంస్థలకు కట్టబెట్టారు. వీటిలో 4 వేల ఎకరాలకు పైగా పోర్టుల భూములు కూడా ఉన్నాయి.

పోర్టులు గుండుగుత్తగా అప్పగింత...: గంగవరంతోపాటు కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను ప్రైవేటు సంస్థలకు ధా రాదత్తం చేసింది చంద్రబాబు హయాంలోనే. నాటి మలేసియా ప్రధాని మహతిర్ మహ్మద్ కుమారుడికి కాకినాడ పోర్టును అప్పగించిందీ చంద్రబాబే. మలేసియాకు వందల కోట్ల రూపాయల ఆస్తులు తరలించారని ఆరోపణలున్నది చం ద్రబాబుపైనే. రాష్ర్టంలోని నౌకాశ్రయాల ప్రైవేటీకరణలో వేల కోట్లను చంద్రబాబు జేబులో వేసుకున్నారని ఆరోపణలొచ్చాయి.

భూములిచ్చి వెనకేసింది లక్షన్నర కోట్లు?
మొత్తంగా వివిధ పరిశ్రమలకు, పోర్టులకు కలిపి చంద్రబాబు 26,634 ఎకరాలను కేటాయించారు. (వివరాలు టేబుల్‌లో..) వాటి విలువ 1,60,420 కోట్లు. గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల విలువ మరో లక్ష కోట్ల రూపాయలు దీనికి అదనం. అంటే మొత్తం 2,60,420 కోట్ల మేర భూములను, పోర్టులను చంద్రబాబు ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేశారు. ఎంత భూమి కేటాయిస్తే అందులో సగం ముఖ్యమంత్రికి దక్కుతుందని తెలుగుదేశం నాయకులు, చంద్రబాబు నాయుడు ‘అనుభవం కొద్దీ’ సూత్రీకరిస్తున్నారు. ఆ లెక్కన చంద్రబాబుకు రు.2,60,420 కోట్లలో సగం అంటే.. రూ.1,30,210 కోట్లు దక్కాయన్న మాట.

గనుల్లో బాబుకు దక్కింది 5 వేల కోట్లు?
1994 నుంచి 2004 వరకూ చంద్రబాబు ఇచ్చిన మైనింగ్ లీజుల సంఖ్య 1,177. వాటిలో సగటున 50 ఎకరాల చొప్పున బాబు లీజుకిచ్చింది మొత్తం 58,859 ఎకరాలు. గ్రానైట్ లీజులు 259లో సగటున 25 ఎకరాల చొప్పున 6,475 ఎకరాలు. గ్రానైటేతర లీజులు 6,517లో సగటున 5 ఎకరాల చొప్పున 32,585 ఎకరాలు... అంటే మొత్తం మైనింగ్‌కు చంద్రబాబు కేటాయించింది 97,919 ఎకరాల భూమి. ఇక అత్యంత విలువైన బ్లాక్ గెలాక్సీ గ్రానైట్ లీజుల సంఖ్య 155. వాటి విస్తీర్ణం 910 ఎకరాలు. అన్నీ కలిపితే మైనింగ్ లీజులకిచ్చిన భూమి మొత్తం లక్ష ఎకరాలు. ఎకరా భూమి విలువ సగటున లక్ష రూపాయలనుకున్నా 1,000 కోట్లకు పైమాటే. వాటిలో ఖనిజాల విలువ ఎంత లేదనుకున్నా 10 వేల కోట్లకు పైనే. మరి ప్రభుత్వం భూమి కేటాయిస్తే అందులో సగం ముఖ్యమంత్రికి దక్కుతుందన్న సూత్రీకరణ ప్రకారం చంద్రబాబుకు దక్కింది 5,000 కోట్ల రూపాయలకు పైనేనన్నమాట.
http://www.sakshi.com/main/FullStory.aspx?catid=602640&Categoryid=1&subcatid=33
Share this article :

0 comments: