చంద్రబాబు కు బహిరంగ లేఖ-1 - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చంద్రబాబు కు బహిరంగ లేఖ-1

చంద్రబాబు కు బహిరంగ లేఖ-1

Written By news on Wednesday, June 5, 2013 | 6/05/2013

చంద్రబాబు కు బహిరంగ లేఖ-1

1.వైఎస్ ముఖ్యమంత్రి  గా  ఉన్నప్పుడు బాబు కోర్ట్ లో కేసు ఎందుకు వేయలేదు?

వేసి ఉంటె వైఎస్ కూడా బాబు పై కేసులు వేసే వాడు అప్పుడు ఇప్పటిలాగా కాంగ్రెస్ సహకారం ఉండేది కాదు కాబట్టి కోర్ట్ లను మేనేజ్ చేయలేను ,దొరికి పోతాను అని భయపడ్డాడు బాబు.

2.నన్ను చంద్ర బాబు రహస్యంగా కలిసాడు అని చిదంబరం పార్లమెంటులో ప్రకటన చేసాడు కానీ బాబు నేను కలవలేదు అన్నాడు.కలిసాడు అనేది నిజం, ఆ విషయాన్నీ ఆంగ్ల పత్రికలు  తాటికాయంత  అక్షరాలోతో వ్రాసాయి కూడా.

బాబు అప్పటి కేంద్ర  హోం మంత్రి చిదంబరాన్ని కలిసిన వెంటనే జగన్ పై కోర్ట్ విచారణకు ఎందుకు ఆదేశించింది?

మరి బాబు చిదంబరాన్ని కలిసి జగన్ ను జైలు లో వేయండి, నా మీద కేసులు కొట్టేయండి అని 
ప్రతిగా కాంగ్రెస్ ను కంటికి రెప్పలా కాపాడుతాను అని చెప్పలేదా?

3.విజయమ్మ పిటిషన్ వేస్తె బాబు మీద కోర్ట్ విచారణకు ఆదేశించినప్పుడు ఆగ్రహించిన బాబు సోనియా, రాబర్ట్ వద్రా, రాష్రానికి చెందినా 8 మంది మంత్రులు అవినీతికి పాల్పడినట్టు తన దగ్గర ఆధారాలు ఉన్నాయి ,కాబట్టి కోర్ట్ లో కేసు వేస్తున్నాము అని చెప్పాడు, చెప్పి కూడా దాదాపు రెండు సంవత్సరాలు  అయింది.మరి బాబు ఎందుకు కేసు వేయలేదు?

కాంగ్రెస్ వాళ్ళు తో ఒక అవగాహనకు వచ్చి  తనమీద కేసులు లేకుండా చేసుకోవడానికే కదా?

4.జగన్ మీద కేసు వేసిన శంకర్ రావు తను సోనియా ఆదేశాలమేరకు కేసు వేశానని  రామోజీ ను కూడా   కలిసానని కానీ ఎప్పుడు ఎందుకు అనేది మాత్రం చెప్పనని  అన్నాడు.
మరి ఇదే శంకర్ రావు మీద అవినీతి ఆరోపణలు వస్తే తీదీపి కనీసం ఎందుకు  మాట్లాడదు ?

శంకర్ రావు ను ఎమన్నా అంటే సోనియా, రామోజీ, చంద్రబాబు లు ఎలా కలిసి కుట్రపన్ని జగన్ ను కేసులలో ఇరికించింది  మీడియా కు చెబుతాడనా  ?

5.గతం లో సిబిఐ ని కాంగ్రెస్ బ్యూరో అఫ్ ఇన్వెస్టిగేషన్ అన్న బాబు , న్యాయమూర్తులు కాంగ్రెస్ ఏజెంట్లు అన్న బాబు ( ద్రోణంరాజు సత్యనారాయణ అనే కాంగ్రెస్  లీడర్ అప్పటి   ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మీద  కేసు వేస్తె 7 కేసులలో అవినీతికి  పాల్పడ్డట్టు ప్రాధమిక  ఆధారాలు ఉన్నాయి అని హై కోర్ట్ చెప్పినప్పుడు ఇదే బాబు కోర్టులను తిట్టాడు, న్యాయమూర్తులు కాంగ్రెస్  ఏజెంట్లు అన్నాడు  రాష్ట్ర బందుకు పిలుపిచ్చి బస్సులు తగలపెట్టించాడు ) జగన్ మీద కేసు వచ్చేసరికి ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది  అంటున్నాడు.సరే అలాగే అనుకొందాము.


మరి అవిశ్వాసం పెట్టమంటే నేను అవిస్వాసం పెడితే జగన్ కాంగ్రెస్ తో బేరం కుదుర్చుకొని బెయిల్ తెచ్చుకొంటాడు అన్నాడు కదా అంటే బెయిల్ అనేది కోర్ట్ చేతిలో లేదు కాంగ్రెస్ చేతిలో మాత్రమే  ఉంది అని బాబు ఒప్పుకున్నట్టే కదా!

అంటే జగన్ మీద  కేసు రాజకీయ ప్రేరేపితము అని బాబు పరోక్షంగా  చెబుతున్నట్టే కదా?
పొతే జగన్ రెండు సార్లు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానానికి  మద్దతు ఇచ్చాడు, FDI వోటింగ్ లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగా  జగన్ పార్టీ MP లు ఒటేసారు.
మరి జగన్ కాంగ్రెస్ తో ఎలా కలిసాడు? బాబు కదా కాంగ్రెస్ కు అంతర్గతంగా సహకరిస్తుంది 

జైలు లో ఉందికూడా వత్తిల్లకు లొంగకుండా  కాంగ్రెస్ పై   సింహం లా పోరాటం చేస్తుంది జగన్ కాదా?

6.జగన్ మీద హై కోర్ట్ విచారణకు అదేసిన్చినప్పుడు జగన్ స్టే కు వెళ్ళకుండా కడిగిన ముత్యం లా  కేసు లోంచి బైటకి రావాలి  అన్న పెద్ద మనిషి బాబు తనమీద సిబిఐ విచారణకు కోర్ట్ అదేసిన్చేసరికి ఎందుకు పరుగెత్తుకెళ్ళి స్టే తెచ్చుకొన్నాడు?
తాను నిప్పు అని ఆంధ్ర హజారే అని  చెప్పుకొనే నారా బాబు విచారణను ఎదుర్కొని క్లీన్ చిట్ తెచ్చుకోవచ్చు కదా?
తన అవినీతి ,అక్రమాలు  బైతపదతాయని భయం కాకపోతే ఎందుకు స్టే తెచ్చుకొంతున్నాడు?

7. నాట్ బిఫోర్ బాబు.

ఈ మధ్య కోర్తులమీద అపారనమ్మకుముంది అంటున్న  బాబు తన కేసులో నా కేసు ఆ న్యాయమూర్తి  దగ్గరకు వద్దు,ఈ న్యాయమూర్తి   దగ్గరకు వద్దు అని నలుగురు న్యాయమూర్తులను న్యాయవ్యవస్థ లో ఉన్న  " నాట్ బిఫోర్"  అనే  ఉత్తమ సాంప్రదాయాన్ని వాడుకొని , బాబు CM  గా ఉన్నప్పుడు ప్లీడర్ గా , న్యాయమూర్తిగా పదోన్నతి పొంది గతం లో బాబు కు అనుకూల తీర్పులు ఇచ్చిన వారి దగ్గరికే  కేసు వచ్చేలా పావులు కదిపి కేసు కొట్టేయిన్చుకోవడము కాకతాళీయమా?

మరల బాబు పై ఉన్న IMG  కేసు కూడా తిరిగి తిరిగి అదే న్యాయమూర్తి దగ్గరకు రావడం కూడా విచిత్రమే!

8.కాంగ్రెస్ ను కాపాడుతోంది చంద్ర బాబే  అని బహిరంగంగా జేసి దివాకర్ రెడ్డి  , బొత్స, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి  చెప్పింది నిజం కాదా ?

ఎందుకు కాపాడుతున్నాడు బాబు? తన మీద కేసులు లేకుండా చేసుకోవడము, జగన్ ను చాల కాలం జైలు లో ఉంచడానికి కాదా ?

9.శంకర్ రావు, తీదీపి వాళ్ళు కలిసి జగన్ మీద కేసు వేస్తె హై కోర్ట్ అది ప్రజా ప్రయోజన వాజ్యము (పిల్) అని విచారణకు స్వీకరించింది కానీ విజయమ్మ బాబు మీద కేసు వేస్తె అది పిల్ కాదు కక్షతో కూడినది అని కొట్టేసింది.ఇదెక్కడి న్యాయం?

జగన్ కు బాబు ఎమన్నా బాబాయా, శంకర్ రావు ఎమన్నా మేనమామా ? కాదే , మరి వారు వేసింది పిల్ ఎలా అయింది, విజయమ్మ వేసింది పిల్ ఎలా కాకుండా పోయింది?

అంతా కాంగ్రెస్ బాబు మేనేజ్మెంట్ కాదా?

అందుకే కదా చంద్రబాబు ప్రతీ వ్యవస్థలో తన సొంత మనుషులను జొప్పించి అన్ని వ్యవస్థలనూ మేనేజ్ చేస్తున్నాడని బ్రిటన్‌కు చెందిన డీఎఫ్‌ఐడీ సంస్థ ప్రతినిధి జేమ్స్ మ్యానర్ భారత్ లో పర్యటించి పుస్తకము వ్రాసాడు. బాబు చీకటి ప్రతిభ విదేశీయులకు సైతం తెలిసిపోయింది.

10.నిప్పు నారా బాబు తానో నిప్పు అని తన జీవితము   తెరిచిన పుస్తకమని ,ఆంధ్రా హజారే ని అని తన అను 'కుల'  మీడియా లో డప్పు వేయిన్చుకొంతుంటాడు కదా మరి తనకు ఈ మధ్య అపార నమ్మకము ఏర్పడిన  సిబిఐ, ఈడి లకు బాబు ముఖ్యమంత్రి  గా ఉన్నప్పుడు చేసిన భూపందేరాలపై విచారణ జరపమని ఒక లేఖ వ్రాస్తే నిజానిజాలు బైటకు వస్తాయి కాదా? 
సిబిఐ విచారణ చేసి బాబు కు క్లీన్ చిట్ ఇస్తే ఎంత మంచి పేరు వస్తుంది , ప్రజలు కూడా  బ్రహ్మరధం పడతారుగా అయినా లేఖ వ్రాయడానికి బాబు ఎందుకు  వణుకుతున్నాడు?

జగన్ గత రెండు సంవత్సరాలుగా విచారణ ఎదుర్కొంటున్నాడు అయినా సిబిఐ కొత్తగా కనుక్కొన్న విషయాలు లేవు, IT  రిటర్న్స్ లో ఫైల్ చేసిన విషయాలు, ROC లో చెప్పిన విషయాలు తప్ప.

కానీ బాబు కనీసము రెండు నెలలైనా  సిబిఐ విచారణ ఎదుర్కోమను బాబు అవినీతి   భండారం ఎంత బైట పడుతుందో చూద్దాము.

ఎదుటివారికి చెప్పేటందుకే నీతులు  ఉన్నాయి డోంట్ కేర్ అన్న అక్కినేని పాట ను బాబు బాగా ఫాలో అవుతాదనుకొంటాను


11.ఆ మధ్య జరిగిన ఉప ఎన్నికలల్లో నరసాపురం, రామచంద్రాపురం  లలో కాంగ్రెస్ కు సహకరించి , గెలిపించి,  టీడీపి దిపాసిట్లు కోల్పోయి ప్రధాన ప్రతిపక్షంగా విశ్వసనీయత కోల్పోయింది అని సిపిఐ నారాయణ బహిరంగ లేఖ వ్రాయలేదా?

ఇంతగా బరితెగించి కాంగ్రెస్ కు సహకరిస్తున్న బాబు ను ఏమనాలి?

12. టీడీపి పెట్టిన అవిశ్వాస తీర్మానం కాంగ్రెస్ ను కాపాడటానికే  అన్న లోక్సత్త JP మాటలను కాదనగలరా?

13.బాబు 1983 లో కాంగ్రెస్ మంత్రి గా ఉంది ఓడిపోగానే 9 రోజులలోనే పార్టీ ఫిరాయించి టీడీపి లో చేరలేదా?

2013 లో అంటే దాదాపు 30 సం తర్వాత 9 సం పాటు బాబు తో ఉండి ఇప్పుడు పార్టీ మారిన కడియం, దాడి లను రాజకీయ వ్యభిచారులు అంటున్న బాబు ను మరి ఏమనాలి?

14. సుప్రీమ్ కోర్ట్ సైతం సిబిఐ ని కేంద్రం చేతిలో కీలుబొమ్మ అని సిబిఐ కి స్వయం ప్రతిపత్తి అవసరం అని చెప్పింది, అలాగే చాలామంది జాతీయ నాయకులు కూడా అన్నారు కానీ బాబు మాత్రం సిబిఐ ని ఒకమాట అనలేదు ఎందుకు?

సిబిఐ దగ్గర బాబు అవినీతికి  సంబంధించిన ఆధారాలు చాల ఉన్నాయి కాబట్టే కదా?

15.1973 లో స్టూడెంట్ లీడర్ గ ఉన్న బాబు దాదాపుగా గత 40 సం గా రాజకీయాలు చేస్తూ కూడా కేవలము 40 సం వయస్సున్న జగన్ ను ప్రజా క్షేత్రం లో ఎదుర్కోలేక కాంగ్రెస్ ముందు సాగిలపడి నీచ రాజకీయాలు చేయడం నిజం కాదా?



courtesy: CVReddy
Share this article :

0 comments: