24న ప్రాంతీయ సదస్సులకు విజయమ్మ: మర్రి - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » 24న ప్రాంతీయ సదస్సులకు విజయమ్మ: మర్రి

24న ప్రాంతీయ సదస్సులకు విజయమ్మ: మర్రి

Written By news on Wednesday, June 19, 2013 | 6/19/2013

గుంటూరు, ప్రకాశం జిల్లాలో ఈ నెల 24న నిర్వహించే ప్రాంతీయ సదస్సులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పాల్గొంటారని జిల్లా కన్వీనర్ మర్రి రాజశేఖర్‌ మీడియాకు వెల్లడించారు. ప్రాంతీయ సదస్సుల్లో పాల్గొనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు వైఎస్ విజయమ్మ దిశానిర్ధేశం చేస్తారని మర్రి రాజశేఖర్ అన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా వైఎస్ఆర్ సీపీదే విజయమని ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. 
హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నియోజకవర్గం పీలేరులోనే ఓటర్లు నిర్భయంగా ఓటేసే పరిస్థితి లేదు అని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రమాకాంత్‌రెడ్డికి వైఎస్ఆర్‌ సీపీ లేఖ రాసింది. సహకార ఎన్నికల్లో పోలీసు, రెవెన్యూ అధికారులు అక్రమాలకు పాల్పడ్డారు అని వైఎస్ఆర్ సీపీ ఆరోపించింది. కొంతమంది అధికారులు కాంగ్రెస్‌కు ఏకపక్షంగా పనిచేస్తున్నారని లేఖలో తెలిపింది. పీలేరు నియోజకవర్గంలో స్థానిక ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిపించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు వైఎస్ఆర్ సీపీ సూచించింది.మెదక్‌::: ; వైఎస్ జగన్ అక్రమ నిర్బంధంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్న వీరారెడ్డి కుటుంబాన్ని మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు కొండాసురేఖ వీరారెడ్డి కుటుంబాన్ని పరామర్శించారు. వీరారెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యంగా చెప్పారు. అన్ని విధాల ఆదుకుంటామని హామీయిచ్చారు. 
Share this article :

0 comments: