పార్టీ ప్లీనరీలో 26 తీర్మానాలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » పార్టీ ప్లీనరీలో 26 తీర్మానాలు

పార్టీ ప్లీనరీలో 26 తీర్మానాలు

Written By news on Tuesday, June 25, 2013 | 6/25/2013

Dr. M.V. Mysurareddyహైదరాబాద్, 25 జూన్‌ 2013:వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రెండవ ప్రజాప్రస్థానం ప్లీనరీ సమావేశం వైయస్‌ఆర్‌ జిల్లా ఇడుపులపాయలో వచ్చే జూలై 8వ తేదీన నిర్వహించనున్నట్లు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎం.వి. మైసూరారెడ్డి ప్రకటించారు. దివంగత మహానేత డాక్టర్‌ వైయస్‌ రాజశేఖరరెడ్డి పుట్టిన రోజుl ఈ సమావేశం ఒకరోజు మాత్రమే నిర్వహిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ జిల్లా సదస్సులను దృష్టిలో పెట్టుకుని ప్లీనరీ సమయాన్ని కుదించినట్లు చెప్పారు. ఈ ప్లీనరీలో రాజకీయ, ఆర్థిక అంశాలతో పాటు ప్రజా సమస్యలపైన మొత్తం 26 తీర్మానాలను ప్రతిపా
దించనున్నట్లు మైసూరా వివరించారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్‌ పి.ఎన్.వి. ప్రసాద్‌తో పాటు పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం సాయంత్రం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మైసూరారెడ్డి ఈ విషయాలు వెల్లడించారు.

ఈ ప్లీనరీలో తీర్మానాలను ప్రవేశపెట్టడంతో పాటు పార్టీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ కూడా నిర్వహించనున్నట్లు మైసూరారెడ్డి పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుని ఎన్నిక కూడా ప్లీనరీలోనే జరుగుతుందన్నారు. పార్టీ సభ్యత్వ నమోదు కమిటీ కన్వీనర్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు సంస్థాగత ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారని తెలిపారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన వివరాలను ఉమ్మారెడ్డి ప్రకటిస్తారని ఆయన చెప్పారు.

ప్రజాప్రస్థానం ప్లీనరీ నిర్వహణకు ఆహ్వాన కమిటీ, భోజనం ఏర్పాట్ల కమిటీ, ప్రాంగణం అలంకరణ కమిటీ, వసతుల ఏర్పాటు కమిటీ, తీర్మానాల కమిటీ, సేవాదళ్‌ కమిటీ, మీడియా కమిటీ, సాంస్కృతిక కార్యక్రమాల కమిటీలను వేసినట్లు ఆయన స్పష్టంచేశారు. ఈ సమావేశాలకు సుమారు 8 వేల మంది హాజరవుతారని తాము భావిస్తున్నామన్నారు.

ఈ సమావేశంలో ప్రముఖంగా రాజకీయ, ఆర్థిక తీర్మానాలు ఉంటాయని మైసూరారెడ్డి చెప్పారు. కాంగ్రెస్‌, టిడిపిలు కుమ్మక్కై సిబిఐ ద్వారా పక్షపాత ధోరణితో నిర్వహిస్తున్న దర్యాప్తుపైన కూడా తీర్మానం చేస్తామన్నారు. ఇవే కాకుండా ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకుని మొత్తం 26 తీర్మానాలను పార్టీ ప్లీనరీలో ప్రవేశపెట్టనున్నట్లు ఆయన వివరించారు. ఈ తీర్మానాలపై ప్లీనరీ వేదిక నుంచి చర్చ కూడా జరుగుతుందన్నారు.

డెహ్రాడూన్‌లో బాబు డ్రామాలు :
ఉత్తరాఖండ్‌ వరద బాధితులకు సాయం పేరుతో చంద్రబాబు నాయుడు డెహ్రాడూన్‌ వెళ్ళి డ్రామాలు ఆడుతున్నారని మైసూరారెడ్డి ఒక విలేకరి ప్రశ్నకు బదులిచ్చారు. ఇప్పటికే వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వైద్య విభాగం, కొందరు వలంటీర్లతో కలిసి వరద బాధిత ప్రాంతాల్లో అత్యవసర వైద్య సేవలు అందిస్తున్నారని చెప్పారు. తమ పార్టీ వైద్యుల బృందం దగ్గర దగ్గర కేదార్‌నాథ్‌ వెళ్ళారని అన్నారు. ప్రజలు ఎక్కడ ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో ఆ ప్రాంతానికి తమ బృందం చేరుకున్నదన్నారు. మరి కొంతమంది వలంటీర్లను కూడా ఉత్తరాఖండ్‌ పంపించి సహాయ చర్యలు చేపట్టనున్నట్లు, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న మిలటరీ బలగాలకు చేదోడువాదోడుగా ఉంచాలని పార్టీ నిర్ణయించినట్లు ఆయన చెప్పారు.

ఉత్తరాఖండ్ వరద బాధితులకు సేవలు అందించడంలో తాము అన్ని పార్టీల కన్నా ముందే ఉన్నామని ఆయన తెలిపారు. ఏ ఒక్క రాజకీయ పార్టీ కన్నా వెనుకబడలేదన్నారు. కాకపోతే కెమెరాల్లో పడడానికి, మీడియాలో రావాలని తమ పార్టీ బృందం తాపత్రయ పడడంలేదన్నారు. ఢిల్లీలోని ఎపి భవన్‌లో కూర్చుని చంద్రబాబు నాయుడు మెడికల్‌ క్యాంపులు అంటూ డ్రామాలు ఆడుతున్నారని, కెమెరాలకు ఫోజులు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఢిల్లీ చేరుకున్న బాధితులను విమానంలో తీసుకురావడం గొప్ప విషయమేమీ కాదని, వరదలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతానికి తరలించడం చాలా ముఖ్యమన్నారు. ఆ పనిని తమ పార్టీ బృందం చేస్తోందన్నారు.


http://www.ysrcongress.com/news/more_news/26-resolutions-will-be-introduced-in-party-2nd-plenary.html
Share this article :

0 comments: