తెలంగాణలో విజయమ్మ పర్యటన ఖరారు - జూలై 8న ప్లీనరీ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » తెలంగాణలో విజయమ్మ పర్యటన ఖరారు - జూలై 8న ప్లీనరీ

తెలంగాణలో విజయమ్మ పర్యటన ఖరారు - జూలై 8న ప్లీనరీ

Written By news on Monday, June 17, 2013 | 6/17/2013

స్థానిక ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ జిల్లాల్లో తమ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ పర్యటన ఖరాయినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత బాజిరెడ్డి గోవర్థన్ తెలిపారు. వైఎస్‌ఆర్ సీపీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తీసుకున్న నిర్ణయాలను ఆయన విలేకరులకు తెలిపారు. 

ఈనెల 25న మెదక్, 26న నల్లగొండ, 27న మహబూబ్‌నగర్, 28న ఖమ్మం, 29న రంగారెడ్డి, 30న కరీంనగర్, జూలై 1న వరంగల్, 2న ఆదిలాబాద్, 3న నిజామాబాద్ జిల్లాల్లో విజయమ్మ పర్యటన ఉంటుందని చెప్పారు. జూలై 8న ఇడుపులపాయలో వైఎస్‌ఆర్ సీపీ ప్లీనరీ సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకుంటామన్నారు. స్థానిక ఎన్నికల నేపథ్యంలో ప్లీనరీ సమావేశం ఒక్కరోజే ఉంటుందని తెలిపారు. 

ఉత్తరాఖండ్ వరదల్లో చిక్కుకున్న తెలుగువారిని కాపాడాల్సిన బాధ్యత సర్కారుపై ఉందని, రాష్ట్రప్రభుత్వం వెంటనే తెలుగువారిని ఆదుకోవాలని కోరారు. షర్మిల పాదయాత్ర జూలై చివరి వారానికి 3 వేల కిలోమీటర్లు పూర్తవుతుందని, ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పైలాన్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. చివరి బహిరంగసభను విజయనగరంలో ఏర్పాటుచేసే అంశంపై పీఏసీలో చర్చించామన్నారు. దేశవ్యాప్తంగా సీబీఐ బాధితులందరినీ ఏకం చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. 

బోడ జనార్దన్ సొంత అజెండాతో పార్టీ నుంచి బయటకు వెళ్లారని బాజిరెడ్డి ఆరోపించారు. పార్టీ మారేటప్పుడు తమ పార్టీపై బురదజల్లడం సరికాదన్నారు. వైఎస్‌ఆర్ సీపీపై విమర్శలు చేసేటప్పుడు బోడ జనార్దన్ ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
Share this article :

0 comments: