మైండ్ గేమ్ కాదు.. మైండ్‌లెస్ గేమ్ - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » మైండ్ గేమ్ కాదు.. మైండ్‌లెస్ గేమ్

మైండ్ గేమ్ కాదు.. మైండ్‌లెస్ గేమ్

Written By news on Saturday, June 22, 2013 | 6/22/2013

- వైఎస్ కుటుంబమే లక్ష్యంగా సీబీఐ, కాంగ్రెస్, టీడీపీ కుట్రలు 
- మైండ్ గేమ్ కాదు.. మైండ్‌లెస్ గేమ్ 
- ఆత్మన్యూనతా భావంతోనే జగన్‌కు సంకెళ్లు 
- సాక్షి చైతన్య పథంలో నంద్యాల వాసుల ధ్వజం

సాక్షి ప్రతినిధి, నంద్యాల: జనాదరణ కలిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ప్రజల మధ్య లేకుండా చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ విలువలకు కూడా తిలోదకాలిచ్చాయని పలువురు వక్తలు పేర్కొన్నారు. జగన్‌ను ఆయన కుటుంబాన్ని కష్టాలపాల్జేస్తూ మైండ్ గేమ్ ఆడుతున్నామనే అపోహతో కాంగ్రెస్ పెద్దలు మైండ్‌లెస్ గేమ్ ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా నంద్యాలలో శుక్రవారం ‘సాక్షి చైతన్య పథం’ సదస్సు నిర్వహించారు. స్వప్న వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఈ సదస్సులో మనస్తత్వ శాస్త్ర నిపుణుడు బి.బాలాజీసింగ్ మాట్లాడుతూ వైఎస్‌ఆర్ కుటుంబాన్ని వేధిస్తున్నామని సంబరపడుతున్న కాంగ్రెస్‌కు, కోట్లాది కుటుంబాలు జగన్‌ను తమ హృదయాల్లో దాచుకున్నాయనే విషయం అర్థంకావడం లేదన్నారు. 

ఆత్మన్యూనతా భావంతో సీబీఐని పావుగా వాడుకుంటూ కాంగ్రెస్ పార్టీ సాగిస్తున్న మైండ్‌లెస్ గేమ్ ఇదని ఆయన విశ్లేషించారు. న్యాయవాది రామసుబ్బయ్య మాట్లాడుతూ జగన్ కోసం రాజ్యాంగాన్ని, ఐపీసీ సెక్షన్లనే సీబీఐ తారుమారు చేస్తోందన్నారు. ఏ నేరానికైనా దర్యాప్తు పూర్తి చేసిన తర్వాతే చార్జిషీటు దాఖలు చేస్తారని, జగన్ విషయంలో మాత్రం బెయిల్ రాకుండా చూసేందుకే ఒక చార్జిషీటుకు అనుబంధ చార్జిషీట్లు వేస్తున్నారన్నారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి, కనీస న్యాయ సూత్రాలకు విరుద్ధమన్నారు.

సీబీఐ స్వయంప్రతిపత్తితో వ్యవహరిస్తే జగన్‌కు ఎప్పుడో బెయిల్ వచ్చేదన్నారు. రిటైర్డ్ టీచర్ పాండురంగారెడ్డి మాట్లాడుతూ 26 జీవోల విషయంలో మంత్రులకు క్లీన్‌చిట్ ఇస్తున్న ముఖ్యమంత్రి కిరణ్, జగన్‌ను నిందితుడిగా చూడటంతోనే ఇదంతా రాజకీయ కుట్రగా తేలుతోందన్నారు. రిటైర్డ్ ఫారెస్టు అధికారి సయ్యద్ హుస్సేన్ మాట్లాడుతూ వైఎస్ మరణంపై అనుమానాలున్న నేపథ్యంలో జగన్ ముఖ్యమంత్రి అయితే తమ కుట్రలన్నీ వెలుగులోకి వస్తాయనే కాంగ్రెస్ పెద్దలు ఆయన్ను జైలులో ఉంచుతున్నారని అభిప్రాయపడ్డారు. జీఎం బీఎడ్ కళాశాల ప్రిన్సిపాల్ విలియం ఫిలిప్ మాట్లాడుతూ వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు బెంగళూరులో ఉండి వ్యాపారాలు చేసుకున్న జగన్ నిందితుడెలా అవుతారని ప్రశ్నించారు. వ్యాపార సంస్థల్లో పెట్టుబడులు పెట్టడం కూడా నేరమే అనే కొత్త అర్థాన్ని సీబీఐ ఇప్పుడు చెబుతోందని ధ్వజమెత్తారు. ఎల్లో మీడియాకు లీకులు ఇస్తూ సీబీఐ విచారణను, కోర్టు తీర్పులను ప్రభావితం చేసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ఆయన దుయ్యబ ట్టారు.
Share this article :

0 comments: