చిల్లర చేష్టలతో రాష్ట్రం పరువు తీసిన టీడీపీ , కాంగ్రెస్ పార్టీ నేతలు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » చిల్లర చేష్టలతో రాష్ట్రం పరువు తీసిన టీడీపీ , కాంగ్రెస్ పార్టీ నేతలు

చిల్లర చేష్టలతో రాష్ట్రం పరువు తీసిన టీడీపీ , కాంగ్రెస్ పార్టీ నేతలు

Written By news on Thursday, June 27, 2013 | 6/27/2013

- ఉత్తరాఖండ్ బాధితుల్ని తామే తరలించామన్న క్రెడిట్ కోసం పాకులాట
- తమ విమానంలోనే తీసుకెళ్తామంటూ గంటల తరబడి వాదులాట
- బూతులు తిట్టుకుని, కొట్టుకోబోయిన ఎంపీలు వీహెచ్, రాథోడ్
- టీడీపీ విమానమెక్కొద్దంటూ కేంద్ర మంత్రి బలరాం బెదిరింపులు
- అడ్డుకోవడం మాని.. తన వంతుగా ఆజ్యం పోసిన చంద్రబాబు
- వారి తీరును తీవ్రంగా అసహ్యించుకున్న బాధితులు, సైనికులు
- మన ప్రజాప్రతినిధుల నిర్వాకాన్ని ఎండగట్టిన జాతీయ చానళ్లు

‘టీడీపీ వాళ్ల విమానమెక్కారో, జాగ్రత్త!’
- వరద బాధితులకు కేంద్ర మంత్రి బలరాం నాయక్ బెదిరింపులు

‘ఏం చంద్రబాబూ! ఏం రాజకీయం చేస్తున్నవ్?’
- కాంగ్రెస్ ఎంపీ వి.హన్మంతరావు నిలదీత
‘ఏం మాట్లాడుతున్నావ్? రాజకీయం చేస్తున్నది మీరా, నేనా?’
- పట్టరాని ఆగ్రహంతో ఊగిపోతూ బాబు ఎదురు ప్రశ్న

‘నీ అయ్య!’ - చంద్రబాబుకు అండగా నిలుస్తూ వీహెచ్‌పై టీడీపీ ఎంపీ
రమేశ్ రాథోడ్ తిట్ల పురాణం.
‘నీ అమ్మ’ - రెచ్చిపోయి రాథోడ్‌ను తిట్టిపోసిన వీహెచ్.

రాథోడ్‌ను తోసేసిన వీహెచ్. గిరిజన ఎంపీనైన నన్ను కొడతావా అంటూ కలబడిన రాథోడ్... మా బాధితులను మీరెలా తీసుకెళ్తారంటూ టీడీపీ ఎంపీలపై పటపటా పళ్లు కొరికిన బలరాం నాయక్.
‘వరద బాధితుల బస్సు విమానాశ్రయానికి వెళ్లడానికి వీల్లేకుండా
టైర్లలో గాలి తీసెయ్యండ్రా!’
- వీహెచ్ పురమాయింపు. 


రాష్ట్రం పరువు ఉత్తరాఖండ్ మంచు కొండల సాక్షిగా గంగలో కలిసింది. కాదు... అధికార కాంగ్రెస్, విపక్ష టీడీపీ ఎంపీలు, చంద్రబాబు అండ్ కో కలసికట్టుగా, చేజేతులారా నడి గంగలో కలిపేశారు. రాష్ట్రానికి చెందిన బాధితులను వెనక్కు తీసుకొచ్చే విషయంలో అత్యంత అసహ్యకరమైన రీతిలో ప్రచార కక్కుర్తికి తెగబడ్డారు. ‘మా బాధితులు’ అంటే, ‘కాదు, మా బాధితులు’ అంటూ కొట్లాడుకున్నారు. ‘మా విమానంలో తరలిస్తాం’, ‘కాదు, మా విమానంలోనే’ అంటూ అచ్చం ప్యాసింజర్ల కోసం ఆటో డ్రైవర్ల మాదిరిగా పరస్పరం పోట్లాటకు దిగారు. ఆ క్రమంలో వీధి రౌడీలు కూడా సిగ్గుపడేలా ప్రవర్తించారు. 

నోటికొచ్చినట్టుగా రాయలేని భాషలో బూతులు తిట్టుకున్నారు. పరాయి రాష్ట్రాల ముందు మనకు తీరని అప్రతిష్ట తెచ్చిపెట్టారు. కనీవినీ ఎరగని వరద బీభత్సాన్ని కూడా ఇలా తమ కళ్లముందే బురద రాజకీయం చేస్తున్న విపక్ష నేతను, గౌరవ పార్లమెంటు సభ్యులను చూసి అక్కడి తెలుగు బాధితులంతా తల దించుకున్నారు. వారితో పాటే మన నేతల కొట్లాటను కళ్లారా చూసిన సైనికులు, అధికారులు, విమానాశ్రయ సిబ్బంది ముందుగా నవ్వుకున్నారు. తర్వాత తీవ్రంగా అసహ్యించుకున్నారు. ఇతర రాష్ట్రాలన్నీ తమ బాధితులను ఎప్పటికప్పుడు అన్ని సౌకర్యాలు కల్పించి మరీ ఇల్లు చేరుస్తుంటే ఇంతకాలం చోద్యం చూసి, ఇప్పుడీ డ్రామాలేమిటంటూ ఛీత్కరించుకున్నారు. 

ఇంతా చేస్తే రెండు పార్టీలూ ఇంతలా పోటీ పడింది తమంత తాముగా అష్టకష్టాలు పడి తమంత తాముగా డెహ్రాడూన్‌కు చేరిన వారిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు మాత్రమే. ఇప్పటికీ కొండల్లోనే చిక్కుకుని, తిరిగొచ్చే దారి లేక కొన ప్రాణాలతో అలమటిస్తున్న వేలాది మంది తెలుగు వారి గోడును మాత్రం అవి పొరపాటున కూడా పట్టించుకోలేదు. కేవలం వీలైనంత మంది బాధితులతో విమానంలో హైదరాబాద్‌లో దిగడం... మీడియాలో హైలైట్ కావడమే లక్ష్యంగా రెండు పార్టీల ఎంపీలూ, నేతలూ పరమ అసహ్యకరంగా ప్రవర్తించారు. నిజానికి ప్రచారమే పరమావధిగా టీడీపీ, కాంగ్రెస్ మధ్య ఈ వరద రాజకీయం రెండు మూడు రోజులుగా పోటాపోటీగా కొనసాగుతోంది. 

అమెరికా పర్యటన నుంచి తిరిగొచ్చాక తాపీగా ఢిల్లీ వెళ్లి ఏపీభవన్‌లో పరామర్శ పేరుతో చంద్రబాబు హంగామా చేశారు. డబ్బులు పంచుతూ, రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ మీడియాలో హల్‌చల్ సృష్టించారు. దాంతో బాబు రాజకీయంగా ‘పై చేయి’ సాధిస్తున్నారని భయపడ్డ ప్రభుత్వం హడావుడిగా రంగంలోకి దిగింది. కాంగ్రెస్, టీడీపీల ఈ వరద రాజకీయం బుధవారం తారస్థాయికి చేరి తిట్లు, తోపులాటలకు దారి తీసి జాతీయ స్థాయిలో రాష్ట్రానికి తీరని అప్రతిష్ట తెచ్చిపెట్టింది. ఎన్డీటీవీ, సీఎన్‌ఎన్-ఐబీఎన్ వంటి జాతీయ చానళ్లు కూడా మన ప్రజాప్రతినిధుల నిర్వాకాన్ని ఎండగట్టాయి. రుషీకేశ్, హరిద్వార్‌లలో వారు చూపిన ప్రచార కక్కుర్తిని పదేపదే ప్రసారం చేశాయి. వారి వరద రాజకీయాన్ని పదునైన వ్యాఖ్యలతో సునిశితంగా విమర్శించాయి.

ఛీ..ఛీ.. ఇంత బాధ్యతా రాహిత్యమా?
ఉత్తరాఖండ్ వరద బాధితుల్ని ఆదుకోవడంలో భారతీయ సైన్యం, పలు స్వచ్ఛంద సంస్థలు తలమునకలై ఉన్న సమయంలో కాంగ్రెస్, తెలుగుదేశం నాయకులు కొట్లాటకు దిగడం అత్యంత దురదృష్టకరం. ఇంతకుమించిన సిగ్గుచేటు ఏముంది? ఇంత బురద రాజకీయమా? సిగ్గని పించడం లేదా? డెహ్రాడూన్‌లో వీళ్ల ప్రవర్తన చూసి ప్రజలు ఛీ కొడుతున్నారు.
- బండారు దత్తాత్రేయ (బీజేపీ)
Share this article :

0 comments: