రైతన్నకేదీ భరోసా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » రైతన్నకేదీ భరోసా?

రైతన్నకేదీ భరోసా?

Written By news on Monday, June 3, 2013 | 6/03/2013

గతేడాదిలాగే ఈ సంవత్సరమూ 
ప్రభుత్వం లైన్లలో నిలబెడుతుందేమోనని రైతుల్లో ఆందోళన
ఈసారైనా ప్రభుత్వం భరోసా ఇస్తుందో.. లేక గాలికి వదిలేస్తుందో!
చంద్రబాబుపై నమ్మకం చచ్చిపోయే టీడీపీ నేతలు వలస వస్తున్నారు
షర్మిల ‘మరో ప్రజాప్రస్థానం’ ఆదివారం యాత్ర ముగిసేనాటికి రోజులు: 167, కిలోమీటర్లు: 2,207.8

‘మరో ప్రజాప్రస్థానం’ నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘జూన్ మాసం వచ్చింది. వ్యవసాయ సీజన్ మొదలవుతోంది.. అంటే రైతన్నలు ఏరువాకకు సిద్ధమయ్యే కాలం. విత్తనాలు, ఎరువులు ఈ నెలలోనే పెద్ద మొత్తంలో అవసరమవుతాయి. వీటిని అందించడానికి ప్రభుత్వం సిద్ధం కావాల్సిన సమయం కూడా ఇదే. కానీ అవసరమైన మేరకు విత్తనాలు, ఎరువులను ఈ ప్రభుత్వం సమకూరుస్తుందో.. లేకుంటే పోయిన ఏడాది మాదిరిగానే రైతులంతా రోజుల తరబడి లైన్లలో నిలబడాల్సిన పరిస్థితే వస్తుందో లేక బ్లాక్ మార్కెట్‌కు వెళ్లి నకిలీ విత్తనాలు కొని రైతులు మోసపోవాల్సి వస్తుందో తెలియని పరిస్థితి’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు 300 నుంచి 800 శాతం పెంచింది. మరి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా జోక్యం చేసుకొని రైతన్నలకు భరోసా ఇస్తుందో.. లేక రైతుల్ని గాలికి వదిలేస్తుందో’’నని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరికి, దానితో కుమ్మక్కైన చంద్రబాబు నాయుడు వైఖరికి నిరసనగా జగన్‌మోహన్‌రెడ్డి తరఫున షర్మిల చేపట్టిన ‘మరో ప్రజాప్రస్థానం’ పాదయాత్ర ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో సాగింది. నిడదవోలు పట్టణంలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి షర్మిల ప్రసంగించారు. ఈ ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

రైతులంటే శ్రద్ధ లేదు..

‘‘కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వానికి రైతులంటే ఏమాత్రం శ్రద్ధ ఉన్నా ఇప్పటికే రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు సిద్ధం చేసి ఉంచేది. ఈ సర్కారు రైతులకు కరెంటు, నీళ్లు, మద్దతు ధర, ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వకపోవడంతోఎంతో మంది రైతులు సాగును వదిలేసే పరిస్థితులు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో వారిలో మనోధైర్యం నింపి వారికి భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఇవాళ రైతన్నలను, వ్యవసాయాన్ని గాలికి వదిలేసింది. ఏ పంటలోనూ రైతు నష్టపోకూడదని, అవసరమైతే రైతును ఆదుకోవడానికి రూ.3,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయాలని, రైతులు పండించిన పంట నిల్వ చేసుకునేందుకు గోదాములు నిర్మించాలని జగన్‌మోహన్‌రెడ్డి మూడేళ్లుగా చెప్తూనే ఉన్నారు.. లేఖలు రాశారు.. దీక్షలు చేశారు. అయినా ఈ ప్రభుత్వానికి పట్టలేదు. గోదావరి డెల్టా ఆధునీకరణ పనుల కోసం వైఎస్సార్ రూ.1500 కోట్లు కేటాయిస్తే.. ఈ ప్రభుత్వం ఆ పనుల్ని ఇప్పటిదాకా పూర్తి చేయలేకపోయింది. జగనన్న అధికారంలోకి వస్తే ఆ పనులను పూర్తి చేస్తారని మాటిస్తున్నా.

బాబుపై నేతలకు నమ్మకం చచ్చిపోయింది

రోజు రోజుకూ చంద్రబాబు నాయుడు ప్రజల్లో విశ్వసనీయత కోల్పోతున్నారు. ఇంతకాలంలో టీడీపీలో నిజాయితీగా బతికిన నేతలకు చంద్రబాబు మీద నమ్మకం చచ్చిపోయి, వాళ్లు ప్రజలకు సమాధానం చెప్పుకోలేక, మనస్సాక్షిని చంపుకోలేక టీడీపీని వీడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ పెండ్యాల కృష్ణబాబు అయితేనేమి, బొడ్డు భాస్కరరామారావు అయితేనేమి, తానేటి వనితమ్మ అయితేనేమి టీడీపీని వదిలి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు అంటే దానికి కారణం చంద్రబాబు తన విశ్వసనీయత కోల్పోవడం, కొద్ది సమయంలోనే జగన్‌మోహన్‌రెడ్డి తన విశ్వసనీయత రుజువు చేసుకోవడం. ఇప్పుడున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు సొంత పార్టీ కాదు. ఆయన కాంగ్రెస్ పార్టీలో పదవులు అనుభవించి, ఆ పార్టీ అధికారం కోల్పోయిన తరువాత అధికారంలో ఉన్న టీడీపీలో చేరారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు, విలువలకు కట్టుబడి, మాకు అండగా నిలబడాలని చాలా మంది నాయకులు మా పార్టీలో చేరారు. ప్రజారాజ్యం పార్టీకి ఓటేసిన 70 లక్షల మందిని పిచ్చోళ్లను చేసి చిరంజీవి కాంగ్రెస్ పార్టీకి అమ్ముడు పోతే, ఈ చంద్రబాబు టీడీపీకి ఓటేసిన కోట్ల మంది ప్రజలను పిచ్చోళ్లను చేసి తెరవెనుకాల కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయారు.’’

13.1 కిలోమీటర్ల మేర నడక

పాదయాత్ర 167వ రోజు ఆదివారం పశ్చిమగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పారుపల్లి అడ్డరోడ్డు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి డి.ముప్పవరం, సమిశ్రగూడెం మీదుగా నడుచుకుంటూ షర్మిల నిడదవోలు నియోజకవర్గ కేంద్రానికి చేరుకున్నారు. ఇక్కడ భారీ ఎత్తున తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడ నుంచి నడుచుకుంటూ గుర్రప్పాడు గ్రామం వరకు యాత్ర చేశారు. ఇదే గ్రామ శివారులో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. ఆమె ఆదివారం 13.1 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,207.8 కిలోమీటర్ల యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న వారిలో పార్టీ నాయకులు ఎంవీ మైసూరారెడ్డి, జిల్లా పార్టీ కన్వీనర్, ఎమ్మెల్యే బాలరాజు, ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, మద్దాల రాజేశ్, తానేటి వనిత, ఎమ్మెల్సీలు మేకా శేషుబాబు, బొడ్డు భాస్కర రామారావు, మాజీ ఎమ్మెల్యేలు పెండ్యాల కృష్ణబాబు, ముదునూరి ప్రసాదరాజు, స్థానిక నాయకులు బొడ్డు వెంకటరమణ చౌదరి, రాజీవ్ కృష్ణ, చీర్ల రాధయ్య, కర్ర రాజారావు, తలారి వెంకట్రావ్, పాశం రామకృష్ణ తదితరులు ఉన్నారు.
Share this article :

0 comments: