నాలుగుసార్లు మాటమార్చారు - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » నాలుగుసార్లు మాటమార్చారు

నాలుగుసార్లు మాటమార్చారు

Written By news on Saturday, June 1, 2013 | 6/01/2013

ఉచిత విద్యుత్‌పై నాలుగుసార్లు మాటమార్చారు 
* మరో ప్రజాప్రస్థానంలో షర్మిల ధ్వజం
* ఓసారి ఉచిత విద్యుత్ కుదరదన్నారు
* ఇంకోసారి ఉచిత విద్యుత్ కావాలా..
* నాణ్యమైన విద్యుత్ కావాలా అన్నారు
* మరోసారి 12 గంటలు ఉచితంగా ఇస్తామన్నారు
* ఇప్పుడు 9 గంటలిస్తామని మాటమార్చారు
* పల్లెల్లో బెల్టుషాపులకు జీవం పోసింది చంద్రబాబే
* ఇప్పుడు వాటిని రద్దు చేస్తానంటున్నారు
* ఇచ్చిన మాట నిలుపుకోవడం ఆయనకు చేతకాదు
* చంద్రబాబు పాలన, కిరణ్ పాలన దొందూదొందే

మరో ప్రజాప్రస్థానం నుంచి ‘సాక్షి’ ప్రత్యేక ప్రతినిధి: ‘‘1999 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఉచిత విద్యుత్తు కుదరనే కుదరదు అన్నారు. 2004లో మీకు ఉచిత విద్యుత్తు కావాలా..? నాణ్యమైన విద్యుత్తు కావాలా..? తేల్చుకోండి అని అన్నారు. 2009 ఎన్నికల్లో మాట మార్చి 12 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తామన్నారు. ఇప్పుడు 2013లో 12 గంటలు అవసరం లేదు.. 9 గంటలు ఇస్తే చాలనుకొని 9 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తానంటూ మళ్లీ మాట మార్చారు. అంటే ఒకే అంశాన్ని 14 ఏళ్లలో నాలుగుసార్లు మాట మార్చి చెప్పారు. ఒక మాట మీద నిలబడటం, ఇచ్చిన మాట నిలుపుకోవడం చంద్రబాబుకు ఎప్పుడూ చేత కాదు..’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల మండిపడ్డారు.

‘‘వ్యవసాయాన్ని దండగ చేసింది ఈ చంద్రబాబే.. పల్లెల్లో ఎక్కడపడితే అక్కడ బెల్టు దుకాణాలకు జీవం పోసింది ఈ చంద్రబాబే.. ఇప్పుడేమో రుణమాఫీ చేస్తాను, ఉచిత విద్యుత్తు ఇస్తాను, బెల్టు దుకాణాలు రద్దు చేస్తానంటూ మాయమాటలు చెప్పి మళ్లీ ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారు..’’ అని విమర్శించారు. ప్రజా సమస్యలు పట్టని కాంగ్రెస్ ప్రభుత్వం వైఖరికి, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఆ ప్రభుత్వాన్ని కాపాడుతున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరికి నిరసనగా షర్మిల చేపట్టిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో సాగింది. తణుకులో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలనుద్దేశించి షర్మిల ప్రసంగించారు. ప్రసంగ సారాంశం ఆమె మాటల్లోనే..

మనం వింటే చార్మినార్ కూడా తానే కట్టానంటారు..
ఉచిత విద్యుత్తు చంద్రబాబు వల్లే సాధ్యమయిందటా.. ఫీజు రీయింబర్స్‌మెంటు కూడా చంద్రబాబు నాయుడే చేశాడటా.. ఇంకొంచెం ఉంటే ఆరోగ్యశ్రీ నేనే చేశాను, వైఎస్సార్ ప్రతి పథకం నేనే చేశాను అని చెప్తారేమో! మనం వింటూ పోతే హైదరాబాద్‌లో చార్మినార్, కృష్ణా నది మీద నాగార్జునసాగర్‌ను నేనే కట్టాను అని చంద్రబాబు చెప్తారు. పట్టపగలు కళ్లార్పకుండా ఎన్ని అబద్ధాలైనా చె ప్పగల సమర్థుడు చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారి రెక్కల కష్టం మీద అప్పటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్సార్ రెక్కల కష్టం మీద ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వ చ్చింది. ఎన్టీఆర్ ప్రజలకు ఇచ్చిన రెండు వాగ్దానాలను చంద్రబాబు నిలబెట్టుకోలేదు. వైఎస్సార్ ఇచ్చిన 9 గంటల ఉచిత విద్యుత్తు, 30 కిలోల బియ్యం పథకం వాగ్దానాలను ఈ కిరణ్‌కుమార్‌రెడ్డి గారు నిలుపుకోలేదు. చంద్రబాబు గారికి, కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి తేడా ఏమీ లేదు. దొందూ దొందే. వారిద్దరికీ ఏమీ తేడా లేదు. ప్రజలంతా చంద్రబాబును ఇంటికి పంపించినట్టే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు.

కిరణ్ మాటలు కోటలు దాటుతున్నా..
కిరణ్‌కుమార్‌రెడ్డి గారికి పేదలంటే కనికరం లేదు. ప్రజల గురించి ఆలోచన లేదు. గ్రామాల్లో, మున్సిపాల్టీల్లో ఎక్కడ కూడా రోజుకు ఐదు, ఆరు గంటలకు మించి కరెంటు ఇవ్వడం లేదు. ఇంత ఎండలో ప్రజలు బయటే ఉంటే వాళ్ల ప్రాణాల మీదకు వస్తుంది కనుక వీలైనంత వరకు ఇంట్లోనే ఉండటానికి వీలు కలిపిస్తూ ప్రభుత్వం ఈ నెలలో కరెంటు కోతలు లేకుండా చూడాలి. కానీ కిరణ్ సర్కారేమో మార్చిలో విద్యార్థులకు పరీక్షలు ఉంటాయని తెలిసినా కరెంటివ్వలేదు. మేలో ఎండలు తీవ్రంగా ఉంటాయని తెలిసి కూడా కరెంటు ఇవ్వలేదు. ఎండలకు వందల కొద్ది మంది ప్రజలు చనిపోయారంటే ఆ పాపం ఈ సర్కార్‌ది కాదా? అని అడుగుతున్నాం. పవర్ కట్‌తో వేలకొద్ది పరిశ్రమలు మూతపడిపోయి లక్షలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. పరిశ్రమలు మూత పడుతున్నాయి. ఈ సీఎం మాత్రం లక్షల మందికి ఉద్యోగాలిస్తున్నామని, లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తున్నామని చెబుతున్నారు. కిరణ్ మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటడం లేదు.

బాబు హయాంలో ‘మద్దతు’ రూ.50.. 
వైఎస్ హయాంలో రూ.450
చంద్రబాబు తన తొమ్మిదేళ్ల పాలనలో వరికి కేవలం రూ.50 మాత్రమే మద్దతు ధర పెంచారు. వైఎస్సార్ అదే వరికి ఐదేళ్ల కాలంలో రూ.450 పెంచారు. ఇప్పుడున్న కిరణ్ సర్కారు ఈ నాలుగేళ్లలో కేవలం రూ.250 మాత్రమే పెంచి, ఎరువుల ధరలు మాత్రం 300 శాతం పెంచారు. ఎక్కడ చూసినా రైతులు అప్పుల పాలైపోయామని బాధపడుతున్నారు. రాష్ట్రంలో ఎక్కడా సాగునీరు లేదు. తాగునీరు లేదు. ఈ పాలకులకు మాత్రం ఇవేమీ పట్టడం లేదు. ప్రజల సమస్యలు పట్టని ఈ కాంగ్రెస్ ప్రభుత్వంపై అన్ని ప్రతిపక్ష పార్టీలు కలిసి అవిశ్వాసం పెడితే ప్రధాన ప్రతిపక్షం నాయకుడు చంద్రబాబు మాత్రం అవిశ్వాసానికి మద్దతివ్వకుండా రెండు చేతులు అడ్డుపెట్టి ఈ ప్రభుత్వాన్ని కాపాడారు.

12.2 కిలోమీటర్ల యాత్ర..
శుక్రవారం 165వ రోజు మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని కొత్తపాడు గ్రామ శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడ్నుంచి ఇరుగవరం, గోపాలపురం మీదుగా తణుకు నియోజకవర్గ కేంద్రానికి షర్మిల చేరుకున్నారు. ఇక్కడ భారీగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అదే పట్టణంలోని సొసైటీ రోడ్డు సమీపంలో ఏర్పాటు చేసిన బస కేంద్రానికి రాత్రి 8 గంటలకు చేరుకున్నారు. శుక్రవారం 12.2 కిలోమీటర్లు నడిచారు. ఇప్పటి వరకు మొత్తం 2,180.2 కి.మీ. యాత్ర పూర్తయింది. పాదయాత్రలో పాల్గొన్న వారిలో ఎమ్మెల్యే మద్దాల రాజేష్, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు, మాజీ ఎమ్మెల్యేలు ముదునూరు ప్రసాదరాజు, స్థానిక నాయకులు చీర్ల రాధయ్య, చిట్టూరి నరేంద్ర, విడివాడ రామచంద్రరావు, కర్ర రాజారావు, కండిబోయిన శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.

4న తూర్పుగోదావరిలోకి ప్రవేశం..
10 జిల్లాలను పూర్తి చేసుకొని మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర 11వ జిల్లాలోకి అడుగుపెట్టబోతోంది. ఈనెల 4వ తేదీ నుంచి తూర్పుగోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశిస్తుందని రాష్ట్ర పార్టీ కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు బ్రిడ్జి దాటుకొని షర్మిల తూర్పు గోదావరి జిల్లాలోకి అడుగుపెడతారన్నారు. ఈ జిల్లాలో మొత్తం 20 రోజుల పాటు, 275 కి.మీ. మేర యాత్ర సాగుతుందని, 13 నియోజకవర్గాల్లో షర్మిల పాదయాత్ర చేస్తారని చెప్పా - See more at: http://www.sakshi.com/main/FullStory.aspx?catid=609747&Categoryid=1&subcatid=33#sthash.i50ZT57Y.dpuf
Share this article :

0 comments: