సీబీఐని తప్పుబడుతూనే, పదే పదే....బెయిల్‌ని ఎందుకు తిరస్కరిస్తున్నారు? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » సీబీఐని తప్పుబడుతూనే, పదే పదే....బెయిల్‌ని ఎందుకు తిరస్కరిస్తున్నారు?

సీబీఐని తప్పుబడుతూనే, పదే పదే....బెయిల్‌ని ఎందుకు తిరస్కరిస్తున్నారు?

Written By news on Monday, June 24, 2013 | 6/24/2013


ప్రజలకిచ్చిన మాటకోసం, తండ్రి ఆశయ సాధనకోసం... లెక్కలేనన్ని కష్టాలు ఎదురైనప్పటికీ మొక్కవోని ధైర్యంతో, మనోనిబ్బరంతో ముందుకుసాగుతున్న జగన్ నిజంగా ధీరోదాత్తుడే. ప్రజానాయకులు దివంగత రాజశేఖరరెడ్డి కృషి ఫలితంగా అధికారంలోకి వచ్చిన ఈ కాంగ్రెసుపార్టీ; ప్రజాబలం కోల్పోయి కాంగ్రెస్‌పార్టీకి బ్రాంచి ఆఫీసుగా మారిన చంద్రబాబు నేతృత్వంలోని ఈ తెలుగుదేశంపార్టీ... సీబీఐని అడ్డుపెట్టుకుని ఆడుతున్న నాటకాలు, చేస్తున్న ఆగడాలు అన్నీఇన్నీ కావు. రాజకీయంగా ముక్కుపచ్చలారని ఒక యువనాయకుడిని ప్రజా క్షేత్రంలో ఎదిరించలేక ఢిల్లీ నుండి గల్లీ దాకా కుట్రలు, కుతంత్రాలు చేసి, జైల్లో అక్రమంగా నిర్బంధించి పైశాచికానందం పొందుతున్న ఈ రెండు పార్టీల వారు ఒక విషయం గుర్తుంచుకుంటే మంచిది. మేలు చేసిన వారిని మోసం చేసే మీలాంటి రాజకీయనాయకులు ఉండవచ్చుగాక, కాని సామాన్య ప్రజలు అలా కాదు. మేలు చేసిన వారిని గుండెల్లో దాచుకుంటారు. జగన్ విషయంలో అదే జరుగుతుంది.

జగన్‌మోహన్‌రెడ్డి పట్ల సీబీఐ తీరు చూస్తే మనం ప్రజాసామ్య దేశంలో ఉన్నామా లేక నియంతృత్వ పాలనలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది రాజ్యాంగ మౌలిక సూత్రమైన ‘చట్టం ముందు అందరూ సమానులే’ అనే అంశాన్ని సీబీఐ విస్మరించినట్టుంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మంత్రులు బయట ఉంటూ, అధికారం చలాయిస్తూ సాక్షులను ప్రభావితం చేయనే చేయరట కానీ, ఏ అధికారమూ లేని జగన్ సాక్షులను ప్రభావితం చేస్తారట! ఇదెక్కడి తర్కం? ఈ సీబీఐ సంస్థ నిజమైన దొంగల్ని వదిలిపెట్టి... సామాన్యులను, నిర్దోషులను వేధిస్తుంటుంది. సీబీఐ వల్ల మన దేశం పరువుపోతోంది. దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థ అయి ఉండి, ఒక నిర్దోషిని అక్రమంగా జైల్లో నిర్బంధించి సంవత్సరం అవుతున్నా ఎక్కడ అక్రమం జరిగిందో కనిపెట్టలేక, సాక్ష్యాధారాలను సేకరించలేక, సూట్‌కేసులు, ట్రంకుపెట్టెలు పట్టుకుని ఇటు అటు తిరగడం తప్ప సీబీఐ ఏం సాధించింది? ఒకవేళ అక్రమం జరిగిందని సీబీఐ భావిస్తే ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన 26 జీవోలు అక్రమమని చెప్పాలి. వాటిని ఇచ్చిన మంత్రులను నిర్బంధించాలి.

అవి చేయకుండా ఒక నిర్దోషిని అక్రమంగా నెలల తరబడి జైల్లో పెట్టి, బెయిల్ రాకుండా అడ్డుకోవడం భావ్యం కాదు. ఈ విషయాన్ని సామాన్య ప్రజలు కూడా తట్టుకోలేకపోతున్నారు. సీబీఐ కర్తవ్య నిర్వహణపట్ల్ల దేశ అత్యున్నత న్యాయస్థానం అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే... అదే సీబీఐ మాటలను నమ్మి ప్రతిసారీ జగన్ బెయిల్ పిటిషన్‌ను తిరస్కరిస్తోంది. ఇది మాకు బాధను, విస్మయాన్ని కలుగజేస్తోంది.

- ఎస్. వెంకటరావు. పాతపట్నం, శ్రీకాకుళంజిల్లా
Share this article :

0 comments: