బెల్టు షాపులను పరిచయం చేసింది బాబు కాదా? - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :

Home » » బెల్టు షాపులను పరిచయం చేసింది బాబు కాదా?

బెల్టు షాపులను పరిచయం చేసింది బాబు కాదా?

Written By news on Thursday, June 6, 2013 | 6/06/2013

బెల్టు షాపులను పరిచయం చేసింది బాబు కాదా?
ఇప్పుడు బెల్టు షాపులంటేనే తెలియదన్నట్లు బాబు మాట్లాడుతున్నారు
బాబు హయాంలో 40 వేల బెల్టు షాపులున్నట్లు 2003 జనవరిలో ఈనాడు పత్రికే రాసింది
అధికారంలోకి వస్తే బెల్టు షాపులను రద్దు చేస్తూ సంతకం పెడతాననడం ప్రజలను మోసగించడమే
వైఎస్సార్ సీపీ ప్లీనరీలో మద్య నియంత్రణపై అత్యుత్తమ విధానాన్ని జగన్ ప్రకటించారు
బెల్టు షాపు అన్నదే లేకుండా చేస్తామన్నారు
నియోజకవర్గానికి ఒక్క మద్యం దుకాణమే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు

సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి వస్తే మద్యం బెల్ట్ షాపులను రద్దు చేస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు చెబుతున్నారని, అసలు వాటిని ప్రపంచానికి పరిచయం చేసిందే ఆయన కాదా అని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి ప్రశ్నించారు. 

బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ. టీడీపీ పరిపాలనలో బెల్ట్ షాపులే లేవని బుధవారం హైదరాబాద్‌లో జరిగిన మద్య నియంత్రణ కమిటీ సమావేశంలో చంద్రబాబు అబద్ధాలు చెప్పారని తెలిపారు. ఆయన హయాంలో 40 వేల బెల్ట్ షాపులు ఉన్నట్లు 2003 సంవత్సరంలో ఈనాడు పత్రికే రాసిందని ఆమె గుర్తు చేస్తూ ఆ ప్రతులను విడుదల చేశారు. ముఖ్యమంత్రి అయితే రెండో సంతకం బెల్ట్ షాపుల రద్దు పైనే అని బాబు చెప్పడం ప్రజలను మోసగించడమేనని చెప్పారు. బెల్ట్ షాపులేమైనా అధికారికమైనవా సంతకాలతో రద్దు చేయడానికి అని ప్రశ్నిం చారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్ష నాయకుడిగా అనుభవం ఉన్న వ్యక్తికి అనధికారికంగా ఏర్పడిన బెల్ట్ షాపులను సంతకాలతో రద్దు చేయలేరనే విషయం తెలియదా అని అన్నారు. చంద్రబాబు అధికారానికి దూరమై సంతకాలు చేసి చాలా కాలమైందని, అందుకే ఇప్పుడు ప్రతి దానికీ సంతకం చేస్తానంటూ తహతహలాడుతున్నారని ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు గారూ.. సమాధానం ఇవ్వండి’ అంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన చంద్రబాబును నిలదీస్తూ ఆమె ఒక ప్రశ్నావళిని విడుదల చేశారు.

సాక్షి, హైదరాబాద్: టీడీపీ పరిపాలనలో బెల్ట్ షాపులే లేవంటూ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ శాసనసభాపక్షం ఉప నాయకురాలు భూమా శోభానాగిరెడ్డి బుధవారం దుయ్యబట్టారు. ఆయన హయాంలో 40 వేల బెల్టు షాపులు నడుస్తున్నట్లుగా 2003లో ఈనాడు దినపత్రికే రాసిందని ఆమె చెప్పారు. ఈ సందర్భంగా ఆమె ఒక ప్రశ్నావళిని విడుదల చేశారు. ఆ ప్రశ్నావళి వివరాలిలా ఉన్నాయి..

అసలు బెల్టు షాపు అంటే ఏమిటి? బెల్టు షాపు అనే పదం పుట్టించిందెవరు? అది ఎందుకు పుట్టింది? రాష్ట్రంలో ఇవ న్నీ చంద్రబాబునాయుడుగారి చేత, చంద్రబాబునాయుడుగారి వల్ల, చంద్రబాబునాయుడుగారి కోసం పుట్టిన షాపులేనని అందరికీ తెలుసు. ఒక లెసైన్స్‌డ్ మద్యం దుకాణం ఉంటే.. ఆ దుకాణం వారే అనధికారికంగా మద్యం షాపులు నడుపుకోవడాన్నే బెల్టు షాపులు అంటున్నాం.

చంద్రబాబుగారు మంగళవారం మద్య నియంత్రణ కమిటీ సమావేశంలో చేసిన ప్రసంగంలో అసలు బెల్టు షాపు అన్నది అనధికార, చట్ట విరుద్ధమైన షాపు అన్న విషయమే ఆయనకు తెలియదన్నట్లు మాట్లాడారు. చంద్రబాబుగారు గతంలో కూడా ఆయన హయాంలో బెల్టు షాపులే లేవని చెప్పే ప్రయత్నం చేశారు. వాస్తవానికి బెల్టు షాపులను కనిపెట్టింది, ఆ విధానాన్ని అమలు చేసిందీ చంద్రబాబునాయుడుగారే అన్న విషయాన్ని తెలుగుదేశం పార్టీకి అధికార గె జిట్‌లాంటి ఈనాడులో 2003 జనవరిలో ఒక వార్తా కథనంలో చూడవచ్చు. అప్పటికే చంద్రబాబుగారి హయాంలో 40 వేల బెల్టు షాపులు నడుస్తున్నాయని ఈనాడు రాసింది.

బెల్టు షాపుల్ని పుట్టించి, పెంచి వృద్ధి చేసిన చంద్రబాబుగారు.. ఇప్పుడు బెల్టు షాపుల నిషేధం ఫైల్ మీద రెండో సంతకం పెడతానంటున్నారు. ఇంతకన్నా వంచన ఉంటుందా?

సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తామని 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఆధ్వర్యంలో వాగ్దానం చేసి గెలిచిన టీడీపీని వెన్నుపోటు పొడిచి అధికారాన్ని కైవసం చేసుకున్న చంద్రబాబుగారు.. ఆ తర్వాత కొద్ది రోజులకే మద్య నిషేధాన్ని ఎత్తివేశారు. 1994లో ఒక్క పైసా కూడా మద్యం మీద ఆదాయం లేని రాష్ట్రాన్ని 2004లో ఆయన దిగిపోయేనాటికి దేశంలోనే మద్యం అమ్మకాల విషయంలో నంబర్-1 రాష్ట్రంగా తయారు చేశారని కూడా ఈనాడు పత్రికే రాసింది.

అలాంటి చంద్రబాబుగారు.. బెల్టు షాపులే ఇల్లీగల్ అన్న విషయాన్ని, వాటిపై ఇప్పటికే నిషేధం ఉందన్న విషయాన్ని మరచిపోయి.. వాటిని నిషేధించేందుకు రెండో సంతకం పెడతానంటున్నారు. నిషేధం ఉన్న షాపుల్నే చంద్రబాబుగారు ఎలా నిషేధిస్తారు? 35 ఏళ్ల రాజకీయ జీవితంలో అనేక పదవులు అనుభవించి, 9 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి, ఏ విషయం మీద జీవోలు ఇవ్వవచ్చో కూడా తెలియదా?

మంగళవారం జరిగిన మద్య నియంత్రణ సదస్సులో చివరికి చంద్రబాబుగారు, బొత్స సత్యనారాయణగారు కూడా భాగస్వాములవుతున్నారని తెలిసే మేము ఆ సదస్సుకు దూరంగా ఉన్నాం. అలాంటి వారితో మద్యం నియంత్రణ మీద మాట్లాడాల్సి రావడం దురదృష్టకరమని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భావించింది. సదస్సు మీద మాకు అగౌరవం లేదు. బాబు, బొత్స తరహా వ్యక్తులతో వేదిక మీద కూర్చోవడం ఇష్టంలేకే హాజరు కాలేదు. అటువంటి వ్యక్తుల మధ్య నిలబడటానికి ఇష్టంలేకనే హాజరు కాలేదు. బెల్టుషాపుల విషయంలో ప్రజలు కూడా వారిని క్షమించరనే సదస్సుకు హాజరుకాలేదు. పీసీసీ అధ్యక్షుడి గా ఉన్న వ్యక్తి వందలకొద్దీ బెల్టు షాపులు నడిపిస్తున్నారన్న నిజం బయటపడినా, పీసీసీ అధ్యక్షుడే మద్యం సిండికేట్ డాన్ అని తెలిసినా, ఈ విషయాన్ని ఏసీబీ బయట పెట్టిన త రువాత దాని దర్యాప్తు అధికారిని ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్ చేసిందని తెలిసినా, అలాంటి అంశం మీద పోరాటం చేయని చంద్రబాబునాయుడు.. ఇప్పుడు బెల్టు షాపుల్ని నిషేధిస్తాననటం దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉంది.

ప్రజా నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డి గారు రెండేళ్ల క్రితం జరిగిన మా పార్టీ మొదటి ప్లీనరీలోనే మద్య నియంత్రణకు సంబంధించి దేశంలోనే అత్యుత్తమమైన విధానాన్ని ప్రకటించారు. ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేశారని కాదు.. ప్రజలపట్ల తన బాధ్యతగా జగన్‌మోహన్‌రెడ్డి గారు ఆరోజు ఇచ్చిన హామీలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి.

రాష్ట్రంలో నియోజకవర్గానికి ఒక్కటి మాత్రమే మద్యం దుకాణం ఉండేలా, బెల్టు షాపు అన్నది మరెక్కడా ఉండటానికే వీల్లేకుండా మద్యం విధానాన్ని అమలు చేస్తానని జగన్‌మోహన్‌రెడ్డి గారు చెప్పారు. ఆ మద్యం దుకాణాల్లో కూడా రేట్లు మందు తాగే వారికి షాక్ కొట్టేలా, నిరుత్సాహ పరిచేలా ఉంటాయని చెప్పారు. ప్రతి పంచాయతీకి 10 మంది చొప్పున.. అంటే రాష్ట్రం మొత్తం మీద 2 లక్షల మంది ఆడపడుచుకులకు పోలీస్ ఉద్యోగాలు ఇచ్చి మద్య నియంత్రణను అమలు పరుస్తామని జగన్‌మోహన్‌రెడ్డి గారు చెప్పారు. మద్యం దుకాణాలను కూడా ప్రభుత్వమే నడిపేటట్టుగా, గ్రామాల్లోకి మద్యం విస్తరణ జరగకుండా చర్యలు చేపడతామని వాగ్దానం చేశారు. అక్రమంగా మద్యం అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని జగన్‌మోహన్‌రెడ్డిగారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున 2011 జూలై 7, 8 తేదీల్లో జరిగిన ప్లీనరీలోనే ప్రకటించారు. దీనిని మా పార్టీ సగర్వంగా చెబుతోంది.

చంద్రబాబునాయుడుగారు రోజుకో మాట చెబుతారు. సరసమైన ధరకు మద్యాన్ని అందిస్తామని గతంలో చెప్పిన చరిత్ర చంద్రబాబుగారిది. ఈరోజు అదే చంద్రబాబుగారు ఓట్ల కోసం ఊసరవెల్లిలా మరో మాట చెబుతారు. మద్య నిషేధాన్ని ఎత్తివేసి, బెల్టు షాపులను పెట్టిన ఈ మహానుభావుడు, ఈ విశ్వసనీయత లేని వ్యక్తి.. ఇప్పుడు ఏకంగా బెల్టు షాపులు నిషేధిస్తామంటారు. అధికారంలో ఉండగా రూ.1,400 కోట్ల మద్యం కుంభకోణానికి పాల్పడిన ఈ చంద్రబాబునాయుడుగారు.. ఈరోజున బెల్టు షాపుల గురించి మాట్లాడతారు. మరోవైపు.. రాష్ట్ర ప్రభుత్వం ఒక ఉద్యమంలాగా జీవోలు జారీ చేసి, మద్యం ఉత్పత్తుల్ని పెంచి, టార్గెట్లు పెట్టి మద్యాన్ని అమ్మిస్తోంది. ఈ ప్రభుత్వానికిగానీ, ఈ ప్రతిపక్షానికిగానీ మద్యం నియంత్రణపై మాట్లాడే హక్కు ఉందా అని మేం ప్రశ్నిస్తున్నాం.

ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతి డెబ్భై కుటుంబాలకు ఒకటి చొప్పున 2 లక్షల బెల్ట్ షాపులు ఉన్నాయి. ప్రతి డెబ్భై కుటుం బాలకు ఒక ఆసుపత్రి, ఒక స్కూలు లేవుగాని, మద్యం షాపు మాత్రం అందుబాటులో ఉండటం సిగ్గుచేటైన విషయం.

జగన్ ములాఖత్‌లపై టీడీపీది దిగజారుడురాజకీయం

ప్రజాక్షేత్రంలో జగన్ ప్రభంజనాన్ని ఎదుర్కోలేమనే భయంతోనే టీడీపీ ఆయన జైలు ములాఖత్‌లపై దిగజారుడు రాజకీయం చేస్తోందని శోభ ధ్వజమెత్తారు. జగన్ కేవలం విచారణలో ఉన్న ఖైదీ మాత్రమేనని, నిబంధనలకు లోబడే ఆయనకు ములాఖత్‌లు లభిస్తున్నాయని, ఈ విషయమై జైలు అధికారులు పదే పదే చెబుతున్నా, టీడీపీ నేతలు దిగజారి మాట్లాడుతున్నారని అన్నారు.

జైళ్ల శాఖ డీజీ కృష్ణరాజు వంటి నిబద్ధత గల అధికారి నిబంధనల మేరకే జగన్‌కు ములాఖత్‌లు ఇస్తున్నామని చెబుతున్నా టీ టీపీ నేతలు పట్టించుకోకుండా ఆరోపణలు చేస్తూనే ఉన్నారని అన్నారు. న్యాయవాది అయిన యనమల రామకృష్ణుడు న్యాయపరమైన అంశాలు తెలిసిన వ్యక్తి అయి ఉండి కూడా లేఖలు రాస్తూ రాద్ధాంతం చేస్తున్నారన్నారు. టీడీపీ నేతలు ఇప్పటివరకు జగన్ ములాఖత్‌లపై చేసిన ఒక్క ఆరోపణను కూడా నిరూపించలేక పోయారని తెలిపారు. మునుపెన్నడూ లేని విధంగా జగన్ అరెస్టు తరువాత జైల్లో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారని, అయినా కుళ్లుమోతుతనంతోనే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని చెప్పారు. జైలు లోపల మద్యం తీసుకుంటున్నారని, నీలి చిత్రాలు చూస్తున్నారంటూ చంద్రబాబునాయుడు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతున్నారని, టీడీపీ వారికి అనుమానాలుంటే వారే జైలు లోపలికి పోయి కాపలాగా ఉండొచ్చు కదా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. విచారణలో ఉన్న ఖైదీగా జగన్‌కు మరిన్ని ములాఖత్‌లు లభించే అవకాశముందని, సీబీఐ న్యాయస్థానం ద్వారా తాము వాటిని పొందవచ్చని, అయినా ఆ పని చేయడం లేదని ఆమె తెలిపారు.
Share this article :

0 comments: