'బాబు పాత్రపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి' - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » 'బాబు పాత్రపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి'

'బాబు పాత్రపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలి'

Written By news on Wednesday, June 19, 2013 | 6/19/2013

ఐఎంజీ భారత భూ కుంభకోణంపై నిజానిజాలు వెలుగులోకి రావాల్సి వుందని దీనిపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ డిమాండ్‌ చేసింది. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 850 ఎకరాల అత్యంత ఖరీదైన భూమిని కేవలం నామమాత్రపు ధరకు ఓ అనామక కంపెనికీకి కట్టబెట్టారని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌ రెడ్డి ఆరోపించారు.

చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు చేస్తూ ప్రభుత్వానికి సహకరిస్తున్నారని భూమన అన్నారు. చంద్రబాబుకు నిజాయితీ ఉంటే విచారణకు సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయిన టీడీపీ తనపై విచారణ జరగకుండా బాబు చూసుకుంటున్నారన్నారు. ప్రభుత్వ చీఫ్‌ విప్‌గా ఉన్నప్పుడు ఐఎంజీ పై హడావిడి చేసిన కిరణ్‌ కుమార్ రెడ్డి ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదని భూమన ప్రశ్నించారు.
Share this article :

0 comments: