వైఎస్సార్ కాంగ్రెస్‌లో విజయవాడ బీసీ నేతల చేరిక - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » వైఎస్సార్ కాంగ్రెస్‌లో విజయవాడ బీసీ నేతల చేరిక

వైఎస్సార్ కాంగ్రెస్‌లో విజయవాడ బీసీ నేతల చేరిక

Written By news on Wednesday, June 19, 2013 | 6/19/2013

 విజయవాడ పశ్చిమ శాసనసభా నియోజకవర్గం పరిధిలోని కాంగ్రెస్, టీడీపీకి చెందిన పలువురు బీసీ నేతలు మంగళవారం ఉదయం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ నివాసానికి సుమారు 30 మంది నేతలు వచ్చి ఆమెను కలుసుకున్నారు. ఆమె వారికి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకున్నారు. పశ్చిమ శాసనసభా నియోజకవర్గం కోఆర్డినేటర్ జలీల్ ఖాన్ ఆధ్వర్యంలో విజయవాడ నేతలు హైదరాబాద్‌కు వచ్చి పార్టీలో చేరారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీకి గతంలో చైర్మన్లుగా పనిచేసిన దాడి అప్పారావు(కాంగ్రెస్), జవ్వాది రుద్రయ్య (టీడీపీ) తమ పార్టీలకు రాజీనామా చేసి వైస్సార్ కాంగ్రెస్‌లో చేరారు. విజయవాడ బులియన్ మార్కెట్‌లో ప్రముఖ వ్యాపారులైన అరసువల్లి విశ్వేశ్వరరావు, పొత్తూరు సుబ్రమణ్యం, టీడీపీ నేతలు పద్మజ, సూర్యనారాయణ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.

బీసీల సంక్షేమం జగన్‌తోనే సాధ్యం

వెనుకబడిన వర్గాల సంక్షేమం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే సాధ్యమని బీసీ నేతలు సంపూర్ణంగా విశ్వసిస్తున్నారని అందువల్లనే వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ వైపు ఆకర్షితులవుతున్నారని జలీల్‌ఖాన్ మీడియాతో అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన పథకాల వల్ల ఎందరో బీసీలు లబ్ధి పొందారని ఆ మేలు వారు మర్చిపోలేరని ఆయన అన్నారు. పార్టీలో చేరిన నేతలంతా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం గట్టిగా కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఖాన్ తెలిపారు.
Share this article :

0 comments: