తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలుస్తాం - YSR - YS Jagan - YSR Congress fans
www.ysrcongress.net :
Home » » తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలుస్తాం

తెలంగాణలో మెజారిటీ స్థానాలు గెలుస్తాం

Written By news on Saturday, June 22, 2013 | 6/22/2013


 తెలంగాణలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలు సాధిస్తుందని మాజీ మంత్రి, ఆ పార్టీ కేంద్ర కార్యనిర్వాహక మండలి సభ్యురాలు కొండా సురేఖ చెప్పారు. చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలోని తుమ్మలగుంటలో నిర్వహించిన వైఎస్సార్ స్మారక గ్రామీణ క్రికెట్ పోటీల్లో విజేతలకు శుక్రవారం ఆమె బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా సురేఖ విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణలో వాతావరణం తమపార్టీకి అనుకూలంగానే ఉందన్నారు. సీబీఐ చార్జిషీట్‌లో పేర్లు నమోదైన మంత్రులను అరెస్టు చేయాలని టీడీపీ కోరడంపై ఆమె మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడినట్లు రుజువైతే అలాగే చేయాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడే అవకాశముందన్నారు. బీసీ ఓటర్ల గుర్తింపులోనూ అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
Share this article :

0 comments: